సాక్షి, హైదరాబాద్: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా.. అంటూ జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి దాడి చేసి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డిపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత శనివారం రాత్రి జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది పల్లేమోని వెంకటేశ్ తోటి సిబ్బందితో కలిసి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.
కెప్టెన్ కుక్ హోటల్ వద్ద కార్పొరేటర్ జీవన్‌రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా అటుగా వచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి అతని అనుచరులు వచ్చి మా ప్లెక్సీలనే తొలగిస్తారా అంటూ బూతులు తిడుతూ వెంకటేశ్ తోటి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.
రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే తన ఫ్లెక్సీలు తొలగించారని కార్పొరేటర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల ఫ్లెక్సీలు వారాలుగా ఉన్నా పట్టించుకోని సిబ్బంది కేవలం విపక్ష నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం వెనుక బీఆర్‌ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. తాను సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదన్నారు.
చదవండి: Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
Comments
Please login to add a commentAdd a comment