demolishes
-
యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!
కూకట్పల్లి: కూకట్పల్లి పాత గ్రామంలోని నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భూమి ఉన్న పట్టాదారులు చేసిన తప్పులకు సామాన్యులు బలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్ని లీజుకు ఇవ్వడంతో పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు ఇచి్చన నోటీసుల విషయాన్నీ యజమానులు తమ లీజుదారులకు చెప్పలేదు. దీంతో ఆదివారం హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో సామాన్యులు నష్టపోయారు. ఇన్నాళ్లు లీజు తీసుకుంటున్న యజమానులు మాత్రం సేఫ్‌గా ఉండిపోయారు. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిరి్మంచుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా... ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచి్చన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. అయితే నోటీసులు విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని క్యాంటీన్ నడుపుతున్న రమేష్, అతని తల్లిదండ్రులు భోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. భూ యజమానులు సైతం ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోకి రాదంటూ చెప్పటంతోనే తాము లీజుకు తీసుకున్నామంటూ రవి అనే బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. గతంలో హైడ్రా అధికారులు వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఈ భూమిలో అనేక మంది లీజుదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేసుకోవడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించారు. కొందరు క్యాంటీన్లు, హోటళ్లు, క్యాటరింగ్ చేస్తుండగా.. మరికొందరు డెకరేషన్ సామాను, జిరాక్స్ మెషిన్లు ఏర్పాటు చేసుకున్నారు. భూ యజమానులు చేసిన తప్పుకు తాము నష్టపోతున్నామంటూ బాధితులు బోరున విలపించినా హైడ్రా అధికారులు కూలి్చవేతలు కొనసాగించారు. అధికారులు నేరుగా తమకు నోటీసులు ఇచ్చానా, తమ నిర్మాణాలకు అంటించినా ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. -
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్‌లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
కేజ్రీవాల్ మౌనం వెనుక అర్థం ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్పూరిలో బుధవారం అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని మాకెన్ మండిపడ్డారు. కాగా, జాహంగీర్‌పూరిలో బాధిత కుటుంబాలను అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శించింది. మాకెన్ బృందలో 16 మంది నేతలు ఉన్నారు. ఇక, కూల్చివేతల వ్యవహారాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని అన్నారు. మరోవైపు జహంగీర్‌పూరి ఘటనపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ అంటేనే ఏకపక్ష కూల్చివేతలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది చదవండి: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం -
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
-
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాకలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని అధికారులు తొలగించారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
కొనసాగుతున్న అక్రమ ప్రజావేదిక కూల్చివేత
-
బాలీవుడ్ నటుడి బంగ్లా కూల్చివేత
ముంబయి: బాలీవుడ్ నటుడికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) భారీ షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణ ఆరోపణలతో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం అర్షద్ వార్సీ బంగ్లాను కూల్చి వేసింది. అక్రమంగా అదనపు నిర్మాణాలను చేపట్టినందుకుగాను బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్పొరేషన్ నోటీసులు స్పందించకపోవడంతో వెర్సోవాలోని ఆయన ఇంటిలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కేసు బీఎంసీ దృష్టిలో ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకూ వాయిదాపడింది. ఇటీవల అర్షద్ వార్సీ తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఎయిర్ ఇండియా కో-ఆపరేటివ్ సొసైటీ (శాంతినికేతన్) లో బంగళా నెంబరు 10 ను కూల్చి వేస్తామంటూ కార్పొరేషన్ శనివారంనోటీసులు జారీ చేసింది. రెండవ అంతస్తులో (1,300 చదరపు అడుగుల) అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరించింది. దీనికి వార్సీకి 24 గంటల సమయం కూడా ఇచ్చింది. అయితే నటుడు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, ఇంటికి తాళం వేసివుండటంతో సోమవారం పాక్షిక కూల్చివేతను చేపట్టినట్టు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. దీనిపై అర్షద్‌కు, ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. మున్సిపల్ అధికారుల అనుమతికి సంబంధించిన పత్రాలకోసం తిరిగి నోటీసులు పంపిన అనంతరం అక్రమ అంతస్తును తొలగిస్తామని వార్డ్ అధికారి ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు. అటు ఈ పరిణామాలను నటుడు అర్షద్ దృవీకరించారు. కాగా 2012లో ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగినుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు అర్షద్. అక్రమ నిర్మాణాలు చేపట్టాడని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. దీంతో 2013లో బీఎంసీ ఈనిర్మాణాన్ని తొలగించాలని భావించినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో నిలిపివేశారు. ఇటీవల స్టే ఎత్తివేయడంతో రంగంలోకి దిగిన బీఎంసీ ఈ చర్య చేపట్టింది. ఇతరులు అనేకమంది ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారన్న ఆరోపణ నేపథ్యంలో ఇతర బంగళాలను కూడా బీఎంసీ పరిశీలించింది.