సోమాలియాలో మళ్లీ దారుణం
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ వద్ద తీవ్రవాదులు శనివారం బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహమద్ అబ్దుల్ ఖాదీర్ వివరాల ప్రకారం.. పెట్రోల్ పంప్, షాపింగ్ మాల్స్ ఉన్న హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. సామాన్య పౌరులే ఈ దుర్ఘటనలో ఎక్కువగా మృతిచెందారని తెలిపారు. నాసో హబ్లాడ్ హోటల్ గేటు వద్ద తొలుత కారు బాంబు పేల్చిన తర్వాత సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. ఆ హోటల్ లో ఎక్కువగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, విదేశాలకు చెందిన ముఖ్య వ్యక్తులు, జర్నలిస్టులు బస చేస్తారని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి ఉండొచ్చని ఓ ఉన్నతాధికారి దాహిర్ వివరించారు.
మూడు వారాల కిందట రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. అప్పట్లో ఆ కాల్పులకు పాల్పడ్డ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు హతమార్చారు. మిలిటెంట్లు సోమాలియాను ఇస్లామిక్ స్టేట్ ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని అధికారులు