Serilingampally
-
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కారు గుర్తుపై గెలిచిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపొచ్చింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నేతలతో ఆయన భేటీ కానున్నారు.అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పడింది. కొత్త నాయకత్వాన్ని తయారు చేయటంపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వరస సమావేశాలను కేటీఆర్ నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
నేడు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం
-
శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తో టుడేస్ లీడర్
-
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఎన్నికల ప్రచారం
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
మైనర్ బాలికపై వేధింపులు.. తండ్రి మందలించడంతో..
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని ఓ మైనర్ బాలిక(16)ను స్థానికంగా ఉండే నాగేశ్వర్రావు కుమారుడు అరవింద్ (21) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాలిక తండ్రి అరవింద్‌ను మందలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 2న బాలిక తండ్రి ద్విచక్ర వాహననంతోపాటు మరో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంటికి అమర్చిన ఏసీ ఔట్ డోర్ కంప్రెషర్ కూడా కాలిపోయింది. దీనికి కారణం అరవిందేనని స్థానికులు చితకబాదారు. ఈనెల 9న బాలికను అరవింద్ వే«ధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు 14న అరవింద్‌ను విచారణ కోసం పిలిచారు. తనపై వారు దాడిచేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ ముందు బాలిక కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.చివరకు చందానగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేరిలింగం పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మెతుకు నర్సింహ రాములుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసులో వ్యవహారంలో ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందాలు సోదాలు నిర్వహించాయి. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ అనేక ఫిర్యాదులు రావడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టిన ఏసీబీ కీలక డాక్యుమెంట్లను సేకరించింది. దీనితో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిపింది. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీ నం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చాంబర్ సీజ్.. శేరిలింగంపల్లి సర్కిల్ టీపీవో ఎం.నర్సింహ రాములు చాంబర్‌ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. గురువారం ఉదయం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి టీపీవో చాంబర్ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే తెరిచి ఉన్న చాంబర్‌ను డోర్ లాక్ వేసి సీజ్ చేశారు. చాంబర్లో ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయని, ఎవరు తెరవరాదని సెక్యూరిటీతో చెప్పి వెళ్లారు. లాక్‌పై వేసిన సీల్‌పై సీబీ డీఎస్పీ డాక్టర్ శ్రీనివాస్ పేరుతో పాటు ఫోన్ నెంబర్ రాసి వెళ్లారు. కాగా సిటీ ప్లానర్ నర్సింహ రాములు షిరిడీ యాత్రలో ఉన్నట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ అధికారులు ఏసీబీ అధికారులు సిటీ ప్లానర్ చాంబర్‌ను సీజ్ చేయడంతో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు. రెండో అంతస్తులో ఉన్న జోనల్ టౌన్ ప్లానింగ్‌లో పనిచేసే ఏసీపీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పత్తా లేకుండా పోయారు. అకౌంట్స్ సెక్షన్‌తో పాటు మొదటి అంతస్తులో ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్–21 టౌన్ ప్లానింగ్ విభాగంలోను ఎవరు ఆఫీస్‌కు రాలేదు. వెస్ట్‌జోనల్ కమిషనర్ ప్రియాంక అల సమీక్షా సమావేశాన్ని చందానగర్ సర్కిల్లో నిర్వహించడం గమనార్హం. అటు మూసారాంబాగ్‌లోని నివాసంలో మరో డీఎస్పీ ఫయాజ్ సయ్యద్ నేతృత్వంలో అధికారుల బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. -
బాటిళ్లతో యువకుడి గొంతు కోసి పరారైన దుండగులు
