GHMC officials
-
హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్
-
పండగ పూటా ఇదేం పద్ధతి?
సాక్షి, హైదరాబాద్: పండగా.. పబ్బమూ అని లేకుండా కరోనా విపత్కర పరిస్థితులెదురైనా విధులు నిర్వర్తించి నగర ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పండగల పూటైనా కనీసం గంట ముందు వెళ్లనివ్వకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. నగరంలో ఒక్కరోజు పారిశుద్ధ్య పనులు జరగకున్నా, ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సెలవులివ్వడం లేదు. దీంతో పండగలకు సెలవులు పెట్టకుండానే కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ పండగలు చేసుకునే సమయంలో వీరికి కనీసం గంటో, రెండు గంటలో నిర్ణీత వ్యవధి కంటే ముందుగా ఇళ్లకు వెళ్లే సదుపాయం కల్పించాలని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పటి కమిషనర్ ఆమ్రపాలి మినహాయింపునిచ్చారు. రోజూ మాదిరిగా పనిలోకి వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు రెండు పర్యాయాలు ‘అటెండెన్స్’ బదులు ఒక్కసారి వేస్తే చాలు అని మినహాయింపు ఇచ్చారు. అయితే.. వారు చేయాల్సిన పని మొత్తం పూర్తిచేసి త్వరితంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా వీఐపీల కార్యక్రమాలుంటే తప్ప పండగల సందర్భాల్లో ఒకసారి హాజరు చాలునని సర్క్యులర్ జారీ చేశారు. దసరా పండగ సందర్భంగా దాన్ని వర్తింపజేశారు. సంక్రాంతికి మాత్రం అధికారులు తమను పూర్తి సమయం వరకు ఉండాల్సిందేనని పట్టుబట్టారని, తమకు మాత్రం కుటుంబాలు ఉండవా.. ఊళ్లకు వెళ్లకున్నా కనీసం ఇంటికి త్వరగా వెళ్లి పనులు చేసుకోవద్దా? అని పలువురు మహిళా కారి్మకులు వాపోయారు. దీనిపై ఓ అధికారి వివరణనిస్తూ, అప్పట్లో మినహాయింపు ఇచ్చినప్పుడు కేవలం దసరాకు మాత్రమే ఇచ్చారని, ముఖ్యమైన పండగలకు అలాంటి మినహాయింపు ఉంటుందని తెలిపినప్పటికీ, ప్రతి పండగకు ముందస్తుగా విజ్ఞప్తి చేసుకోవాలని సూచించారన్నారు. ప్రతి పెద్ద పండగకూ విజ్ఞప్తి చేసుకోవడమేమిటన్నారు. తాము ఎవరికి విజ్ఞప్తి చేసుకోగలమని, ప్రతిసారీ యూనియన్ నేతలను ఆశ్రయిస్తే, వారు విజ్ఞప్తి చేయాలా? అని పారిశుద్ధ్య కారి్మకులు ప్రశ్నింస్తున్నారు. ఎప్పుడైనా పనులు చేసేది తామేనని, అయినా చేయాల్సిన పని మొత్తం పూర్తి చేశాకే కదా ఇళ్లకు వెళ్లేది. పనిలేకున్నా పూర్తి సమయం వరకు ఉండాలనడం ఏం న్యాయం అంటున్నారు. ఇప్పటికైనా ఈ అంశంలో ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకొని, భవిష్యత్‌లోనైనా కనీసం పెద్ద పండగలకైనా ఈ వెసులుబాటు కల్పించాలలి కోరుతున్నారు. పారిశుద్ధ్య కారి్మకుల్లో దాదాపు 90 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. చెట్టు చెట్టుకో కథ -
జీహెచ్ ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
-
అధికారులదే హవా?
-
డెక్కన్ మాల్‌కు అనుమతి పత్రాలపై జీహెచ్ఎంసీ అధికారుల మధ్య వాగ్వాదం
-
మూడు నెలల్లో నాలా పనులు పూర్తి చేయండి
ఎల్బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు. సమావేశంలో ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్‌ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌రావు, హార్టికల్చర్ డీడీ రాజ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరదనీటి కాలువ పనుల పరిశీలన నాగోలు: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ అధికారులు సిగ్గుపడాలి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం వచ్చినా నగర వ్యాప్తంగా రోడ్ల మీద ఉండే గుంతలు పూడ్చివేయకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు మండిపడింది. ఇద్దరు సీనియర్ సిటిజన్లు గత కొన్నేళ్లుగా వారికి వచ్చే పెన్షన్ డబ్బుతో ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను స్వచ్ఛందంగా పూడ్చుతున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ అధికారుల జీతాల్లో కొంత మొత్తాన్ని తిలక్ దంపతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో గుంతల పూడ్చివేతకు ఏం ప్రణాళికలు రూపొందించారు? ఎన్ని గుంతలను గుర్తించారు? వాటిలో ఎన్నింటిని పూడ్చివేశారు? తదితర వివరాలతో జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జోన్ల డిప్యూటీ కమిషనర్లు, సూపరిం టెండెంట్ ఇంజనీర్లు ఈ నెల 20లోగా వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి గంగాధర్ తిలక్ దంపతులు వారికి వచ్చే పెన్షన్ డబ్బులతో రోడ్లమీద గుంతలను పూడ్చుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. నగరంలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తిలక్ దంపతులు గుర్తించి వారి కారులో వెళ్లి ఆ గుంతలను పూడుస్తున్నప్పుడు.. జీహెచ్ఎంసీ అధికారులకు ఆ గుంతలు ఎందుకు కనిపించడం లేదని ధర్మాసనం నిలదీసింది. బడ్జెట్ తగ్గించాలని ఆదేశించాలా ? అధికారులు కష్టపడి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారని, వర్షాలతోపాటు భారీగా వాహ నాలు తిరుగుతుండడంతో తరచుగా గుం తలు ఏర్పడుతున్నాయని జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాది పాశం కృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘గుంతలు ఏర్పడడానికి వర్షాలను ఎందుకు నిందిస్తారు? వాహనాలు తిరిగితే గుంతలు పడతాయని భావిస్తే, అవి తిరగకుండా నిషేధిస్తారా ? అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గుంతలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఊరుకోవాలా? చేయాల్సిన పనిచేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించాలని ఆదేశించాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. -
‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని సుమేధ కపూరియా తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని అన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా కూతురు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. సుమేధ మృతిపై మానవ హక్కుల సంఘం స్పందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మూసివేయాలి. మా కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు ఆలోచించుకోవాలి. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. నాలా కారణంగానే మా బిడ్డ మరణించడం అధికారుల వైఫల్యం కాదా? అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు. మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?’అని సుమేధ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరద ఉధృతికి సుమేధ మృతదేహం స్థానికంగా ఉండే బండ చెరువుకు కొట్టుకెళ్లింది. (చదవండి: ఉసురు తీసిన నాలా ) -
ఓయూ వివాదాస్పద స్థలంలో నిర్మాణాల కూల్చివేత
అంబర్‌పేట(హైదరాబాద్): ఓయూలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. డీడీ కాలనీ ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఉన్న స్థలంపై ఓ రిటైర్డ్ న్యాయమూర్తికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బందోబస్తుతో వివాదాస్పద స్థలంలో గోడను నిర్మించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆ నిర్మాణానికి అనుమతిలేదని కూల్చివేయాలంటూ స్థానిక సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు అందాయి. సర్కిల్–16 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ నర్సింగ్‌రావు నేతృత్వంలో వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గత కొన్నేళ్ల క్రితం ఈ స్థలంలో నిర్మాణం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం అనుమతులు పొందారని, ప్రస్తుతం వాటి కాలపరిమితి ముగిసిందని ఏసీపీæ తెలిపారు. తాజాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామన్నారు. తిరిగి నిర్మాణాలకు వారు దరఖాస్తు చేసుకుంటే అందుకు నిబంధనలు పాటిస్తూ పరిశీలిస్తామన్నారు. ఈ కూల్చివేతల బృందంలో టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సాయిబాబా, చైన్మన్లు బాబామియా, రజ్వీలు కూడా ఉన్నారు. -
మురికి గుంతలో 48 గంటలుగా..
సాక్షి, హైదరాబాద్ : కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాల్వలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా మురికి గుంతలో కూర్చుని డ్రైనేజీ పైప్‌లైన్ పనులను అడ్డుకున్నారు. శుక్రవారం మొదలైన ఆమె నిరసన కార్యక్రమం శనివారం (48 గంటలు) కూడా కొనసాగుతోంది. వివరాలు.. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ 30 ఫీట్ల రోడ్డులో కొంత కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానికులు సొంతంగా సేకరించిన నిధులతో సుమారు 200 మీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ఇష్టానుసారం పైప్లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ పనులను అడ్డుకుంది. డ్రైనేజీ పైప్‌లైన్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో కూర్చొని నిరసనకు దిగారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులను జీహెచ్ఎంసీ చేస్తుందని... మీరెందుకు చేస్తున్నారంటూ పనులను అడ్డుకుంది. అయితే, సొంత నిధులతో కాలనీని అభివృద్ధి చేసుకోవడంలో తప్పేంటని, తమ పనులకు అడ్డు రావద్దని కాలనీవాసులు ఆమెకు సూచించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ఇష్టానుసారంగా మురికి నీటి కాల్వలు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక బద్దంగా డ్రైనేజీ పైప్లైన్లు నిర్మించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ కాలనీలో నివసిస్తున్న మహిళగా నిరసన తెలుపుతున్నానని స్పష్టం చేశారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురికి కాలువలు, మ్యాన్ హోళ్లు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డంపింగ్ యార్డ్‌కు అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ధ్వంసం చేయించడమే కాకుండా దానిని చెత్తలారీలో డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు... శనివారం తెల్లవారుజామున కొందరు దళిత సంఘాల నేతలు పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు. చెత్తలారీలో విగ్రహాన్ని జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న దళితబహుజన సంఘాల నాయకులు లారీని అడ్డుకుని అందులో ఉన్న చెత్తను కింద పోయించారు. చెత్తతోపాటు ధ్వంసమైన అంబేడ్కర్ విగ్రహం కనిపించింది. దీంతో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు పసుల రాంమూర్తి, జవహర్‌నగర్ దళిత సంక్షేమ సంఘంనేత మేడ రవితోపాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు. జవహర్‌నగర్ పోలీసులు వచ్చి జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని చెత్తలారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చెత్తలారీలో తీసుకువచ్చి అవమానపరిచిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంఘాల నేతలు సాయంత్రం మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని జాగ్రత్తగా తరలించాం పంజగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై జీహెచ్ఎంసీ వారికి సమాచారం ఇచ్చాం. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేనందున దానిని తొలగించాలని కోరడంతో జాగ్రత్తగా దానిని తీసి ప్రైవేట్ లారీలో ఎస్కార్ట్‌తో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించాం. అక్కడ కూడా జాగ్రత్తగా అమర్చి వచ్చాం. – ఏసీపీ తిరుపతన్న ఐఏఎస్ అధికారితో విచారణ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన సంఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఘటనలపై విచారణ జరపాలని నగర పోలీస్ కమిషనర్‌ను కోరాం. జీహెచ్ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో కూడా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. యూసుఫ్‌గూడ నుండి విగ్రహం బయటకు రావడానికి బాధ్యులైన యార్డ్ ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలగించాం. – జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు జీహెచ్ఎంసీ చెత్తలారీలో అంబేడ్కర్ విగ్రహం శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుడిమల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది దళిత సంఘాల నేతలు పంజగుట్ట కూడలి వద్దకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఐదడుగుల దూరంలో సుమారు నాలుగడుగుల గొయ్యి తీశారు. కాంక్రీట్‌తో ఐదడుగుల దిమ్మె నిర్మించి, దానిపైన 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అరగంట వ్యవధిలో విగ్రహ ఏర్పాటు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సుభాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని, పోలీసులు దానిని తొలగించాలని కోరారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. పశ్చిమమండల పోలీసులు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, కేంద్ర బలగాలు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని డంప్‌యార్డుకు తరలించారు. -
చెత్త వేస్తే చలానా..!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు సరికొత్త చర్యలు చేపట్టనున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. చెత్త వేసేవారిని గుర్తించి చలానాలు విధించనున్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. తడి–పొడి చెత్తలు వేరుచేసి వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు పంపిణీ చేసినా ప్రయోజనం కనిపించడంలేదు. వ్యక్తులు, గృహిణులే కాక పలు కంపెనీలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మాల్స్ నిర్వాహకులు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు. నానా రకాల వ్యర్థాల్ని నాలాల్లో విసురుతున్నారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు దిండ్లు , దుప్పట్లు తదితరమైనవి వాటిల్లో వేస్తుండటంతో వర్షపునీరు పారే దారి లేక పొంగిపొర్లుతోంది. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా త్వరలో వినియోగంలోకి తేనున్నారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి ట్యాబ్‌లు లేదా స్మార్ట్ఫోన్లు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారబోస్తున్న వ్యక్తులు, వాహనాల ఫొటోలను నిఘా సిబ్బంది తీసి సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తారు. వాటిని ఆన్లైన్ ద్వారా జోనల్ కార్యాలయాల్లోని అధికారులు గుర్తిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త, వ్యర్థాలు వేసిన వారికి చలానాలు జారీ చేస్తారు. అవి నేరుగా వారి చిరునామాలకు చేరుతాయి. తొలిదశలో హోటళ్లు,ఫంక్షన్‌హాళ్లపై నజర్ చెత్త వేసే వ్యక్తులను గుర్తించడం కష్టం కనుక తొలిదశలో హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే ఇతర సంస్థలను గుర్తిస్తారు. వాటికి చలానాలు జారీ చేస్తారు. ఇందుకుగాను ఆస్తిపన్ను గుర్తింపు నంబర్(పీటీఐఎన్) వంటి వాటిని కూడా వినియోగించుకుంటారు. చలానాలు చెల్లించనిపక్షంలో సదరు మొత్తాన్ని ఆస్తిపన్నులో కలిపే ఆలోచనలోనూ అధికారులున్నారు. తొలిదశలో ఎక్కువ చెత్తను వెలువరించే సంస్థలు, హోటళ్లపై దృష్టి సారించనున్నారు. చెత్తతోపాటు నిర్మాణవ్యర్థాలు వేసేవారిని, రోడ్లపై వ్యర్థజలాలు వదిలేవారిని కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఫొటోలతోసహా పట్టుకుంటారు. పోస్టర్లతో భవనాలను పాడుచేసేవారిని, గోడలపై రాతలు రాసేవారిని కూడా గుర్తిస్తారు. వీరికి మలిదశలో చలానాలను జారీ చేయనున్నారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు ఒక్కో సర్కిల్లో 5 నుంచి 10 మంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని నియమించనున్నారు. వీటితోపాటు పోలీసుల సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఉల్లంఘనులకు కూడా చలానాలు జారీ చేసే వీలుంది. బహిరంగ మూత్ర విసర్జన, ప్లాస్టిక్ వినియోగం, అనుమతి లేని బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు తదితరమైన వాటికి కూడా చలానాలు విధించనున్నారు. జరిమానాలిలా.. జీహెచ్ఎంసీ యాక్ట్, నిబంధనల మేరకు ఏ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధించవచ్చో స్పష్టంగా ఉంది. వాటిల్లో స్వల్పమార్పులు చేసి ఈ చలానాల విధానాన్ని అధికారులు అందుబాటులోకి తేనున్నారు. ఉల్లంఘనలకు విధించనున్న జరిమానాలు -
ఐకియా స్టోర్ : నిన్న వెజ్ బిర్యానీ.. నేడు కేక్
సాక్షి, హైదరాబాద్ : వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన కలకలం సద్దుమణగకముందే ఐకియాలో మరో పురుగు బయటకొచ్చింది. ఈ సారి చాక్లెట్ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు. కిషోర్ అనే కస్టమర్ ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలు.. కిషోర్ అనే కస్టమర్ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్ కూతురు చాక్లెట్ కేక్‌ని ఆర్డర్ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్ తన ఆర్డర్ కాపీ, బిల్ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ పోలీస్‌లకు ట్యాగ్ చేశాడు. #Ikeahyderbad I found an insect inside the chocolate cake which came out while my daughter was eating the cake at IKEA store today in Hyderabad. https://t.co/zrQnMX8rOI @TV9Telugu @KTRTRS sir @hydcitypolice @THHyderabad @Abnandhrajyothi pic.twitter.com/9rtQduiiV7 pic.twitter.com/UOqSB72ETs — Kishore2018 (@Kishore20181) September 12, 2018 కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం మరో వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జీహెచ్ఎంసీ అధికారులు తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని తెలియజేశాడు. దాంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీకి 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి ఐకియా అధికారి ఒకరి మాట్లాడుతూ ‘మా రెస్టారెంట్లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో పురుగు వచ్చిందని తెలిసింది. దీని గురించి మేం ఎంతో చింతిస్తున్నాం. అందుకు క్షమించమని కోరుకుంటున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు. గతంలో వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు ఐకియాకు 11, 500 రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటన తర్వాత ఐకియా ఇక మీదట తన స్లోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని అమ్మడం మానేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘ఇక మీదట ఐకియా కేక్‌లను కూడా అమ్మడం మానేస్తుందా..?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఐకియా బిర్యానీలో గొంగళి పురుగు
హైదరాబాద్: ఐకియా స్టోర్‌లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేపింది. శుక్రవారం స్టోర్‌కు వెళ్లిన మొహమ్మద్‌కు బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. ఈ విషయాన్ని అతడు స్టోర్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ట్విటర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు శనివారం స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఆగస్టులో స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
