congratulations
-
భారత్ జట్టుకు అభినందనలు తెలుపుతున్న సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు
-
పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
హైదరాబాద్: తెలుగువారికి పద్మ అవార్డులు ప్రకటించడంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజం డాక్టరు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, నందమూరి బాలకృష్ణకు అవార్డులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి వైద్యరంగంలో, కళారంగంలో నందమూరి బాలకృష్ణ సేవలకు తగిన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం సంతోషమని ఓ ప్రకటనలో కేతిరెడ్డి అభినందనలు తెలిపారు. -
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
షూటర్ మను భాకర్ కు జగన్ అభినందనలు
-
భారత క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
-
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్‌కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
ఎన్నికల అధికారులకు అభినందనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేసినందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూత్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల్లో తమ కార్యాలయానికి నివేదికలు పంపాలని కోరారు. అన్ని జిల్లాల నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓటర్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందని చెప్పారు. ఈ జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేంతవరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందన్నారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారాయన. My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater… — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్ సర్ప్రైజ్గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ప్రధాని మంత్రి నరేద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తాడని తాను హామీ ఇస్తున్నానని’ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula — Narendra Modi (@narendramodi) December 7, 2023 ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. -
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండ పొలం) అవార్డు గెలుచుకోవటం సంతోషమని సీఎం అన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సాధించారు. చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ The Telugu Flag flies high at the 69th National Film Awards! My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa. Kudos and congratulations to @ssrajamouli garu and… — YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2023 -
నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు. చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి -
కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. చిరంజీవి ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: విశ్వవేదికపై సత్తా చాటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు. కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్‌రక్షిత్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్‌కు అభినందనలు తెలిపారు. అలాగే సునాక్ పదవీ కాలంలో భారత్‌తో బ్రిటన్ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ప్రధాని రిషి సునాక్‌ని అభినందిస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ...బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు సంతోషిస్తున్నాను. ఇది భారత్‌కి ఎంతగానో గర్వకారణం. అలాగే భారత్ బ్రిటన్ సంబంధాలు ఎంత ప్రత్యేకమైనవి. అవి మీ హయాంలో మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాను అని అన్నారు. ఏదిఏమైన బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవ్వడం అనేది చారిత్రాత్మకమైన ఘట్టం. (చదవండి: డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర) -
పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకున్న సింధును సీఎం జగన్ కొనియాడారు. ఆమె ఘనత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై పీవీ సింధు గెలుపొందింది. వాంగ్ జి యిపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, సింధుకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్లను గెలుచుకుంది. ఆమెకు ఇది సింగపూర్ ఓపెన్ తొలి టైటిల్. చదవండి: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..! -
పారాలింపిక్స్ పతకధారులకు ఏపీ సీఎం అభినందనలు
అమరావతి: టోక్యో పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు భవీనాబెన్(మహిళల టేబుల్ టెన్నిస్‌లో రజతం), నిషద్ కూమార్(పురుషుల హై జంప్‌లో రజతం), వినోద్ కూమార్(పురుషుల డిస్కస్ త్రోలో కాంస్యం)లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వీరు సాధించిన పతకాలు దేశం యావత్తుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
పోలీసులే భయపడేంతగా కొట్టేసింది!
ఏకనాథ్ పోర్టే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్. కల్బాదేవి ప్రాంతంలోని శుర్తీ హోటల్ జంక్షన్(ముంబై) దగ్గర డ్యూటీలో ఉన్నాడు. (ఈ ప్లేస్‌ను గుర్తుపెట్టుకోండి). టూ వీలర్ వెనుక హెల్మెట్ లేకుండా వెళుతున్న ఒక మహిళను ఆపాడు. మారిన నిబంధనల ప్రకారం బైక్ వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. లేదంటే ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టమని అడిగే టైమ్ కూడా ఆ మహిళ ఏకనాథ్కి ఇవ్వలేదు. ‘హెల్మెట్ పెట్టుకోకపోతే నీకేమైంది?’ అని.. మీద పడి కొట్టేసింది. అతడి చొక్కా చింపేసింది. చట్టం పేజీలు చిరిగిపోయినట్లుగా చిరిగిపోయాడు కానిస్టేబుల్ ఏకనాథ్. పోలీసులే భయపడేంతగా కొట్టేసింది! ఆమె పేరు సాత్విక (30). బండి నడుపుతున్న అతని పేరు మొహిసిన్ షేక్. కానిస్టేబుల్ని ఆమె కొడుతుంటే అడ్డు చెప్పకపోగా ఫోన్లో రికార్డ్ చేశాడు షేక్ గారు. ఆమె అంత చెయ్యి చేసుకుంటున్నా ఏకనాథ్ నోరెత్తలేదు. దెబ్బలు తింటూనే ‘మేడమ్’ అని ఆమెకు, ‘సర్’ అని అతడికి.. హెల్మెట్ ఎందుకు తప్పనిసరో చెబుతున్నాడు. తర్వాత వాళ్లిద్దరూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేంతగా ఆమె ఏకనాథ్ని ‘అసాల్ట్’ చేసింది. ఆమె అతడిని కొట్టడం శుర్తీ హోటల్ జంక్షన్ దగ్గర ముంబై నగర పౌరులు గుమికూడి చూశారు. పరువు పోయిందని అనుకోలేదు ఏకనాథ్. డ్యూటీ పరువు నిలబెట్టానని అనుకున్నాడు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అయింది. నిన్న ఏకనాథ్ మళ్లీ అదే జంక్షన్లో డ్యూటీ చేస్తున్నారు. అక్కడికి కొలాబా డివిజనల్ ఎ.సి.పి లతా ఢాండే వచ్చారు. కారు దిగి నేరుగా ఏకనాథ్ దగ్గరికి వెళ్లారు. అతడు దెబ్బలు తిన్న సేమ్ స్పాట్ లో నిలుచోమని చెప్పి, అందరూ చూస్తుండగా అతడికి పూలగుచ్ఛం అందించారు. భుజాల చుట్టూ శాలువా కప్పారు. అభినందనలు తెలిపారు. సాత్విక అనే ఆ పౌర మహిళ ఎంత రూడ్ గా ప్రవర్తించినప్పటికీ ఏకనాథ్ సహనం కోల్పోకుండా ఉన్నందుకు అతడికి దక్కిన గౌరవం అది. దెబ్బలు తింటున్నప్పుడు ఎలా ఉన్నాడో, డిపార్ట్మెంట్ సత్కారం అందుకుంటున్నప్పుడూ అలాగే.. డ్యూటీ మైండెడ్ గా.. ఉన్నాడు ఏకనాథ్! చదవండి: నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు -
'మా క్రేజీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం'
నూతన సంవత్సరం రోజున టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హార్దిక్, నటాషాలు దుబాయ్‌లో స్పీడ్ బోట్లో విహరిస్తూ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా నిశ్చితార్థంపై ట్విటర్లో స్పందించాడు. ' మొదట హార్దిక్, నటాషాలకు నా బిగ్ కంగ్రాట్స్. నటాషా మీకు మా కుటుంబంలోకి స్వాగతం. నటాషా నీవు మా క్రేజీ ఫ్యామిలీతో కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టూ మ్యాడ్నెస్.. లవ్ బోత్ ఆఫ్ యూ గాయ్స్' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కృనాల్ దంపతులతో పాటు హార్దిక్, నటాషాలున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు. అంతకుముందు కోహ్లి దంపతులు, ధోని దంపతులు, టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు హార్దిక్, నటాషాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపడుతూ బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. రానున్న శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు కూడా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఎంపిక చేయలేదు. కానీ న్యూజిలాండ్ టూర్లో ఆడనున్న ఇండియా-ఏకు మాత్రం హార్దిక్ పాండ్యా పేరును బీసీసీఐ ప్రకటించింది. (చదవండి : సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం) Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42 — Krunal Pandya (@krunalpandya24) January 2, 2020 -
‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 4 వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది. 23 భారతీయ భాషలలో జ్యూరీ సభ్యులు సిఫారసు చేసిన రచనలను అకాడెమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదించి అవార్డులను ప్రకటించింది. తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్ వి.చినవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. బండి నారాయణస్వామి రాయలసీమ రచయితగా గుర్తింపు పొందారు. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా, గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు అకాడెమీ యువ పురస్కార్ లభించింది. ‘తాత మాట వరాల మూట’రచనకు గాను బెలగం భీమేశ్వరరావుకు అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కారం’ప్రకటించింది. ధరూర్ పుస్తకం, నంది కిశోర్ కవిత కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య తదితర 23 మంది రచయితలున్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు వచ్చే ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆయన చేసిన రచనలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు. -
యంగ్ సీఎం జగననన్నకు అభినందనలు
-
దేశం గర్వపడేలా చేశారు..!
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు అభినందనలు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు. బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు. రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్ వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు. ‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు. -
కొత్తగా ఎంపికైన ఎంపీలకు అభినందనలు
ఢిల్లీ: కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో కొందరు మళ్లీ ఎంపికయ్యారని అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సభలో పలు రంగాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సభను హుందాగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..విశ్రాం జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ ఛైర్మన్‌గా కురియన్ సేవలు మరువలేనివన్నారు. ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు మరోసారి అభినందనలు చెప్పారు. -
యువభారత్‌పై ప్రశంసల జల్లు
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువభారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ గర్వించదగ్గ సమయమిదని రాజకీయ ప్రముఖుల, క్రికెటర్లు,సినీతారాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. కుర్రాళ్ల విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యువ క్రికెటర్లు సాధించిన ఈ అద్భుత విజయానికి ఎంతో థ్రిల్లయ్యాను. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అభినందనలు. ఈ గెలుపుతో ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాడు- ప్రధాని నరేంద్ర మోదీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత్‌కు అభినందనులు. ఈ తరం క్రికెటర్లు అందించిన ఈ విజయంతో దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీలవుతున్నారు- రాహుల్ గాంధీ కోచ్ ద్రవిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన అండర్-19 భారత జట్టుకు అభినందనలు.- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండర్-19 ప్రపంచకప్ విజేతగా నాలుగోసారి నిలిచిన భారత్‌కు అభినందనలు. ఈ క్రెడిట్ అంతా కుర్రాళ్లతో పాటు నా ఆల్‌టైం ఫేవరెట్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌దే- కేటీఆర్ గొప్ప టీమ్ వర్క్‌తో మీ కలను సాకారం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లకు కంగ్రాట్స్. మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. రాహుల్ ద్రవిడ్‌కు అభినందనలు- సచిన్ టెండూల్కర్ ఈ కుర్రాళ్లు రాహుల్ ద్రవిడ్ సురక్షితమైన చేతుల్లో పడ్డారు. భారత క్రికెట్ భవిష్యత్ కోసం గొప్ప కృషి. మనమంతా గొప్ప నైపుణ్యమున్న భవిష్యత్ ఆటగాళ్లను కలిగిఉన్నాం- వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచకప్ గెలిచిన యువ భారత ఆటగాళ్లకు అభినందనలు. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చారు- అనిల్ కుంబ్లే అద్భుత ప్రదర్శనతో మన దేశానికి మరో ఘనతను అందజేశారు. ఈ క్షణాలను బాగా ఆస్వాదించండి- రవిశాస్త్రి అండర్-19 జట్టుకు మరో అద్భుత విజయం. దీన్ని పునాదిగా చేసుకుని భవిష్యత్తులో రాణించండి. ఈ మూమెంట్‌ను బాగా ఆస్వాదించండి- విరాట్ కోహ్లీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కంగ్రాట్స్. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సమిష్టిగా రాణించి విజయం సాధించింది- యువరాజ్ సింగ్ ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 జట్టుకు శుభాకాంక్షలు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారు - టాలీవుడ్ హీరో వెంకటేశ్ యావత్తు భారత దేశం గర్వించదగ్గ సమయమిది. భారత అండర్-19 జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. యంగ్ హీరోస్‌కు నా కంగ్రాట్స్- మహేశ్ బాబు నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కంగ్రాట్స్. సీనియర్, జూనియర్ జట్లు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాయి- ఎస్.ఎస్.రాజమౌళి -
ఈటలకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరై తిరిగి వచ్చిన మంత్రి ఈటల, శనివారం సీఎం కేసీఆర్‌ను కలసిన సందర్భంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై పన్ను వద్దని, ప్రభుత్వమే ప్రభుత్వం మీద పన్ను వేయడం ఏమిటని జీఎస్టీ సమావేశంలో ఈటల ప్రశ్నించారు. మిషన్ భగీరథ, నీటిపారుదల పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల పనులపై 18 శాతం పన్ను విధించడంపై ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను తగ్గించే వరకు పట్టుబట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై ఈటల ఒత్తిడి తీసుకొచ్చారని మంత్రి కార్యాలయం తెలిపింది. మంత్రి ఈటల ఒత్తిడికి దిగివచ్చిన జీఎస్టీ కౌన్సిల్.. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులపై పన్నును 5 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం పట్ల ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ సాధించిన విజయమిది అన్నారు. ఇప్పటి వరకు 22 జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరగగా, 20 సమావేశాల్లో ఈటల పాల్గొని వాదనలు వినిపించారు. వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులపై పన్నులు వేయవద్దని, పేద ప్రజలు వినియోగించే వస్తువులపై తక్కువ పన్నులు ఉండాలని ఈటల లేవనెత్తిన వాదనలకు మిగతా రాష్ట్రాలు కూడా మద్దతు తెలిపాయి. -
కొత్త మంత్రులకు వైఎస్ఆర్ సీపీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలియచేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఢిల్లీలో వారిని కలుసుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్ కుమార్ సింగ్, అల్ఫాన్స్, వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, గజేంద్రసింగ్ షేఖావత్, సత్యపాల్ సింగ్,శివ ప్రతాప్ శుక్,అశ్వినికుమార్ చౌబే తదితరులను విజయసాయి రెడ్డి కలిశారు. దేశ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలకు వైఎస్ఆర్ సీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అభినందించటానికి మీరెంత దూరం?
సెల్ఫ్ చెక్ ఆటల్లో గెలిచినవారు, చదువులో ర్యాంకులు సాధించినవారు, సమాజం కోసం కష్టపడి పనిచేసేవారు... ఎవరైనా ఒక మంచిపని చేసినా లేదా ఏదైనా సాధించినా కోరుకొనేది చిన్నపాటి అభినందన. ఇది లభించినప్పుడు వారు పడిన శ్రమనంతా మరచిపోతారు. అభినందించే తత్వం ఉండాలంటే ప్రేమ ఉండాలి. అసూయద్వేషాలకు దూరంగా ఉండాలి. ఇతరులను అభినందించాలంటే మీ అహం మీకు అడ్డుగా ఉందేమో ఒకసారి పరిశీలించుకోండి. 1. ఎవరైనా మంచిపని చేసినప్పుడు తప్పకుండా అభినందిస్తారు. ఎ. కాదు బి. అవును 2. మీ అభినందనలు ఎవరికైనా తెలియచే యలేకపోతే, అంతటితో వదిలేయరు. ఎంతకాలం గడిచినా ఎప్పటికైనా వారితో మీ మనసులోని మాటను చెబుతారు. ఎ. కాదు బి. అవును 3. మనిషి కోర్కెలకు అంతం ఉండదని మీకు తెలుసు. మీ కోర్కెలను అదుపులో పెట్టుకుంటారు. ఇతరులనుంచి ఏదీ ఆశించరు. ఎ. కాదు బి. అవును 4. ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేరు. వారు అలా ఎందుకు అభివృద్ధి చెందాలి? అని ఆలోచిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. ఆనందం విలువ మీకు తెలుసు. అందుకే ఇతరులు ఏదైనా సాధించినప్పుడు మీ అభినందనల ద్వారా వారికీ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 6. మీకు లభించే ప్రతివస్తువు (విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లికేషన్స్, ప్రకృతి ద్వారా లభించేవి మొదలైనవి)ను గౌరవిస్తారు. వాటిద్వారా లభించే సౌకర్యాలను అప్రిషియేట్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 7. మీరు సాధించలేని వాటి కారణాలను విశ్లేషిస్తారేకాని, వాటిగురించి ఆందోళన చెందరు. మీరు సాధించిన దానికి మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. మీ దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎదుటివారి స్కిల్స్‌ను బయటపెట్టడానికి ట్రై చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 9. ఇతరుల తప్పొప్పులను ఎంచటమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటివారు ఎంత గొప్పపని చేసినా అది మీ దృష్టిలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇతరుల మనసు గాయపరచటం మీకలవాటు. ఎ. అవును బి. కాదు 10. ఆత్మతృప్తి మీకుంటుంది. గడచిన జీవితం ఆనందంగానే సాగిందని నమ్ముతారు. మీకు సహాయంగా నిలిచిన అందరికీ మనసులో కృతజ్ఞతలు తెలుపుతారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో అభినందించే తత్వం బాగా ఉంటుంది. స్వార్థంతో ఉండకుండా ఏదైనా సాధించిన వారిని అప్రిషియేట్ చేయగలరు. దీనివల్ల నలుగురితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు సంతృప్తి మిగులుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే ఇతరులను అభినందించాలంటే మీకసలు నచ్చదు. అందరినీ అభినందించటం తెలుసుకోండి. చిన్న ప్రశంస గొప్ప ఆనందాన్నిస్తుంది. -
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య గర్వకారణం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండటం మొత్తం తెలుగు ప్రాంతానికే గర్వకారణం అని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగాలనే ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుందని చెప్పారు. శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణగాంధీకి 244 ఓట్లు రాగా మొత్తం 272 ఓట్ల మెజార్టీతో వెంకయ్యనాయుడు గెలుపొందారు. మరోపక్క, విజయం సాధించిన వెంకయ్యకు గోపాలకృష్ణ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భారత జాతి నిర్మాణంలో వెంకయ్యనాయుడు చాలా అంకితభావంతో పనిచేస్తారని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని పేర్కొంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంకయ్యపై అభినందనల వర్షం కురిపించారు. -
హర్మన్ ప్రీత్ పై ప్రశంసల జల్లు..
హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 20 ఫోర్లు 7 సిక్సులతో 171 నాటౌట్‌గా కెరీర్లో కౌర్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. సింగిల్ హ్యాండ్ ప్రదర్శనపై భారత క్రికెటర్లు, అభిమానులు ఈ వైస్ కెప్టెన్‌ను సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. భారత కెప్టెన్ కోహ్లీ ‘వాట్ ఏ ఇన్నింగ్స్ కౌర్.. బౌలర్ల ప్రదర్శన అద్భుతమని’ ట్వీట్ చేయగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అద్బుతమైన బ్యాటింగ్ కౌర్.. విజయం దిశగా పయనించండి అని ట్వీట్ చేశాడు. సింగిల్ హ్యాండ్‌తో గెలిపించే మ్యాచ్‌లు చూసి చాల రోజులైందని సంజయ మంజ్రేకర్ కౌర్ ప్రదర్శనను కొనియాడాడు. ఇక ట్వీటర్ వీరుడు.. సెహ్వాగ్ కౌర్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్.. అద్భుతమైన హిట్టింగ్ అంటూ ట్వీట్ చేశాడు. కౌర్ రాక్ స్టార్ అని భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రీ.. ప్రశంసించగా.. మహిళల ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అని కైఫ్ కౌర్‌ను కొనియాడాడు. భారత క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సురైశ్ రైనా, శిఖర్ ధావన్‌లు కౌర్‌ను మిథాలీసేనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అభిమానులు కౌర్‌కు, భారత మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ తమ అభిమానాని చాటుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్లో భారత మహిళలు విజయం సాధించి ప్రపంచ కప్ సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్‌గా దీప్తిశర్మ(188 నాటౌట్) తర్వాత కౌర్ నిలిచింది. దీప్తీ దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించింది. What an innings by @ImHarmanpreet and a brilliant effort by the bowlers also so far.. #INDvAUS @BCCIWomen #ICCWomensWorldCup2017 — Virat Kohli (@imVkohli) 20 July 2017 Brilliant finish by the #WomenInBlue! The pic says it all! Here we come Lord's! My best wishes for the final against England #AUSvIND #WWC17 pic.twitter.com/WPNLsLFhuE — sachin tendulkar (@sachin_rt) 20 July 2017 GREAT NEWS- Amar Bela Je Jaye my first Rabindra Sangeet album is up online. Click the link to listen and buy.https://t.co/WD9gSJsbcd — Sanjay Manjrekar (@sanjaymanjrekar) 6 October 2016 An Innings of a lifetime , Harmanpreet Kaur . What wonderful clean hitting. More than 60% of India's runs. Fan ! Over to the Bowlers now. pic.twitter.com/xZlIB2SW4x — Virender Sehwag (@virendersehwag) 20 July 2017 -
ట్వీటర్లో పోటెత్తిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకి ట్వీటర్లో శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. చాలా ఏళ్లుగా వెంకయ్యనాయుడు తనకు తెలుసని, ఆయన ఉప రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీటర్లో పోస్టు చేశారు. వెంకయ్య అనుభవం క్రీయాశీలకం కానుందని అన్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవానికి పట్టమిదీ అని రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్వీట్ చేశారు. రైతు బిడ్డకు దక్కిన గౌరవమిది అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెంకయ్యను అభినందిస్తూ ట్వీటారు. వెంకయ్యకున్న నాయకత్వ లక్షణాలే ఆయన్ను ఉప రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవికి దగ్గర చేశాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. -
అవార్డు గ్రహీతలకు కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మెర్సీ మార్గరేట్, వాసాల నర్సయ్యను ఆయన ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 ప్రకటించిన యువ రచయితలకు తెలుగులో ”మాటల మడుగు” పద్య సాహిత్యం రాసిన మెర్సీ మార్గరేట్ ఎంపిక అయ్యారు. అలాగే పాటు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారానికి ఎన్నికైన విషయం విదితమే. పురస్కార విజేతలు... రాగి ఫలకం, ప్రశంసా పత్రం, రూ.50వేల నగదు అందుకోనున్నారు. మొత్తం 24 భాషల్లో 35 ఏళ్ల లోపు యువ రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. నవంబర్ 14న విజేతలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను అందజేయనుంది. -
ప్రతిభావంత విద్యార్థినికి అభినందనలు
అనంతపురం రూరల్ : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థిని బి. కళావతిని ఆ కళాశాల చైర్మ¯న్ పల్లె రఘునాథరెడ్డి అభినందించారు. ఈ విద్యార్థిని జైలు వార్డెన్, స్టాఫ్ సెలెక్షన్, పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ ఎస్సై, సివిల్ ఎస్సై పోస్టులను సాధించింది. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని పలువురు అభినందించారు. పల్లె మాట్లాడుతూ కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందన్నారు. ఇందుకు ఈ విద్యార్థినే నిదర్శనమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌కు మోదీ అభినందన
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మేక్రన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ’ భవిష్యత్‌లో ఫ్రాన్స్-భారత్‌ల మధ్య బంధం మరింత బలపడుతుందని తాను నమ్ముతున్నట్లు’ ఆయన ఈ సందర్భంగా ట్విట్ చేశారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడి ఎన్నికల్లో మేక్రాన్‌తో పాటు మరీన్ లీ పెన్లు పోటీ పడిన విషయం తెలిసిందే. మాక్రన్‌కు 66.06 శాతం, లీ పెన్కు 33.9 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో లీ పెన్‌పై ఆది నుంచి ఆధిక్యంలో ఉన్న మేక్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీంతో 39 ఏళ్ల మేక్రానే ఫ్రాన్స్ అధ్యక్షుల్లో పిన్న వయస్కులు కావడం విశేషం. యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆయన ఎన్ మార్చ్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్మిక చట్టాలను సరళీకరించడం, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను పెంచడం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రక్షణ కల్పించడం అనే హామీలతో మేక్రాన్ ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు బ్రిటిన్ ప్రధాని థెరిస్సా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నేతలు నుంచి మేక్రాన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, కెనడా ప్రధానితో పాటు, హిల్లరీ క్లింటన్ కూడా మెక్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ
హైదరాబాద్ : ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ కైవసం చేసుకున్న భారత నంబర్‌వన్ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఆమెను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు అభినందిస్తున్నారు. సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షలు తెలిపారు. సింధును అభినందించినవారిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్, ఒడిశా ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ తదితరులు ఉన్నారు. అలాగే క్రికెటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, శరద్ పవార్, రాజ్యసభ ఎంపీ విజయ్ గోయిల్,హీరోయిన్లు అనుష్క శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సింధూకు శుభాకాంక్షలుత తెలిపారు. కాగా మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై గెలిచిన విషయం తెలిసిందే. Congratulations @Pvsindhu1 for clinching the #IndiaOpen2017 title by beating Carolina Marin. #SindhuvsMarin — Sarbananda Sonowal (@sarbanandsonwal) 2 April 2017 @Pvsindhu1 congratulationssssss champion.. ur an inspiration to many.. may ur success grow bigger by d day!! -
తెలుగు పద్మాలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఈ ఏడాది పద్మ పురస్కారలకు ఎంపికైన తెలుగు ప్రముఖులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయా రంగాల్లో వారు చేసిన అద్భుతకృషికి లభించిన గొప్ప గుర్తింపు అని అన్నారు. భవిష్యత్తులో కూడా వారు ఇలాంటివి మరిన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో విశేషంగా పనిచేసే ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేరుతో అవార్డులు ఇచ్చే విషయం తెలిసిందే. ఈసారి తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎనిమిది పద్మ అవార్డులు దక్కాయి. -
ట్రంప్‌కు ఒబామా ఫోన్.. కలుసుకోవాలని ఆహ్వానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. బుధవారం ట్రంప్‌కు ఫోన్ చేసిన ఒబామా శుభాకాంక్షలు చెప్పడంతోపాటు గురువారం శ్వేత సౌదానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడ వారిద్దరు అధికార బదిలీకి సంబంధించిన అంశాలు చర్చించుకోనున్నారు. ఫలితాలు వెల్లడైన మరుక్షణమే ఒబామా స్వయంగా తన ఇంటి నుంచి ట్రంప్‌కు ఫోన్ చేశారని, వైట్ హౌస్ కు ఆహ్వానించారని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ కెల్యాన్నే కాన్వే కూడా స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒబామా ఫోన్ చేశారని తెలిపారు. అయితే, ప్రసంగం అయిపోగానే ట్రంప్ ఆయనకు తిరిగి ఫోన్ చేశాడని, వారిద్దరి మధ్య చాలా చక్కటి సంభాషణ సాగిందని అన్నారు. వారిద్దరు రేపు కలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ఎన్నికల ఫలితాలు, రాబోయే రోజుల్లో ఒకరికొకరు కలిసి పనిచేసే విషయంలో ఒబామా ఒక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలిసింది. -
జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి
వన్‌టౌన్ : కేబీఎన్ కళాశాల విద్యార్థి పి.అరుణ్‌రెడ్డి గుజరాత్లో జరిగే అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ ఈత పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అరుణ్‌రెడ్డి అండర్–19 కేటగిరీ 50 మీటర్ల బటర్ ఫ్లై, వంద మీటర్ల మిడ్ రిలే విభాగాల్లో బంగారు పతకాలు, 50 మీటర్లు, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో రజత పతకాలు పొందాడని చెప్పారు. ఈ సందర్భంగా కాలేజీలో మంగళవారం అరుణ్‌రెడ్డిని పలువురు అభినందించారు. -
షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా
బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మీరా రాజ్‌పుత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. బుజ్జాయి రాకతో షాహిద్ సంతోషంలో మునిగిపోయాడు. తొలిసారి తల్లిదండ్రులైన షాహిద్ దంపతులకు.. సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి షాహిద్ గాళ్ ఫ్రెండ్ కరీనా కపూర్ కూడా వీరికి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. షాహిద్ తండ్రయ్యారన్న విషయం తెలిసిన వెంటనే షాహిద్‌కు అభినందనలు తెలుపుతూ కరీనా మెసేజ్ పంపించారట. ఒకప్పటి విఫల ప్రేమికులు.. వివాహానంతరం స్నేహితులుగా మారారు. కాగా మరికొన్ని నెలలలో కరీనా కూడా తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరో, కరీనా భర్త అయిన సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్లు 'రంగూన్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. -
కేసీఆర్‌కు అసదుద్దీన్ ప్రశంసలు
హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అదే సమయంలో గోదావరి నది నీళ్లు ఉపయోగించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలేవీ ఇప్పటి వరకు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చెప్పింది సత్యం అని అన్నారు. అలాగే, ప్రతీది రాజకీయం చేయడం తగదని, తెలంగాణకు నీటి పారుదల, అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. -
శభాష్.. బాగా పని చేశారు
– జిల్లా అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి – పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ 26న సెలవు కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సహా జిల్లా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు డీఐజీ రమణకుమార్, జిల్లా కలెక్టర్, జేసీ పలువురు అధికారులు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రాష్ట్రంలో 170 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా.. సంగమేశ్వరం ఘాట్ ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి.. కలెక్టర్, జేసీలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధికారులంతా పుష్కరాలకు రెండు రోజుల ముందు నుంచే రేయింబవళ్లు శ్రమించడంతో పుష్కర విధుల్లోని ఉద్యోగులందరికీ ఈనెల 26న సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి నుంచి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకష్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశం, మల్లికార్జున తదితరులు ఉన్నారు. -
వంగవీటి రాధాకు పలువురి అభినందన
కృష్ణలంక : వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షునిగా నియమితులైన వంగవీటి రాధా కృష్ణను 16వ డివిజన్ రాణిగారితోటకు చెందిన పలువురు నాయకులు రాఘవయ్య పార్కు సమీపంలోని కార్యాలయంలో గురువారం కలుసుకున్నారు. రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు. ఆయన నియామకంతో నగరంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నాయకులకు సూచించారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు తంగిరాల రామిరెడ్డి, 16 డివిజన్ నేతలు భిక్షాలరెడ్డి, కుమ్మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దీపకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మకార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. త్రిపురకు చెందని దీప ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. Congratulations and best wishes for #Rio2016 Olympics to Dipa Karmakar, our first Olympic-qualifying Indian woman gymnast. — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 April 2016 -
కోహ్లీకి మాజీ గర్ల్‌ఫ్రెండ్ అభినందనలు!
న్యూ ఢిల్లీ: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం అనుష్క శర్మ అభినందనలు తెలిపినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. గత కొంత కాలంగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ అభినందనలు.. ఈ జంట మళ్లీ ఒక్కటవ్వడానికి దోహదం చేస్తాయని అభిమానుల్లో ఆశలు రేపుతున్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే కోహ్లి ఈ మ్యాచ్‌లో భారత్‌ను ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ అర్థసెంచరీ సాధించాడు. కోహ్లీ అద్భుత ప్రదర్శనకు ఫిదా అయిన అనుష్క శర్మ అతనికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో గ్యాలరీలో అనుష్క శర్మ చేసిన సందడి.. కోహ్లీ ఫ్లైయింగ్ కిస్‌లు మళ్లీ పునరావృతమవుతాయేమో వేచి చూడాలి మరి! -
సానియా మీర్జాకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిలకడగా అత్యున్నత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఒకే ఏడాదిలో పది టైటిల్స్ గెలవడం అసాధారణ విషయమని కొనియాడారు. భవిష్యత్‌లో సానియా మీర్జా మరిన్ని టైటిల్స్ నెగ్గి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. -
'సానియాకు ప్రధాని ప్రశంసల జల్లు'
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించి టైటిల్ సాధించిన నేపథ్యంలో వారిద్దరిపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి క్రీడా ప్రతిభ దేశం గర్వించేలా ఉందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు స్పందించిన సానియా కూడా తనకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్టిట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి సానియా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. గత జులైలో హింగిస్‌తోనే కలిసి సానియా వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన సానియా-హింగిస్‌లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది. రన్నరప్ డెలాక్వా-ష్వెదోవా జోడీకి 2 లక్షల 75 వేల డాలర్లు (రూ. కోటీ 82 లక్షలు) దక్కాయి. -
సానియాకు అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: భారత్ కు తొలిసారిగా మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ సాధించిపెట్టిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై అభినందనల జల్లు కురుస్తోంది. మార్టినా హింగిస్ తో కలిసి మహిళల డబుల్స్ సాధించిన సానియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గొప్ప విజయం సాధించారని సానియాను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. వింబుల్డన్ విజయానికి తామెంతో గర్విస్తున్నామని, సంతోషపడుతున్నామని ప్రశంసించారు. సానియా సాధించిన విజయం దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ కూడా సానియా, హింగిస్ జోడికి అభినందనలు తెలిపారు. మహిళల డబుల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్ స్లామ్ గెలిచిన సానియా మిర్జాకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. Hearty congratulations @MirzaSania @mhingis on winning women's doubles in Wimbledon, @MirzaSania's achievement will inspire youth of India — President of India (@RashtrapatiBhvn) July 12, 2015 Well played @mhingis & @MirzaSania. You played wonderful tennis & registered a fantastic win at @Wimbledon. We are proud & very happy. — Narendra Modi (@narendramodi) July 12, 2015 -
‘సాక్షి’కి అభినందనల వెల్లువ
దుండగులను కెమెరాలో బంధించిన విలేకరికి నజరానాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాహసోపేత జర్నలిజానికి నిదర్శనంగా నిలుస్తూ సాయుధ దుండగులు బైక్‌పై సంచరిస్తున్న ఫొటో ‘సాక్షి’ పత్రికలో ప్రచురితంకావడం పెద్ద సంచలనమైంది. ఆదివారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, మెట్రో నగరాలు, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఫొటోపైనే చర్చ జరిగింది. ఎంతో సాహసంతో ఆ ఫొటోను వెలుగులోకి తెచ్చిన అర్వపల్లి విలేకరి శ్రీరంగం వెంకన్నకు అభినందనలు వెల్లువెత్తాయి. అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో హల్చల్ చేసింది. దాదాపు అన్ని న్యూస్ చానెళ్లూ దాన్ని ఉపయోగించుకున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, వెబ్సైట్లలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రాణాలకు తెగించి దుండగులను సజీవంగా ప్రజలకు చూపెట్టిన ‘సాక్షి’ అర్వపల్లి విలేకరి వెంకన్నకు రాష్ట్ర ప్రెస్ అకాడమీ నజరానా ప్రకటించింది. రూ. 15 వేల పారితోషికం అందించనున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. మరోవైపు వెంకన్న సాహసాన్ని గుర్తించి అతనికి రూ. 10 వేల నజరానా ఇస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్ ప్రకటించారు. -
సానియాకు రాష్ట్రపతి అభినందనలు
న్యూఢిల్లీ: డబ్యూటీఏ డబుల్స్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. మంగళవారం ఓ సందేశాన్ని విడుదల చేసిన ప్రణబ్.. సానియా సాధించిన ఘనత దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 'సింగపూర్ లో సానియా సాధించిన డబ్యూటీఏ డబుల్స్ టైటిల్ నిజంగా గర్వించదగింది. ఇంతటి ఘనతను మీ కుటుంబంతో కలిసి సెలిబ్రెట్ చేసుకోవడానికి దేశం మొత్తం సిద్ధంగా ఉంది' అని ప్రణబ్ తెలిపారు. మరిన్ని విజయాలను సానియా సాధించి దేశ కీర్తిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో కలిసి సానియా మీర్జా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో ఈ జంట తైపీ, చైనాలకు చెందిన సు వై సై, షుయ్ పెంగ్ జంటపై 6-1, 6-0 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ ను సాధించారు. -
సానియాకు ప్రధాని మోదీ అభినందనలు
డబ్ల్యుటీఏ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ సందేశం పెట్టారు. ఇది చాలా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వెంటనే సానియా కూడా ఆయనకు సమాధానం పెట్టి.. కృతజ్ఞతలు తెలిపింది. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో కలిసి సానియా మీర్జా ఈ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో ఈ జంట తైపీ, చైనాలకు చెందిన సు వై సై, షుయ్ పెంగ్ జంటపై 6-1, 6-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కారా బ్లాక్‌తో జత కట్టినప్పటినుంచి సానియ డబుల్స్ ప్రతిభ కూడా బాగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఫైనల్ మ్యాచ్‌ని సానియా - కారా జంట ముగించడం విశేషం. @narendramodi Thank you very much Sir..humbled by your wishes — Sania Mirza (@MirzaSania) October 27, 2014