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి లింక్‌రోడ్ వద్ద ఓ యువకునిపై హత్యాయత్నం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు బాటిళ్లతో ఓ యువకుడి గొంతు కోసి పరారయ్యారు. యువకుడి కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం అయిన యువకుడి పరిస్థితి విషమం ఉండటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
నవోదయ విద్యాలయ.. దరఖాస్తు చేయండిలా
సాక్షి, హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయ రంగారెడ్డి జిల్లాలో 2021–22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డేనియల్ రత్నకుమార్ కోరారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని జేఎన్వీ కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రవేశ ప్రక్రియను వివరించారు. రంగారెడ్డి జిల్లా జేఎన్వీ పరిధిలోకి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం అయిదో తరగతి విద్యార్థులంతా అర్హులన్నారు. ఆరవ తరగతి ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రశ్న: దరఖాస్తులను ఎలా చేసుకోవాలి? ప్రిన్సిపల్ : వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులను ఆన్లైన్లోనే చేసుకోవాలి. డిసెంబర్ 15వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న: ఆరవ తరగతి దరఖాస్తులకు అర్హులెవరు? ప్రిన్సిపల్ : 01–05–2008 నుంచి 30.4.2012 మధ్య పుట్టినవారై వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి. ప్రశ్న: ఆరవ తరగతిలో అడ్మిషన్లకు రిజర్వేషన్లు వర్తింపజేస్తారా? ప్రిన్సిపల్ : ఆరవ తరగతిలోని మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 25 శాతం పట్టణ వాసులకు రిజర్వు చేస్తారు. మొత్తం సీట్లలో 1/3 సీట్లు బాలికలకు కేటాయించారు. అంతేకాక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం సీట్లు కేటాయిస్తాం. ప్రశ్న: ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు ఎలాంటి సౌకర్యం కల్పించారు? ప్రిన్సిపల్ : విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులో తోడ్పడుటకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థి అన్ని డాక్యుమెంట్లను తీసుకొని రిజిష్ట్రేషన్ చేసుకొనేటప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ స్వీకరించడానికి పనిచేస్తున్న మొబైల్ తీసుకొని సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి. అందుకోసం సహాయకేంద్రం సహాయకులు పీ. శ్రీనివాసరావు– 9959513171, కే.మట్టారెడ్డి– 9490702185, భూప్‌సింగ్– 9390728928లతో సంప్రదించవచ్చు. ప్రశ్న: జేఎన్వీ ప్రత్యేకతలు ఏమిటి? ప్రిన్సిపల్ : కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి ద్వారా జేఎన్వీలను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంగ్లిష్ మీడియం బోధన ఉంటుంది. జేఎన్వీ రంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల అన్ని అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చాం. 11, 12 తరగతి చదివే అమ్మాయిలకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖచే నెలకు రూ. 2 వేల స్కాలర్షిప్ అందిస్తారు. అవంతి ఫెలోస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 11, 12 తరగతులు చదివే వారికి జేఈఈ (జీ), నీట్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరగుతుంది. చదవండి: బూజు జాడ చెప్పే కొత్త యంత్రం! -
శేరిలింగంపల్లి యువతిపై కార్పొరేటర్ దాడి
-
యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం ఓ యువతిపై దాడి చేశారు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్ కుటుంబం కూడా ఉంటుంది. అక్కడికి కారులో వచ్చిన వేణుగోపాల్ కుమార్తె అడ్డంగా ఉన్న కార్పొరేటర్ కారు తీయాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది దాడి చేసేంతగా పెరిగింది. ఈ గొడవను వేణుగోపాల్ రెండో కుమార్తె వీడియో తీసింది. షార్ట్, బనియన్‌పై ఉన్నానని వీడియో తీయ్యొద్దని కార్పొరేటర్ ఆ యువతిని వారించారు. అయినా వినకుండా వీడియో తీయడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురిపైన కేసు నమోదయినట్లు చందానగర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పై 323,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువతి పైన 448,504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. -
రాయదుర్గం భూములు ప్రభుత్వానివే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం.46లోని 84 ఎకరాల 30 గుంటల భూములపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే రిట్ దాఖలైందని, ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది. భూములపై కోర్టు వ్యాజ్యాలు ఉన్న తరుణంలో అవి భూ కబ్జాదారులు ఆక్రమించకుండా పోలీసుల రక్షణ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇతరులు రిట్ దాఖలు చేశారు. ఈ భూములు తమవేనని, రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మ్యుటేషన్ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మరో రిట్ కూడా దాఖలైంది. వీటిని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వ్యతిరేకించారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని, వాటి విషయంలో ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పారు. 1946లో ఇచ్చిన డిక్రీని అడ్డం పెట్టుకుని భూముల్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని, వీటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి భూములను కాపాడుతోందని చెప్పారు. గతంలో కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ 7, సీఎస్ 14ల్లోని భూములకు చెందిన పత్రాలు అన్నింటినీ కోర్టు ఆఫ్ వార్డు స్వాధీనంలో ఉంచామని తెలిపారు. ఇప్పటికే ఈ భూములపై కోర్టు ధిక్కార కేసు కూడా నమోదైందని, ఇప్పుడే ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు. -
‘మంత్రి పదవి రానందుకు అసంతృప్తి లేదు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో ఎలాంటి అసంతృప్తి లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. అలకబూనిన ఎమ్మెల్యే గాంధీ, గన్మెన్లను పంపించారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టి పారేశారు. తన మనవడిని చూసేందుకు గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో రెండు రోజుల పాటు గన్మెన్లను వాపస్ పంపానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి గన్మెన్లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. సోమవారం గుంటూరుకు వెళ్లేందుకు ప్రయాణమైన ఆయన నగర శివార్లలోకి వెళ్లగానే గన్మెన్లను పంపించారనే ప్రచారం జరగడంతో వెనుదిరిగి వివేకానందనగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రతిసారి ఇలానే గన్మెన్లను పంపిస్తానని వివరించారు. తమ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విధేయునిగా ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం కేటీఆర్‌ను కలిశానన్నారు. (చదవండి: గులాబీ పుష్పక విమానం.. ఓవర్ లోడ్!) -
టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ
సాక్షి, హైదరాబాద్: శేరిలింగపల్లిలో నియోజకవర్గంలో టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. శేరిలింగపల్లిలోని ఆల్విన్ సొసైటీ కార్యాలయంలో బుధవారం ఉదయం కొందరు టీడీపీ నాయకులు అల్పహార విందు ఏర్పాటు చేశారు. టీడీపీ విందు కార్యక్రమం గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. టీడీపీ ఎన్నికల నియమావళిని ఉల్లఘింస్తుందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఆల్విన్ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆల్విన్ సొసైటీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున అరికెపూడి గాంధీ, టీడీపీ నుంచి వెనిగళ్ల ఆనంద్‌ప్రసాద్ బరిలో ఉన్నారు. -
శేరిలింగంపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం
-
కూటమిలో కొట్లాట
-
గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు
హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటులో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో లొల్లి మొదలైంది. దీనిలో భాగంగా గాంధీ భవన్ వద్ద బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అనుచరులు.. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తను ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును తనకే కేటాయిస్తారంటూ ప్రచారం చేసుకున్న భిక్షపతి.. తాజా పరిణామాలతో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించవద్దని భిక్షపతి యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వకుండా ఎవరిని నిలబెట్టినా ఓడిస్తామని ఆయన హెచ్చరించారు. భిక్షపతి యాదవ్‌కు మద్దతుగా మరొక కార్యకర్త చేయి కోసుకుని నిరసన తెలిపాడు. -
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా - శేరిలింగంపల్లి
-
శేరిలింగంపల్లి టీఆర్ఎస్లో అసమ్మతి రాగం!
