సాక్షి,హైదరాబాద్: కనీస సదుపాయాల లేమిపై.. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా.. కనీసం తాగటానికి కూడా నీరు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. యాజమాన్యం తీరును నిరసిస్తూ.. కాలేజీ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
హాస్టల్‌లో నిత్యావసరాలు కరువయ్యాయని వాపోయారు వాళ్లు. వాడడానికి కాదు కదా.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు వాళ్లు. అలాగే కాలేజీ బాయ్స్ హాస్టల్‌లో చాలా మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నా.. ఎవరూ స్పందించకపోవటం దారుణమన్నారు. హాస్టల్ పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకపోవటమే కాదు.. డ్రైనేజీ పొంగిపొర్లుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. కాలేజీ యాజమాన్యం త్వరగా స్పందించి.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment