property tax due
-
విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసులు సిద్ధం చేశారు. నగరంలోని సెవెన్ హిల్స్ సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం 2020-21 సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం పది లక్షలు మాత్రమే టీడీపీ కార్యాలయం నిర్వాహకులు చెల్లించగా, 17 లక్షలు బకాయి పడ్డారు. (చదవండి: టీడీపీలో రాజీనామాల పర్వం..) మిగిలిన చెల్లింపులు కోసం అధికారులు నోటీసులు పంపించిన కానీ టీడీపీ కార్యాలయం నుంచి సరైన స్పందన లేకపోవడంతో 17 లక్షల ఆస్తి పన్ను బకాయిలకు గాను జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసును సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు.. గతంలో ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను నిర్ణయించడంతో సవరించాలని కోరామని.. అందుకే చెల్లింపులో జాప్యం జరిగిందని చెబుతున్నారు.(చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..) -
గూండాగిరీ చేస్తావా...యు ఫస్ట్ గెటవుట్
భాగ్యనగర్‌కాలనీ: ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన కూకట్పల్లి జీహెచ్ఎంసీ సిబ్బందిని ఓ కళాశాల యాజమాన్యం అవమానించింది. గెటవుట్ అంటూ అమర్యాదగా ప్రవర్తించింది. రూ. 18 లక్షల రూపాయల ఆస్తిపన్ను బకాయి ఉన్నందున వసూలు చేసేందుకు సర్కిల్ 24 డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తన సిబ్బందితో కలిసి హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతానగర్‌లో గల ఎంఎన్ఆర్ కళాశాలకు బుధవారం ఉదయం వెళ్లారు. అయితే అంతకుముందురోజు కూడా వెళ్లారు. అప్పుడు కలవడానికి చైర్మన సమయం ఇవ్వలేదు.దీంతోబుధవారం సిబ్బందితో కలిసి కళాశాలకు వెళ్లిన డీసీ మంగతాయారు పట్ల కళాశాల చైర్మన్ ఎంఎన్ రాజు యు ఫస్ట్ గేట్ అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించారు. గుండాగిరి చేస్తున్నారా.. అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆస్తి పన్ను వసూలుకు వచ్చామని డీసీ చెప్పగా.. లోపలికి రానివ్వలేదు. దీంతో తమ ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తిస్తారా అని నిరసిస్తూ జిహెచ్‌యంసి సిబ్బంది ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించకపోతే కదిలేది లేదని భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా వెళ్లటంతో కళాశాల యాజమాన్యం 18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా డీసీ మంగతాయారు మాట్లాడుతూ ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన తమపై కళాశాల చైర్మన్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి వాల్యుయేషన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, బిల్లు కలెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకు గాను నిమ్స్ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. వాస్తవానికి మొదటినుంచి నిమ్స్‌కు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఉంది. కానీ ఐదేళ్ల క్రితం ఆ మినహాయింపును ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, అప్పటి నుంచి కూడా నిమ్స్ మాత్రం ఆస్తిపన్నులు కట్టడం లేదు. ఈ ఒక్క సంవత్సరానివే దాదాపు 3 కోట్లకు పైగా పన్ను కట్టాల్సి ఉండగా, మొత్తం బకాయిలు 12.68 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దాంతో ఆస్పత్రిని సీజ్ చేసేందుకు డిప్యూటీ కమిషనర్ సోమరాజు నేతృత్వంలో బృందం అక్కడకు చేరుకుంది. అయితే, తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్పత్రిని నడుపుతున్నామని, అలాంటి తమ వద్ద నుంచి ఆస్తిపన్నులు వసూలు చేయడం ఏంటని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ వాదించారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం పన్ను కట్టి తీరాల్సిందేనని అంటున్నారు.