![GVMC Demolishes Palla Srinivasa Rao Illegal Building In Visakha - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/25/5.jpg.webp?itok=DSP9phlH)
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాకలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని అధికారులు తొలగించారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’
Comments
Please login to add a commentAdd a comment