![Unknown Persons Deceased Attempt On Man In Serilingampally - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/10/man_0.jpg.webp?itok=_y_M5B5q)
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి లింక్‌రోడ్ వద్ద ఓ యువకునిపై హత్యాయత్నం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు బాటిళ్లతో ఓ యువకుడి గొంతు కోసి పరారయ్యారు. యువకుడి కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అయిన యువకుడి పరిస్థితి విషమం ఉండటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment