ఉప్పల్: బీజేపీ నేతపై హత్యాయత్నం బూటకమని పోలీసులు తేల్చారు. తనకు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ప్రాణహాని ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నంలో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్న రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యల్లగోని భాస్కర్ గౌడ్, సినీ నిర్మాతగా, రియల్ వ్యాపారిగా పని చేసేవాడు. ఈ నెల 24న అతను తనపై హత్యాయత్నం జరిగిందని రక్త గాయాలతో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో పలు అసక్తికరమైన అంశాలు గుర్తించారు.
సెటిల్‌మెంట్లు..రియల్ దందాలు
భాస్కర్ గౌడ్ పలు సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. బీజేపీ రాష్ట్ర స్వచ్చ్ భారత్ అభియాన్ కనీ్వనర్‌గా, జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. బోడుప్పల్‌లో ఆఫీసు ఏర్పాటు చేసిన అతను భూ తగాదాలకు సంబంధించిన సెటిల్ మెంట్‌లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిపై ఉప్పల్, నాచారం, కీసర తదితర పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నాయి, మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది.
పలుకుబడి కోసం పథకం..
ఈ నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు గన్‌మెన్‌న్‌ను నియమించుకోవాలని భావింన భాస్కర్ గౌడ్ తన స్నేహితుడు శివ కిషోర్ గౌడ్‌తో కలిసి పథకం రూపొందించాడు. హత్యాయత్నం జరిగితే కాని గన్‌మెన్‌లను ఇవ్వరని తెలియడంతో శివకిషోర్ తన స్నేహితుడు యదగిరితో కలిసి ఈ నెల 22 న నాగోల్‌లోని అమరావతి బార్ వద్ద పథకం రంచారు. యాదగిరి స్నేహితులు కొండా అరుణ్,సృజన్ రెడ్డి, ఆకుల ప్రశాంత్, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ తదితరులు భాస్కర్ గౌడ్‌పై ఫేక్ హత్యాయత్నం చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ర. 2.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా ర. 50,000 ఇచ్చారు.
24న ఉప్పల్ ఏషియన్ థియేటర్ వైపు నుంచి భాస్కర్ గౌడ్ కారులో డ్రైవర్‌తో కలిసి ఉప్పల్ భగాయత్‌లోకి రాగానే వనం టీ స్టాల్ వద్ద ఉన్న శివకుమార్ స్నేహితులు డ్రైవర్‌పై, భాస్కర్ గౌడ్‌పై కత్తితో దాడి చేసి పారి పోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యాయత్నం బూటకమని తేల్చారు. పోలీసులను తప్పుదోవ పట్టింనందుకుగాను పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుండీ హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్‌లు, ర. 2 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సవవేశంలో ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ,ఎస్‌ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment