GHMC staff
-
Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా.. అంటూ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి దాడి చేసి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డిపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత శనివారం రాత్రి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది పల్లేమోని వెంకటేశ్ తోటి సిబ్బందితో కలిసి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. కెప్టెన్ కుక్ హోటల్ వద్ద కార్పొరేటర్ జీవన్‌రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా అటుగా వచ్చిన కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి అతని అనుచరులు వచ్చి మా ప్లెక్సీలనే తొలగిస్తారా అంటూ బూతులు తిడుతూ వెంకటేశ్ తోటి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే తన ఫ్లెక్సీలు తొలగించారని కార్పొరేటర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు వారాలుగా ఉన్నా పట్టించుకోని సిబ్బంది కేవలం విపక్ష నాయకుల ఫ్లెక్సీలను తొలగించడం వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. తాను సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదన్నారు. చదవండి: Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ -
గూండాగిరీ చేస్తావా...యు ఫస్ట్ గెటవుట్
భాగ్యనగర్‌కాలనీ: ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన కూకట్పల్లి జీహెచ్ఎంసీ సిబ్బందిని ఓ కళాశాల యాజమాన్యం అవమానించింది. గెటవుట్ అంటూ అమర్యాదగా ప్రవర్తించింది. రూ. 18 లక్షల రూపాయల ఆస్తిపన్ను బకాయి ఉన్నందున వసూలు చేసేందుకు సర్కిల్ 24 డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తన సిబ్బందితో కలిసి హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతానగర్‌లో గల ఎంఎన్ఆర్ కళాశాలకు బుధవారం ఉదయం వెళ్లారు. అయితే అంతకుముందురోజు కూడా వెళ్లారు. అప్పుడు కలవడానికి చైర్మన సమయం ఇవ్వలేదు.దీంతోబుధవారం సిబ్బందితో కలిసి కళాశాలకు వెళ్లిన డీసీ మంగతాయారు పట్ల కళాశాల చైర్మన్ ఎంఎన్ రాజు యు ఫస్ట్ గేట్ అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించారు. గుండాగిరి చేస్తున్నారా.. అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆస్తి పన్ను వసూలుకు వచ్చామని డీసీ చెప్పగా.. లోపలికి రానివ్వలేదు. దీంతో తమ ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తిస్తారా అని నిరసిస్తూ జిహెచ్‌యంసి సిబ్బంది ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించకపోతే కదిలేది లేదని భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా వెళ్లటంతో కళాశాల యాజమాన్యం 18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా డీసీ మంగతాయారు మాట్లాడుతూ ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన తమపై కళాశాల చైర్మన్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి వాల్యుయేషన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, బిల్లు కలెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ సతీమణికి ఓటు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని గడిచిన మూడు వారాల నుంచి నిర్విరామ ప్రచారం చేసి గ్రేటర్‌పై గులాబీజెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్న మంత్రి కేటీఆర్ సతీమణికి ఓటు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ నివసిస్తారు. ఆయనకు ఇక్కడే ఓటు హక్కు ఉంది. అయితే ఆయన భార్య శైలిమకు మాత్రం ఓటు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది పేర్కొంటున్నారు. ఆమెకు ఓటు ఎందుకు లేదన్నది అంతుబట్టకుండా ఉంది. స్వగ్రామంలో కూడా ఆమెకు ఓటు లేదని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 5 గంటలవరకు కూడా కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలింగ్ స్లిప్ అందించలేదని తెలుస్తోంది.