మియాపూర్: మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌కు శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని డివిజన్ కార్యకర్తలు, అభిమానులు హెచ్చరించారు. శుక్రవారం హఫీజ్‌పేట్ డివిజన్లోని ఇంజినీర్స్ ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో కార్యకర్తలు పలువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న బీసీ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్‌కు వారం రోజుల్లోగా శేరిలింగంపల్లి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 10 డివిజన్లలోని నాయకులు, కార్యకర్తలను ఏకం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ అధిష్టానం తలొగ్గకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తేల్చిచెప్పారు. అయినా పార్టీ విధానంలో మార్పు రాకపోతే తమ నాయకుడు జగదీశ్వర్‌గౌడ్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలిపారు. ఆయన గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని విధాలా అర్హుడైన జగదీశ్వర్‌గౌడ్‌ను కాదని టీడీపీ నుంచి వచ్చిన ఆరెకపూడి గాం«ధీకి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు నల్లా సంజీవరెడ్డి, తయార్ హుస్సేన్, నాగేశ్వర్రావు, మోహన్ నాయక్, జీవీ రెడ్డి, లక్ష్మీనారాయణ, దేవేందర్, సాదిక్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, మోసిన్, అజీజ్, సాజిద్, భాగ్యారావు, శ్యామ్, కృష్ణ, రాధారాణి, సరోజ, దేవి, బిందు, రత్నమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యి కోట్ల స్థలం..
► శేరిలింగంపల్లిలో సర్కారు స్థలాల ప్రక్షాళన షురూ ► ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే మినహాయింపు గచ్చిబౌలి: శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూముల ప్రక్షాళన మొదలైంది. రాయదుర్గం నవకల్సాలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యి కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజిత్ కుమార్ షైనీ ఆదేశాలతో రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2లో రెండు వారాలుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రహరీలు, బారికేడ్లు తొలగించి సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కబ్జాదారుల్లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నట్టు తెలుస్తోంది. తమ పాట్లు, స్థలాలకు మినహాయింపు ఇవ్వాలని వీరు రెవెన్యూ ఉన్నతాధికారులు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 40 ఎకరాలకు సరిహద్దులు ... రాయదుర్గం నవకల్సా సర్వే నెంబర్ 66/2లో 45 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ స్థలం. కొందరు రియల్టర్లు ఏడాది క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో ప్రధాన రహదారి వెంట ఉన్న 4 ఎకరాల స్థలంలో బారికేడ్లు నిర్మించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ భూములు సర్వే చేపట్టిన అధికారులు ఈ సర్వే నెంబర్లో 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని సరిహద్దులు నిర్ణయించారు. ఒవర్లాప్లో 3 ఎకరాలు చిత్రపురి కాలనీలోకి పోయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1లో 55 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో శశ్మానlవాటిక ఉంది. ఈ సర్వే నెంబర్లోని ప్రహరీ గోడలను కూల్చి సరిహద్దులు ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 66/1, 66/2లలో ఇప్పటికే 40 ఎకరాలకు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎకరం ధర 25 కోట్ల పైగా ఉంది. గ్రామ మ్యాప్ ఆధారంగా ఇప్పటికే ఓ సారి సర్వే చేసిన అధికారుల... ఇందులో సరిహద్దులు సరిగ్గా రాకపోవడంతో డాక్యుమెంట్ల ప్రకారం సర్వే చేస్తున్నారు. శుక్రవారంతో పూర్తి కానున్న ఈ సర్వే అనతరం ఎన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నారో స్పష్టం కానుంది. వంద ఎకరాలు గుర్తించాల్సి ఉంది: - మధుసూదన్ , తహసీల్దార్ రాయదుర్గం సవకల్సా సర్వే నెంబర్ 66/1, 66/2, 66/3లో 260 ఎకరాలను ప్రభుత్వ స్థలమని 2001లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని శేరిలింగంపల్లి తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్లు చెల్లవని చెప్పారు. అయితే, ప్రభుత్వం క్రమబద్ధీకరించినా, కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్లు అయినా మినహాయింపు ఉంటుందన్నారు. నవకల్సాలోని మూడు సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించాల్సి ఉందన్నారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 28ను ప్రక్షాళన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అన్ని సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు. -
బంగారం వర్తకుల బంద్
శేరిలింగంపల్లి (హైదరాబాద్) : బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శేరిలింగంపల్లి జ్యూయెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. కేంద్రం వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జ్యుయెలరీ షాపులను మూసివేశారు. తారానగర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎక్సైజ్ డ్యూటీని విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎక్సైజ్ సుంకంతో జ్యూయెలరీ వ్యాపారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. -
'బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు'
హైదరాబాద్: రెండేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని ఐటీ, పంచాయతీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం శేరిలింగంపల్లి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా మోదీ తెలంగాణకు రాలేదన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నుంచి ఆరు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లలో కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. -
ఆ వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే గాంధీ
హైదరాబాద్: తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడంపై వస్తున్న వార్తలను తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను రాయడం, ప్రసారం చేయడం చేసేటప్పుడు తన వివరణ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గాంధీ అన్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాజకీయంగా తనను గట్టి దెబ్బ తీయడానికి జరుగుతున్న ప్రచారంగా ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. -
శివార్లలో ‘ఔటర్ల’ హల్చల్!
* జీహెచ్ఎంసీ శివారు వార్డుల్లో జిల్లా నేతల పాగా * తమ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం * ఎల్బీనగర్ సర్కిల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ * సాగర్ రహదారి డివిజన్లలో మంచిరెడ్డి వర్సెస్ గుత్తా * ఉప్పల్‌లో ఈటల వర్సెస్ దామోదర్‌రెడ్డి, ఉమా మాధవరెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జీహెచ్ఎంసీ పీఠంపై కన్నేసిన అధికార పార్టీ మంత్రులకు డివిజన్ల బాధ్యతను అప్పగించగా... గ్రేటర్ శివార్లలో జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఆయా జిల్లాల నేతలను కాంగ్రెస్, టీడీపీ రంగంలోకి దింపాయి. శివారు డివిజన్లలో స్థిరనివాసం ఏర్పరచుకున్న తమ జిల్లాల ఓటర్లను ప్రభావితం చేసేందుకు.. ఆ నేతలను బరిలోకి తెచ్చి వ్యూహాత్మక ఎత్తుగడ వేశాయి. దీంతో అధికార పార్టీ కూడా మంత్రులను వారికి తొలుత కేటాయించిన డివిజన్ల నుంచి... వారి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్న డివిజన్లను పంపే పనిలో నిమగ్నమైంది. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి మంత్రులకు డివిజన్ల కేటాయింపు పూర్తిచేసేలా కసరత్తు చేస్తోంది. ఈలోగానే ఆయా జిల్లాల నేతలతో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్, టీడీపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎల్బీ నగర్లో నల్లగొండ నేతలు ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్ఎస్ తరఫున బాధ్యత తీసుకోగా... ఆయనకు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వేముల వీరేశం, టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి సహకరిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. ఇదే సర్కిల్లోని బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, ఆర్.కె.పురం, సంతోష్‌నగర్ డివిజన్ల బాధ్యతను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించారు. తెలుగుదేశం పార్టీ తమ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో పాటు నల్లగొండ జిల్లా నేతలు పలువురికి ఈ ప్రాంతంలో ప్రచార బాధ్యతలు అప్పగించింది. నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎల్బీనగర్ సర్కిల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ప్రచారంలోకి దిగారు. గత ఆదివారం నామినేషన్ల కార్యక్రమానికి వారిద్దరూ హాజరయ్యారు. బుధవారం నుంచి అభ్యర్థులతో పాటు తాము ప్రచారంలో పాల్గొంటామని వెంకట్‌రెడ్డి చెప్పారు. దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్ దాకా విస్తరించి ఉన్న నల్లగొండ జిల్లా వాసులను కలుసుకుని మద్దతు కోరడమే అన్ని పార్టీల నల్లగొండ జిల్లా నేతల లక్ష్యం. ఉప్పల్‌లో ఈటల.. కూకట్‌పల్లిలో తుమ్మల ఉప్పల్ సర్కిల్లో ఆర్థిక మంత్రి ఈటల టీఆర్ఎస్ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీడీపీ తరఫున ఉమామాధవరెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఈ నేతలు ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక మినీ ఏపీగా పిలిచే కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ తరఫున ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల, టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. శేరిలింగంపల్లిలో అధికార పార్టీ తరఫున రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, టీడీపీ తరఫున వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. రాజేంద్రనగర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ తరఫున అదే జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఎన్నికల సారథ్య బాధ్యతలు నిర్వరిస్తున్నారు.