ఆ వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే గాంధీ
హైదరాబాద్: తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడంపై వస్తున్న వార్తలను తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను రాయడం, ప్రసారం చేయడం చేసేటప్పుడు తన వివరణ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గాంధీ అన్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాజకీయంగా తనను గట్టి దెబ్బ తీయడానికి జరుగుతున్న ప్రచారంగా ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.