శభాష్.. బాగా పని చేశారు
శభాష్.. బాగా పని చేశారు
Published Thu, Aug 25 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
– జిల్లా అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
– పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ 26న సెలవు
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సహా జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు డీఐజీ రమణకుమార్, జిల్లా కలెక్టర్, జేసీ పలువురు అధికారులు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రాష్ట్రంలో 170 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా.. సంగమేశ్వరం ఘాట్ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి.. కలెక్టర్, జేసీలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధికారులంతా పుష్కరాలకు రెండు రోజుల ముందు నుంచే రేయింబవళ్లు శ్రమించడంతో పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ ఈనెల 26న సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి నుంచి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకష్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్‌లు వెంకటేశం, మల్లికార్జున తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement