gunmen
-
గన్‌మెన్ కావాలని..
ఉప్పల్: బీజేపీ నేతపై హత్యాయత్నం బూటకమని పోలీసులు తేల్చారు. తనకు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యల్లగోని భాస్కర్ గౌడ్, సినీ నిర్మాతగా, రియల్ వ్యాపారిగా పని చేసేవాడు. ఈ నెల 24న అతను తనపై హత్యాయత్నం జరిగిందని రక్త గాయాలతో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో పలు అసక్తికరమైన అంశాలు గుర్తించారు. సెటిల్మెంట్లు..రియల్ దందాలు భాస్కర్ గౌడ్ పలు సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. బీజేపీ రాష్ట్ర స్వచ్చ్ భారత్ అభియాన్ కనీ్వనర్‌గా, జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూ తగాదాలకు సంబంధించిన సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిపై ఉప్పల్, నాచారం, కీసర తదితర పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. పలుకుబడి కోసం పథకం.. ఈ నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు గన్మెన్న్ను నియమించుకోవాలని భావింన భాస్కర్ గౌడ్ తన స్నేహితుడు శివ కిషోర్ గౌడ్‌తో కలిసి పథకం రూపొందించాడు. హత్యాయత్నం జరిగితే కాని గన్మెన్లను ఇవ్వరని తెలియడంతో శివకిషోర్ తన స్నేహితుడు యదగిరితో కలిసి ఈ నెల 22 న నాగోల్‌లోని అమరావతి బార్ వద్ద పథకం రంచారు. యాదగిరి స్నేహితులు కొండా అరుణ్,సృజన్ రెడ్డి, ఆకుల ప్రశాంత్, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ తదితరులు భాస్కర్ గౌడ్‌పై ఫేక్ హత్యాయత్నం చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ర. 2.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ర. 50,000 ఇచ్చారు. 24న ఉప్పల్ ఏషియన్ థియేటర్ వైపు నుంచి భాస్కర్ గౌడ్ కారులో డ్రైవర్‌తో కలిసి ఉప్పల్ భగాయత్లోకి రాగానే వనం టీ స్టాల్ వద్ద ఉన్న శివకుమార్ స్నేహితులు డ్రైవర్‌పై, భాస్కర్ గౌడ్‌పై కత్తితో దాడి చేసి పారి పోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యాయత్నం బూటకమని తేల్చారు. పోలీసులను తప్పుదోవ పట్టింనందుకుగాను పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండీ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు, ర. 2 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సవవేశంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ,ఎస్ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
TS Govt: మాజీలకు గన్మెన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రమాణ స్వీకారం జరిపిన మరుక్షణం నుంచే వివిధ శాఖలు, విభాగాలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో పలు విభాగాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మరో నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించింది. వాళ్లకు గన్మెన్లకు తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
మంత్రి సబితా గన్ మెన్ ఆత్మహత్య..
-
కానిస్టేబుల్ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
-
ఎంత దారుణం.. మార్కెట్లో ప్రవేశించి 47 మందిని కాల్చి చంపారు!
ఆఫ్రికాలోని నైజీరియాలోని సాయుధులు నరమేధానికి తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో సాయుధులు 50 మందిని దారుణంగా చంపారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు. కాగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ రెండు దాడులకు సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో.. ఫులానీ మూలానికి చెందిన పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని "నైజీరియా ఆహార బుట్ట"గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది. -
వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత
సాక్షి, అమరావతి: దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాధాకు ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి కొడాలి నాని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారంటూ రాధా ఆదివారం చేసిన వ్యాఖ్యల్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే సీఎం జగన్.. రాధాకు 2+2 గన్‌మెన్‌ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని తెలిపారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారని చెప్పారు. ఎవరికి ప్రాణభయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజకీయాల గురించి వంగవీటి రాధాతో మాట్లాడలేదన్నారు. గుడ్లవల్లేరులో ఆదివారం రంగా విగ్రహావిష్కరణకు రావాలని అక్కడివారు పిలిస్తే వెళ్లానని, ఆ కార్యక్రమానికి రాధా కూడా వచ్చారని చెప్పారు. వైఎస్సార్సీపీలోకి వస్తానని రాధా తమతో చెప్పలేదని, తాము ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాధా వైఎస్సార్సీపీలోకి రావాలనుకుంటే ఆయనే చెబుతారని, అప్పుడు సీఎం జగన్‌తో మాట్లాడతామని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదు సినిమా టికెట్ రేట్లు ఎక్కడా తగ్గించలేదని, గతంలో ఉన్నవే కొనసాగుతున్నాయని మంత్రి కొడాలి నాని చెప్పారు. కోర్టుల ఆదేశాలతో సినిమా టికెట్ ధరలు పెంచి దోచుకునేందుకు తాము అవకాశం కల్పించలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తాము చేస్తున్నదానివల్ల ఎగ్జిబిటర్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కిరాణా కొట్టుకు కలెక్షన్లు ఎక్కువ వచ్చినప్పుడు సినిమా వాళ్లు పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా?.. అంటూ హీరో నాని మాటలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 శాతం సీట్లలో బీజేపీకి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు. ఓటీఎస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ వారు ధర్నాలు చేసి మమ అనిపించారని ఎద్దేవా చేశారు. 50 లక్షల మందిలో 10 లక్షల మంది ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేది లేదు.. అని పేర్కొన్నారు. పేదల కోసం మనసున్న సీఎం జగన్ పెట్టిన ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. ఆస్పత్రికి చేరేలోపే భార్య, కొడుకు మృతి
కొణిజర్ల: కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోతే తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకుంది. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కలెక్టరేట్లో గన్‌మెన్‌గా ఉన్న భర్తకు తీరిక లేకపోవడంతో మరిదిని వెంట పెట్టుకుని బయలుదేరిన క్రమంలో ఆస్పత్రికి చేరకుండానే జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం విదితమే. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన జెర్రిపోతుల సంధ్య తన కుమారుడు మహంత్‌ను తీసుకుని మరిది పుల్లారావుతో ఖమ్మంలోని ఆస్పత్రికి బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. (చదవండి: తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్) మార్గమధ్యలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. పుల్లారావు, మహంత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడగా సంధ్య హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి మృతదేహాలను గురువారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రికి బయలుదేరుతున్నప్పుడు గంటలో వస్తామని చెప్పిన వారు మృతదేహాలుగా రావడంతో కుటుంబీకులు రోదించిన తీరు అందరికీ కన్నీళ్లు పెట్టించింది. డ్యూటీ నిమిత్తం ఎక్కడకు వెళ్లినా గంటగంటకూ తనతో వీడియో కాల్లో మాట్లాడే కుమారుడు, భార్య మృతదేహాలను చూస్తూ నాగరాజు ఏడుస్తూ స్పృహ తప్పారు. ఇక ఆయన కుమార్తె రిషిత తల్లి, సోదరుడిని చూస్తూ అమాయకంగా రోదిస్తుండడం కలిచివేసింది. అలాగే, అన్న నీడలా వెన్నంటి ఉండే పుల్లారావు మృతితో ఆయన భార్య పద్మ, 8 నెలల కుమారుడు భార్గవ్ రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు. ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌పై ఉంచి అంతిమయాత్ర నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
ఎవరు గన్మన్లు.. ఎవరు బౌన్సర్లు?
నల్లగొండ జిల్లాలో ఓ మాజీ జెడ్పీటీసీ ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఓ రియల్ఎస్టేట్ గొడవలో చూపించి ప్రత్యర్థులను బెదిరించి జైలు పాలయ్యాడు. ములుగు జిల్లాల్లో తన తండ్రికి కేటాయించినగన్మన్లను, బౌన్సర్లను చూపించి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ నేత కుమారుడు. ఆత్మరక్షణ మాటున బెదిరింపులపర్వం సాగుతోంది. లైసెన్స్డ్ గన్ ‘గురి’తప్పింది. ప్రభుత్వం కేటాయించిన గన్మన్లను, లైసెన్స్డ్ తుపాకులను కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో తుపాకులు, గన్మెన్లను చూపి తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంకొందరైతే ప్రైవేటు గన్మన్లను పోలీసులుగా చెప్పుకుంటూ ఎదుటివారిని భయపెడుతున్నారు. దీంతో గన్మన్లు, లైసెన్స్డ్ గన్స్, ప్రైవేటు బౌన్సర్ల విషయంలో కొందరు నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ నేత ప్రైవేటు వ్యవహారంలో లైసెన్స్డ్ గన్ చూపి బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎంతమందికి గన్‌మెన్ సౌకర్యం? రాష్ట్రంలో ఎవరెవరికి గన్‌మెన్ సౌకర్యం కల్పించారు? వారికి ఎంత వ్యయం అవుతుంది? ఈ సేవలు పొందుతున్నందుకు వారేమైనా రుసుము చెల్లిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన పోలీసుశాఖ ఆ వివరాలు సెక్షన్ 24 (4) ప్రకారం వెల్లడించలేమంటూ సమాధానం ఇచ్చింది. బౌన్సర్లను పోలీసులుగా.. ప్రాణ భయం ఉన్న పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు పోలీసుశాఖ గన్మన్లను కేటాయించింది. లైసెన్స్డ్ గన్స్ మంజూరు చేసింది. ఇంకొందరు తమ వెంట ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. వారినే పోలీసులుగా చూపిస్తూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. హెయిర్ కటింగ్, సఫారీలు వేసుకోవడం, బాడీ లాంగ్వేజ్, నడుముకు తుపాకులు ఉండటంతో వీరు కూడా పోలీసులేనని జనాలు భ్రమపడిపోతున్నారు. స్పష్టత, పర్యవేక్షణ అవసరం.. ప్రభుత్వం ఎంతమందికి గన్మన్లతో రక్షణ కల్పించారన్న విషయం జిల్లాల వారీగా విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేటు బాడీగార్డులు, బౌన్సర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండాలని, వారి కదలికల సమాచారం సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఉండేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పారదర్శకత, పోలీసుల పర్యవేక్షణ పెరిగితే అమాయకులపై బెదిరింపులు అంతగా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. -
చౌదరి గన్ మెన్ల దౌర్జన్యం
అనంతపురం రూరల్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గన్మెన్లు దౌర్జన్యాలకు తెరలేపారు. పేదలకిచ్చిన స్థలాలను ఎమ్మెల్యే పేరు చెప్పి బలవంతంగా అక్రమించుకుంటున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ హుకుం జారీ చేశారని ఎ.నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన రామాంజినమ్మ, మాబున్నీలకు 2007లో ఇందిరమ్మ కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారు. 70 శాతం మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయినా బిల్లులు రాలేదు. దీంతో ఇంటి నిర్మాణ పనులు ఆపేసి బాడుగ ఇంట్లో జీవసం సాగిస్తున్నారు. ఇదే అదునుగా భావివంచిన ఎమ్మెల్యే గన్మెన్లు హరి, నబిరసూల్‌లు ఖాళీగా ఉన్న ఆ రెండు ఇళ్లను తమ అధీనంలోకి తీసుకొని నేల మట్టం చేశారు. స్థలాలను ఆక్రమించి పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం తమకు మంజూరు చేసిన స్థలంలో మీరు ఎలా ఇంటి నిర్మాణ పనులు చేపడతారని ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మీ పేర్ల మీద ఉన్న పట్టాలను రద్దు చేయించాం. మీకు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండం’టూ దౌరజ్జన్యం చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యా రు. పనులకు వెళ్లి పొట్ట నింపుకునే బడుగు జీవులపై పెత్తనం చెలాయించడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే గన్మెన్లు తమ పేర్ల పైన ఇంటి పట్టాలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని తెలిసి, వారి సమీప బంధుల పేరిట పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. -
అలిగిన మంత్రి అఖిలప్రియ
సాక్షి, ఆళ్లగడ్డ: మంత్రి అఖిలప్రియ అలకబూనారు. తన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారన్న కోపంతో గన్మెన్లను వెనక్కి పంపించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనకు రక్షణగా వస్తున్న స్థానిక పోలీసులను సైతం వెంట రావద్దని పంపించేశారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలోని వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దీంతో సదరు వ్యక్తులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆమె స్థానిక పోలీసులను అడగ్గా.. పై అధికారుల ఆదేశాల మేరకు అనుమానమున్న అందరి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని చెప్పారు. తన వర్గీయుల ఇళ్లపైనే ఆకస్మిక దాడులు నిర్వహిస్తారా? అంటూ గురువారం రాత్రి గన్మెన్లను పిలిచి.. వెళ్లిపోవాలని అఖిలప్రియ ఆదేశించారు. గన్మెన్లు ఉన్నతాధికారులకు చెప్పగా, వారు మంత్రితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయినప్పటికీ శాంతించని మంత్రి ముందు గన్మెన్లు బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తోడెండ్లపల్లి, రుద్రవరం మండలం నరసాపురం గ్రామాల్లో సభల్లో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మంత్రికి భద్రత కల్పించేందుకు స్థానిక ఎస్ఐలు, పోలీసులు వెంట రావడంతో మంత్రి మరోసారి మండిపడ్డారు. అన్ని పార్టీలకు చెందిన అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు. అధికార పార్టీ నేతలు మాత్రమే అసంతృప్తితో ఉండడం గమనార్హం. -
అక్రమ సంబంధం; భర్త తలకు తుపాకీతో గురి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో ఓ అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపింది. అక్రమ సంబంధంపై నిలదీసిన భర్తను కాల్చిపడేస్తానంటూ నిందితుడు బెదిరింపులకు దిగడంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన శైలజ, రాజు భార్యాభర్తలు. అయితే, గత కొంతకాలంగా రాచకొండ ఏడీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మెన్‌గా పనిచేసే రమేష్, శైలజ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న రాత్రి (సోమవారం) 7 గంటల సమయంలో శైలజ, రమేష్ ఇంట్లో ఉండగా గమనించిన రాజు వారిని నిలదీశాడు. దీంతో రమేష్, రాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమేశ్ తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని రాజు మొయినాబాద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తుపాకీతో గురిపెట్టి కాల్చిపడేస్తానంటూ రమేష్ తనను హెచ్చరించాడని రాజు కంప్లెయింట్‌లో పేర్కొన్నాడు. ఇదిలాఉండగా.. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా రమేష్ తన రివాల్వర్ ఎలా తీసుకెళ్లాడని ఆరోపణలు చేస్తున్నారు. -
టీడీపీ ఎంపీ గన్‌మెన్ భార్య ఆత్మహత్య
సాక్షి, మదనపల్లె: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ గన్‌మెన్ వెంకటరమణ భార్య సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బాలాజీనగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా వెంకటరమణ తన భార్య సరస్వతిని సర్వీస్ గన్‌తో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో కాల్పులు..ముగ్గురి మృతి
న్యూ ఓర్లియాన్స్: అమెరికాలోని న్యూ ఓర్లియాన్స్ నగరంలో శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గరలోని రెండు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. న్యూఓర్లియాన్స్ నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ సమీపంలో ఉన్న క్లాయ్‌బోర్న్‌అవెన్యూలో ఈ కాల్పులు జరిగాయి. ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా జన సమూహంపై తుపాకులతో కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి మైఖేల్ హారీసన్ తెలిపారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు వేగవంతం చేశామని హారీసన్ తెలిపారు. కాల్పులకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాల్పుల సంఘటనను నగర మేయర్ లాటోయో కాంట్రెల్ ఖండించారు. ఇలాంటి ఘటనలకు ఓర్లియాన్స్లో తావులేదని ట్విటర్ ద్వారా తెలిపారు. -
గన్‌మెన్ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండటం, ఇతరత్రా కారణాల వల్ల వారి భద్రత విషయమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నాలుగేళ్లుగా గన్మెన్లను నియమించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించినట్లు సమాచారం. ఉండాల్సిందే.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకే గన్‌మెన్‌తో, మరికొంత మంది గన్మెన్లు లేకుండానే నియోజకవర్గాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు గన్మెన్లను నియమిస్తే మరుసటి రోజే హెడ్‌క్వార్టర్స్‌కు రిటర్న్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ఎస్పీలు రిపోర్టు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ)లను తొలగించుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ తిరగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతపై ఆయా జిల్లాల మంత్రులతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా కొంతమందికి ఫోన్లు వెళ్లడంతో తప్పక పలువురు గన్మెన్లను నియమించుకున్నట్లు తెలిసింది. ముగ్గురు ఎంపీలూ.. ముగ్గురు ఎంపీల విషయంలోనూ ఇదే వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. గన్మెన్లను కేటాయిస్తే క్యాంపు ఆఫీసు, ఇళ్లలో వదిలి కార్యకర్తలు, అనుచరులతో వెళ్తున్నారని.. ఆ ఎంపీలకూ మందలింపులు జరిగాయని సమాచారం. దీంతో ఇద్దరు 2+2 నియమించుకోగా, ఓ ఎంపీ 1+1 స్వీకరించినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎస్పీలు, కమిషనర్ల మధ్య గన్మెన్లు ఒత్తిడికి గురవుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు వెంట తీసుకెళ్లకపోవడం.. వెళ్లకపోతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..16 మంది మృతి
బాగ్దాద్ : ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్ ప్రావిన్స్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాగ్దాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపాడని స్థానిక లుటెనంట్ కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారులవిగా గుర్తించారు. చనిపోయిన వారంతా ఈ ముగ్గురు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనాస్థలాన్ని సీజ్ చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు జుబౌరీ తెలిపారు. -
నాకు అవసరం లేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మరోమారు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు. తాజాగా సోమవారం మళ్లీ ఇద్దరు గన్మెన్లను కేటాయించగా.. ఈసారీ వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే తనకు కొండంత అండ అని తెలిపారు. -
టీవీ చానెల్‌పై సాయుధుల దాడి.. కాల్పుల బీభత్సం.. భీతావహం!
కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గుర్తుతెలియని సాయుధులు మంగళవారం కాబూల్‌లోని ఓ టీవీ చానెల్లోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రముఖ టీవీ చానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా బలగాలు టీవీ చానెల్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి. చానెల్లో కాల్పులతో విరుచుకుపడుతున్న సాయుధులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక సాయుధుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాబూల్ పోలీసులు ప్రకటించారు. మిగతా సాయుధులను కూడా ఏరివేసి.. చానెల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. త్రుటిలో తప్పించుకున్నాను: రిపోర్టర్ భారీ ఆయుధాలతో వచ్చిన సాయుధులు గ్రనేడ్లు విసురుతూ.. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ.. చానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలోని చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాయలంలో చొరబడిన సాయుధులు కాల్పులు కొనసాగిస్తుండటంతో అందులోని ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారు. సాయుధుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు చానెల్ రిపోర్టర్ ఒకరు మీడియాకు తెలిపాడు. చానెల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొందని, కాసేపటికోసారి కాల్పుల శబ్దం, ఉద్యోగాల హాహాకారాలు వినిపిస్తున్నాయని ఆయన వివరించారు. వందమందికిపైగా ఉద్యోగులు కార్యాలయ భవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాబూల్‌లో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. -
రేవంత్ రెడ్డి గన్మెన్లు వెనక్కి..
సాక్షి, వికారాబాద్ : కొడంగల్ ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ గన్మెన్లను కూడా వెనక్కి పంపారు. కొడంగల్‌లో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం నేరుగా వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. గన్మెన్లను సరెండర్ చేశారు. రాజీనామా ఆమోదం పొందకముందే ఆయన ఈ పనిచేయడం గమనార్హం. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో ఏకవాక్య రాజీనామా లేఖను రాసిన రేవంత్.. దానిని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. రేవంత్ వెంట సూర్యాపేట టీడీపీ చీఫ్! : అక్టోబర్ 31న ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు సైతం ఆయన వెంట పార్టీ మారనున్నట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పటేల్ రమేశ్‌రెడ్డి ఆదివారం తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై, రేవంత్‌తో కలిసి వెళ్లే అంశంపై చర్చలు జరిపారు. -
24 మంది క్రైస్తవుల కాల్చివేత
-
24 మంది క్రైస్తవుల కాల్చివేత
కైరో: ఈజిప్టులో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. విచక్షణ లేకుండా ఓ బస్సుపై కాల్పులతో మారణకాండ సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్ అన్బా శామ్యూల్ మొనాస్టరీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోగా 25మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దేశంలోని కోప్టిక్ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌లో రెండు చర్చిలపై జరిగిన బాంబు దాడుల్లో 46 మంది చనిపోయారు. -
ఆఫ్ఘన్ టీవీ స్టేషన్లో ఉగ్రవాదుల భీభత్సం
జలాలాబాద్: గుర్తు తెలియని ఉగ్రవాదులు ఏకంగా అఫ్ఘనిస్థాన్ అధికారిక టీవీ చానెల్ భవనంపై దాడికి దిగారు. జలాలాబాద్లోలోని ఓ భవనంలో గల టీవీ స్టేషన్లోకి చొరబడి ఇష్టారీతిన కాల్పులకు తెగబడ్డారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది మాత్రం ఇప్పటికీ పోరాడుతున్నాడట. బుధవారం ఉదయం మొదలైన ఈ దాడి ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. భద్రతా బలగాలకు సాయుధుడికి మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని ప్రావిన్షియల్ గవర్నర్ అధికారిక ప్రతినిధి అత్తౌల్లా ఖుగ్యానీ విలేకరులకు తెలిపారు. ‘ఎంతమంది సాయుధులు టీవీ స్టేషన్లోకి చొరబడ్డారనే విషయాన్ని మేం ఇప్పుడే స్పష్టం చేయలేము. పైగా వారు ఎవరు? వారి టార్గెట్ ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి లోపలికి ముగ్గురు చొరబడినట్లు కనిపిస్తోంది. వారిలో ఇద్దరు తమను తాము పేల్చేసుకోగా ఒకరు మాత్రం బలగాలతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది’ అని ఖుగ్యానీ అన్నారు. ప్రస్తుతం దాడి జరుగుతున్న ప్రాంతానికి పాకిస్థాన్‌తో సరిహద్దు ఉంది. -
పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
విజయవాడ: తప్పు చేసిన ప్రజాప్రతినిధులపై పోలీసు అధికారులు తమంతటతాము చర్యలు తీసుకునే మాట అటుంచితే.. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడానికి జంకుతున్నారు. రవాణాశాఖ ఆఫీస్‌లో టీడీపీ నేతలు గన్‌మెన్‌పై దాడికి పాల్పడిన ఘటనలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, అంబటి రాంబాబు తదితరులు రెండు రోజుల క్రితం ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన సీఐ చంద్రశేఖర్.. కనీసం రశీదు కూడా ఇవ్వలేదని వారు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గన్‌మెన్‌పై దాడి ఘటన కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసుల తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇంట్లోకి చొరబడి కాల్చిచంపాడు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోపోర్ పట్టణంలోని సైద్పురా ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగుడు నేరుగా ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో ఫయాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు ఎందుకు జరిపాడు అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
బంగ్లా ఈద్గాపై దాడి: రంగంలోకి భారత ఎన్ఎస్జీ
- ఒక ముష్కరుడి హతం.. మరో ఆరుగురి కోసం వేట ఢాకా: అధికారిక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ లో రంజాన్ పండుగ నాడు ముష్కరులు బీభత్సం సృష్టించారు. దాదాపు ఏడుగురు సాయుధులు.. బంగ్లాలోనే అతిపెద్ద ఈద్గా(ముస్లింల ప్రార్థనా స్థలం) అయిన షోలాకియాపై దాడి చేశారు. నమాజ్ చేసేందుకు వచ్చినవారిపై పెద్ద ఎత్తున బాంబులు, తుపాకులు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరుల్లో ఒకణ్ని భద్రతాబలగాలు అంతమొందించాయి. మరొకడిని సజీవంగా పట్టుకున్నాయి. ఈద్గా సమీపంలోని స్కూల్ భవనంలో దాక్కున్న మరి కొదరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. మెడలో తుపాకులు, ఓ చేతిలో నాటు బాంబులు, మరో చేతిలో కత్తులు చేతబట్టుకున్న దాదాపు ఏడుగురు.. షోలాకియా ఈద్గా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని, పోలీస్ చెక్ పోస్టుపై బాంబులు విసిరారని, వెంటనే తేరుకున్న పోలీసులు ముష్కరులపై కాల్పులు జరిపారని, ప్రతిదాడిలో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడని కిశోర్ గంజ్ జిల్లా పోలీస్ డిప్యూటీ చీఫ్ తౌఫజల్ హుస్సేన్ తెలిపారు. పోలీసు కాల్పులతో పారిపోయిన ముష్కరులు ఈద్గా సమీపంలోని ఓ స్కూల్ భవనంలోకి చొరబడి, లోపలినుంచి కాల్పులు చేస్తున్నారని, వారి కోసం వేట కొనసాగుతోందని పేర్కొన్నారు. రంగంలోకి భారత ఎన్ఎస్జీ రంజాన్ పర్వదినాన పొరుగు దేశంలో చోటుచేసుకున్న భీకర పరిణామాలపై భారత ప్రభుత్వ స్పందించింది. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్ జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనుంది. 26/11 ముంబై, గుర్ దాస్ పూర్, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వంటి ఉగ్రదాడుల సమయంలో సమర్థవంతంగా పనిచేసి, ముష్కరులను అంతం చేయడంతో ఎన్ఎస్జీది కీలక పాత్ర. ప్రస్తుతం షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుంది. -
సోమాలియాలో మళ్లీ దారుణం
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ వద్ద తీవ్రవాదులు శనివారం బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహమద్ అబ్దుల్ ఖాదీర్ వివరాల ప్రకారం.. పెట్రోల్ పంప్, షాపింగ్ మాల్స్ ఉన్న హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. సామాన్య పౌరులే ఈ దుర్ఘటనలో ఎక్కువగా మృతిచెందారని తెలిపారు. నాసో హబ్లాడ్ హోటల్ గేటు వద్ద తొలుత కారు బాంబు పేల్చిన తర్వాత సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. ఆ హోటల్ లో ఎక్కువగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, విదేశాలకు చెందిన ముఖ్య వ్యక్తులు, జర్నలిస్టులు బస చేస్తారని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి ఉండొచ్చని ఓ ఉన్నతాధికారి దాహిర్ వివరించారు. మూడు వారాల కిందట రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. అప్పట్లో ఆ కాల్పులకు పాల్పడ్డ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు హతమార్చారు. మిలిటెంట్లు సోమాలియాను ఇస్లామిక్ స్టేట్ ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని అధికారులు