ఓయూ వివాదాస్పద స్థలంలో నిర్మాణాల కూల్చివేత | Demolition Of Illegal Buildings At Osmania University Hyderabad | Sakshi
Sakshi News home page

ఓయూ వివాదాస్పద స్థలంలో నిర్మాణాల కూల్చివేత

Published Tue, May 26 2020 4:10 AM | Last Updated on Tue, May 26 2020 4:10 AM

Demolition Of Illegal Buildings At Osmania University Hyderabad - Sakshi

డీడీ కాలనీలో వివాదాస్పద స్థలంలో వెలిసిన గోడలను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు 

అంబర్‌పేట(హైదరాబాద్‌): ఓయూలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. డీడీ కాలనీ ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఉన్న స్థలంపై ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల రిటైర్డ్‌ న్యాయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బందోబస్తుతో వివాదాస్పద స్థలంలో గోడను నిర్మించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆ నిర్మాణానికి అనుమతిలేదని కూల్చివేయాలంటూ స్థానిక సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు అందాయి.

సర్కిల్‌–16 టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ నర్సింగ్‌రావు నేతృత్వంలో వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గత కొన్నేళ్ల క్రితం ఈ స్థలంలో నిర్మాణం కోసం రిటైర్డ్‌ న్యాయమూర్తి కుటుంబం అనుమతులు పొందారని, ప్రస్తుతం వాటి కాలపరిమితి ముగిసిందని ఏసీపీæ తెలిపారు. తాజాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామన్నారు. తిరిగి నిర్మాణాలకు వారు దరఖాస్తు చేసుకుంటే అందుకు నిబంధనలు పాటిస్తూ పరిశీలిస్తామన్నారు. ఈ కూల్చివేతల బృందంలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సాయిబాబా, చైన్‌మన్‌లు బాబామియా, రజ్వీలు కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement