fecilities
-
ట్రక్కు డ్రైవర్లకు ఇక రాజభోగాలు
-
HYD: ‘ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి’
సాక్షి,హైదరాబాద్: కనీస సదుపాయాల లేమిపై.. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా.. కనీసం తాగటానికి కూడా నీరు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. యాజమాన్యం తీరును నిరసిస్తూ.. కాలేజీ మెయిన్‌గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్లో నిత్యావసరాలు కరువయ్యాయని వాపోయారు వాళ్లు. వాడడానికి కాదు కదా.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు వాళ్లు. అలాగే కాలేజీ బాయ్స్ హాస్టల్లో చాలా మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నా.. ఎవరూ స్పందించకపోవటం దారుణమన్నారు. హాస్టల్ పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకపోవటమే కాదు.. డ్రైనేజీ పొంగిపొర్లుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. కాలేజీ యాజమాన్యం త్వరగా స్పందించి.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. -
సమస్యల కూత!
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనలో మాత్రం రైల్వే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక స్టేషన్లో తాగునీటి ఇబ్బంది వేధిస్తుండగా.. మరో స్టేషన్లో సరిపడా బాత్రూంలు లేక, వెయిటింగ్స్ హాల్స్ వినియోగానికి రాక, లోలెవల్ ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చెందక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ సమస్యలను సర్పంచ్‌లు, కార్యదర్శులు పట్టించుకుంటే.. పట్టణ, మున్సిపాలిటీ సమస్యలను కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనర్లు పట్టించుకుంటారు.. అలాగే బస్టాండుల్లో ఉన్న సమస్యలను డీఎంలు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పట్టించుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. కానీ రైల్వేస్టేషన్ల వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్కడి సమస్యలు బయటికి రావడంలేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహణ ఉండటంతో తమకెందుకులేనని అందరూ అనునకోవడంతో ఏళ్లు గడిచినా రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచడంలేదు. దీంతో సమస్యలను వెలికితీయడానికి ‘సాక్షి’ బృందం స్టేషన్లను సందర్శించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్టేషన్ మహబూబ్‌నగర్: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండో పెద్ద స్టేషన్ మహబూబ్‌నగర్. జిల్లా పరిధిలోని స్టేషన్ల గుండా ప్రతి రోజు 7వేల నుంచి 8వేల మంది ప్రయాణం సాగిస్తుండగా..ప్రతి రోజు సుమారు రూ.7 నుంచి 9 లక్షల దాకా ఆదాయం వస్తుంది. అయితే, స్టేషన్ ఆవరణలో బాత్రూంలు లేక, స్టేషన్లో ఉన్న బాత్రూంలు సరిపడా లేక ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా స్టేషన్ ఆవరణలో నిర్మించిన రైల్వే కమ్యూనిటీ భవనం వృథాగా మారింది. స్టేషన్ ఆవరణలోని పార్కు కూడా అస్తవ్యస్తంగా ఉంది. స్టేషన్‌కు అతిసమీపంలోని మోతీనగర్‌వాసులు పట్టాలపై నుంచి పట్టణంలో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్యూబీ నిర్మించాలని కాలనీవాసులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఈ రైల్వే స్టేషన్ బీ–గ్రేడ్ హోదాలో ఉంది. ఏ–గ్రేడ్ కోసం ఎదురుచూస్తున్నా ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. రైల్వేస్టేషన్‌కు ఏ–గ్రేడ్ హోదా లభిస్తే స్టేషన్లో మరెన్నో సౌకర్యాలు అందుతాయి. తాగునీటి ఎద్దడి తీవ్రం జడ్చర్ల టౌన్: జడ్చర్ల రైల్వేస్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. ప్రధానంగా స్టేషన్లో తాగునీటి సమస్య వేధిస్తుంది. ఉన్న రెండు బోర్లు వట్టిపోవటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు అవి చాలకుండా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క చోట తాగునీటి కోసం నల్లాలద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పలుచోట్ల నల్లాలు ఏర్పాటు చేసినప్పటికి అవి నిరుపయోగంగానే మారాయి. అదేవిధంగా కోతులు ప్రయాణికులను ప్లాట్‌ఫాంపైకి రానీవ్వకుండా పరుగులు పెట్టిస్తున్నాయి. రైలు వచ్చి స్టేషన్లో నిలబడితే మొదటిప్లాట్‌ఫాం నుంచి టికెట్ కొనుగోలు చేసి రెండవ ప్లాట్‌ఫాంలో ఆగిన రైలు ఎక్కాలంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. నీటి కొరత కారణంగా ఉన్న టాయిలెట్స్ మూసి ఉంచుతున్నారు. వృథాగా వెయిటింగ్ హాల్ దేవరకద్ర: దేవరకద్ర రైల్వే స్టేషన్‌ను ఇటీవల కొత్తగా నిర్మించారు. ఈ స్టేషన్లో కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నిలుస్తాయి. ఈ స్టేషన్ నుంచి నెలకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇటీవల ఇక్కడి నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ వేరు పడడం వల్ల ఈ స్టేషన్‌ను జంక్షన్‌గా ప్రకటించారు. అయినా దానికి తగ్గట్లు సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. స్టేషన్లో క్యాంటిన్ మూతపడగా, వెయిటింగ్ హాల్స్ నిరుపయోగంగా ఉంది. దీంతో ప్రయాణికులు చెట్ల కింద బెంబీలపై వేచి ఉండే పరిస్థితి ఉంది. తాగునీటి సౌకర్యం ఉన్న కులాయిలు సక్రమంగా పని చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రం అయిన ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపడం లేదు. దీని వల్ల ప్రయాణికులు జిల్లా కేంద్రం వెళ్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచక అవస్థలు మండలంలోని కౌకుంట్ల, కురుమూర్తి రైల్వేస్టేషన్లలోనూ ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు రైలు ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక రెండు స్టేషన్లలోను క్యాంటిన్ మూత పడడం వల్ల ప్రయాణికులకు కనీసం టీ కూడా దొరకని పరిస్థితి ఉంది. కురుమూర్తి రైల్వేస్టేషన్ చాలా పురాతనమైనది. ఈ స్టేషన్ నిర్వహణను రైల్వే శాఖ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. హైలెవల్ ప్లాట్‌ఫాం లేక అవస్థలు అలంపూర్: జోగుళాంబ రైల్వేస్టేషన్లో ప్రధానంగా లోలెవల్ ప్లాట్ ఫాంతో ఇబ్బంది నెలకొంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు రైళ్లు ఎక్కడానికి అవస్థలు పడుతున్నారు. హైలెవల్ ప్లాట్ ఫాం నిర్మిస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా, ఈ స్టేషన్లో ఏపీ సంపర్క్, బెంగుళూరు–వెంకటాద్రి, చైన్నైఎగ్మోర్, యశ్వవంత్పూర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. కానరాని సీసీ కెమెరాలు బాలానగర్ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్ మూసే ఉంచారు. బాలానగర్ (జడ్చర్ల): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో తాగునీటి సమస్యతోపాటు ప్రయాణికులకు భద్రత కరువైంది. స్టేషన్లో ఒక్క సీసీ కెమెరా సైతం ఏర్పాటుచేయలేదు. నిత్యంవందల సంఖ్యలో ప్రయాణికులు స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, సాయంత్రం, రాత్రి వేళల్లో మందుబాబులు స్టేషన్ పరిసరాల్లో మద్యం సేవిస్తుండడం పరిపాటిగా మారడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, స్టేషన్లో కొళాయిలు ఉన్నా నీరు రావడంలేదు. ఏళ్ల నుంచి క్యాంటిన్ మూసే ఉంచారు. మూడేళ్ల కిందటి వరకు స్టేషన్లో క్యాంటీన్ ఉండేది. ఆ తర్వాత తీసివేశారు. ప్రయాణికులు ఏమైనా తిందాం అన్నా, నీరు తాగుదామన్నా క్యాంటీన్ లేని పరిస్థితి. ఉన్న కొళాయిల్లో నీరు రాని పరిస్థితి నెలకొంది. – ఆంజనేయులు ప్రయాణికుడు దేవరకద్ర ఎండలోనే ఎదురుచూడాలి మదనాపురం (వనపర్తి): ఒకప్పుడు వర్తక వ్యాపారంతో ఎంతో ప్రఖ్యాతి చెందిన మదనాపురం(వనపర్తి రోడ్డు) రైల్వే స్టేషన్లో షెడ్లు లేక ప్రయాణికులు ఎండలో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. స్టేషన్ నుంచి ఎక్కువగా తిరుపతి, హైదరాబాదు, హుబ్లీ, రాయచూర్, పూణె, ముంబాయి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే, స్టేషన్లో ఇటీవల నిర్మించిన మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకరాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండవ ప్లాట్‌ఫాం ఉన్నప్పటికీ ప్రయణికుల కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఎండలోనే నిల్చునే పరిస్థితి నెలకొంది. ప్లాట్‌ఫాం ఎత్తు పెంచాలి కౌకుంట్ల స్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు పెంచాలి. మాలాంటి వాళ్లు రైలు ఎక్కాలంటే ఇబ్బందులు పడుతున్నాం. పాత కాలంలో ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్ ఫారం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం రైలు ఎంతో ఎత్తులో ఉంటుంది. మెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. – లక్ష్యయ్య, ప్రయాణికుడు, కొత్తకోట -
వేసవి సెలవులు: టీటీడీ అలర్ట్
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులు అధికంగా ఉండే క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్‌తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం 3 లక్షల 50 వేల లడ్డూల తయారీచేస్తున్నట్టు తెలిపారు. వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాగా, అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్అండ్టీ కంపెనీతో సర్వే చేయిస్తోంది. -
ఎండు చేపకు ఎంత కష్టం!
కోడూరు(అవనిగడ్డ) : ఎండు చేపకు కష్టం వచ్చింది. రోడ్డుపైనే ఎండాల్సి వస్తోంది. ఎండబెట్టుకునేందుకు వసతులు లేవు. వేటకు వెళ్లి తెచ్చుకున్న సంపద కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రోడ్లనే కల్లలుగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఏ రోడ్డు చూసినా ఎండు చేపలతో నిండిపోయాయి. వివరాలు.. మండల పరిధిలో పాలకాయతిప్ప, హంసలదీవిల్లో 300 మత్స్యకార కుటుంబాలున్నాయి. గంగపుత్రులు తమకు సముద్రంలో దొరికిన మత్స్యసంపదలో పెద్దవాటిని విక్రయించి, చిన్న చేపలు, రొయ్యలను ఆరపెట్టి, అవి ఎండిన తరువాత విక్రయిస్తుంటారు. అయితే పాలకాయతిప్పలో సరుకును ఎండపెట్టుకునేందుకు ఏ విధమైన ప్లాట్‌ఫాంలు నిర్మించకపోవడంతో గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే ఇలా ఆరబెడుతున్నారు. దీంతో ప్రస్తుతం దింటిమెరక బైపాస్ రహదారి దగ్గర నుంచి కరకట్ట వరకు సుమారు కిలోమీటరన్నరకు పైగా ప్రధాన రహదారి ఒకవైపు పూర్తిగా ఎండిన సరుకుతో నిండిపోయింది. సాగర సంగమానికి వచ్చే యాత్రికులు ఈ రోడ్డు మీదగానే ప్రయాణం చేయాల్సి ఉండడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. ఎండు చేపలు, రొయ్యల వాసనతో ఇక్కట్లు పడుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పటకైన పాలకులు స్పందించి తమ సంపదను ఎండపెట్టుకొనేందుకు అవసరమైన ఫ్లాట్‌ఫాంలను నిర్మించాలని పాలకాయతిప్ప గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆర్జిత సేవా భక్తులకు మెరుగైన సౌకర్యాలు
– గర్భాలయ అభిషేక సేవాకర్తలకు రెండు మహాలడ్డూప్రసాదాలు – ప్రత్యేకపూజాసేవల ప్రసాదాలు ఇక జ్యూట్ బ్యాగులలో – భక్తులకు అందుబాటులో అమ్మవారి శ్రీచక్ర కుంకుమార్చన శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవాకర్తలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో కాన్ఫరెన్స్హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్, అడ్వాన్స్ బుకింగ్ అభిషేకం టికెట్ ధర రూ. 1500లుగా నిర్ణయించిన విషయం తెల్సిందే కాగా, ఈ టికెట్లను తీసుకున్న సేవాకర్తలకు పూజా ద్రవ్యాలు, లడ్డూప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేయించిన జ్యూట్ బ్యాగులలో అందజేయాలని నిర్ణయించామన్నారు. అలాగే రూ. 5వేల గర్భాలయ అభిషేకం టికెట్ తీసుకున్న సేవాకర్తలకు పూజాద్రవ్యాలు, శ్రీశైలప్రభ, గోమయం విభూది, కంకణాల బాక్స్‌లతో పాటు 250 గ్రాముల చొప్పున రెండు మహాలడ్డూప్రసాదాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలమహాక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం ఆశీర్వచనాల అనంతరం వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించిన జ్యూట్ బ్యాగులలో మహా ప్రసాదాలను అందజేస్తామని తెలిపారు. అలాగే లడ్డూప్రసాదాలను కొనుగోలు చేసిన భక్తులకు రూ. 20 చొప్పున జ్యూట్ బ్యాగులను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పడ్డ స్వయం సహాయక బృందాలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో నంద్యాలకు చెందిన తేజలక్ష్మిగ్రూప్ (మెప్మా) వారు తయారు చేస్తున్న జ్యూట్‌బ్యాగులను వారి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. సమావేశంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, స్వామివార్ల ఫ్రధానార్చకులు పీఠం మల్లయ్యస్వామి, వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, సహాయ సంపాదకులు బ్రహ్మచార్య తదితరులు పాల్గొన్నారు. డ్రై ఫ్రూట్స్ ప్రసాద వితరణపై ఆలోచన:l: మల్లన్న భక్తులకు డ్రై ఫ్రూట్స్ ప్రసాదవితరణ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ఈఓ తెలిపారు. వారం, పది రోజుల పాటు తీర్థయాత్రలపై వచ్చే భక్తులు, పర్యాటకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు లడ్డూప్రసాదాలు కొనుగోలు చేసినా నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్‌పై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అమ్మవారి శ్రీచక్ర కుంకుమ: అమ్మవారి ఆలయంలో జరిగే శ్రీ చక్ర కుంకుమార్చన ద్వారా సేకరించిన కుంకుమను 150 గ్రాముల డబ్బాలో రూ. 50లు చొప్పున విక్రయించడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా స్వామిఅమ్మవార్ల లడ్డూప్రసాదాలతో పాటు విభూది, కుంకుమలు కూడా ఇక నుంచి తమ ఇళ్లకు తీసుకువెళ్లే సౌకర్యం కలిగిందన్నారు. త్వరలో మీడియా ఫెసిలిటీ సెంటర్ శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే అన్ని కార్యక్రమాలను పత్రికలు, మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడానికి గంగా, గౌరి సదన్‌లోని ఒక దానిలో మీడియా ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెచ్డీ కెమెరాలను కూడా కొనుగోలు చేయాలని, అలాగే చిన్నపాటి స్టూడియో ఏర్పాటుపై కూడా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కేజీబీవీల్లోవసతులు కల్పించాలి
–విద్యార్థులకు మంచి బోధన కల్పించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదే –తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయెుద్దు –కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పాల్గొన్న అధికారులు నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 46 కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో కొన్నింటికీ తలుపులు, కిటికీలు సరిగా లేవన్నారు. వెంటనే వాటిని బిగించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్పెషల్ ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ఆశ్రమ పాఠశాలల్లో చేర్చిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదేనన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తుందని, దాని ప్రతిఫలంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లయితే గెస్ట్ టీచర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, ప్రహరీలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఈఓ చంద్రమోహన్, సర్వశిక్షా అభియాన్ పీడీ కిరణ్‌కుమార్, కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గణపతి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
భద్రాచలం : పవిత్ర గోదావరి నదిలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం భద్రాచలం ఇన్చార్జ్ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ రాజీవ్ పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తులకు, వారి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని; ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాంపు వద్ద లాంచీలలో గణేష్ విగ్రహాలను ఒకదాని తరువాత ఒకటి వచ్చేలా చూడాలన్నారు. అందుకు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులకు సహకరించాలని కోరారు. గోదావరి నది పెరిగినా, తగ్గినా తదనుగుణంగా అధికారులు నిమజ్జనాన్ని సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాంప్ వద్ద గోదావరికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని దేవస్థానం, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో తగినంతమంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కరకట్టపై వాహనాలు వచ్చే రూట్లలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతమున్న రెండు లాంచీలకు అదనంగా 8వ తేదీన ఒకటి, 12వ తేదీన మరొకటి తెప్పించి నిమజ్జన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. నిమజ్జన విజయవంతానికి సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్.ఆశలత, సర్పంచ్ బి.శ్వేత, దేవస్థానం డీఈ రవీందర్, ఇరిగేషన్ డీఈ, ఏఈ హెచ్‌వి.రాంప్రసాద్, వెంకన్న, ఫైర్ ఆఫీసర్ పి.సురేష్‌కుమార్, ట్రాన్స్‌కో ఏడీఈ కోక్యానాయక్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
కృష్ణ పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ అన్నారు. మంగళవారం లింగాలగట్టులోని పుష్కరఘాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. లింగాలగట్టు లోలెవల్ ఘాటులో భక్తుల కోసం మధ్యాహ్నా భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా శిబిరంలో పుష్కర భక్తులకు భోజనాన్ని వడ్డించారు. శ్రీశైలం డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలవుతున్న నీటిని నిలుపుదల చేయించి లింగాలఘాటు దిగువఘాటును సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ దగ్గరుండి సిబ్బంది చేత శుభ్రం చేయించారు. – శ్రీశైలం -
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
డోన్ టౌన్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్మామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గోపినాథ్ మాల్యా అన్నారు. డోన్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని మాల్యా దంపతులు సోమవారం ప్రారంభించారు. తర్వాత నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ రైల్వే డీఈ సూరబ్ కుమార్, ఏడీఏ గౌతమ్, ఎంప్లాయీస్ సంఘం కార్యదర్శి ఖాజా, రైల్వే సిబ్బంది శశిధర్, మల్లిఖార్జున, దామోదర్,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వసతులు లేవని ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టు : కృష్ణా పుష్కరాలలో 12 రోజులపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు శ్రీశైలం చేరుకున్న పారా మెడికల్ సిబ్బందికి వసతిని కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 150 మంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది లింగాలగట్టు, పాతాళగంగ, శ్రీశైలం,సున్నిపెంట ఇతర ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుఝాము నుంచి విధులకు హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి గురువారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. పారా మెడికల్ సిబ్బందికి వసతిని కేటాయించకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. -
భక్తుల చేత శభాష్ అనిపించుకుందాం
– మెరుగైన సౌకర్యాలు కల్పించండి – 24గంటలు కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో.... – పుష్కర విధులు నిర్వహించడం మహాపుణ్యకార్యం – డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి శ్రీశైలం: భక్తుల చేత శభాష్ అనిపించుకునేలా శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణా పుష్కరాలను అధికారులు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పుష్కరఘాట్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఈఓ భరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులతో కలిసి పాతాళగంగ ఘాట్లను పరిశీలించారు. అనంతరం చంద్రావతి కల్యాణ మండపంలో పుష్కర విధులపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుని పుష్కరాల ఆరంభానికి శుభసూచకంగా కృష్ణమ్మ సంకేతాన్ని పంపిందని అన్నారు. ప్రత్యేక విధులపై హాజరైన ప్రతి ఒక్కఅధికారి తమకు కేటాయించిన విధులను సక్రమంగా అమలు పరిచి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గత కొన్ని వారాలుగా జిల్లా కలెక్టర్ పుష్కరాల విధుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా పని చేయాలి, అనే విషయాలను విశదీకరించి ఉంటారని అన్నారు. అలాగే డీఐజీ, ఎస్పీలు భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజెప్పి ఉంటారని ఈవిధి నిర్వహణలో ఉన్న వారంతా తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలు శ్రీశైలాన్ని కేంద్ర కార్యాలయంగా చేసుకుని విధులు నిర్వహిస్తారని చెప్పారు. కృష్ణా జలాలు రావడంతో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీలకు నీటిని వదిలే అవకాశం కలిగిందని ఇది కూడా శుభపరిణామంగా పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా నదీ పుష్కరాలలో ఈ ఏడాది శ్రీశైలం, సంగమేశ్వరంలలో విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది భక్తులకు తమ సేవలను అందించడం ద్వారా ఎంతో పుణ్యం చేసుకున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. -
పుష్కరఘాట్లలో వసతులు కల్పించాలి
రాంనగర్ : కష్ణా పుష్కర ఘాట్లలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల వద్ద మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, కల్పించడంతో పాటు ఘాట్ నుంచి నదిలోనికి వెళ్లకుండా పెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దుస్తులు మార్చుకునే గదులు, దుస్తులు తగిలించుకునేందుకు అనువుగా కొక్కాలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా తెలియజేయాలని ఆదేశించారు. పుష్కరఘాట్లలో ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తామని, పనుల్లో లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, ఘాట్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయోగమేదీ
► జిల్లాలో మొత్తం హైస్కూల్స్ 456.. ల్యాబ్స్ లేని స్కూళ్లు 250కి పైనే ► మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలు ► అవీ బూజుపట్టి పనికిరాని దుస్థితి ► పరికరాల కొనుగోలుకు నిధులివ్వని సర్కారు ► చాలని నిర్వహణ నిధులు ఏలూరు సిటీ : పాఠశాల విద్యలో వినూత్న మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. విద్యావ్యవస్థ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. పాఠ్యాంశాలను సైతం అభివృద్ధి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షా విధానంలోనూ మార్పులు తెస్తున్నారు. కృత్యాధార బోధనా పద్ధతికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ.. కృత్యాధార బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించటంలో మాత్రం సర్కారు విఫలమవుతోంది. రూపాయి కూడా విదల్చకుండానే ఫలితాలు వచ్చేయాలనే తరహాలో వ్యవహరిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఆధునిక సైన్స ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. వాటికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పరీక్షల్లో 20 మార్కులు కృత్యాధార బోధనకే కేటాయించారు. సైన్స ల్యాబ్స్ ఏర్పాటు చేయకుండా విద్యార్థుల నుంచి ఫలి తాలు ఎలా రాబడతామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. టెన్త్ విద్యార్థులకు కీలకం పదో తరగతిలో మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించి పరీక్షలు రాయాలంటే సైన్స ల్యాబ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సీసీఈ విధానంలో ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు బోధించాలంటే ప్రయోగశాలలు తప్పనిసరి. హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం వీటిని విధిగా ఏర్పాటు చేయటంతోపాటు, ప్రత్యేకంగా పీరియడ్స్ కేటాయించాల్సి ఉంది. టెన్త్ విద్యార్థులు ఫిజికల్ సైన్సలో 10 మార్కులు, బయాలాజికల్ సైన్సలో 10 మార్కులు సాధించాలంటే ల్యాబ్స్ ఉండాలి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో మొత్తం 456 హైస్కూల్స్ ఉండగా.. వాటిలో 250కి పైగా స్కూళ్లలో సైన్స ల్యాబ్‌లు లేవు. మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలున్నా బూజుపట్టి పనికిరాని దుస్థితికి చేరాయి. దీంతో తూతూమంత్రంగానే తరగతులు చెబుతున్నారు. అరకొర నిధులు ఇవ్వటంతో పూర్తిస్థాయిలో సైన్స ల్యాబ్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. టెస్ట్ట్యూబ్స్, బీకర్లు, రసాయనాలు, కుంభాకార కటకాలు, పుటాకార కటకాలు, మైక్రోస్కోప్, నీటి సౌకర్యం, రసాయనాలు మండించేందుకు గ్యాస్, గాలి వెలుతురు ఉండే తరగతి గదులు ఇలా ప్రత్యేకంగా ఉండాలి. సైన్స ల్యాబ్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలంటే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష వరకూ వెచ్చించాల్సి ఉంది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు దేనికి ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా కొంతమేర నిధులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను నిర్వహణ గ్రాంట్‌గా విదుదల చేస్తున్నారు. ఇందులోనూ సైన్స ల్యాబ్‌కు ఇచ్చేది అతి స్వల్పమే. లైబ్రరీ, ల్యాబ్ నిర్వహణకు రూ.10వేలు, తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యానికి రూ.10 వేలు, పాఠశాలలో ఏవైనా మరమ్మతులు చేసేందుకు రూ.10వేలు, పారిశుధ్యం, కంప్యూటర్స్ రూ.15వేలు, ఇతర ఖర్చులకు రూ.5 వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. -
ఇలా ఇంకెన్నాళ్లు..?
ఏటా కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో కానరాని వసతులు ► 6,974 స్కూళ్లలో తాగునీటికి తంటాలు ► 17,332 పాఠశాలలకు నీటి వసతి కరువు ► 11,206 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు ► 11,937 స్కూళ్లలో కానరాని ఆట స్థలాలు ► 3,181 విద్యుత్ సరఫరా లేని స్కూళ్లు టాయిలెట్లు, మరుగుదొడ్లు, తాగునీరు,తరగతి గదుల్లేక విద్యార్థుల అవస్థలు 2 వేల స్కూళ్లలో బాలికలకు, 5 వేల స్కూళ్లలో బాలురకు టాయిలెట్లు లేవు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ఈ ఫొటోలే నిదర్శనం. ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. కోర్టులు కొరడా ఝళిపిస్తున్నా సర్కారీ బడుల పరిస్థితి మారడం లేదు. ఏళ్లుగా అదే దుస్థితి. తాగునీరు, టాయిలెట్లు, తరగతి గదులు వంటి కనీస వసతులు కరువై ప్రభుత్వ స్కూళ్లు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. అధికారులు కాగితాలపై అన్నీ ఉన్నట్టు చూపుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లేదు. గోడలు కనిపిస్తే మరుగుదొడ్లు ఉన్నట్టేనని, నల్లా కనిపిస్తే నీళ్లొచ్చినా రాకున్నా మంచినీటి వసతి ఉన్నట్టేనని అధికారులు రికార్డుల్లో రాసేస్తున్నారు. ఫలితంగా అధికారిక లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే ఉండడం లేదు. అనేక స్కూళ్లలో పిల్లలకు చెట్ల పొదలు, రోడ్డు పక్కన గోడలే టాయిలెట్లుగా మారుతున్నాయి! ఒంటికి, రెంటికి సౌకర్యం లేని పాఠశాలల్లో బాలికల కష్టాలైతే చెప్పనలవి కాదు. కేవలం సౌకర్యాలు లే కపోవడం వల్లే ఎందరో బాలికలు చదువులకు మధ్యలో స్వస్తి చెబుతున్నారు. వందల మంది చదువుతున్నా టాయిలెట్లు లే ని స్కూళ్లు ఎన్నో దర్శనమిస్తున్నాయి. టాయిలెట్లు ఉన్నా నిర్వహణ లేక కంపుకొట్టేవే అధికంగా ఉన్నాయి. చాలాచోట్లా విద్యార్థులకు గుక్కెడు మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. అరకొర తరగతి గదులతో వరండాలు, చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. భవనాలు లేవు.. తాగునీరు లేదు.. రాష్ట్రంలో మొత్తం 28,707 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 2,116 స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. మరో 5,742 స్కూళ్లలో బాలురకు టాయిలెట్లు లేవు. 6,685 స్కూళ్లలో కామన్ టాయిలెట్స్ లేవు. మిగతా స్కూళ్లలో సగానికిపైగా టాయిలెట్లకు నీటి వసతి లేదు. ఇక 6,974 స్కూళ్లలో తాగునీటి సదుపాయం లేదు. దీంతో ఈ స్కూళ్లలోని పిల్లలు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. మొత్తంగా తాగునీటికి, టాయిలెట్లకు నీటి వసతి కల్పించాల్సిన పాఠశాలలు 17,332 ఉన్నాయి. 3,500 స్కూళ్లకు భవనాలు, అదనపు తరగతులు లేకపోవడంతో చెట్ల కింద, అద్దె భవనాల్లో పిల్లలకు చదువులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్న భోజనం సంగతి సరేసరి. వంట సామగ్రిని దాచేందుకు, వాటిలో చెత్తాచెదారం పడకుండా జాగ్రత్తగా ఉంచేందుకు కిచెన్ షెడ్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ 11,206 స్కూళ్లకు కిచెన్ షెడ్లు లేవు. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. కొన్నిచోట్ల వానొస్తే ఆ రోజు వంటకు చేయకపోవడంతో పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది. గాలి, వానల వల్ల బియ్యం, నూనెల్లో చెత్తాచెదారం పడుతుండటంతో అవి కలుషితం అవుతున్నాయి. 3,181 స్కూళ్లకు వెలుగు లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు (ఐసీటీ) ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే రాష్ట్రంలో 3,181 స్కూళ్లకు విద్యుత్ కనెక్షన్లే లేవు. ఇక విద్యుత్ కనెక్షన్లు ఉన్న మరో 5 వేల స్కూళ్లలో బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ పాఠశాలల్లో విద్యుత్ వెలుగులు లేవు.. కంప్యూటర్ చదువులూ లేవు! క్రీడలకు ప్రాధాన్యం ఏదీ? విద్యార్థిలో శారీరక ఎదుగుదలతోపాటు ఆత్మస్థైరానికి దోహదం చేసేవి క్రీడలు. అయినా ఆట స్థలాలు లేక క్రీడలకు పోత్సాహం కరువైంది. రాష్ట్రంలోని 11,937 స్కూళ్లలో ఆట స్థలాలు లేవు. ఫలితంగా ఆ స్కూళ్లలో పిల్లలు ఆటపాటలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కొరత ఇదీ.. సదుపాయం స్కూళ్లు బాలుర టాయిలెట్స్ లేనివి 5,742 బాలికల టాయిలెట్స్ లేనివి 2,116 కామన్ టాయిలెట్లు లేనివి 6,685 భవనాలు, అదనపు తరగతులు లేనివి 3,500 నీటి సదుపాయం లేనివి 17,332 విద్యుత్ సరఫరా లేనివి 3,181 కిచెన్ షెడ్లు లేనివి 11,206 ఆట స్థలాలు లేనివి 11,937 ప్రహరీ గోడలు లేనివి 12,435 జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలోని ఓ తరగతి దుస్థితి ఇది. పైకప్పు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరింది. 2015-16 విద్యా సంవత్సరం అంతా విద్యార్థులు ఈ గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చొని చదువుకున్నారు. ఇప్పటికే పరిస్థితి అలాగే ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఇది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇందులో 109 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. ఐదు తరగతులకు నాలుగు గదులే ఉన్నాయి. అందులో ఒకటి కూలిపోయిన గదిలోనే పాఠాలు చెబుతున్నారు. మరో రెండు తరగతుల విద్యార్థులు అరుబయటే కూర్చుంటారు. పాఠశాలలో బాలికలకు మాత్రమే మూత్రశాలలు ఉన్నా వాటి నిర్వహణ అధ్వానంగా మారింది. బాలురు మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్తున్నారు. తాగునీటి సదుపాయం కూడా లేదు. వంటగది లేక మధ్యాహ్న భోజనం నిర్వాహకులు నానాపాట్లు పడుతున్నారు. వరంగల్ జిల్లా జనగామ పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి దుస్థితి ఇది. ఈ పాఠశాలలో దాదాపు అన్ని గదులు ఇలానే ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో పాఠశాల గది పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఒక విద్యార్థి, టీచర్ గాయపడ్డారు. ఆ రోజు నుంచి ఆ గదిలో పాఠాలు బోధించడం లేదు. గదులకు ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.