College management
-
గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకం
సాక్షి, కృష్ణా జిల్లా: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాష్టీకానికి దిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడింది. మీడియా సిబ్బందిపైనా కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడికి దిగింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో దాడి చేసింది.వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. -
చాటింగ్ తెచ్చిన రగడ
శంకర్పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్పల్లి మండలం, దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. (చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు) -
Engineering Student: ఇంజినీరింగ్ మధ్యలో హిజ్రాగా మారి
సాక్షి, చెన్నై: ఇంజినీరింగ్ చదువుతూ హిజ్రాగా మారిన ఓ యువకుడిని చదువు కొనసాగించేందుకు కళాశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పొన్నేరికి చెందిన కూలీ తెన్నరసు, శశికళ కుమారుడు లోకేష్. రెడ్‌హిల్స్ సమీపంలోని ఆర్వీఎస్ పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో చేరాడు. రెండో సెమిస్టర్ పూర్తయిన తరువాత లోకేష్ హిజ్రాగా మారి గెజిట్‌లో ఓవియాగా పేరును మార్చుకున్నాడు. అంత వరకు సాఫిగా సాగిన లోకష్ కళాశాల జీవితం పూర్తిగా మారిపోయింది. హిజ్రాగా మారిన లోకేష్ అలియాస్ ఓవియాకు కళాశాల అనుమతి నిరాకరించింది. దీంతో మద్యలోనే ఇంజినీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చదువుపై మక్కువతో 2022–23వ సంవత్సరంగానూ డిగ్రీ చేయాలని పచ్చప్ప కళాశాలలో హిజ్రా కోటాలో సీటు ఆశించింది. అయితే హిజ్రా కోటాకు సంబందించి ప్రభుత్వం ఉత్తర్వులు లేకపోవడం, వయస్సు దాటడంతో సీటును నిరాకరించారు. దీంతో ఓవియా గత 18న కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి పరిస్థితిని వివరించి కళాశాలలో సీటు ఇప్పించాలని కోరింది. ఈ సంఘటనపై స్పందించిన కలెక్టర్ పొన్నేరిలో ప్రభుత్వ కళాశాలలలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీటు కేటాయిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం ఓవియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఓవియా మాట్లాడుతూ.. బాగా చదువుకుని టీచర్‌గా రాణిస్తానని మీడియాకు వివరించింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) -
ఫీజా.. బడితెపూజా!
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మహేశ్‌కు (పేరుమార్చాం) కాలేజీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. 2019–20 విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్ కింద రూ.2,05,000 చెల్లించాలని అందులో స్పష్టం చేసింది. మహేశ్ 2018–19 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజు, అక్రిడిటేషన్, మిస్లీనియస్ కింద రూ.1,13,500 మాత్రమే చెల్లించాడు. ఏఎఫ్ఆర్సీ నిబంధనల ప్రకారం ఈ మేరకు ఫీజు తీసుకోవాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యం మాత్రం రూ.91,500 ఫీజు పెంచేసి విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్న కళాశాల యాజమాన్యాలు.. విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) నిర్దేశించిన ఫీజులు కాకుండా కాలేజీ యాజమాన్యాలు ఖరారు చేసిన ఫీజులు తక్షణమే చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కటాఫ్ తేదీలను విధిస్తూ ఆ లోపు చెల్లించకుంటే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుందంటూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులతో పాటు కనీ్వనర్ కోటాలో సీట్లు పొందిన వారిపైనా ఇదే తరహాలో ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రీయింబర్స్మెంట్ లబి్ధదారులకు ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే ఆయా విద్యార్థులకు సీట్ల కేటా యింపు లేఖలోనే స్పష్టం చేస్తారు. కొన్ని కాలేజీలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా అన్నివర్గాల విద్యార్థుల నుంచి ఫీజుల వసూళ్లు చేస్తున్నాయి. డెడ్ లైన్ ఐదో తారీఖు.. విద్యా సంవత్సరం అర్ధ వార్షికం కావస్తుండటంతో కాలేజీలు ఫీజుల వసూళ్ల వేగాన్ని పెంచాయి. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను పేర్కొంటూ విద్యార్థులకు సర్క్యులర్లు పంపుతున్నాయి. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటు అక్రిడిటేషన్, మిస్లీనియస్ ఫీజులను సైతం జోడిస్తూ.. ఆ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట్ సమీపంలోని ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వేరువేరుగా సర్క్యులర్లు పంపింది. కేటగిరీ–ఏ, కేటగిరీ–బీ విద్యార్థులతో పాటు ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ విద్యార్థులు ఎంతమేర ఫీజులు చెల్లించాలో స్పష్టం చేసింది. గతేడాది చెల్లించిన మొత్తాలు కాకుండా.. ప్రస్తుతం పెంచిన ఫీజులు అక్టోబర్ 5లోగా తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులు తమ లాగిన్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో లేదా తమ బ్యాంకు ఖాతా ఉన్న శాఖ ద్వారా డీడీల రూపంలో సమరి్పంచాలని పేర్కొం ది. కటాఫ్ తేదీ తర్వాత రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన.. ఫీజుల చెల్లింపులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షలు చెల్లించడం తమవల్ల కాదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. టాప్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఒత్తిడి చేస్తుండటంతో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు వాపోతున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ లేఖలు సమరి్పస్తున్నారు. వీటిపై స్పందిస్తున్న అధికారులు.. విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కాలేజీ యాజమాన్యాలకు అష్యూరెన్స్ సరి్టఫికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. -
ఆ కళాశాలలో గంజాయి నిల్వలు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో పేరు గాంచిన ఆ కళాశాలలో ఇన్నాళ్లూ బయటకు పొక్కని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంపన్నుల పిల్లలు చదివే ఈ కళాశాలలో పాశ్చాత్య పోకడలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ర్యాగింగ్, మద్యపానం సేవించడం, డ్రగ్స్, గంజాయితో ఇక్కడ విద్యార్థులు పట్టుబడినా ఆ విద్యా సంస్థ పేరు మాత్రం బయటకు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగిన అరాచకాలను సైతం మాఫీ చేసేశారు. ఇప్పుడు ఆ కార్పొరేట్ కళాశాలలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరడంతో పోలీసులు కూడా దృష్టిసారించారు. ఆదివారం సాయంత్రం పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు రుషికొండ సమీపంలోని కళాశాలకు చెందిన హాస్టల్లో తనిఖీలు చేపట్టి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆ కళాశాల యాజమాన్యం అధికార పార్టీ ద్దలకు అత్యంత సన్నిహితులు కావడంతో పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు దీనిపై పెదవి విప్పడం లేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తున్నారు. అయితే గంజాయి పట్టబడటం వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల రుషికొండ ప్రాంతంలో రేవ్ పార్టీలు నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన తనిఖీల్లో విద్యార్థుల నుంచి గంజాయి పెద్ద మొత్తంలో లభించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. -
గూండాగిరీ చేస్తావా...యు ఫస్ట్ గెటవుట్
భాగ్యనగర్‌కాలనీ: ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన కూకట్పల్లి జీహెచ్ఎంసీ సిబ్బందిని ఓ కళాశాల యాజమాన్యం అవమానించింది. గెటవుట్ అంటూ అమర్యాదగా ప్రవర్తించింది. రూ. 18 లక్షల రూపాయల ఆస్తిపన్ను బకాయి ఉన్నందున వసూలు చేసేందుకు సర్కిల్ 24 డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తన సిబ్బందితో కలిసి హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని సమతానగర్‌లో గల ఎంఎన్ఆర్ కళాశాలకు బుధవారం ఉదయం వెళ్లారు. అయితే అంతకుముందురోజు కూడా వెళ్లారు. అప్పుడు కలవడానికి చైర్మన సమయం ఇవ్వలేదు.దీంతోబుధవారం సిబ్బందితో కలిసి కళాశాలకు వెళ్లిన డీసీ మంగతాయారు పట్ల కళాశాల చైర్మన్ ఎంఎన్ రాజు యు ఫస్ట్ గేట్ అవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించారు. గుండాగిరి చేస్తున్నారా.. అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆస్తి పన్ను వసూలుకు వచ్చామని డీసీ చెప్పగా.. లోపలికి రానివ్వలేదు. దీంతో తమ ఉన్నతాధికారిపై దురుసుగా ప్రవర్తిస్తారా అని నిరసిస్తూ జిహెచ్‌యంసి సిబ్బంది ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించకపోతే కదిలేది లేదని భీష్మించుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా వెళ్లటంతో కళాశాల యాజమాన్యం 18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా డీసీ మంగతాయారు మాట్లాడుతూ ఆస్తిపన్ను వసూలుకు వెళ్లిన తమపై కళాశాల చైర్మన్ దురుసుగా ప్రవర్తించారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి వాల్యుయేషన్ ఆఫీసర్ మోహన్‌రెడ్డి, బిల్లు కలెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
రైలుకు ఎదురెళ్లి విద్యార్థి ఆత్మహత్య
♦ కళాశాల యాజమాన్యం ♦ మందలించడంతో మనస్తాపం ♦ జెట్టిపాలెం గ్రామంలో విషాద ఛాయలు మొగల్తూరు : కళాశాల యాజమాన్యం మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటంబంలో విషాదాన్ని నింపింది. ఏకైక కుమారుడును పోగొట్టుకున్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రామన్నపాలెం పంచాయతీ జెట్టిపాలెంకు చెందిన అడపా వెంకటేశ్వరరావు, శాంతమణిల ఏకైక కుమారుడు మణికంఠ. సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 24న కాలేజీ యాజమాన్యం మందలించడంతో దిగాలుగా ఇంటికి చేరుకున్న మణికంఠ మనస్తాపంతో 25న ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అదే రోజు కుటుంబ సభ్యులు, బంధువులు మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మణికంఠ ఆచూకీ కోసం వెతకడం మొదలు పెట్టారు. పోలీసులు నరసాపురం రైల్వేస్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా విజయవాడ వైపు వెళ్లే రైలు ఎక్కినట్టు తెలిసింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే తెనాలి రైల్వే ట్రాక్‌పై ఓ యువకుని మృతదేహం పడి ఉందని, మార్చురీలో భద్రపర్చారని ఈ నెల 29న సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆక్కడ రైల్వే పోలీసులను సంప్రదించారు. 25వ తేదీ సాయంత్రం రైలుకు ఎదురెళ్లి ఆత్యహత్యకు పాల్పడ్డాడని, శవాన్ని మార్చురిలో భద్రపర్చామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంది మణికంఠ అని కుటుంబ సభ్యులు గుర్తించి మృతదేహాన్ని జెట్టిపాలెంకు తీసుకువచ్చారు. మణికంఠ మృతితో జెట్టిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘బయోమెట్రిక్’పై స్పష్టత కరువు
కళాశాలల్లో సాధారణ పద్ధతిలోనే అటెండెన్స్ సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానంపై స్పష్టత కరువైంది. ఈ హాజరు ఆధారంగానే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విద్యార్థులతోపాటు బోధకుల హాజరులోనూ సమయపాలన, పారదర్శకత కోసం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని భావించింది. ఈ మేరకు బయోమెట్రిక్ మెషిన్లు కళాశాలల్లో అందుబాటులో పెట్టాలని యాజమాన్యాలకు సూచించింది. అయితే, స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సాధారణ పద్ధతిలోనే హాజరును స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మెషిన్ల కొనుగోలుకు వెనుకాడుతున్న యాజమాన్యాలు రాష్ట్రంలో 7,005 కాలేజీలున్నాయి. వీటిలో 2,750 ఇంటర్మీడియట్, వొకేషనల్, 4,245 డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 16.50 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలోని విద్యార్థుల హాజరు నమోదు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కనిష్టంగా 30 వేల మెషిన్లు అవసరమవుతాయని అంచనా. అయితే, మెషిన్లు కొనుగోలు చేసి నిర్వహించడం కష్టమని, వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని కాలేజీ యాజమాన్య సంఘాలు కోరుతున్నాయి. కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే దానికి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈపాస్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ భావించింది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే అంశంపై సాంకేతిక విభాగంతో చర్చించింది. అయితే, బయోమెట్రిక్ విధానంపై స్పష్టత రాకపోవడంతో ఆ శాఖ సైతం నిర్ణయాన్ని మార్చుకుంది. ఎప్పటిలాగే విద్యార్థుల నుంచి ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) పద్ధతిని పాటించాలని అంచనాకు వచ్చింది. -
ట్రబుల్ ఐటీ..
