Udaypur
-
2023లో ‘ఉదయ్‌పూర్’ ఎందుకు మారుమోగింది?
2023కు జ్ఞాపకాలతో వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. నూతన సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసింది. అయితే 2023 రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దీనికితోడు 2023లో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. ఉదయ్‌పూర్ జీ-20ని స్వాగతించింది. రెండు భారీ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా ఉదయపూర్‌లో జరిగాయి. ట్రావెల్ అండ్ లీజర్ 2023లో విడుదల చేసిన జాబితాలో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా పేరు తెచ్చుకుంది. పర్యాటకుల అభిరుచి, స్థానిక సంస్కృతి, ఆహారం, షాపింగ్, వివిధ పర్యాటక ప్రదేశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఉదయపూర్ నగరానికి 93.33 రీడర్ స్కోర్ లభించింది. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పర్యాటకులు ఉదయ్‌పూర్‌ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. భారత్ అధ్యక్షతన తొలి జీ-20 సమావేశం ఉదయపూర్‌లో జరిగింది. రెండవ జీ-20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ (ఎస్ఎఫ్డబ్ల్యుజీ) సమావేశం కూడా ఇక్కడే జరిగింది. దీనిలో 90 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి చెందింది. 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇక్కడే వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో నటాషాను వివాహం చేసుకున్నారు. స్టార్ హోటల్ రాఫాల్లో క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి హార్దిక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్‌లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్‌లో ఎట్రాక్షన్‌గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
పద్మజ కుమారి పర్మార్.. ఈమె గురించి ఎప్పుడైనా విన్నారా?
ఎంతోమంది రాజులు రాజ్యాలను పాలించారు.. మట్టిలో కలిసిపోయారు. రాచరిక వ్యవస్థ మొత్తం అంతరించిపోయినప్పటికీ.. కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం వారు చేసిన సేవలే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఉదయపూర్ మేవార్ వంశానికి చెందిన యువరాణి 'పద్మజ కుమారి పర్మార్' (Padmaja Kumari Parmar). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె చేసిన సేవలేంటి? నికర ఆస్తుల విలువ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉదయపూర్ వంశానికి చెందినవారిలో పద్మజ కుమారి పర్మార్ తనదైన ముద్ర వేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రాజ వంశానికి చెందిన పద్మజ దాతృత్వం నేడు ఖండాంతరాలలో విస్తరించింది. 1969లో తన తాత జ్ఞాపకార్థం మహారాణా ఆఫ్ మేవార్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మహిళల విముక్తి & విద్యను ప్రోత్సహించింది. హెచ్ఆర్హెచ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్.. పద్మజ కుమారి పర్మార్ తన పూర్వీకుల అడుగుజాడల్లోనే HRH గ్రూప్ ఆఫ్ హోటళ్లతో ముందుకు సాగుతోంది. హెచ్ఆర్హెచ్ గ్రూప్‌కు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మజ తన అనుభవాలతో వీటిని ప్రపంచ స్థాయికి తీసుకువెళుతున్నారు. పద్మజ కుమారి పర్మార్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని MS చద్దా సెంటర్ ఫర్ గ్లోబల్ ఇండియా & హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని గ్లోబల్ హెల్త్ అండ్ సర్వీస్ అడ్వైజరీ కౌన్సిల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సలహా బోర్డులలో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి? పద్మజకు డాక్టర్ కుష్ పర్మార్‌తో వివాహం జరిగిన తరువాత బోస్టన్‌కు మకాం మార్చింది. ఆ తరువాత ఉదయపూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి, యునైటెడ్ స్టేట్స్లో ఆమె కొత్త జీవితానికి మధ్య వారధిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈమె హెచ్ఆర్హెచ్ గ్రూప్ వ్యాపార ఉనికిని విస్తరిస్తోంది. ఇదీ చదవండి: ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్.. పద్మజ కుమారి పర్మార్ దాతృత్వ స్ఫూర్తితో అలఖ్ నయన్ మందిర్ ట్రస్టీగా, సేవా మందిర్ వంటి సంస్థల ద్వారా మహిళలను ఉద్ధరించడంలో పాత్ర పోషిస్తోంది. రూ. 50కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్న ఈమె ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈమె తన వంశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేస్తోంది. -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ సైకిల్: సింగిల్ ఛార్జ్‌తో..
భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, CNG వాహనాలు దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం బస్సులు, కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదలవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయపూర్ నగరంలోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 45 కిమీ రేంజ్ అందిస్తుంది. సుమారు 160 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 30 నిముషాల్లో ఛార్జ్ చేసుకోగలదు. ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ విక్రమాదిత్య దవే వెల్లడించారు. (ఇదీ చదవండి: 1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!) ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గేర్, పెడల్ సిస్టమ్ రెండింటినీ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ప్యానెల్ ప్లేట్, లైట్, హార్న్ వంటివి కూడా అమర్చారు. పాత సైకిల్ని ఇలాంటి కొత్త సైకిల్ మాదిరిగా మార్చడానికి రూ. 18,000, కొత్త సైకిల్ కావాలంటే రూ. 30,000 నుంచి రూ. 35,000 ఖర్చవుతుందని డాక్టర్ విక్రమాదిత్య తెలిపారు. ఈ సైకిల్ కావాలనుకునే వారు కాలేజీని సంప్రదించి తీసుకోవచ్చని కూడా వెల్లడించారు. -
రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Marriage: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమికుల దినోత్సవాన(ఫిబ్రవరి 14) హార్దిక్- నటాషాలు తమ కుమారుడు అగస్త్య, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2020 జనవరి 1న నటాషా వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేసిన హార్దిక్ పాండ్యా.. లాక్డౌన్లో సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లాడాడు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు హార్దిక్. ఇక నటాషా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ... తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనైంది. చదవండి: Nick Vujicic- Kanae Miyahara: ‘పరిపూర్ణతే’ అర్హతా? వాళ్లది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా.. Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ప్లాట్‌లో నేలపై రక్తపు మరకలతో భార్య, బిడ్డలు.. ఏం జరిగింది?
ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కాగా, మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉండటం అందరిని విషాదానికి గురిచేసింది. వివరాల ప్రకారం.. ప్రకాశ్ కుటుంబం ఉదయ్‌పూర్‌లోని గోగుండా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ప్రకాశ్‌కు భార్య దుర్గాగోమతి(27), వారి నలుగురు పిల్లలు కలిసి ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా, ప్రకాశ్.. గుజరాత్లో పని చేస్తూ బస్సుల్లో ఆహారాన్ని విక్రయించేవాడు. ప్రకాశ్ సోదరులు కూడా అతడి ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నారు. అయితే, సోమవారం ప్రకాశ్.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడి సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఉండటం గమనించారు. ఈ సందర్భంగా ఘటనపై అడిషనల్ ఎస్పీ కుందన్ కన్వారియా వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రకాశ్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. ప్రకాశ్ మొదట కుటుంబ సభ్యులను చంపి.. తర్వాత తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని అన్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నట్టు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Six members of a family, including four children, were found dead in mysterious circumstances in Rajasthan's Udaipur on Monday. The bodies of the couple and their four children were recovered from a room in the house in Gogunda town. pic.twitter.com/4OqxhY2n4x — Aakash Shukla (@JournoAakash) November 21, 2022 -
గుజరాత్ ఎన్నికలు.. గిరిజనులకు కేజ్రీవాల్ వరాలు
వడోదర: గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను అమలు చేస్తుందని, పంచాయతీ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకూ వర్తింపజేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. గుజరాత్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా సీఎంకు బదులుగా గిరిజనుడినే నియమిస్తామన్నారు. గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయన ఈ మేరకు ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా గిరిజనులు ఇప్పటికీ వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. ఆప్ నిజాయతీ దేశభక్తికి మారుపేరు కాగా, బీజేపీ అవినీతి, కల్తీమద్యానికి మారుపేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాబల్య చోటా ఉదయ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గిరిజన గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక మొహల్లా క్లినిక్‌ను ఏర్పాటు చేస్తుంది. గిరిజనులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా నెలకొల్పుతాం. కుల ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేయడంతోపాటు నీడ లేని వారికి పక్కా ఇల్లు నిర్మిస్తాం. గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్లు వేస్తాం’ అని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగల ప్రజల పరిపాలన, నియంత్రణలకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. అదేవిధంగా, 1996లో తీసుకు వచ్చిన పంచాయతీ చట్టంతో గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో స్వయం పాలనకు వీలు కల్పిస్తుంది. (క్లిక్: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!) -
ఉదయ్‌పూర్ టైలర్ హత్యకేసులో హైదరాబాద్‌కు లింకులు?
సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌లో షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో ఎన్ఐఏ మంగళవారం సోదాలు చేసింది. సంతోష్‌నగర్‌లో తావీద్ సెంటర్ నిర్వహిస్తున్న.. బిహార్‌కు చెందిన మహ్మద్ మున్వార్ హుస్సేన్ అశ్రఫి అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారించింది. ఈ నెల 14న జైపూర్‌లోని ఎన్ఐఏ ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. చదవండి: (ఉదయ్‌పూర్ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..) -
ఉదయ్‌పూర్ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హిందూ టైలర్ కన్హయలాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హంతకులు వినియోగించిన బైక్ నంబర్ ప్లేట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. హంతకుల్లో ఒకరైన రియాజ్ అక్తారీ RJ27AS 2611 అనే బైక్ నంబర్ కోసం రూ. 5,000 అదనంగా చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల బైక్ నెంబర్, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్ర దాడి తేదీ (26/11)తో సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కన్హయ్యలాల్‌ను చంపిన తరువాత నిందితులు ఇదే బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులోని ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ విచారిస్తోంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ దావత్ ఎ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధం ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు అనిమానిస్తున్నారు. ఇద్దరు నిందితులను గురువారం కోర్టుముందు హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది. చదవండి: నూపుర్ వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కాంగ్రెస్ స్పందన.. ‘సిగ్గుతో ఉరేసుకోవాలి’ -
ఉదయపూర్‌లో ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం
సాక్షి, కృష్ణాజిల్లా: ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సీ.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో ఎండీ చలమల శెట్టి గోపి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
నాన్నా బాగా చదువుకో: పరీక్షలు రాస్తున్న ఎమ్మెల్యే!
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించే క్రమంలో మంచిగా చదవమని ప్రోత్సహిస్తుంటారు. కానీ రాజస్థాన్‌లోని ఓ బీజేపీ ఎంఎల్ఏను అతని కుమార్తెలు ‘నాన్నా బాగా చదువుకో’ అని చెబుతున్నారు. ఏడో తరగతిలో చదువు ఆపేసిన తండ్రితో బి.ఏ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు కూడా రాయిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రూరల్ ఎంఎల్ఏ అయిన ఫూల్ సింగ్ మీనా చిన్నతనంలో ఉండగా ఆర్మీలో పనిచేస్తోన్న తన తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారం అతని మీద పడడంతో చదువును మధ్యలో ఆపేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్నీ పోషిస్తూ పెరిగాడు. కనీసం స్కూలు విద్యాభ్యాసం కూడా పూర్తిచేయని ఫూల్ సింగ్ తన తెలివితేటలతో ఎంఎల్ఏగా ఎదిగారు. అంతేగాకుండా తన ఐదుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. నలుగురు కుమార్తెలు పీజీ చేయగా, చిన్న కూతురు ప్రస్తుతం లా డిగ్రీ చేస్తోంది. 2013లో ఫూల్ సింగ్ మొదటిసారి ఎంఎల్ఏగా ఎన్నికైనప్పుడు... రకరకాల కారణాలతో ఆగిపోయిన తన చదువు ను ఇప్పుడు కొనసాగించండి నాన్నా! అని చెప్పారనీ, అదే ఏడాది 10వ తరగతిలో జాయిన్ చేసి, రోజూ వాళ్లు చదువుకున్న తరువాత తనకు చదువు చెప్పేవారని ఫూల్సింగ్ చెప్పారు. ‘‘అలా చదువుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ప్రస్తుతం కోటా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి.ఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాను. భవిష్యత్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసి తరువాత పీహెచ్డీ కూడా చేస్తాననీ’’ ఆయన చెప్పారు. ఫూల్ సింగ్ తాను చదువుకోవడమేగాక తన నియోజక వర్గంలోని ప్రతిభ కలిగిన విద్యార్థినులను ప్రోత్సహిస్తున్నారు. అకడమిక్స్‌లో మంచి ప్రతిభ కనబరిచిన అమ్మాయిలను రాజస్థాన్ అసెంబ్లీ సందర్శన, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలవడానికి విమానంలో పంపిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం ఆయనే భరిస్తూ.. ఇప్పటి దాకా 50మంది అమ్మాయిలను అసెంబ్లీ సందర్శనకు పంపించారు. చదవండి: కేరళ సీఎం విజయన్‌కు తలబొప్పి -
ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం దిగ్ర్భాంతి
ఉదయ్‌పూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది. పార్టీకి చెందిన వల్లభ్‌నగర్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తవట్ (48) బుధవారం ఉదయం కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన మృతిచెందారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి గజేంద్రసింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. అతడి మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్, కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న గజేంద్రసింగ్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో నెల నుంచి చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యంతో గజేంద్రసింగ్ మృతిచెందాడు. గజేంద్రసింగ్ వల్లభ్‌నగర్ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు గులాబ్ సింగ్ కుమారుడే గజేంద్రసింగ్. ఈయన మేవార్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ వెంట ఉన్నారు. అతడి మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంతాపం వ్యక్తం చేశారు. అతడి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పారు. సచిన్ పైలెట్ కూడా గజేంద్రసింగ్ మృతికి సంతాపం తెలిపారు. -
నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్
సాక్షి, తిరుపతి : ప్రముఖ నటుడు నాగబాబు కూమార్తె నిహారిక కొణెదల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. పెళ్లి తేదీని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. (డిసెంబరులో మూడు ముళ్లు) అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్‌లో జరగనుందట. ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్లో వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకభాకర్ రావు తెలిపారు. ఇక పెళ్లి పనులు కూడా మెగా వారింట ఇప్పటికే మొదలయ్యాయి. (నిహారిక ఇంట పసుపు ఫంక్షన్) చదవండి: వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక -
మేము రాముడి వంశస్థులమే: మహేంద్ర సింగ్
జైపూర్ : అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మేవార్ ఉదయ్‌పూర్ రాజకుటుంబీకుడైన మహేంద్ర సింగ్ స్పందించారు. తాము రాముడి వంశస్థులమని, ఒకవేళ ఏవైనా వివరాలు కావాలనుకుంటే కోర్టు తమను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సాక్ష్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా అయోధ్య భూ వివాదం కేసులో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందినవారమని జైపూర్ రాజకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి పేర్కొన్న విషయం విదితమే. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం, ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. మా వంశవృక్షంలో 62వ రాజుగా దశరథుడు, 63వ రాజుగా రాముడు, 64వ రాజుగా కుశుడి పేరు ఉన్నాయి. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. -
‘100 స్మార్ట్ సిటీస్’ ఊసేది!?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సోమవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ‘100 స్మార్ట్ సిటీస్’ స్కీమ్ ఊసు కూడా లేకపోవడం ఆశ్చర్యం. దేశంలోని అన్ని వంద నగరాలను అన్ని సౌకర్యాలతో అత్యాధునిక నగరాలుగా తీర్చి దిద్దుతామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ తెగ ఊదరగొట్టింది. అధికారంలోకి రాగానే ఈ పథకం కోసం మొదటి బడ్జెట్లో 7,060 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2015, జూన్ నెలలో ఈ స్కీమ్‌కు శ్రీకారం చుట్టి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. స్మార్ట్ సిటీ అంటే స్పష్టమైన నిర్వచనం ఇవ్వకపోయినా నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం సౌకర్యాలు కల్పించడం, అత్యాధునిక రోడ్డు సౌకర్యాలు కల్పించడం, ఘన వ్యర్థాల నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, ప్రజలు, ముఖ్యంగా పేదలకు గృహ సౌకర్యం లాంటి మౌలిక సౌకర్యాలను కల్పించడం ఒక అంశం కాగా, నగరమంతా ‘వైఫై’ సేవలు అందుబాటులోకి తేవడం, మెట్రో రవాణా సౌకర్యాలకు మొబైల్ యాప్స్ లేదా జీపీఎస్ వ్యవస్థను అనుసంధానించడం, సీసీటీవీ కెమెరాలతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం రెండో అంశం. వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేసే ప్రక్రియ 2016, సెప్టెంబర్ నెల నుంచి 2018, జనవరి నెలవరకు కొనసాగింది. తొలి విడతగా ఒక్కో నగరానికి 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వంద నగరాలకు సంబంధించి 5,151 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. 2018, మార్చి నెల నాటికి ఈ పథకం కింద కేటాయించిన నిధుల్లో కేవలం 1.83 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్’ తెలిపింది. ఈ స్కీమ్ కింద ‘పోర్ట్‌బ్లేర్’ నగరం అభివృద్ధికి అతి తక్కువగా 777 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. అతి ఎక్కువగా చండీగఢ్ నగరం అభివృద్ధికి 5,600 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆమోదించింది. ముందుగా ఈ స్కీమ్ కింద ప్రతి నగరానికి 500 కోట్ల రూపాయల గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం, దానికి మ్యాచింగ్ గ్రాండ్‌గా మరో 500 రూపాయల గ్రాంట్‌ను విడుదల చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తర్వాత ప్రాజెక్టులకయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించింది. అందుకు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం, మున్సిపల్ బాండులు విడుదల చేయడం, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవడం, విద్యుత్, నీటి లాంటి ప్రాథమిక సౌకర్యాల యూజర్ చార్జీలను పెంచడం ద్వారా సమకూర్చుకోవాలని కూడా సూచించింది. పర్యవసానంగా ఉదయ్‌పూర్ నగరంలో విద్యుత్, నీటి చార్జీలు ఐదింతలు పెరిగాయి. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. 500 కోట్ల రూపాయలను మాత్రమే ఇస్తామని, మిగతా సొమ్మును సొంతంగా సమకూర్చుకోవాలంటూ రాష్ట్రాలను ఆదేశించడంతోనే ఈ పథకం విఫలం అయింది. 2017, ఫిబ్రవరి నాటికి ఆమోదించిన ప్రాజెక్టుల్లో 3 శాతం పూర్తయ్యాయి. 2018, జూలై నెల నాటికి ఆమోదించిన వాటిలో 21.56 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2018, డిసెంబర్ నెల నాటికి వాటి సంఖ్య 33 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రాజెక్టుల వల్ల నగరాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివద్ధికి నోచుకున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ సిటీల స్కీమ్ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ స్కీమ్ పురోగతిని సమీక్షించిన ‘పట్టణాభివృద్ధి శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం’ 2018, మార్చి నెల నాటికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 1.83 శాతం నిధులను వినియోగించినట్లు వెల్లడించింది. -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదిమంది దుర్మరణం చెందగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. యాత్రికులతో హరిద్వార్ వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి ఉదయ్‌పూర్ వద్ద లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా గుజరాత్‌కు చెందినవారు. వీరంతా యాత్రా స్థలాల సందర్శన కోసం గత రాత్రి అహ్మదాబాద్ నుంచి బయల్దేరారు. ఈ ప్రమాదంపై ఉదయ్‌పూర్ ఎస్పీ మాట్లాడుతూ... బస్సు డ్రైవర్ ...ద్విచక్రవాహనాన్ని తప్పించబోయాడని, ఈ సందర్భంగా బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలిపారు. ప్రధాని దిగ్భ్రాంతి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులతో హరిద్వార్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడి 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ప్రధానిన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!
ఉదయ్ పూర్ (రాజస్థాన్): బావిలో నీళ్లు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ, వేడి నీళ్లు.. అది కూడా 58 డిగ్రీల సెల్సియస్ వేడితో దొరికితే.. ఆశ్చర్యమే కదా! సరిగ్గా ఇలాంటి బావి రాజస్థాన్ లోని బికార్డీ గ్రామంలోని ఓ పేద రైతు పొలంలో ఉంది. ఆ బావి గొప్పదనం గురించి పెద్దగా తెలియని ఆ బీద రైతు.. దానిలో నీళ్లను మోటారుతో తోడి, వాటిని చల్లార్చి పంట పండించడానికి వాడుకుంటున్నాడు. ఇప్పడు జియోలాజికల్ పరిశోధకులంతా ఈ బావి బాట పట్టారు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి బావిని రాజస్థాన్ లో చూడలేదని వారు చెప్తున్నారు. 30 మీటర్ల లోతు గల ఈ బావి భూగర్భంలో నీటికి బాగా చేరువగా ఉండటం వల్ల అక్కడ వేడికి నీరు ప్రభావితం అవుతోందని చెప్తున్నారు. రాతిభాగంలో ఉండే అనేక రకాల రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయని చెబుతున్నారు. అగ్ని పర్వతాలు లేని ప్రాంతం కావడంతో ఈ నీటిలో సల్ఫర్ చేరలేదని అంటున్నారు. ఈ బావిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేలా రైతుకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.