గ్రేటర్‌కు ‘చెత్త’ముప్పు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న మన గ్రేటర్ సిటీ తలసరి చెత్త ఉత్పత్తిలోనూ దేశంలో అగ్రభాగానికి చేరింది. నగరంలో ప్రతీ వ్యక్తి నిత్యం సుమారు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తుండగా, బెంగళూరులో 440 గ్రాములు ఉత్పత్తి అవుతోంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే 410 గ్రాముల చెత్త మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తిపై నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నీరి) తాజాగా అధ్యయనం చేసింది. ఇందులో ఈ లెక్కలు తేలాయి. హైదరాబాద్‌లో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉండడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే విషయంలో ప్రజల విముఖత నగరపాలక సంస్థకు శాపంగా మారింది. వ్యర్థాల్లో అధికం ఇవే... నగరంలో రోజూ సుమారు 4,500 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. మిగతా వాటిలో ఆర్గానిక్ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, ఈ–వేస్ట్ తదితరాలున్నాయి. ఇక వ్యక్తిగతంగా సిటిజన్లు వృథాగా పడవేస్తున్న వాటిలో వస్తువులు, దుస్తులు, తినుబండారాలు, ఫుడ్ పార్సిళ్లకు సంబంధించిన ప్యాకేజింగ్ మెటీరియల్ అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత వినియోగించి పడవేస్తున్న లెదర్ బ్యాగులు, బూట్లు, ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, వాటర్ బాటిల్స్, బ్యాటరీలు, ఎల క్ట్రానిక్ విడిభాగాలున్నాయి. కొన్ని రకాల వినియోగ వస్తువులను శుద్ధిచేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ సిటిజన్లు వాటిని చెత్తడబ్బాలు, వీధుల్లో పడేస్తుండటంతో గ్రేటర్ నగరంలో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. అవగాహనే కీలకం... ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా పంపిణీ చేసిన డబ్బాలను వేర్వేరుగా వినియోగించడంలో చాలా మంది విముఖత చూపుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకులు తదితర వ్యర్థాలను వేరుచేసి ఆరబెట్టిన తరవాత ఇళ్లలో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు కూడా చాలామంది ముం దుకు రావడంలేదు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం సాధారణ చెత్తతోపాటే పడేస్తుండటంతో నగర పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వ్యక్తి సామాజిక బాధ్యతగా వ్యవహరించి తడి, పొడి చెత్త కోసం 2 డబ్బాల విధానాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దుస్తులు, వస్తువులు, తినుబండారాల పార్సిళ్ల కోసం వినియోగించే ప్యాకింగ్‌లను ఇష్టారాజ్యంగా రహదారులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని కోరుతున్నారు. -
మీకు చెప్పినా వేస్ట్: కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలో వర్షాలు ప్రారంభమైనా పూడికతీత పనుల్లో వేగం మాత్రం పెరగలేదు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి కావడంలేదు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించలేదు. శిథిల భవనాల కూల్చివేతల్లో జాప్యం కొనసాగుతోంది. రహదారులు మరమ్మతు పనులు పూర్తి కాలేదు. మీరేం చేస్తున్నారు’ అంటూ అధికారులపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రహదారుల తవ్వకాలు, నాలాల్లో పూడికతీత, సమస్యాత్మక బాటిల్‌నెక్స్, వాటర్ లాగింగ్ పాయింట్లు, వర్షాకాలం సమస్యలపై సంసిద్ధత తదితర పనులపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టిన పనుల్లో బాగా వేగం పెరగాలని, సత్వరం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అందుకు అధికారులు బదులిస్తూ.. పూడికతీత ఏడాది పొడవునా చేస్తున్నామని, గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ పనే జరిగిందని చెప్పారు. దీనికి ‘నాక్కావాల్సింది అది కాదు.. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పనులు స్లోగా నడుస్తున్నాయి. మాటల్లో కాకుండా చేతల్లో పనులు కనిపించాలి’ అంటూ మందలించారు. వర్షాకాలంలోగా రోడ్ల పనులు పూర్తి చేయాలంటే.. తాను ఊహించినట్టుగా పనులు జరగలేదన్నారు. ‘మీకెన్ని సార్లు చెప్పినా వేస్ట్’ అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నాలాలపై ఆక్రమణలు, శిథిల భవనాల తొలగింపులో అలసత్వం వద్దని, వీటికి ఎవరు అడ్డుపడ్డా వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. ఇందుకుగాను టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో టౌన్ ప్లానింగ్, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను ఆరంభంలోనే అడ్డుకోవాలని, లేని పక్షంలో వాటిని తొలగించడం తీవ్ర సమస్యగా మారుతుందని హెచ్చరించారు. ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా చేపట్టిన పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పనులు సత్వరం పూర్తయ్యేందుకు సర్కిల్, జోనల్, అడిషనల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. జోనల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించబోమని మంత్రి హెచ్చరించారు. మంత్రి, మేయర్, కమిషనర్, చీఫ్ ఇంజినీర్లు, అడిషనర్లు కమిషర్ల వల్లనే సమస్యలన్నీ పరిష్కారం కావని, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సీనియర్ అధికారుల వరకు అందరి సమన్వయంతోనే వీటిని అధిగమించవచ్చన్నారు. లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో అనుమతులివ్వాల్సిందిగా ట్రాఫిక్ అధికారులకు సూచించారు. జోన్లు 10కి, సర్కిళ్లు 50కి పెంపు.. అభివృద్ధి పనులు వేగవంతంగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిపాలనను మరింత వికేంద్రీకరించడం ద్వారా నగర ప్రజలకు మెరుగైన పౌరసేవలు కల్పించవచ్చునని సీఎం భావిస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రస్తుతం 30కి పెరిగిన సర్కిళ్లను 50కి, ఆరు జోన్లను 10కి పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు చెప్పారు. ఒక్కో సర్కిల్లో కేవలం మూడు వార్డులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై అసంతృప్తి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని ఇటీవలే ప్రతిజ్ఞ చేసినా జీహెచ్ఎంసీలోనే వాడి పడేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించాయన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని కచ్చితంగా పాటించాలని, జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నిమున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు స్పష్టమైన ఆదేశాలివ్వాల్సిందిగా మున్సిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. భూసేకరణకు ప్రత్యేక విభాగం.. నగరంలో పెద్ద ఎత్తున ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టినందున వీటికి అవసరమైన భూసేకరణకు జీహెచ్ఎంసీలోనే ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఇతర పనుల ఒత్తిడి వల్ల జీహెచ్ఎంసీకి అవసరమైన భూసేకరణలో తగిన సమయం కేటాయించలేక పోతున్నందున ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్ ఈఎన్సీ ధన్సింగ్, జలమండలి, హెచ్ఆర్డీసీఎల్, ట్రాఫిక్, పబ్లిక్‌హెల్త్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చినుకు చిటికేస్తే.. సిటీ వణుకుడే
-
చినుకు చిటికేస్తే.. సిటీ వణుకుడే
మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం - సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు - 513 అడుగులకు ‘సాగర్’ నీటిమట్టం - రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు - మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్లు - ఉధృతంగా మూసీ, పెరుగుతున్న గోదావరి నీటిమట్టం సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాజధాని హైదరాబాద్‌ను వర్షం విడవడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రానికి నగరంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని సుమారు 200కు పైగా బస్తీలను వర్షపునీరు ముంచెత్తింది. ప్రధాన రహదారులపై 234 బాటిల్‌నెక్స్ వద్ద భారీగా నీరు నిలవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగులు, విద్యార్థులు 4 గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వర్షం విడవకుండా కురుస్తుం డటం తో నగరంలోని పురాతన భవనాల్లో నివసిస్తున్న వారు తక్షణం ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. గతేడాది గ్రేటర్ పరిధిలో 2,010 శిథిల భవనాలను గుర్తిం చగా.. ఇప్పటివరకు 1,451 భవనాలను కూల్చి వేశామని.. మిగిలిన 559 భవనాల్లో నివసిస్తున్నవారు తక్షణం ఖాళీచేయాలని నోటీసులి చ్చామని అధికా రులు తెలిపారు. కాగా, నగర శివార్లలోని పర్వతా పూర్లో మూసీలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు రహదారిపై నిలిచి వాహనాల రాకపోక లకు అంతరాయం కలిగింది. గ్రేటర్ జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ల ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుం డడంతో జలాశయాల్లోకి వరద ప్రవాహం మొదల వలేదని జలమండలి వర్గాలు తెలిపాయి. పెరిగిన ‘సాగర్’ నీటి మట్టం ► హుస్సేన్‌సాగర్ నీటిమట్టం 513.41 మీ. కాగా మంగళవారం 513.32 మీ.కు చేరుకుంది ► హుస్సేన్‌సాగర్‌లోకి 1,625 క్యూసెక్ల ఇన్‌ఫ్లో వస్తుం డగా 600క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు మధిరలో 9.4 సెం.మీ. వర్షం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం మధిరలో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2, ఖమ్మం జిల్లాలో 5.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లాలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగా రెడ్డి జిల్లాలో జంట జలాశయాలైన గండిపేటలో 1,576.88, హిమాయత్‌సాగర్‌లో 1,745.34 అడు గుల నీటి మట్టం పెరిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో అత్యధికంగా 1.4 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 2 సెంటీ మీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో 3.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్ జిల్లాలో 1.4 సెం.మీ., జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు చిన్నమాటుకు గండిపడింది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో వేమనపల్ మండలంలో అత్యధికంగా 1.7 సెం.మీ., మంచిర్యాల, మంద మర్రి, నస్పూర్ మండలాల్లో అత్యల్పంగా 0.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, వనపర్తిలో వర్షాలు ఖమ్మం జిల్లాలోని 1,407 చెరువులు, కుంటల్లో.. 550 చెరువుల్లోకి 25 శాతం నీరు చేరింది. పాలేరు రిజర్వా యర్‌లోకి అడుగు మేర వరద నీరు చేరింది. లంకాసాగర్ ప్రాజెక్టు 8.6 అడుగులకు నీరు చేరింది. తల్లాడ మండలంలోని ముద్దునూరి పడమటి చెరువు గండిపడింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మా జిపేట, తాడూరు, వెల్దండ, వంగూరు, తెలక్కపల్లి, అచ్చంపేట, అమ్రాబాద్ మండలాలల్లో సాధారణ వర్షపాతాని కంటే రెట్టింపు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బాలానగర్‌లో 1.5, కోస్గిలో 1.3, మిడ్జిల్ 1.3, గండీడ్ 1.1, నవాబ్‌పేటలో 1.1, దేవరకద్రలో 0.8 సెం.మీ. వర్షం కురిసింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో అత్యధికంగా 1.3 సెం.మీ, అత్యల్పంగా పెద్దమందడిలో 0.7, జోగుళాంబ గద్వా ల జిల్లాలో 10.2 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గద్వాలలో 1.7, అత్య ల్పంగా ఐజలో 0.1 సెం.మీ. వర్షం కురిసింది. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 17 అడుగులకు చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రా జెక్ట్‌కు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో 15 గేట్లను ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరుకు జలకళ సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. నారాయణఖేడ్, జహీరాబాద్, కోహిర్ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 523.6 మీటర్లు కాగా ప్రస్తుతం 521 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 29.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.28 టీఎంసీల నీరుంది. ఉధృతంగా మూసీ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టులోకి వర దనీరు వస్తోంది. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 645 అడు గులు కాగా ప్రస్తుతం 629.5 అడుగుల మేర నీరుంది. మునగాల మండలంలో 7.2 సెం. మీ. నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాయిపల్లి నుంచి బీబీనగర్, వలిగొండ మండలాల్లో మూసీ ఉధృతంగా పారుతోంది. -
కూల్‌డ్రింక్ కొంటేనే టికెట్!
-
కూల్‌డ్రింక్ కొంటేనే టికెట్!
కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట నయా దోపిడీ - సాధారణ ప్రేక్షకులకు రెట్టింపు ధరకు విక్రయం - సినిమా టికెట్లకు ఫుడ్ కూపన్లు జోడించి అమ్మకం - 75 శాతానికిపైగా టికెట్ ధర పెంచడానికి భారీ స్కెచ్ - కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ ఇష్టం లేకున్నా కొనాలని నిబంధన సాక్షి, హైదరాబాద్: కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా మల్టీప్లెక్స్‌లు సిద్ధమయ్యాయి. ‘బాహుబలి–ది కన్‌క్లూజన్’పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ దందాకు తెరతీశాయి. టికెట్‌తో పాటు బలవంతంగా తినుబండారాలను ప్రేక్షకుల చేతుల్లో పెట్టేలా కాంబో ఆఫర్లు రూపొం దించాయి. ఈ ఆఫర్ల పేరుతో సినిమా టికెట్ ధరను అమాంతం 75 శాతానికిపైగా పెంచేలా భారీ స్కెచ్ వేశాయి. కూల్‌డ్రింక్ ఇష్టం లేకపోయినా, పాప్ కార్న్ నచ్చకపోయినా ఆయా థియేటర్లలో సినిమా చూడాలంటే కాంబో ఆఫర్ కింద టికెట్ కొనాల్సిందే. అలాగే ఎంట్రీ పాస్‌ల పేరుతోనూ అధిక ధరకు టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బాహుబలి క్రేజే.. పెట్టుబడి.. బాహుబలి–ది కన్‌క్లూజన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు దళారులు, మరికొందరు మల్టీప్లెక్స్ నిర్వాహకులు సిద్ధమయ్యారు. కార్పొరేట్, బల్క్ బుకింగ్ పేరుతో సాధారణ ప్రేక్షకులకు అమ్మాల్సిన టికెట్లను రెట్టింపు ధరకు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మొదటి మూడు రోజుల పాటు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్లన్నింటినీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీనికిగానూ మల్టీప్లెక్స్ నిర్వాహకుల వద్ద నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్టు ధర రూ.150 ఉంటే.. కాంబో ఆఫర్ పేరుతో రూ.250 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆఫర్లో భాగంగా ఓ కోక్, పాప్‌కార్న్, ఓ సమో సా ఇస్తారు. ఇలా ఒక్కో షోలోని టికెట్లన్నీ విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు పోగేసుకుంటున్నారు. ఎంట్రీ పాస్‌పైనా దందా.. ఒక్కో టికెట్‌ను రూ.400 నుంచి రూ.450 దాకా పెట్టి కొనుక్కున్న దళారీలు వాటిని ఆకర్షణీయమైన ఎంట్రీ పాస్‌ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. ఈ పాస్‌లపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంట్రీ పాస్‌లను కూడా రూ.వెయ్యి వరకూ అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మొదటి మూడు రోజులు సాధారణ ప్రేక్షకుడికి టికెట్ దొరకడమే గగనంగా మారింది. చట్టం ఏం చెబుతోంది.. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 2 లేదా 4 టికెట్లను బుకింగ్ కౌం టర్ ద్వారానే అమ్మాలని నిబంధనలు ఉన్నాయి. కార్పొరేట్ షో వేసుకోవాలంటే నగర కమిషనర్ నుంచి లేదా డీసీపీ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండానే స్పెషల్ షోల పేరుతో చాలా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యాపారం సాగుతోంది. ఈ టికెట్ల దందాపై సంబంధిత అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు. విచారణ చేపట్టాలి.. చట్టాన్ని అమలు చేయడంలో అధికారుల అలసత్వం వల్లే ఇటువంటి అడ్డదారులు తొక్కుతున్నారు. కాంబో.. ఇతర ఆఫర్లను పెట్టి డబ్బులు దండుకోవడాన్ని చీటింగ్‌గానే పరిగణించాలి. ఒక వ్యక్తికిగానీ ఒక సంస్థకుగానీ టికెట్లను మొత్తంగా అమ్మవచ్చని ఎక్కడా లే దు. కాంబో ఆఫర్ల దందాలో భారీ ఎత్తున పన్ను ఎగవేత ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై విచారణ చేపట్టాలి. – సీవీఎల్ నరసింహారావు, వినియోగదారులహక్కుల కార్యకర్త -
ఔటర్‌పై స్పీడుకు బ్రేక్!
వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి.. గీత దాటితే జరిమానా ఉమ్టా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: పరిధులు దాటి దూసుకుపోతున్న వాహనాలు... నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగానికి కళ్లెం పడింది. ప్రస్తుతమున్న 120 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉల్లంఘించిన వాహనాలకు చలాన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఔటర్‌పై 208 కి.మీ. వేగంతో వాహనాలు వెళుతున్నాయన్న విస్మయకర వాస్తవాన్ని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ ఈ మేరకు బ్రేకులు వేసింది. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై సీఎస్ ఎస్పీ సింగ్ అధ్యక్షతన హెచ్ఎండీఏ, రాచకొండ, సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్లు, ఎండీహెచ్ఎంఆర్ఎల్, రవాణా, ఆర్ అండ్ బీ అధికారులతో సచివాలయంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) సమావేశం జరిగింది. 2041 నాటికి ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (సీటీఎస్)లో భాగంగా నగరంలో ఎన్ని కిలో మీటర్లలో రోడ్లు అభివృద్ధి చేయాలి, ఎంఎంటీఎస్, మెట్రో రైలును ఎలా అనుసంధానించాలి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సదుపాయాల కల్పనకు దాదాపు రూ.1.53 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే ఓఆర్ఆర్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఐటీసీ)లో భాగంగా అమలుచేయనున్న హైవే మేనేజ్మెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌లో రహదారి పొడవునా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ ట్రాఫిక్ క్లాసిఫైర్ కౌంట్స్ (ఏ రకపు వాహనాలు వస్తున్నాయో కనిపెడుతుంది), ఎమర్జెన్సీ కాల్ బాక్స్, ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు సీఎస్‌కు వివరించారు. వరద అంచనాకు ‘ఫ్లడ్ సెన్సార్’లు... వానలకు నగరంలోని రోడ్లు జలమయమవుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. ఈ ఇబ్బందులను గుర్తించేందుకు ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాల్లో ఫ్లడ్ సెన్సార్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని తెలుసుకునేందుకు పొల్యూషన్ సెన్సార్ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. సిటీ ఐటీఎస్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు బస్సుల్లో జీపీఎస్‌లు అమర్చనున్నారు. దీనికి సంబంధించిన యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ వెతలపై దృష్టి... నగరంలో మరో పెద్ద సమస్య పార్కింగ్. దీనికి చెక్ పెట్టేందుకు నో పార్కింగ్, పార్కింగ్ రోడ్ల జాబితా ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే కొత్తగా మల్టీ లెవల్, ఓపెన్ ల్యాండ్ పార్కింగ్‌ల ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై దృష్టి సారించాలని కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టడీ (సీటీఎస్) సిబ్బందికి సూచించారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సందీప్ శాండిల్యా, మహేష్ భగవత్, నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌టీఎస్‌తో మేలు అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (బీఆర్టీఎస్)ను అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అధికారులు... నగరంలో దీని అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీఆర్టీఎస్ బస్సుల కోసం డివైడర్‌కు రెండు వైపులా 3.5 మీటర్ల చొప్పున ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ లైన్లలోకి ఇతర వాహనాలు రాకుండా చూడటం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పి, బస్సుల వేగం పెరుగుతుంది. -
ఇక సొరంగ మార్గం..!
- దుర్గంచెరువు కేబుల్ స్టే బ్రిడ్జి చివరి నుంచి ఖాజాగూడ వరకు సొరంగ మార్గం - ఎస్సార్డీపీలో జాప్యంతో ప్రత్యామ్నాయంగా నిర్మాణానికి యోచన - నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు - సమగ్ర అధ్యయన నివేదిక రూపొందించనున్న జీహెచ్ఎంసీ అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్సార్డీపీ)లో భాగంగా పలు స్కైవేలు, రహదారుల విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అరుుతే ఇది కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు ప్రత్యా మ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. దుర్గం చెరువుపై వేలాడే వంతెన(కేబుల్ స్టే బ్రిడ్జి) నిర్మాణానికి ఇప్పటికే రూ.184 కోట్లు మంజూరు చేసింది. ఈ వంతెన ముగిసే ఇనార్బిట్ మాల్ దగ్గరి నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు ఉన్న గుట్ట ప్రాంతంలో దాదాపు 300 మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లేవారికి ఎంతో సమయం కలసి వస్తుందని భావిస్తోంది. సొరంగ మార్గానికి సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచించింది. ఇటీవల మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వంతెన వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా మంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీంతోపాటు దుర్గం చెరువు కేబుల్ వే బ్రిడ్జి, సొరంగమార్గం రెండూ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వారు మాదాపూర్, గచ్చిబౌలి మీదుగా కాకుండా దుర్గం చెరువుపై వేలాడే వంతెన, అక్కడి నుంచి సొరంగమార్గం ద్వారా వెళ్లవచ్చు. తద్వారా అతి తక్కువ సమయంలో రోడ్ నంబర్ 45 నుంచి ఎలివేటెడ్ కారిడార్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లవచ్చనేది అధికారుల అంచనా. దీని వల్ల ప్రయాణ సమయం కలసి రావడంతోపాటు రోడ్ నంబర్ 36, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. దీనితోపాటు మెహిదీపట్నం నుంచి లింగంపల్లి(వయా నల్లగండ్ల) వరకు, జేఎన్టీయూ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు బీఆర్టీఎస్ ఏర్పాటు ఆలోచనలు కూడా ఉన్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కేబీఆర్ పరిసరాల్లో 120 అడుగుల రోడ్లు కేబీఆర్ చుట్టూ ఉన్న వివిధ రహదారులను విస్తరించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పరిసరాల్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, ఫిల్మ్‌నగర్ రోడ్లు 120 అడుగుల వెడల్పుతో ఉన్నప్పటికీ, రోడ్ నంబర్ 92 మార్గం అంతటా 120 అడుగులు లేదు. కొన్ని చోట్ల వంద అడుగులే ఉంది. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నం 45, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, 10, 14, 2 రోడ్లు 80 అడుగులు ఉన్నారుు. వీటన్నింటినీ 120 అడుగులకు విస్తరించడం ద్వారా ఈ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. -
ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ముందుగా సంపన్నులు కబ్జా చేసుకున్న వాటిని కూల్చాలన్నారు. ఆ తర్వాతే పేదల జోలికి వెళ్లాలని సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చాలని 2015లోనే కోర్టు ఆదేశిస్తే.. ఇప్పుడు కూల్చడమేమిటన్నారు. ప్రభుత్వ పట్టాలిచ్చిన వారి ఇళ్లు కూల్చాలంటే పరిహారమివ్వాలన్నారు. -
మూడో రోజు సాగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
కొనసాగుతున్న కూల్చివేతలు
-
కొనసాగుతున్న కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మూడో రోజైన బుధవారం సైతం జీహెచ్ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పీడు మరింత పెంచారు. బుధవారం ఒక్కరోజే 211 నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తంగా కూల్చివేతలు 452కు చేరాయి. పేదలపై ప్రతాపం చూపవద్దని, భారీ అక్రమాలపైనే శ్రద్ధ పెట్టాలని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలందడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూల్చివేతలకు పూనుకున్నారు. రాయదుర్గంలోని మల్క చెరువు నాలాను ఆక్రమించిన భారీ నిర్మాణాలు, వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలోని హోటల్ కిచెన్‌హాల్ కూల్చివేతల్ని మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. మల్క చెరువు బఫర్‌జోన్‌లోని వే బ్రిడ్జి, స్క్రాప్ గోడౌన్లను కూల్చివేశారు. మూడోరోజు కూల్చివేతల్లో ముఖ్యంగా చెరువులపై వెలసిన వాణిజ్య నిర్మాణాలు, కూల్చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలున్న భవనాలు, నష్టపరిహారం చెల్లించిన నాలాల వెంబడి నిర్మాణాలు, బీఆర్ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ వహించారు. అక్రమాలను సహించం.. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, నగరంలో అక్రమ నిర్మాణాలను సహించేదిలేదని స్పష్టం చేశారు. -
నేడు భారీ వర్షం..ఇళ్లలోంచి రావద్దు
-
జరభద్రం
హైదరాబాద్‌లో నేడు అతి భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక వీలైనంత వరకు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచన - గ్రేటర్ పరిధిలో నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు - అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు - రాత్రి కూడా కార్యాలయాల్లోనే ఉండాలని సూచన - లుంబినీ పార్కు సహా పలు పార్కుల మూసివేత - సహాయక చర్యలకు ఏర్పాట్లు సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ - అవసరమైతే సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయం - లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు - గురువారం వర్షంతో పలుచోట్ల బీభత్సం - జలదిగ్బంధంలోనే పలు కాలనీలు.. పొంగుతున్న నాలాలు - ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు సాక్షి, హైదరాబాద్: మరో రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ హై అలర్ట్ అయింది. ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన విలవిల్లాడుతున్న నగరం.. మరింత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనబోతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్ర, శనివారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. నగరం పరిధిలోని పార్కులన్నింటినీ మూసివేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మీ అధికారులతోనూ సంప్రదించింది. ప్రధాన శాఖల అధికారులంతా తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ అధికారులు రాత్రిళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండాలని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. జల దిగ్బంధంలోనే.. హైదరాబాద్ నగరంలో గురువారం కూడా కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు, బస్తీలు జలమయమయ్యాయి. నగరంలోని అన్ని చెరువులు, కుంటలు నిండిపోయాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి పదకొండు గంటల వరకు సగటున ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి, నారాయణగూడ, అంబర్పేట్, వెస్ట్‌మారేడ్‌పల్లి, చిలకలగూడ, తిరుమలగిరి ప్రాంతాల్లో కుండపోత కురిసింది. పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు చీకట్లోనే మగ్గుతున్నాయి. సెల్లార్లు, అపార్ట్మెంట్లలో నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక, నిత్యావసరాలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నా అవి సరిపోవడం లేదు. బేగంపేటలోని అల్లంతోట బావి ప్రాంతం నీటిలోనే ఉండిపోయింది. నాలాలు ఉప్పొంగడం, రోడ్లపైనే నీరు నిలవడంతో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించి పోయింది. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు నీటి చేరికతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుసేన్సాగర్ నిండుకుండల్లా మారాయి. మల్కాజ్గిరి, నారాయణగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్మీ అధికారులతో సంప్రదింపులు భారీ వర్షాలతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే సైన్యం సహకారం తీసుకోవాలన్న సీఎం సూచన మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఆర్మీ అధికారులను సంప్రదించారు. బేగంపేట, టోలిచౌకి, అల్వాల్, నిజాంపేట, హకీంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున సైన్యం సహకారం అవసరం కావచ్చని వివరించారు. దీనిపై స్పందించిన సైనికాధికారులు తాము కూడా పరిస్థితిని అంచనా వేయనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. వారికి ఆహారం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారిని నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. వరద బాధితులకు ఉచితంగా భోజనం అందించడానికి హరేకృష్ణ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ద్విచక్ర వాహనాలపై క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఇక గురువారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా సుమారు 13 శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సుమారు 865 భవనాలను కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ: కేటీఆర్ 20 వేల కోట్లతో మెరుగుపరుస్తామని వెల్లడి హైదరాబాద్: హైదరాబాద్‌లోని డ్రైనేజీ వ్యవస్థను ఏడాదిన్నరలోపు రూ.20 వేల కోట్లతో ఆధునీకరిస్తామని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు రాకుండా, వాన నీటిలో మునిగిపోయే పరిస్థితి తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న నిజాంపేట, బేగంపేటలోని మయూరిమార్గ్, అల్లంతోటబావి ప్రాంతాలను మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు. తాము మూడు రోజులుగా నీరు, కరెంట్, ఆహారం లేక అల్లాడుతున్నామని నిజాంపేట వాసులు మంత్రికి వివరించారు. వృద్ధులు, పిల్లలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారని చెప్పారు. అపార్ట్మెంట్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. సెల్లార్లలో నిలిచిన నీటిని తోడేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాలాల పక్కన సుమారు 23 వేల ఆక్రమణలున్నాయని.. వాటిని తొలగించేందుకు ప్రస్తుతం రూ.20 వేల కోట్లు అవసరమని.. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాత్రి కూడా కార్యాలయాల్లోనే..: మరోవైపు జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు గురువారం రాత్రి తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు 100 నంబర్‌కు ఫోన్ చేస్తే, జీహెచ్ఎంసీ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందుతుందని, అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. -
శిథిలావస్థ భవనాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్ పరిధిలో ఈ రోజు పర్యటించిన జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్‌రెడ్డి శిథిలావస్థకు చేరిన పలు భవనాలను గుర్తించి కూల్చివేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పురాతన బిల్డింగులు కూల్చి వేస్తున్నారు. -
సందిగ్ధంలో ఎఫ్ఎన్సీసీ భవితవ్యం
బంజారాహిల్స్: ఈ నెల 24న ఫిలింనగర్‌లోని ఫిలింనగర్ కన్వెన్షన్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో పోర్టికో కుప్పకూలిన ఘటన వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్టయ్యారు. ప్రధాన భవనంతో పాటు ఇటీవల నిర్మించిన కన్వెన్షన్ సెంటర్, పార్కింగ్‌స్థలంలో ఇండోర్ గేమ్స్ భవనం అన్నీ జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా నిర్మించినవేనని తేలింది. దీంతో కన్వెన్షన్ సెంటర్‌ను పూర్తిగా కూల్చివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎఫ్ఎన్సీసీ ఆవరణలో ఇంకా అనుమతులు లేకుండా నిర్మించిన గదులను కూడా నేలమట్టం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎఫ్ఎన్సీసీ మళ్లీ తెరుచుకోవడం కష్ట సాధ్యంగా మారింది. ఈ కారణంగా ఇందులో పని చేస్తున్న 350 కుటుంబాల వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం తలెత్తింది. మూడు రోజులుగా ఎఫ్ఎన్సీసీ మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉపాధి కల్పిస్తున్న ఎఫ్‌ఎన్‌సీసీని షరతులతో తెరవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ కమిటీ సంగతేంది? ఎఫ్ఎన్సీసీలో పోర్టికో కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపైన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కమిటీ కొనసాగవచ్చా లేదా అన్నదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇదే కమిటీ కొనసాగితే విచారణ చాలా కష్టంగా ఉంటుందని రికార్డులు కూడా తారుమారయ్యే అవకాశాలున్నాయని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. కొనసాగుతున్న పనులు... కుప్పకూలిన పోర్టికో ప్రాంతం నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 60 శాతం నిర్మాణ సామగ్రి మాత్రమే తొలగించగలిగారు. ఇనుపచువ్వలను పక్కకు తొలగించటం ఇబ్బందిగా మారిందని జీహెచ్ఎంసీ ఈఈ చెన్నారెడ్డి తెలిపారు. ఈ పని ఇంకో రెండు రోజులు పడుతుందని తెలిపారు. -
కుప్పకూలిన బతుకులు..
-
కుప్పకూలిన బతుకులు..
- ఫిల్మ్‌నగర్ ఎఫ్ఎన్సీసీలో అనుమతి లేకుండా పోర్టికో నిర్మాణం - ఒక్కసారిగా పడిపోయిన పిల్లర్లు - ఇద్దరు కూలీల దుర్మరణం,మరో 8 మందికి తీవ్రగాయాలు - స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం.. నాసిరకం పిల్లర్లే దుర్ఘటనకు కారణం - కాంట్రాక్టర్, ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు, కార్యవర్గంపై కేసు సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం ఆదివారం కుప్పకూలింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పోర్టికో పిల్లర్లతో పాటు ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం, పిల్లర్లు నాసిరకంగా ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనుమతులు లేకుండా నిర్మాణం.. ఎఫ్ఎన్సీసీ కమిటీ మెయిన్ గేట్ ముందు నుంచి 500 గజాల స్థలంలో దాదాపు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పోర్టికో నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా వారం క్రితం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఈ కాంట్రాక్టును కొండలరావుకు అప్పగించగా.. సుధాకర్‌రావు అనే వ్యక్తి సైట్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తున్నారు. పోర్టికో అక్రమ నిర్మాణం కావడంతో ఎవరైనా అడ్డుకుంటారని భావించిన ఎఫ్ఎన్సీసీ కమిటీ వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బీమ్స్ నిర్మించి, శనివారం ఉదయం నుంచి శ్లాబ్ పని ప్రారంభించారు. అయితే 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆరు పిల్లర్లనూ నాసిరకంగా కట్టారు. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో పది మంది కూలీలు పనిచేస్తుండగా.. సెంట్రింగ్ సపోర్ట్ కదలడంతో ఈ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కర్ణాటకలోని రాయచూరుకు చెందిన మాన్‌శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్(29), శివ(31), మల్లేశం(25), అజిత్ బిశ్వాస్(24), సీతారాం(32), వీరప్ప(24), కోటేశ్వరరావు(35), సాహెబ్ మండల్(24) గాయపడ్డారు. క్షతగాత్రుల్ని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో శివ తల పగలడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్‌కు దవడ భాగం పూర్తిగా దెబ్బతింది. వీరిద్దరూ మినహా మిగిలిన వారిని డిశ్చార్జ్ చేశారు. బాధితులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఎఫ్ఎన్సీసీ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోపం ఎవరిదో గుర్తించేందుకు జేఎన్టీయూ నిపుణుల కమిటీకి ఈ వ్యవహారాన్ని అప్పగించామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు సందర్శించారు. సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ప్రాణాపాయం సంభవించడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి మృతిచెందిన కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాంట్రాక్టర్ కక్కుర్తే కారణమా..? 30 అడుగుల ఎత్తులో పోర్టికో నిర్మాణం చేపట్టడంతో దాదాపు 18 అంగుళాల చుట్టు కొలతతో ఆరు పిల్లర్లు నిర్మించారు. వీటి మధ్యలో ఆరంగుళాల చుట్టుకొలతతో ఉన్న ప్లాస్టిక్ గొట్టం ఏర్పాటు చేసి, అందులో ఇసుక నింపారు. కాంట్రాక్టర్ కక్కుర్తి కారణంగానే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్ విని యోగించిన ఇసుక, సిమెంట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లూస్ టీమ్స్ వాటి నమూనాలను సేకరించాయి. క్షతగాత్రుడైన శ్రీనివాస్, జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ కొండలరావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, లేబర్ కాంట్రాక్టర్ రవితో పాటు ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు, కార్యవర్గంపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు సీల్ కాగా, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం రాత్రి సీల్ చేశారు. జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాల మేరకు డీఎంసీ సామ్రాట్ అశోక్ గేట్లకు సీల్ వేశారు. -
టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మెహనరావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. రామ్మోహనరావు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన తన ఇంటికి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయమే ఆ కట్టడాన్ని కూల్చేశారు. ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల విషయంలో జీహెచ్ఎంసీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కూకట్ పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాలలో తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే చర్యలు తీసుకుంటోంది. గత వారం 15 రోజులుగా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమపై వచ్చే రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కనపెట్టి కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమం కాదు.. నేనే కూల్చేశా: కంభంపాటి కాగా, అది అక్రమ నిర్మాణం కాదని.. ఇంటి బయట వాచ్ మన్ నివాసం కోసం చిన్న గదిలాంటిది కట్టిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. దాంతో తానే మనుషులను పెట్టి దాన్ని కూల్చేసినట్లు ఆయన చెప్పారు. -
టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అత్యావశ్యకం
వీలైనంత త్వరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోండి - ట్రిబ్యునల్‌తో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట - ఉల్లంఘనులను అరెస్ట్ చేసి, ప్రాసిక్యూట్ చేసేలా చూడండి - సర్కార్, జీహెచ్ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ తామరతుంపరల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలంటే వాటిని కూల్చివేస్తే సరిపోదని, వాటిని నిర్మించిన వారిపై చట్టపరంగా చర్యలకు ఉపక్రమించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉల్లంఘనులపై జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 461(4) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయవచ్చని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ సంశయించడానికి ఎటువంటి కారణం లేదని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా వెలసిన నిర్మాణాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిరక్షించేందుకు జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న జీహెచ్ఎంసీ అభ్యర్థనపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణదారులు చట్టాలను అపహాస్యం చేస్తూ సివిల్ కోర్టులకెళ్లి అనుకూల ఉత్తర్వులు పొందుతూ అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యావశ్యకమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... తన పొరుగింటి వారు ఎటువంటి సెట్బ్యాక్లు విడిచిపెట్టకుండా అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాలని హైదరాబాద్‌కు చెం దిన జాన్ మహమ్మద్ అలియాస్ షాహాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించా రు. ఈ ఆదేశాల మేరకు కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. ప్రభుత్వం ముందు తాముంచిన ప్రతిపాదనలను కోర్టుకు వివరించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ స్పందనను వివరిస్తూ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ కూడా ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ జస్టిస్ నాగార్జునరెడ్డి గురువారం తీర్పునిచ్చారు. ట్రిబ్యునల్‌తోనే ప్రణాళికాబద్ధ అభివృద్ధి.. ‘జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసి టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి సమర్థనీయమే. అక్రమ కట్టడాల కూల్చివేతకు కార్పొరేషన్ నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తులు సివిల్ కోర్టులను ఆశ్రయిచి ఇంజక్షన్ ఉత్తర్వులు పొందుతున్నారు. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇదంతా ఓ క్రమపద్ధతిలో సాగుతోంది. ఉల్లంఘనులు చట్టాలను కాలరాస్తూ, కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ప్రణాళికబద్ధంగా సాగాల్సిన నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యావశ్యకం. ఈ ట్రిబ్యునల్‌లో టౌన్ ప్లానింగ్‌లో అనుభవజ్ఞుడైన ఒక వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. తద్వారా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల పరిధుల్లో విస్తృతంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయండి... ‘జీహెచ్ఎంసీలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తన అఫిడవిట్లో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్లను తగిన సంఖ్యలో కార్పొరేషన్‌కు డిప్యూటేషన్‌పై పంపాలి. కార్పొరేషన్ అధికారులు సైతం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకోకుండా సెక్షన్ 461(4) కింద ఉల్లంఘనులు, అక్రమ నిర్మాణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారిని ప్రాసిక్యూట్ చేసేలా చూడాలి. ఇక ఈ కేసు విషయానికొస్తే అక్రమ నిర్మాణదారులకు అనుకూలంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కార్పొరేషన్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి’ అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
దిల్కుషా... మేయర్ క్యాంపు ఆఫీస్?
బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్థలాన్వేషణ చేపట్టారు. రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్ కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. దిల్కుషా గెస్ట్‌హౌస్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్నఅధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి... గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రో పనుల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతో పాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రాలేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుంది. -
జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత
ప్రభుత్వ స్థలలతో పాటు అనుమతి లేని పలు ప్రాంతాల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లోని అంబేద్కర్ యూనివర్సిటీ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వస్థలంలో గుడిసెలు నిర్మించుకున్న పేదలను ఖాళీ చేయించడానికి వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అయినా అధికారులు బలవంతంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. -
'అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించారు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల విభజనపై బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌లో స్పందించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని ఆయన ఆరోపించారు. అధికారపార్టీ తొత్తులుగా అధికారులు వ్యవహరించారని విమర్శించారు. వార్డుల విభజనపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని వార్డులను తగ్గించారని ఉన్నతాధికారులపై కె.లక్ష్మణ్ మండిపడ్డారు. -
ఆ స్థలం జూబ్లీహిల్స్ సొసైటీదే
♦ నేను లీజుపై తీసుకున్నా.. డీకే కుటుంబానికి సంబంధం లేదు ♦ పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చౌరస్తాలో తాను సొసైటీ నుంచి 59 ఏళ్ల లీజుకు స్థలాన్ని తీసుకున్నానని, ఈ స్థలంతో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్ తెలిపారు. తాను 1987లో జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నానని, ఈ మేరకు పలు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయమై మాజీ మంత్రి డీకే అరుణ ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం సమీప బంధువు భవనానికి విలువ పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కూల్చివేశారని, ఆపై సదరు భూమి డీకే అరుణకి చెందినది అంటూ మీడియాకు లీకులిచ్చారని మండిపడ్డారు. సునీల్‌కుమార్‌తో తమ కుటుంబానికి పరిచయం మాత్రమే ఉందని, పరిచయం ఉన్న వారి ఆస్తులు, తమవి ఎలా అవుతాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
అపరిశుభ్రతపై జీహెచ్ఎంసీ కొరడా
- కేఎఫ్‌సీకి జరిమానా - సెప్టిక్ ట్యాంకర్ల సీజ్ - స్వచ్చ హైదరాబాద్‌కు చర్యలు సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై చెత్తా చెదారం, వ్యర్థాలను పడవేసే వారి పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లో హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్న కేఎఫ్‌సీతో పాటు ఉప్పల్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా వాహనాలపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏకంగా కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ‘కేఎఫ్‌సీ’ రెస్టారెంట్ వారు గత కొంతకాలంగా హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్గంధమయం అయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల క్రితం హోటల్ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు. అయినా కేఎఫ్‌సీ సిబ్బంది ‘మా యాజమాన్యానికి చెబుతాం’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అధికారులు కేసు నమోదు చేసి రూ. 10 వేల రూపాయలు జరిమానా విధించారు. ఉప్పల్‌లో ట్యాంక్‌లు సీజ్ సెప్టిక్ ట్యాంక్‌లో తీసుకొచ్చిన వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు.నగరంలోని రామంతాపూర్ మోడ్రన్ బేకరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను మ్యాన్‌హోల్‌లో వదులుతుండగా అటుగా వెళ్తున్న ఈస్ట్ జోనల్ కమిషనర్ గమనించారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సెప్టిక్ ట్యాంక్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం కూడా అదే విధంగా మరో వ్యక్తి వ్యర్థాలను వదులుతుండగా గమనించిన మెడికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ రావు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకొని తాళం చెవులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేలోగా మరో తాళం చెవితో వాహనాన్ని తీసుకొని ట్యాంకర్దారుడు ఉడాయించారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసు నమోదుచేసి పరారీలో ఉన్న వాహన యజమాని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
ఆర్డీఎఫ్ విద్యుత్‌పై మళ్లీ ఆశలు!
రెండు నెలల్లో ఉత్పత్తి..? సాక్షి, సిటీబ్యూరో : ఏళ్ల తరబడి కుంటుతోన్న ఆర్డీఎఫ్ (చెత్త నుంచి విద్యుత్ ఉత్పతి) ప్రాజెక్టు మరో రెండునెలల్లో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఆర్డీఎఫ్తో ఐఎల్ఎఫ్ఎస్ చేయి కలపడంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, జూలై నెలాఖరు వరకు ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కాగలదని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దీని కోసం గ్రేటర్ నుంచి వెలువడుతున్న చెత్తలో 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను అక్కడకు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికానుంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇటీవల నగరంలోని చెత్త సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సిద్ధమైన అధికారులు ఆర్డీఎఫ్‌పై మరోమారు దృష్టి సారించారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఆర్డీఎఫ్ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పలు అవాంతరాలతో ముందుకు కదల్లేదు. ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు.. ఐఎల్ఎఫ్ఎస్ భాగస్వామ్యం తదితర చర్యలతో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి కాగలదని భావిస్తున్నారు. గ్రేటర్ నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తలో 700 మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తికి వుుందుకొచ్చిన ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో జీహెచ్ఎంసీ(పూర్వపు ఎంసీహెచ్) దశాబ్దం క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. 11 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ. 84 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అందులో 70 శాతం సొమ్మును ఆర్థిక సంస్థల నుంచి సేకరించాలని, మిగతా 30 శాతం ఈక్విటీ షేర్ (రూ25.20కోట్లు)లో 26 శాతం (దాదాపు రూ. 6.55 కోట్లు) జీహెచ్ఎంసీ పెట్టుబడిగా పెట్టాలనేది ఒప్పందం. ఒప్పందమైతే కుదిరినప్పటికీ పనుల పురోగతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించకపోవడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. జీహెచ్ఎంసీ తను చెల్లించాల్సిన వాటా సొమ్ములో రూ. 3.75 కోట్లు మాత్రం చెల్లించింది. 2012 ఆరంభం నాటికి విద్యుత్ పనులు ప్రారంభం కాగలవని అంచనా వేసినా అమలుకు నోచుకోలేదు. కేంద్రంలోని ఎంఎన్ఆర్ఈ చెత్తనుంచి విద్యుత్ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇచ్చే రాయితీ, జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన మిగతా వాటా ధనం రానందునే ఉత్పత్తి ప్రారంభించలేదని ఆర్డీఎఫ్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. తాజాగా దానిపై అధికారులు శ్రద్ధ చూపడంతో రెండునెల ల్లోగా పనులు చేపట్టేందుకు వీలుగా ఒప్పందంలో కొద్దిపాటి మార్పుచేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరు వరకు పనులు ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బుధవారం తనను కలిసిన విలేకరులకు తెలిపారు. ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా.. గ్రేటర్లో వెలువడే చెత్తనుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు శివార్లలోని నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆర్డీఎఫ్కున్న 26 ఎకరాల భూముల్లో ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రేటర్ నుంచి రోజుకు అక్కడకు తరలించే 700 టన్నుల చెత్తలో పదిశాతం(70 టన్నుల) చెత్త తరలింపునకయ్యే వ్యయం ఆర్డీఎఫ్‌దే కాగా, మిగతా 630 టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ అక్కడకు తరలిస్తుంది. ఇందుకుగాను టన్నుకు రూ. 25ల వంతున రోజుకు రూ. 15750లను జీహెచ్ఎంసీకి ఆర్డీఎఫ్ రాయుల్టీగా చెల్లిస్తుంది. ఒప్పందం మార్పులో భాగంగా రోజుకు సగటున 1100 మెట్రిక్‌టన్నుల చెత్తను జీహెచ్ఎంసీయే ప్లాంట్ వద్దకు తరలించనున్నట్లు సమాచారం. -
‘చెత్త’ సమస్యకు చెక్!
- పూర్తి స్థాయిలో తరలింపు బాధ్యతలు రాంకీకి! - ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు - 45 లక్షల పంపిణీకి నిర్ణయం - కొనుగోలు కోసం ప్రభుత్వానికి లేఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో చెత్త సేకరణ, తరలింపు, నిర్వహణ అంశాలపై ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. పకడ్బందీగా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరంలో చెత్తసేకరణ, నిర్వహణలో భాగంగా రాంకీ సంస్థ ప్రస్తుతం చెత్త నిర్వహణ పనులు మాత్రమే చేస్తోంది. అయితే త్వరలోనే తరలింపు పనులను కూడా దానికే అప్పగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ-రాంకీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇంటింటినుంచి చెత్త సేకరించి ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలింపు.. ట్రాన్స్ఫర్ స్టేషన్లనుంచి డంపింగ్‌యార్డుకు తరలింపు.. డంపింగ్‌యార్డులో నిర్వహణ పనుల్ని చేయాల్సి ఉంది. జీహెచ్ఎంసీలోని యూనియన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతతో ప్రస్తుతం కేవలం నిర్వహణ పనుల్ని మాత్రమే రాంకీకి అప్పగించారు. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా చెత్త సమస్య పరిష్కారంతోపాటు రాంకీ ఒప్పందం అమలుపై కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు తగు పరిష్కారం కనుక్కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా మంగళవారం ఈ అంశంపై జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు తొలుత కొన్ని ప్రాంతాల్లో ఒప్పందం మేరకు మొత్తం పనుల్ని రాంకీకి అప్పగించి పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అందులో భాగంగా పాతబస్తీ ప్రాంతంలో(సౌత్జోన్లో) తొలిదశలో మూడంచెల పనుల్నీ రాంకీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అక్కడి ఫలితంతో మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయాలనేది అధికారుల ఆలోచనగా ఉన్నట్లు తెలిసింది. రంగు డబ్బాల కొనుగోళ్లకు సర్కారుకు లేఖ.. ఇంటింటినుంచి చెత్తను సేకరించేందుకు తడి, పొడి చెత్తలకు వేర్వేరుగా రెండు రంగుల డబ్బాలను వినియోగించాలని సీఎం సూచించిన నేపథ్యంలో అందుకు సిద్ధమైన అధికారులు అందుకుగాను దాదాపు 45 లక్షల డబ్బాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆమేరకు పరిపాలనపర అనుమతులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని కొనుగోలు చేయనున్నారు. -
రియల్ ఎస్టేట్ కంపెనీ, జీహెచ్ ఎంసీ అధికారుల మధ్య తోపులాట
హైదరాబాద్ సిటీ: నాగన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దోబీఘాట్ వద్ద ఓ బిల్డర్ వర్గీయులకు, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య శనివారం తోపులాట జరిగింది. వివరాలు... బిన్ట్రిఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన బిల్డర్, జీహెచ్ఎంసీకి రూ. 6.90 లక్షలు రుణం చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించి బిల్డింగ్‌ను సీజ్ చేయడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది కంపెనీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన వెంటనే వెంచర్ లోని రెండు షాపుల్ని సీజ్ చేయగా బిల్డర్ బకాయిలకు సంబంధించి రెండు చెక్కులు వారికి అందించాడు. ఆ సమయంలో బిన్ట్రిఫ్ వర్గీయులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవపై జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
స్వైన్ గణగణ
ప్రమాదంలో ప్రజారోగ్యం ప్రాణాలు పోతున్నా పట్టని పాలకులు అధ్వానంగా పారిశుద్ధ్యం మన సర్కారు ఆశ... ఆకాశంలో మెట్రో వేగంతో పరుగెడుతోంది. ‘విశ్వ’మంత ఎదగాలనే ‘కల’ల బండి... కళ్ల ముందు నిరంతరం కదులుతోంది. ఈ వేగాన్ని అందుకోలేక ‘వాస్తవం’ చతికిలబడుతోంది. పారిశుద్ధ్యలోపం రూపంలో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. స్వైన్ ఫ్లూను జనంపైకి వదిలి... మృత్యువు వికటాట్ట హాసం చేస్తోంది. మహా నగరపు దారి పొడవునా గుండె నెత్తురులు చిమ్ముతూ... ‘స్వైన్’ మృత్యు గంటలు మోగిస్తోంది. నేలపైకి చూడాలని సర్కారుకు స్పృహ వచ్చేలోపు ఇంకెన్ని ప్రాణాలు స్పృహ కోల్పోతాయోనని మహా నగరం బెంగటిల్లుతోంది. ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలను చార్మినార్ శిరస్సు వంచి కోరుతోంది. ఇదే సమయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘మహానగరానికి మామూలు వైద్యం కాదు...శస్త్ర చికిత్స చేయాల’నడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్వైన్ ఫ్లూ.. ఎబోలా.. డెంగీ.. చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు సిటీలో విజృంభిస్తున్నాయి.. మూడు నెలలుగా స్వైన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ మరణ మృదంగం మోగుతూనే ఉంది.. వందలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. అయినా అధికారులు... ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు.. రోడ్లపై పరుగులు తీస్తున్న మురుగు.. దోమల విజృంభణతో కంటిమీద కునుకు కరువైంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.. అనేక ప్రాంతాల్లో మురుగునీరే తాగునీరవుతోంది. నగరాన్ని విశ్వనగరంగా మార్చేస్తాం.. మురుగు వాడలను అద్భుతంగా మార్చేస్తాం.. ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తాం.. హైటెక్ హంగులు కల్పిస్తాం.. అంటూ సీఎం కేసీఆర్ నుంచి కేబినేట్ మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులు నిత్యం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు... వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.. నరగంలో పారిశుద్ధ్యం పరిస్థితిపై శనివారం ‘సాక్షి’ విజిట్‌లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. నగరానికి శస్త్రచికిత్స చేయాల్సిందేనని సాక్షాత్తూ సీఎం ప్రకటించడం భాగ్యనగరిలో అధ్వాన పరిస్థితికి అద్దం పడుతోంది. - సాక్షి, నెట్వర్క స్వాగతం పలుకుతున్న మురుగు నీరు... మన్సూరాబాద్: నగరానికి ముఖద్వారం.. సిటీకి వచ్చేవారికి మురుగునీరు స్వాగతం పలుకుతోంది. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి.. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాలను పరిశీలిస్తే ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. చెత్తాచెదారాలు.. పొంగిపొర్లుతున్న మురుగునీరు ఇళ్లల్లోకి సైతం వచ్చేస్తోందని, వ్యాధుల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. జాతీయ రహాదారిపై డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మున్సిపల్, జోనల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో అధికారులు నిత్యం ప్రయాణించే రహదారులపై డ్రైనేజీ పొంగిపోర్లుతున్న ఉన్నతాధికారులకాని, శానిటేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. లక్షలు మింగేస్తున్నారు... కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్యం పేరుతో అధికారులు లక్షలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెత్త సమస్య కుత్బుల్లాపూర్వాసులకు పెద్ద గుదిబండగా మారింది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చె త్తాచెదారమే దర్శనమిస్తోంది. ప్రజలు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. చెత్త తరలించేందుకు అధునాతన వాహనాలున్నాయి. డంపర్ బిన్స్ ఉన్నాయి. అయినా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ప్రజలు రోగాల బారినపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. లక్షలు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్‌నగర్ రైతు బజార్, సూరారం కాలనీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ పరిధిలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ప్రత్యక్ష నరకం దిల్సుఖ్నగర్: ఇళ్ల మధ్య మురుగునీరు..చెత్తతో నిండిన రోడ్లు...పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..పందుల స్వైర విహారంతో ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.. ఆస్ప్రతుల్లో ఓపీల సంఖ్య పెరిగిపోతోంది. ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఎబోలా వంటి ప్రాంణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, ప్రజలలో అవగాహన లేమి వెరసి కాలనీల్లో అధ్వానంగా ఉంది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఐఎస్‌సదన్, అజంపుర, మాదన్నపేట్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల పరిధిలోని ప్రజలు విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీలలో పారిశుద్ధ్య సేవలు అందించడంలో శానిటేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఓల్డ్‌మలక్‌పేట్, ఆర్కేపురం, సరూర్‌నగర్, ఐఎస్‌సదన్, మూసారంబాగ్,మూసారంబాగ్ తదితర డివిజన్లలో అధికశాతం మురికివాడల నిర్వాసితులు డెంగ్యూ, మలేరియాతోపాటు పలురోగాల బారిన పడుతూ ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల స్పందన మొక్కుబడిగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వైన్ విజృంభిస్తున్నా... మెహిదీపట్నం/గోల్కొండ: ప్రముఖ పర్యాటక కేంద్రం.. నగర శివారు ప్రాంతాలు.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలు ఎన్నో ఉన్నాయి. శానిటేషన్ అధ్వానంగా ఉంది. దోమలు విజృంభిస్తున్నాయి. కంటిమీద కునుకు కరువైంది. విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పందులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నాయి. స్వైన్‌ఫ్లూ భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. చెత్త తరలింపు పనులను పర్యవేక్షించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. షేక్‌పేట్, గుడిమల్కాపూర్, షాహిద్‌నగర్, మురాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెత్త తరలింపు సవ్యంగా జరగడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డ్‌లా వీధులు ఉప్పల్: చెత్తాచెదారాలతో వీధులన్నీ డంపిగ్ యార్డులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన వీధుల్లో నిత్యం మురుగునీరు పొంగిపొర్లుతూనే ఉంటోంది. పందులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫిర్యాలు చేసినా అధికారులుల్లో ఉలుకు..పలుకు లేదు.. కాప్రా డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ, సాయిబాబానగర్, సాయిరాంనగర్ల్లో పందుల బెడద అధికంగా ఉంది. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక ప్రధాన రహదారిలో వారం రోజులుగా మురుగు పరుగులు తీస్తోంది. పలు మార్లుగా ఫిర్యాదుచేసినా శానిటేషన్ విభాగంలో చలనం లేకపోవడం శోచనీయం. రామంతాపూర్ చిన్న చెరువు ఒడ్డున చెత్త పేరుకుపోయి చెత్త డంపింగ్ యార్డులా మారిపోయింది. సమీపంలోని ఇందిరానగర్, నెహ్రూనగర్, నేతాజీనగర్ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. వివేక్‌నగర్, రాంశంకర్‌నగర్, సత్యానగర్లకు సమీపంలో బైపాస్ రోడ్డులో ఉన్న చెత్త డంపింగ్‌యార్డులో కూడా పందులు సంచరిస్తు స్థానిక బస్తీలోకి వెల్తున్నాయి. బాలకృష్ణనగర్‌లో కొంతమంది పందుల పెంపకం చేపట్టడంతో అవి విచ్చలవిడిగా వీధుల్లోకి వస్తున్నాయి. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కదలని మురుగు... అల్వాల్/నేరేడ్మెట్/యాప్రాల్/మౌలాలి/మల్కాజిగిరి/గౌతంనగర్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం, ఏకలవ్యనగర్, జొన్నబండ, సూర్యనగర్, గ్రీన్‌ఫీల్డ్స్, ఖానాజిగూడ, సుభాష్‌నగర్, తుర్కపల్లి, బటన్‌గూడ ప్రాంతాలలో పారిశుద్య నిర్వాహన కొరవడింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అల్వాల్‌లో ఇప్పటివరకు ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. నేరేడ్మెట్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఓపెన్ నాలాల్లో చెత్త పేరుకపోవడంతోమురుగు నీరు రోడ్డుపై పారుతోంది. అంతే కాకుండా రామకృష్ణాపురం, కేశవనగర్, నేరేడ్మెట్ తదితర ప్రాంతాలలో రోడ్లపై పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయనగర్, జేఎల్ఎన్ఎస్ నగర్. గోపాల్‌నగర్, జ్యోతినగర్ వరకూ ఓపెన్నాలలో చెత్త చెదారం రోజుల తరబడి పేరుకుపోయి ఉంది. మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డు మౌలాలి, ఓల్డు సఫిల్గూడా, పీబీ కాలనీ, ద్వారకా మయికాలనీ, భరత్‌నగర్, షఫీనగర్లలో ఓపెన్ డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోయి ప్రవాహానికి అడ్డుపడుతుంది. షఫీనగర్‌లో చెత్త డంపింగ్ యార్డుతో దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. సంతోషిమానగర్, ఎస్పినగర్, చందాబాగ్, మౌలాలి, ఎన్కృష్ణానగర్,వినాయకనగర్,ప్రగతినగర్ తదితర బస్తీలలో చెత్త కుప్పలుగా పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. షఫీనగర్, ఎస్పీనగర్, శ్రామికనగర్లలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. కలుషిత నీరే దిక్కు ఆల్విన్ కాలనీ: కూకట్పల్లి సర్కిల్ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గందం వెదజల్లుతోంది. పలు కాలనీల్లో డ్రైనేజీ సౌకర్యం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లుతోంది. మంజీర, బోర్‌వాటర్ పైపుల్లో, వాల్స్‌లో కలుస్తూ కలుషిత నీరుగా మారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా శానిటేషన్ సమస్య ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట రామకృష్ణానగర్, రిక్షాపుల్లర్స్ కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతూ బోర్‌వాటర్ వాల్ వద్ద కలిసిపోవడంతో సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతోంది. ఆస్బెస్టాస్ కాలనీలో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. సుమిత్రానగర్, దయారుగూడ, నైనా గార్డెన్ సమీపంలో చెత్త కుప్పలు తెప్పలుగా వేయడంతో ఈగలు, దోమలకు ఆవాసాలుగా మారడంతో అవి వృద్ధి చెంది రాత్రివేళలో కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.కేపీహెచ్‌బీకాలనీ మొదటిరోడ్డు, ధనలక్ష్మి సెంటర్, బస్టాప్ సెంటర్లలో చెత్తను తరలించేవారు లేరు. ఫాగింగ్ చేసిన పాపాన పోలేదు. -
వికారాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
-
పాఠశాల నడుస్తుండగానే కూల్చివేత
-
పాఠశాల నడుస్తుండగానే కూల్చివేత
హైదరాబాద్: పాఠశాల నడుస్తుండగానే కూల్చివేసిన ఘటన హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో చోటుచేసుకుంది. స్థానిక సాయిరామ్ హైస్కూల్ భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. తరగతి గదుల్లో విద్యార్థులుండగానే జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం హుటాహుటిన విద్యార్థులను బయటకు పంపించేసింది. ముందస్తు ఆదేశాలు లేకుండా ఒక్కసారిగా కూల్చివేయడంతో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. అక్రమంగా నిర్మించారనే కారణంతో ఐదు అంతస్థుల పాఠశాల భవనంలోని రెండు అంతస్థులను కూల్చివేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరించామని తమ చర్యను జీహెచ్ ఎంసీ అధికారులు సమర్థించుకున్నారు. తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేని సాయిరామ్ హైస్కూల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు వాపోయారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేతకు దిగడాన్ని బాలల హక్కుల సంఘం తప్పుబట్టింది. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులను వివరణ కోరనున్నట్టు తెలిపింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఇంతకుముందు కూడా సికింద్రాబాద్ ఓ ఇంటిని ఎవరూలేని సమయం చూసి కూల్చివేశారు. -
అనుమతి ఉన్నా... కూల్చేశారు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులకు బుధవారం పెద్ద ఝలక్ తగిలింది. మునిసిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాన్ని కూడా అక్రమ నిర్మాణం అనుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాను నిబంధనల ప్రకారం భవనాన్ని నిర్మించానని యజమాని జీహెచ్ ఎంసీ అధికారులు ఎదుట ఆందోళనకు దిగాడు. దాంతో తమ తప్పు తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగేందుకు ప్రయత్నించారు. తనకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ అధికారులను భవన యజమాని ప్రశ్నించాడు. దాంతో నీళ్లు నమలడం జీహెచ్ఎంసీ అధికారుల వంతైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో గురుకుల ట్రస్ట్‌కు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం ఆదేశించారు. దాంతో మంగళవారం రంగంలోకి దిగిన అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రెండవ రోజు బుధవారం అక్రమకట్టడం కూల్చివేస్తు పక్కనే ఉన్న భవనాన్ని కూడా కూల్చివేశారు. దాంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. అ క్రమంలో భవన నిర్మాణానికి పొందిన అనుమతులను భవన యజమాని సదరు అధికారులకు చూపించారు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు తప్పైపోయిందంటూ నాలిక కర్చుకున్నారు. -
నిమ్స్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ
ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనందుకు గాను నిమ్స్ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. వాస్తవానికి మొదటినుంచి నిమ్స్‌కు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఉంది. కానీ ఐదేళ్ల క్రితం ఆ మినహాయింపును ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, అప్పటి నుంచి కూడా నిమ్స్ మాత్రం ఆస్తిపన్నులు కట్టడం లేదు. ఈ ఒక్క సంవత్సరానివే దాదాపు 3 కోట్లకు పైగా పన్ను కట్టాల్సి ఉండగా, మొత్తం బకాయిలు 12.68 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దాంతో ఆస్పత్రిని సీజ్ చేసేందుకు డిప్యూటీ కమిషనర్ సోమరాజు నేతృత్వంలో బృందం అక్కడకు చేరుకుంది. అయితే, తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆస్పత్రిని నడుపుతున్నామని, అలాంటి తమ వద్ద నుంచి ఆస్తిపన్నులు వసూలు చేయడం ఏంటని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ వాదించారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం పన్ను కట్టి తీరాల్సిందేనని అంటున్నారు.