విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్‌..! | GVMC Officials Decided To Give Confiscation Notice To Visakha TDP | Sakshi
Sakshi News home page

విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్‌..!

Published Sun, Jan 31 2021 3:04 PM | Last Updated on Sun, Jan 31 2021 4:59 PM

GVMC Officials Decided To Give Confiscation Notice To Visakha TDP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసులు సిద్ధం చేశారు. నగరంలోని సెవెన్ హిల్స్ సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం 2020-21 సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం పది లక్షలు మాత్రమే టీడీపీ కార్యాలయం నిర్వాహకులు చెల్లించగా, 17 లక్షలు బకాయి పడ్డారు. (చదవండి: టీడీపీలో రాజీనామాల పర్వం..)

మిగిలిన చెల్లింపులు కోసం అధికారులు నోటీసులు పంపించిన కానీ టీడీపీ కార్యాలయం నుంచి సరైన స్పందన లేకపోవడంతో  17 లక్షల ఆస్తి పన్ను బకాయిలకు గాను జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసును సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు.. గతంలో ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను నిర్ణయించడంతో సవరించాలని కోరామని.. అందుకే చెల్లింపులో జాప్యం జరిగిందని చెబుతున్నారు.(చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement