సాక్షి, హైదరాబాద్: కారు గుర్తుపై గెలిచిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపొచ్చింది. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నేతలతో ఆయన భేటీ కానున్నారు.
అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పడింది. కొత్త నాయకత్వాన్ని తయారు చేయటంపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వరస సమావేశాలను కేటీఆర్ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!
Comments
Please login to add a commentAdd a comment