
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేశారు. ఓ వైపు దీక్షకి పర్మిషన్ లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. మరో వైపు దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాలు మాత్రం తాము దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశాయి. క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం వారి రాకను స్వాగతిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తున్న క్రమంలో విద్యార్థులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో క్యాంపస్‌లోకి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసింది.
Comments
Please login to add a commentAdd a comment