భైంసా : తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ ఐటీ బాసరలోనే ఉంది. ఈ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.వందల కోట్ల నిధులను విడుదల చేస్తోంది. అయినా.. ట్రిపుల్ ఐటీలో మాత్రం సమస్యలు పరిష్కారం కావడంలేదు. భారీ మొత్తంలో నిధులు విడుదలవుతున్నా.. అవి ఏమవుతున్నాయో.. ఎక్కడ ఖర్చు చేస్తున్నారో స్పష్టత లేదు. భోజన శాలల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో మొక్కల పెంపకం, ఫర్నిచర్, మందుల కొనుగోళ్లలో కూడా ఇక్కడి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు పరిష్కారం కావడంలేదు. రోడ్లపైకి విద్యార్థులు.. బాసర ట్రిపుల్‌ఐటీలో 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు విద్యార్థులకు ఆందోళనలే శరణ్యమవుతున్నాయి. 2008 నుంచి విద్యార్థులు ఇప్పటికీ లెక్కలేనన్నిసార్లు రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. రెండేళ్ల క్రితం విద్యార్థులంతా సమ్మె చేపట్టి అప్పటి ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ రాజ్‌కుమార్ వచ్చే వరకు నిరసన విరమించలేదు. విద్యార్థులకు సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. వారం రోజులపాటు తరగతులు పక్కనపెట్టి విద్యార్థులంతా ఒక్కటై పోరాడారు. అయినా.. ట్రిపుల్ఐటీ పరిస్థితి మారలేదు. భోజనశాలల ఇష్టారాజ్యం.. వేల మంది విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీలో నాణ్యమైన భోజనం దొరకడం లేదు. భోజనశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలోనే నిధులు తీసుకుంటున్న మెస్ నిర్వాహకులు విద్యార్థులకు నాసిరకమైన ఆహారం అందిస్తున్నారు. మెనూ అమలు కావడం లేదు. మెస్కమిటీలు చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులకు యూనివర్సిటీకి ఆన్లైన్లో మెస్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా అక్కడి నుంచి అంతగా స్పందన ఉండడంలేదు. ట్రిపుల్ఐటీ కళాశాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ తరచూ మెస్‌లపై ఫిర్యాదు చేసే విద్యార్థులపై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో మార్కుల కోత, చెడు ప్రవర్తన కలిగిన విద్యార్థులుగా ముద్రవేస్తారన్న భయం విద్యార్థుల్లో ఉంది. దీంతో మెస్ యాజమాన్యాలు అందించే నాసిరకం భోజనంతోనే కడుపు నింపుకుంటున్నారు. చుట్టుపక్కల వారసంతల్లో లభించే కుల్లిన, వాడిపోయిన కూరగాయలను, నాసిరకంగా ఉన్న పప్పుదినుసులు, బియ్యాన్ని వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అయోడిన్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నా బాసర ట్రిపుల్ఐటీ కళాశాలలో ఎక్కడా ఆయోడిన్ ఉప్పు వాడినట్లు దాఖలాలు లేవు. భోజనశాలల్లో నెలకొన్న సమస్యలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గతంలోనే కళాశాల అధికారులకు మొట్టికాయలు వేసినా తీరుమారలేదు. గతంలో ప్రతినెలా జిల్లా ఉన్నతాధికారి సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని న్యాయస్థానం సూచించినా ఆ దిశగా చర్యలే లేవు. ఒకే వైద్యుడు... ట్రిపుల్‌ఐటీలో చదివే ఏడు వేల మంది విద్యార్థులకు ఒకేఒక్క వైద్యుడు ఉన్నాడు. ట్రిపుల్‌ఐటీలో గత సర్కారు ఐదుగురు వైద్యులను నియమించింది. వైద్యులందరికీ మెరుగైన జీతభత్యాలు, నివాసగృహం, భోజన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి యూనివర్సిటీ అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. బాసర ట్రిపుల్ఐటీ అధికారులు వారికి సహాయసహకారాలు అందించలేదు. వైద్యులకు చెల్లించే జీతభత్యాల్లోనూ కోత విధించి ఇచ్చారు. ఇవి చూసి ఎవరికీ చెప్పుకోలేక వైద్యులంతా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. విద్యార్థినుల కోసం మహిళా వైద్యురాలిని నియమించాలని కోరుతున్నా ఇప్పటికీ స్పందన కనిపించడం లేదు. పర్యవేక్షణ కరువు... ట్రిపుల్ఐటీ బాసరలో ఉన్నా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడి పరిపాలన వివరాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో స్థానికంగా ఉండే సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంలేదు. జిల్లా యంత్రాంగం ట్రిపుల్ ఐటీకి సౌకర్యాలు కల్పిస్తున్నా పరిపాలన వ్యవహారాలపై ఇక్కడి యంత్రాంగానికి అధికారం లేకుండాపోయింది. అధికారులు నామమాత్ర పరిశీలనకే పరిమితం కావడంతో ట్రిపుల్ఐటీ సిబ్బంది ఎవరికీ జవాబుదారిగా ఉండడం లేదు. ఎంతో మంది చదువుతున్న ఈ సరస్వతీ నిలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన బాసర : తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. మెస్ నిర్వాహకులు ఉడికీఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. బుధవారం రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలనే గురువారం విద్యార్థులకు వడ్డించారు. దీంతో ఈ1, ఈ2, ఈ3, ఈ4 విద్యార్థులు సుమారు రెండు గంటలకు పైగా ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్ట్‌ను తొలగించి కొత్త వారిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యం విద్యార్థులకు నచ్చజెప్పాలని చూసినా వారు శాంతిం చలేదు. మార్వేల్ మెస్ కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. తదుపరి విద్యార్థి పరమేశ్వర్ ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణకు ఫోన్ ద్వారా సమస్యను తెలుపగా.. మార్వేల్ మెస్‌ను వెంటనే మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామని చెప్పారు. దీంతో విద్యార్థులు శాంతించా రు. విద్యార్థులకు మద్దతుగా ముథోల్ జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నూకం రామారావు, డెరైక్టర్ హన్మంతురావు, ఎంపీటీసీలు గెంటెల శ్యాం, పోతన్న, తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు!
* రీయింబర్స్మెంట్ జాప్యంతో విద్యార్థులకు తిప్పలు * ‘స్థానికత నిర్ధారణ’ నేపథ్యంలో గందరగోళం * సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు సాక్షి, హైదరాబాద్: ఒక విద్యార్థి ఓ ప్రముఖ కాలేజీలో ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్‌లో చేరేందుకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని కోరాడు. కానీ ఆ విద్యార్థికి సంబంధించి గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా రాలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఎలాగూ వస్తుంది కనుక ఇవ్వాలంటూ విద్యార్థి మళ్లీ కాలేజీకి వెళ్లినా.. యాజమాన్యం ఒప్పుకోలేదు. అంతగా కావాలంటే బకాయి పడిన ఫీజును చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు చెల్లించలేక, పైకోర్సులో చేరే మార్గం లేక ఆ విద్యార్థి ఆందోళనలో మునిగిపోయాడు... రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఇది. ‘స్థానికులకే ఫీజు’ అన్న తెలంగాణ ప్రభుత్వ విధానం నేపథ్యంలో.. ఇటు విద్యార్థులు, అటు కాలేజీల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం ఎవరిని స్థానికులుగా గుర్తిస్తుందో తెలియని పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కాలేజీల యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కానందున మీరే ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల వ్యవహారం తేలేవరకు సర్టిఫికెట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్పష్టత ఇవ్వని ఆంధ్రప్రదేశ్!.. ఏటా సీమాంధ్రకు చెందిన దాదాపు 40 వేల మంది విద్యార్థులు తెలంగాణ జిల్లాల్లోని కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులను చదువుతున్నారు. అటు సీమాంధ్ర జిల్లాల్లోని కాలేజీల్లో తెలంగాణకు చెందిన 11 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుతున్న వారు మరో 12 లక్షల మంది వరకూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానికత నిర్ధారణపై కసరత్తు చేస్తోంది. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో.. విద్యార్థులకు కష్టాలు వచ్చి పడ్డాయి. తెలంగాణ విద్యార్థులకు బకాయిలు రావాలంటే స్థానికతపై స్పష్టత వస్తే చాలు.. కానీ ఇక్కడ చదివిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారికి ఫీజు ఇస్తారా? లేదా అనేది ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయలేదు. బకాయిల విషయంలో ప్రభుత్వాలు హామీ ఇస్తే సర్టిఫికెట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. రీయింబర్స్మెంట్ ఎత్తి వేస్తే ఊరుకోం: కృష్ణయ్య ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నాన్చివేత ధోరణి విడనాడాలని, ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రీయింబర్స్‌మెంట్‌పై అంతా మౌనం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు మార్గదర్శకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. మంత్రివర్గసభ్యులకు కూడా ఈ అంశానికి సంబంధించిన సమాచారం ఉండడంలేదు. ఉన్నత స్థాయిలోని కొం దరు అధికారులకు, న్యాయ నిపుణులకు తప్ప ఎవరికీ మార్గదర్శకాల గురించి గానీ, కటాఫ్ సంవత్సరం గురించి కానీ వివరాలు తెలియనివ్వడంలేదు. అధికారికంగా ప్రకటించేవరకు ఫీజు రీయింబర్స్‌మెంటు మీద ఎలాంటి సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కార్యాలయం గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. అధికారులంతా మౌనం వహించడంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఉన్నతాధికారి ఆధ్వర్యంలోనే ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో మొదటినుంచి కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాల్సిందేనని, లేదంటే కోర్టుకెళ్లడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండడం కూడా గోప్యతకు కారణమని తెలుస్తోంది. ఈ అంశాలన్ని పరిగణనలోకి తీసుకుంటూ పలువురు సీనియర్ అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. బుధవారం జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని చర్చకు పెట్టనున్నారని సమాచారం. -
బో‘ధనం’ వివరాలివ్వండి
- ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆదేశం - 2007 నుంచి విద్యార్థుల వివరాలు కోరిన వైనం సాక్షి, అనంతపురం : ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు 2007 నుంచి ఇప్పటి దాకా అందిన ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాల వివరాలను అందజేయాలని ప్రభుత్వం ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్లు, వారి రేషన్, ఆధార్ కార్డులు, ఎఫ్ఎస్ఐడీ నంబర్లు ఇవ్వాలని సూచించింది. దీంతో యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. జిల్లాలో ప్రయివేటు జూనియర్ కళాశాలలు 109, డిగ్రీ 35, ఇంజనీరింగ్ కళాశాలలు 18 ఉన్నాయి. వీటిలో అధిక భాగం టీడీపీ నేతల ఆధీనంలోనే నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో విద్యార్థులు లేకపోయినా.. ఉన్నట్లుగా రికార్డులు సృష్టించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు కోసమే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఈ కళాశాలల్లో వసతులు,ప్రమాణాలు లేకపోయినా ప్రభుత్వ సొమ్మును మాత్రం దర్జాగా స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు కొందరు విద్యార్థులు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో చేరి ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మెజార్టీ కళాశాలల్లో విద్యార్థులు ఏదో ఒక కోర్సులో చేరి.. ఆ తరువాత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునేవారు. పరీక్షలకు మాత్రమే హాజరయ్యేవారు. కాగా, కొత్తగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడేళ్ల రికార్డులను కోరింది. ఇప్పుడు ఆ వివరాలు అందజేస్తే తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో అధికారులను లొంగదీసుకుని ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు పొందిన కళాశాలలు ఇప్పుడు ఆ అవకతవకలు వెలుగులోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యాజమాన్యాలన్నీ ఒక రింగ్‌గా ఏర్పడి జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించినట్లు సమాచారం. పనిలో పనిగా రికార్డులు తమ వద్ద లేవని, అధికారుల వద్ద ఉన్న వాటినేప్రామాణికంగా తీసుకోవాలంటూ తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఉమాదేవిని ‘సాక్షి’ వివరణ కోరగా... ప్రభుత్వం వివరాలను కోరిన విషయం వాస్తవమేనన్నారు. ప్రస్తుతం తాము అదేపనిలో ఉన్నట్లు తెలిపారు.