జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ  | Foreign Stork Injured At Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ 

Published Thu, Jan 6 2022 8:49 AM | Last Updated on Thu, Jan 6 2022 8:49 AM

Foreign Stork Injured At Hyderabad - Sakshi

గాయపడిన విదేశీ కొంగ 

సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్‌):  ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్‌ అంబర్‌పేట మల్లికార్జున్‌నగర్‌లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement