‘నల్ల చెరువు–హైడ్రా కూల్చివేతల్లో’ మరో కోణం
తమ పట్టా భూములు లీజుకు ఇచ్చిన యజమానులు
వాటిల్లో షెడ్లు నిర్మించుకున్న పలువురు వ్యాపారులు
ఇరిగేషన్ అధికారుల నోటీసుల విషయం తెలియని వైనం
వాటిల్లో షెడ్లు నిర్మించుకున్న పలువురు వ్యాపారులు
ఇరిగేషన్ అధికారుల నోటీసుల విషయం తెలియని వైనం
నిర్మాణాలను ఆదివారం కూల్చేసిన హైడ్రా అధికారులు
జీవనోపాధి, యంత్రాలు కోల్పోయామంటున్న బాధితులు
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి పాత గ్రామంలోని నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో భూమి ఉన్న పట్టాదారులు చేసిన తప్పులకు సామాన్యులు బలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్ని లీజుకు ఇవ్వడంతో పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు ఇచి్చన నోటీసుల విషయాన్నీ యజమానులు తమ లీజుదారులకు చెప్పలేదు. దీంతో ఆదివారం హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో సామాన్యులు నష్టపోయారు. ఇన్నాళ్లు లీజు తీసుకుంటున్న యజమానులు మాత్రం సేఫ్‌గా ఉండిపోయారు. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు.
దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిరి్మంచుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా... ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచి్చన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు.
అయితే నోటీసులు విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని క్యాంటీన్ నడుపుతున్న రమేష్, అతని తల్లిదండ్రులు భోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. భూ యజమానులు సైతం ఇది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోకి రాదంటూ చెప్పటంతోనే తాము లీజుకు తీసుకున్నామంటూ రవి అనే బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు.
గతంలో హైడ్రా అధికారులు వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఈ భూమిలో అనేక మంది లీజుదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేసుకోవడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించారు. కొందరు క్యాంటీన్లు, హోటళ్లు, క్యాటరింగ్ చేస్తుండగా.. మరికొందరు డెకరేషన్ సామాను, జిరాక్స్ మెషిన్లు ఏర్పాటు చేసుకున్నారు. భూ యజమానులు చేసిన తప్పుకు తాము నష్టపోతున్నామంటూ బాధితులు బోరున విలపించినా హైడ్రా అధికారులు కూలి్చవేతలు కొనసాగించారు. అధికారులు నేరుగా తమకు నోటీసులు ఇచ్చానా, తమ నిర్మాణాలకు అంటించినా ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment