ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..! | Rare hot water well found in village near Pali | Sakshi
Sakshi News home page

ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!

Published Thu, May 5 2016 4:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!

ఈ బావిలో నీళ్లు.. బాగా 'హాట్' గురూ..!

ఉదయ్ పూర్ (రాజస్థాన్): బావిలో నీళ్లు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ, వేడి నీళ్లు.. అది కూడా 58 డిగ్రీల సెల్సియస్ వేడితో దొరికితే.. ఆశ్చర్యమే కదా! సరిగ్గా ఇలాంటి బావి రాజస్థాన్ లోని బికార్డీ గ్రామంలోని ఓ పేద రైతు పొలంలో ఉంది. ఆ బావి గొప్పదనం గురించి పెద్దగా తెలియని ఆ బీద రైతు.. దానిలో నీళ్లను మోటారుతో తోడి, వాటిని చల్లార్చి పంట పండించడానికి వాడుకుంటున్నాడు.

ఇప్పడు జియోలాజికల్ పరిశోధకులంతా ఈ బావి బాట పట్టారు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి బావిని రాజస్థాన్ లో చూడలేదని వారు చెప్తున్నారు. 30 మీటర్ల లోతు గల ఈ బావి భూగర్భంలో నీటికి బాగా చేరువగా ఉండటం వల్ల అక్కడ వేడికి నీరు ప్రభావితం అవుతోందని చెప్తున్నారు. రాతిభాగంలో ఉండే అనేక రకాల రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయని చెబుతున్నారు. అగ్ని పర్వతాలు లేని ప్రాంతం కావడంతో ఈ నీటిలో సల్ఫర్ చేరలేదని అంటున్నారు. ఈ బావిని టూరిస్ట్ స్పాట్ గా మార్చేలా రైతుకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement