సానియాకు అభినందనల వెల్లువ | President, PM congratulate Sania for Wimbledon triumph | Sakshi
Sakshi News home page

సానియాకు అభినందనల వెల్లువ

Published Sun, Jul 12 2015 11:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

సానియాకు అభినందనల వెల్లువ

సానియాకు అభినందనల వెల్లువ

న్యూఢిల్లీ: భారత్ కు తొలిసారిగా మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ సాధించిపెట్టిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై అభినందనల జల్లు కురుస్తోంది. మార్టినా హింగిస్ తో కలిసి మహిళల డబుల్స్ సాధించిన సానియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

గొప్ప విజయం సాధించారని సానియాను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. వింబుల్డన్ విజయానికి తామెంతో గర్విస్తున్నామని, సంతోషపడుతున్నామని ప్రశంసించారు. సానియా సాధించిన విజయం దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ కూడా సానియా, హింగిస్ జోడికి అభినందనలు తెలిపారు.

మహిళల డబుల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్ స్లామ్ గెలిచిన సానియా మిర్జాకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement