కృష్ణా పుష్కరాలలో 12 రోజులపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు శ్రీశైలం చేరుకున్న పారా మెడికల్ సిబ్బందికి వసతిని కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
వసతులు లేవని ఆందోళన
Aug 12 2016 12:38 AM | Updated on Sep 4 2017 8:52 AM
శ్రీశైలం ప్రాజెక్టు : కృష్ణా పుష్కరాలలో 12 రోజులపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు శ్రీశైలం చేరుకున్న పారా మెడికల్ సిబ్బందికి వసతిని కల్పించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 150 మంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది లింగాలగట్టు, పాతాళగంగ, శ్రీశైలం,సున్నిపెంట ఇతర ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుఝాము నుంచి విధులకు హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి గురువారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. పారా మెడికల్ సిబ్బందికి వసతిని కేటాయించకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు ఆందోళనలకు దిగారు.
Advertisement
Advertisement