పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్‌ | PV Sindhu Marries Venkata Datta Sai In Udaipur, Wedding Photo Trending On Social Media | Sakshi
Sakshi News home page

PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్‌

Published Mon, Dec 23 2024 12:49 PM | Last Updated on Mon, Dec 23 2024 1:52 PM

PV Sindhu Marries Venkata Datta Sai In Udaipur 1st Pic Out Goes Viral

PV Sindhu Marries Venkatta Datta Sai: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయి(Venkatta Datta Sai)ని ఆదివారం ఆమె వివాహమాడింది. ఈ వేడుకకు సంబంధించిన తొలి ఫొటో సోమవారం బయటకు వచ్చింది.

ఫొటో షేర్‌ చేసిన కేంద్ర మంత్రి
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పీవీ సింధు- వెంకట దత్త సాయి పెళ్లి ఫొటోను షేర్‌ చేశారు. ‘ఉదయర్‌పూర్‌లో నిన్న సాయంత్రం.. మన బ్యాడ్మింటన్‌ చాంపియన్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు- వెంకట దత్త సాయి వివాహానికి హాజరుకావడం సంతోషంగా ఉంది.

నూతన దంపతులకు శుభాకాంక్షల వెల్లువ
జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్న నూతన దంపతులకు శుభాకాంక్షలతో పాటు ఆశీర్వాదాలూ అందజేశాను’’ అని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా జీవితంలోని ప్రత్యేకమైన ఘట్టంలో సింధు- వెంకట దత్త సాయి వెండి రంగు దుస్తుల్లో తళుక్కుమన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.

రాజస్తాన్‌లో పెళ్లి
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని రాజకోట వంటి వేదికపై సింధు- వెంకట దత్త సాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా వరుడు మరెవరో కాదు.. సింధుకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఇరు కుటుంబాల పెద్దల నిర్ణయం మేరకు వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్‌ జరుగనుంది.

రెండు ఒలింపిక్‌ పతకాలు
కాగా రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన తెలుగు తేజం సింధు.. టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తద్వారా భారత్‌ తరఫున వరుసగా రెండు ఎడిషన్లలో ఒలింపిక్‌ పతకాలు గెలిచిన ప్లేయర్‌గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అయితే, ఇటీవల ముగిసిన ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

ఈ వార్త చదవండి: IPL 2025: సంజూ శాంసన్‌ కీలక నిర్ణయం!.. ఇకపై..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement