Osmania University
-
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్‌లో లేహ్, తేజ్‌పూర్‌లో ప్రయోగశాలను, హైదరాబాద్‌లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్‌లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
‘ఓయూ’లో ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) చేపట్టిన చలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలికొంది. ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ యాదవ్‌తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం 7.30 నిమిషాలకు హాస్టల్ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించి సాయంత్రం 6 గంటలకు విడిచి పెట్టారు. అనంతరం అశోక్‌కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, కోదండరాం మౌనం వహించడం దారుణమని చెప్పారు.ఈ నెల 20వ తేదీలోగా వీసీలను నియమించకుంటే 10 విశ్వవిద్యాలయాల బంద్ చేపడుతామని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయూ అధికారుల అనుమతి లేకుండా హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మూడో రోజుకు చేరిన డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మూడో రోజు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డీఎస్సీ అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన్నట్టు సీఐ రాజేందర్ తెలిపారు. మీడియా వర్గాలపై దాడి డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ శ్రీ చరణ్, కెమెరామెన్ సాగర్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్‌స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ధర్నా విరమించారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, ఎస్ఎఫ్ఐ నేత రవినాయక్, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వర్రావు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండిచారు. -
ఓయూలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం దారు ణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం?’అని నిలదీశారు. గాయపడిన జర్నలిస్టు శ్రీచరణ్‌ను కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు.సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు అక్కడకు వెళ్లిన జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ ఖండించింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని వర్సిటీలు పోలీసుల లాఠీదెబ్బలతో రక్త మొడినట్టే.. మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఓ ప్రకటనలో మండిపడ్డారు. » ఓయూలో జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తూ టీయూడబ్ల్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, సచివాలయ జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. » మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. » డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం అప్రజాస్వామిక మని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ విమర్శించారు. పార్టీ నాయకులు రాకే‹Ùకుమార్, పల్లా ప్రవీణ్, కడారిస్వామి, పడాల సతీ‹Ùతో కలిసి బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. » బీఆర్ఎస్పీ నేతలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి, వారిని సరీ్వస్ నుంచి తొలగించా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్ట్‌పై బుధవారం ఆయన స్పందించారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ అన్నారు.‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్‌ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్‌గూడలో ఉండాలో తేలిపోతది. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. క్రిశాంక్‌ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్‌ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్‌ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్‌పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024 -
సీఎం వస్తే ప్రారంభమే..
ఓయూలో నిరి్మంచిన సెంటినరీ పైలాన్ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 2017లో జరిగిన ఓయూ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల గుర్తింపుగా పైలాన్‌ను నిరి్మంచాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో పైలాన్ నిర్మాణంలో జాప్యం జరిగింది. మీడియా కథనాలతో వీసీ ప్రొ.రవీందర్ గతేడాది పైలాన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓయూ చరిత్రలో నిలిచిపోయేలా రూ.1.58 కోట్లతో నిర్మించిన పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులను విద్యార్థి నేతల కోరగా సీఎంను కలిసేందుకు అనుమతి కోసం ప్రత్నిస్తున్నారు. నిరంతర కార్యక్రమాలతో సీఎం రేవంత్‌రెడ్డి బిజిబిజిగా ఉండటంతో ఓయూ అధికారులు కలవలేకపోతున్నారు. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పైలాన్ ప్రారంభం మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని త్వరితగతిన ప్రారంభించాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు. –ఉస్మానియా యూనివర్సిటీ -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
కిటికీలు తొలగించి.. చొరబాటు
సనత్‌నగర్: యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ (ఉస్మానియా యూనివర్సిటీ) ఉమెన్స్ హాస్టల్లోకి శుక్రవారం రాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడి హంగామా సృష్టించారు. హాస్టల్ కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించడంతో విద్యారి్థనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమై ముగ్గురిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్యారడైజ్ సమీపంలోని వాటర్‌వర్క్స్ కార్యాలయంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేసే శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం తాగి శుక్రవారం అర్ధరాత్రి పీజీ కాలేజ్ హాస్టల్ వద్దకు వచ్చారు. కిటికీలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యారి్థనులు పట్టుకునేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ ఒక్కడే చిక్కడంతో 100కు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితుల పేర్లను శ్రీకాంత్ వెల్లడించడం లేదు. ఆందోళన.. ఉద్రిక్తత.. తమకు రక్షణ కరువైందంటూ హాస్టల్ విద్యారి్థనులు శనివారం ఆందోళనకు దిగారు. వీసీ వచ్చి హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అంటూ ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్లోసీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, స్టాటి క్ సెక్యూరిటీ ఫోర్స్ నియమించాలని, రెండు కిటికీలను మరమ్మతులు చేయించాలని, ప్రహరీగోడ ఎత్తు పెంచాలనే డిమాండ్లను వ్యక్తంచేశారు. నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ రామలింగరాజు, సీఐ భాస్కర్లు పరిస్థితిని సమీక్షించి యూని వర్సిటీ అధికారులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ రవికుమార్‌తో కలిసి డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యారి్థనులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ లో ఉద్రిక్తత
-
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో వ్యక్తి మృతి
-
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
డాక్టరేట్ అందుకున్న శంతను నారాయణ్
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ శంతను నారాయణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వీసీ ప్రొ.రవీందర్ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శంతను నారాయణ్ మూడో ఓయూ పూర్వవిద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓయూలో అన్ని విభాగాలలో బంగారు పతకాలను ప్రవేశపెట్టాలని, అందుకు పూర్వవిద్యార్థులు సహకరించాలన్నారు. నేడు (31న) తన పెళ్లిరోజు అయినప్పటికీ మీ కోసం పాండిచ్చేరినుంచి వచ్చానని ఆమె చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. బంగారు పతకాలలో మహిళల రికార్డు.. ఓయూలో అత్యధికంగా బంగారు పతకాలు సాధించి మహిళలు రికార్డు సృష్టించారు. ప్రకటించిన 46 మంది పీజీ విద్యార్థుల్లో 40 మంది మహిళలు కాగా కేవలం ఆరుగురు మాత్రమే పురుషులు ఉన్నారు. వివిధ విభాగాలలో 1,024 మంది పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, వీసీ ప్రొ.రవీందర్, రిజి్రస్టార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.రాములు తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో మూడో పీహెచ్డీ: శంతను నారాయణ్ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ శంతను నారాయణ్ గవర్నర్ తమిళిసై, వీసీ ప్రొ.రవీందర్ చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మా, నా భార్య పీహెచ్డీ డాక్టరేట్లు కాగా తనతో మూడోదన్నారు. ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులు అవకాశాలను ఎంచుకోవాలన్నారు. అనంతరం పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను సాధించిన 1,024 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డాక్టరేట్ అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ‘భారతదేశంలో శాసనసభ్యుల శాసనాధికారాలు–వాటిపై న్యాయ సమీక్ష’ అనే అంశంపై న్యాయశాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను బాలరాజుకు పీహెచ్డీ పట్టా లభించింది. అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ల ఆనందం... ఓయూ నుంచి పీహెచ్డీ డాక్టరేట్లు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్ డిగ్రీలను అందుకున్న వారిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేసేవారే అధికంగా ఉన్నారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉద్యోగాలు రావడంతో 10, 15 సంవత్సరాల క్రితం చదవులను వదిలేసి ఇక డాక్టరేట్‌ను అందుకోలేమని అనుకున్న మాకు వీసీ వన్‌టైం ఛాయిస్‌తో పరిశోధనను పూర్తి చేసే అవకాశం కల్పించారని అనేక మంది విద్యార్థులు పేర్కొన్నారు. -
ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
-
అంతర్గత ప్రతిభకే అందలం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో మూల్యాంకన విధానం పూర్తిగా మారబోతోంది. సంప్రదాయ పద్ధతులకు ఇక స్వస్తి పలకనున్నారు. మార్కులే కొలమానం కాకుండా, విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీసి, దాని ఆధారంగా అతని క్రెడిట్స్ నిర్ణయిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్టు– గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ఓయూ మొదలు పెట్టింది. అధ్యాపకులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులను కూడా ముందుగానే సమాయత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలో పీజీ కోర్సులు చేసే దాదాపు 30 వేల మంది సరికొత్త మూల్యాంకన పరిధిలోకి వస్తారు. కొత్త మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి గత ఏడాది ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) చేత అధ్యయనం చేయించింది. ఈ సంస్థ ఇచ్చిన సిఫారసులను మండలి ఆమోదించి అమల్లోకి తెస్తోంది. ప్రతిభకు అన్నివిధాలా పరీక్ష ఇప్పటివరకూ ఏడాది మొత్తం చదివిన విద్యకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానాలు. కొత్త విధానంలో విద్యార్థి అంతర్గత నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియలో బోధకులు అత్యంత కీలకంగా మారనున్నారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ ఏడాది పొడవునా అతను అనుసరించే విధానాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అటెండెన్స్‌కు సైతం కొన్ని మార్కులుంటాయి. ప్రతి చాప్టర్లో పాఠాన్ని విద్యార్థి ఏమేర అర్థం చేసుకున్నాడో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులకు అధ్యాపకులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. సబ్జెక్టుపై పట్టు కోసం తరగతి గదిలో స్వల్పకాలిక చర్చలు నిర్వహిస్తారు. నెలవారీ పరీక్షలూ నిర్వహిస్తారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్టుల్లో ఎక్కడ ప్రతిభ కలిగి ఉన్నాడు? ఎక్కడ వెనుకబడ్డాడు? అనేది గుర్తించి మార్కులు వేస్తారు. మరోవైపు అనుభవ పూర్వక విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి థియరీ కాకుండా, ప్రాక్టికల్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెరుగైన ఫలితాలిస్తాయని పారిశ్రామిక రంగం కోరుకునే నిపుణులు తయారయ్యే వీలుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ప్రతిభను వెలుగులోకి తేవడానికే : ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) మూల్యాంకన విధానంలో మార్పుల వల్ల విద్యార్థి కేవలం థియరీకే పరిమితం అయ్యే అవకాశం లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత విద్య చేసినా, ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదనే ఈ సరికొత్త విధానం అనుసరిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్ళాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అధ్యాపకులనూ సన్నద్ధం చేశాం : ప్రొఫెసర్ రవీందర్ (ఓయూ వీసీ) ఈ ఏడాది పీజీ కోర్సుల్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అధ్యాపకులను సన్నద్ధం చేశాం. క్లాసులు ప్రారంభమైనప్పట్నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సిసలైన ప్రతిభ వెలికి తీసే విధానం కాబట్టి విద్యార్థులకూ మేలు జరుగతుంది. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్‌లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ ఫైల్‌ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్‌తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
హైదరాబాద్‌లో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు. 3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్‌ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు. -
ఓయూ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్‌రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు. అకడమిక్ కేలండర్‌ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్‌లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు. ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ఓయూలో మెట్ల బావిని బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి
-
టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్
-
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనలతో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్ చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని, అదే సమయంలో జ్యూడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్ష ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. విద్యార్థి నిరుద్యోగ మార్చ్ పేరుతో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి విద్యార్థి సంఘాలు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్ గేట్లు మూసేశారు. అయినప్పటికీ దీక్షకు దిగేందుకు యత్నించారు విద్యార్థులు. దీంతో.. పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు యత్నించగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, పలువురి విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. -
ఉస్మానియా యూనివర్సిటీ: నేడు రేపు క్యాంపస్‌లో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేశారు. ఓ వైపు దీక్షకి పర్మిషన్ లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. మరో వైపు దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాలు మాత్రం తాము దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశాయి. క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం వారి రాకను స్వాగతిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తున్న క్రమంలో విద్యార్థులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో క్యాంపస్‌లోకి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసింది. -
HYD: ‘ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి’
సాక్షి,హైదరాబాద్: కనీస సదుపాయాల లేమిపై.. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా.. కనీసం తాగటానికి కూడా నీరు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. యాజమాన్యం తీరును నిరసిస్తూ.. కాలేజీ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్లో నిత్యావసరాలు కరువయ్యాయని వాపోయారు వాళ్లు. వాడడానికి కాదు కదా.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు వాళ్లు. అలాగే కాలేజీ బాయ్స్ హాస్టల్లో చాలా మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నా.. ఎవరూ స్పందించకపోవటం దారుణమన్నారు. హాస్టల్ పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకపోవటమే కాదు.. డ్రైనేజీ పొంగిపొర్లుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. కాలేజీ యాజమాన్యం త్వరగా స్పందించి.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు.