ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకు గాను నిమ్స్ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. వాస్తవానికి మొదటినుంచి నిమ్స్కు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఉంది. కానీ ఐదేళ్ల క్రితం ఆ మినహాయింపును ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, అప్పటి నుంచి కూడా నిమ్స్ మాత్రం ఆస్తిపన్నులు కట్టడం లేదు. ఈ ఒక్క సంవత్సరానివే దాదాపు 3 కోట్లకు పైగా పన్ను కట్టాల్సి ఉండగా, మొత్తం బకాయిలు 12.68 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
దాంతో ఆస్పత్రిని సీజ్ చేసేందుకు డిప్యూటీ కమిషనర్ సోమరాజు నేతృత్వంలో బృందం అక్కడకు చేరుకుంది. అయితే, తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్పత్రిని నడుపుతున్నామని, అలాంటి తమ వద్ద నుంచి ఆస్తిపన్నులు వసూలు చేయడం ఏంటని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ వాదించారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం పన్ను కట్టి తీరాల్సిందేనని అంటున్నారు.
నిమ్స్ను సీజ్ చేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ
Published Fri, Jan 10 2014 3:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement