భాగ్యనగర్‌కాలనీ: ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ఓ కళాశాల యాజమాన్యం అవమానించింది. గెటవుట్ అంటూ అమర్యాదగా ప్రవర్తించింది. రూ. 18 లక్షల రూపాయల ఆస్తిపన్ను బకాయి ఉన్నందున వసూలు చేసేందుకు సర్కిల్ 24 డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తన సిబ్బందితో కలిసి హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతానగర్‌లో గల ఎంఎన్‌ఆర్ కళాశాలకు బుధవారం ఉదయం వెళ్లారు. అయితే అంతకుముందురోజు కూడా వెళ్లారు. అప్పుడు కలవడానికి చైర్మన సమయం ఇవ్వలేదు.దీంతోబుధవారం సిబ్బందితో కలిసి కళాశాలకు వెళ్లిన డీసీ మంగతాయారు పట్ల కళాశాల చైర్మన్ ఎంఎన్ రాజు యు ఫస్ట్ గేట్ అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించారు.
గుండాగిరి చేస్తున్నారా.. అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆస్తి పన్ను వసూలుకు వచ్చామని డీసీ చెప్పగా.. లోపలికి రానివ్వలేదు. దీంతో తమ ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తిస్తారా అని నిరసిస్తూ జిహెచ్‌యంసి సిబ్బంది ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించకపోతే కదిలేది లేదని భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా వెళ్లటంతో కళాశాల యాజమాన్యం 18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా డీసీ మంగతాయారు మాట్లాడుతూ ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన తమపై కళాశాల చైర్మన్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వాల్యుయేషన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, బిల్లు కలెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment