Hot water
-
చల్లని వర్సెస్ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్?
మన ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. నీరు బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎంతో మందిలో ఉండే సందేహం... బరువు తగ్గాలనుకుంటే ఏ నీరు తాగితే మంచిది? అనే సందేహం వస్తుంటుంది. చాలామంది వేడి నీరు తాగితేనే బరువు తగ్గుతాం అనుకుంటారు. ఇంకొందరూ చల్లని నీరే అన్ని విధాల మంచిదని భావిస్తుంటారు. మరీ దీని గురించి పోషకాహార నిపుణుల ఏమంటున్నారంటే..వేడి నీళ్లు తాగితే...ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ ఎంజైమ్‌లు ఉత్పత్తి చక్కగా ఉంటుంది. ఇది ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాల శోషణ ప్రభావంతంగా ఉంటుంది. ఇక్కడ బరువు తగ్గాలంటే జీర్ణ క్రియ సవ్యంగా జరగాలి. కాబట్టి వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాలను, వ్యర్ధాలను బయటికి పంపవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో గోరువెచ్చని నీళ్లు ముందుంటాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఇంకా మంచిది. గోరువెచ్చని నీళ్లు శరీర ఉష్ణోగ్రతను తాత్కాలికంగా కొంతవరకు పెంచుతుంది. దీనివల్లే జీవక్రియ కూడా వేగాన్ని పెంచి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు భోజనానికి ముందు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా తినడం కూడా తగ్గుతుంది తద్వారా కూడా బరువు తగ్గొచ్చు.చల్లని నీరు తాగితే...చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. మళ్లీ తిరిగి ఉష్ణోగ్రత పెరగడానికి కాస్తా శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఇది జరగడానికి ఎన్నో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇలా బర్న్ అయిన క్యాలరీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే మరింత ఎక్కువ కాలం వ్యాయామం చేయడానికి ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్ళలాగే చల్లటి నీరు కూడా జీవక్రియను పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల ఆకలి కాస్త తగ్గుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగడం వల్ల మంచే జరుగుతుంది.రెండింటిలో ఏది మంచిదంటే..గోరువెచ్చటి నీరైనా, చల్లని నీరైనా రెండూ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి ఏది అనేది మన ఇష్టమే. ఏదేమైనా నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రెండూ జీర్ణ క్రియను ప్రేరేపించడంలో ముందుంటాయి. అయితే ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే మంచిది. దానిలో నిమ్మరసం జోడించుకుంటే ఇంకా మంచిది. ఇది ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినడాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆహారాన్ని ఎక్కువగా తినకుండా అడ్డుకుంటుంది. ఇక చల్లటి నీరు విషయానికొస్తే వ్యాయామం చేసేటప్పుడు చల్లటి నీరు తాగడమే మంచిది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా అడ్డుకొని శరీరానికి ఓదార్పుని ఇస్తుంది. కాబట్టి కొన్నిసార్లు గోరువెచ్చని నీరు, కొన్నిసార్లు చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రెండింటిన సమాయాను సారంగా శారీరక పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని తాగితే బరువు తగ్గడం సులభం. -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్‌తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్‌గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్‌ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్‌లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
నలభై ఏళ్లుగా ఉప్పొంగుతున్న వేడినీరు
ఏటూరునాగారం: సాధారణంగా భూమి నుంచి మోటార్ల ద్వారా నీరు బయటకు వస్తే కొంత గోరువెచ్చగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఉన్న బోరులో నుంచి ఏడాదిపొడవునా.. వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చమురు నిక్షేపాలు ఉన్నాయని 1978లో ములుగు జిల్లా ఏటూరునాగారం రామన్నగూడెంలో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వేసిన బోరు నుంచి నిర్విరామంగా వేడినీరు ఉబికి వస్తుంది. ఎలాంటి మోటారు, యంత్రాలు, మిషన్లు లేకుండానే నీరు ఉబికి రావడం ఒక వింత కాగా.. ఆ నీరు వర్షాకాలం, వేసవి కాలం, చలికాలంలో సైతం వెచ్చగా ఉండడం మరో వింతగా కన్పిస్తుంది. రామన్నగూడెంలోని ప్రజలు ఈ వేడినీళ్ల కాల్వలో దుస్తులు ఉతడకం, స్నానాలు చేయడంతోపాటు గృహఅవసరాలకు సైతం ఈ నీటిని వినియోగిస్తుంటారు. అయితే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వారికి మాత్రం ఈ విషయం ఆశ్చర్యాన్ని కల్గించకమానదు. విత్తనాలకు ప్రత్యేకత వరి విత్తనాలు మొలకెత్తేందుకు రైతులు సాధారణంగా గోలెం, డ్రమ్ము లేదా ధాన్యం విత్తనాలపై గోనెసంచులు వేసి నీటితో తడుపుతుంటారు. కానీ రామన్నగూడెంలోని రైతులు వరి విత్తనాల బస్తాలను ఈ వేడినీళ్ల కాల్వలో నానబెట్టి నాటితే వారి నారు ఏపుగా, శక్తివంతంగా పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకోసం విత్తనాలు తెచ్చిన సమయంలో బస్తాలను ఈ నీటిలో వేసి 24 గంటల తర్వాత తీసి మంచంపై ఆరబోసుకుంటారు. ఇలా చేయడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని నమ్ముతున్నారు. అంతేకాకుండా మహిళలు, గ్రామస్తులు ఎక్కువగా వారి ఇళ్లలోకి నీటిని తీసుకెళ్లి అవసరాలకు వినియోగించుకుంటారు. ప్రజలు ఆ కాల్వలో నీటిని వినియోగించుకున్న తర్వాత నీరు కాల్వల ద్వారా సమీపంలోని గోదావరి నదిలో కలుస్తుంది. 45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో నీటినిల్వలు కొద్దిగా కూడా తగ్గకపోవడం గమనార్హం. అంతేకాకుండా కొంత మంది రైతులు అందులో మోటార్లను దింపి వరి పంట సాగుకు నీటిని పారించుకుంటున్నారు. -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
ఈ కెటిల్లో వంట కూడా వండేయొచ్చు , ధర కూడా తక్కువే
ఒకటిన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ కెటిల్.. ఆటో షట్ఆఫ్, బాయిల్–డ్రై ప్రొటెక్షన్‌తో రూపొందింది. ఈ మెషిన్‌తో టీ, కాఫీలతో పాటు ఇన్ స్టంట్ నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. దీనిలో ఫారెన్ హీట్ లేదా సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత యూనిట్‌ని మార్చడానికి వీలుగా ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. బాయిల్ లేదా స్టాప్ బటన్ సాయంతో.. దీన్ని చాలా సులభంగా వాడుకోవచ్చు. ఫుడ్–గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఉన్న ఈ డివైస్.. మగ్ మాదిరి వినియోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైక్వాలటీ టెక్నాలజీతో, యాంటీ స్కాల్డ్ హ్యాండిల్‌తో చూడటానికి భలే అందంగా ఉంటుంది. కిచెన్ ఇంటీరియర్ లుక్ కోసం కూడా దీన్ని ఎన్నుకోవచ్చు. ధర 40 డాలర్లు (రూ.3,315) -
రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!
రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక.. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లోని పైపు పగిలిపోవడంతో మాల్లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. ఇది కూడా చదవండి: బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు -
Health Tips: వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే!
సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. తడిసిన తరువాత స్నానం చేయాలి మనమందరం వర్షంలో తడిసి ఆనందిస్తుంటాం.. అందులోనూ చిన్నారులు మరింత ఉత్సాహం చూపిస్తుంటారు. వర్షంలో తడిసిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబును నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. నీరు తాగాలి ఈ సమయంలో తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో ప్యాక్డ్ వాటర్, కియోస్క్‌లు, ధాబాస్ లేదా షాపుల నుంచి వడకట్టని నీటిని తాగరాదు. వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మాత్రమే నీరు తాగండి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెంటిలేషన్ ఉండాలి మనం ఎక్కువ సమయం గడిపే స్థలం కూడా వర్షాకాలంలో ప్రభావితం చేస్తుంది. ఇరుకైన ప్రదేశంలో ఉంటే అంటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి. వీలైనప్పుడల్లా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. తప్పకుండా చేతులు కడుక్కోవాలి వాష్‌రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి వస్తాయి. మీరు భోజనానికి ముందు ఆ తరువాత తప్పనిసరిగా సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది అంటువ్యాధులను నివారించడానికి మీకు సహాయపడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచండి వర్షాకాలంలో ఇంట్లో చాలా దుమ్ము వచ్చి చేరుతుంది. వర్షంతో వచ్చే తడితో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. అవి అంటువ్యాధులను, ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంటాయి. సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంటి శుభ్రతతో దోమలు, ఇతర కీటకాల పెంపకాన్ని నివారించవచ్చు. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది. ►చర్మ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడినీటితో రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, క్రిములు తొలగిపోతాయి. అలర్జీలు దరి చేరకుండా చూసుకోవచ్చు. చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి! Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు! 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..
చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. చలిలో సైతం కొందరు మైదానాల్లో జాగింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ కాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం. ఆస్తమా, అలర్జీ ప్రమాదంపొంచి ఉంది చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్తమా, అలర్జీ ఉన్నవారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎప్పుడూ వెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరే తాగాలి. చలికి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దాని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఆస్తమా రోగులు ఆయాసానికి గురి కాకుండా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నందున వృద్ధులు, పిల్లలు, గర్భిణులు అసలే బయటికి రావద్దు. రెండు రోజులకు మించి దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రవిప్రసాద్, ఎండీ, పలమనాలజిస్టు , నల్లగొండ చదవండి: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల చర్మ వ్యాధులు ఉన్నవారు చలికాలం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చర్మం పొడిబారి పోతుంది. చర్మ వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. ఈసారి చలి మరింత ఎక్కువగా ఉన్నందున సోరియాసిస్ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సోరియాసిస్ వ్యాధి చలికి తీవ్రమవుతుంది. ఒల్లంతా పొలుసుల మాదిరిగా మారుతుంది. శరీరంలో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైతే శరీరం, కాళ్లు పగిలినట్లు అవుతాయి. పెద్ద వయస్సువారు, పుట్టుకతోనే పొడి చర్మం ఉండేవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. పెదాలు, కాళ్లు కూడా పగులుతుంటాయి. కొందరిలో చలికి తల వెంట్రుకలు రాలిపోతుంటాయి. గాయాలైనా కూడా మానని పరిస్థితి. దురద కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మవ్యాధి పెరిగి కొందరిలో శరీరం, కాళ్లు, పగిలిపోతాయి. అలాంటివారు వైద్యులను సంప్రదించాలి. చదవండి: 2021 గుణపాఠాలు.. ఇప్పుడైనా కొత్త నిర్ణయాలు తీసుకుందామా.. చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె మంచిది చలికాలం ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బులను వాడాలి. గ్లిజరిన్‌తో తయారు చేసిన సబ్బులను వాడడం వల్ల చర్మం వాడిపోకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మ్యాయిశ్చరైజ్ క్రీమ్‌లను వాడుకోవాలి. అవి కొనుగోలు చేయలేనివారు కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. ఫ్యారాఫిన్ నూనె కూడా తక్కువ ధరలో ఉంటుంది. దాన్ని కూడా వాడొచ్చు. చలికాలం నీరు తక్కువగా తాగుతారు. దానివల్లన చర్మం పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిట్కాలతో, ఎప్పటికప్పుడు ఆయిల్‌తో మాయిశ్చరైజ్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. – డాక్టర్ అనితారాణి, చర్మవ్యాధుల వైద్య నిపుణులు, నల్లగొండ చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి నీరు ఎక్కువ తాగాలి.. బయటి పదార్థాలు తినొద్దు వారం రోజులుగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నపిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. పెద్దలతో పోల్చితే చిన్నపిల్లల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల చలి కాలంలో పిల్లలను వెచ్చని ప్రదేశాల్లోనే ఉంచాలి. నెలలోపు పిల్లలకు చలిగాలి తగలకుండా దుప్పట్లు కప్పి ఉంచాలి. గదుల్లో ఫ్యాన్లు, ఏసీలు వేయొద్దు. నెలలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ సాక్సులు, గ్లౌజ్‌లు, స్వెర్టర్లు వేయాలి. సంవత్సరం దాటిన పిల్లలకు కూడా స్వెర్టర్లు వేసి ఉంచాలి. చిన్నారుల చర్మం పొడి బారిపోకుండా మెత్తగా ఉంచుకునేలా క్రీమ్స్ రాయాలి. చల్లటి గాలికి జలుబు, దగ్గు వస్తుంది. పిల్లలను బయటికు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలపై తిప్పకపోవడమే మంచిది. ఎదిగిన పిల్లలకు మాస్క్ వాడాలి. పిల్లలకు వేడివేడిగా ఆహార పదార్థాలు పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగించాలి. ఈ కాలంలో బయటి ఆహార పదార్థాలు తినకూడదు. శీతల పానియాలు తాపొద్దు. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ తినకుండా చూడాలి. –డాక్టర్ తేజావత్ విద్యాసాగర్ , సూర్యాపేట ‘షుగర్’ బాధితులూ.. జర జాగ్రత్త గతంలో ఎప్పుడూలేని విధంగా ఈసారి చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల వరకు పడిపోతున్నాయి. చలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చలికి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రావొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాస్కు ధరించడంతోపాటు తగు జాగ్రతలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. గోరువెచ్చని నీరు తాగుతూ వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. చలికి జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రెండు రోజులు అవి తగ్గకపోతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఒమిక్రాన్‌కు కూడా ఇవే లక్షణాలతోపాటు ఒల్లు నొప్పులు ఉంటున్నాయి. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పటి వరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటే మంచిది. షుగర్ వ్యాధికి, కీళ్ల నొప్పులు, స్టెరాయిడ్స్ వాడేవారు మరింత జాగ్రతగా ఉండాలి. ఈ రెండు నెలలపాటు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చలి కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పుదు. – డాక్టర్ విజయ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వ్యాయామం మరువొద్దు రామగిరి(నల్లగొండ) : చలికాలం వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో వ్యాధిగ్రస్తుల్లో రక్త చిక్కబడే ప్రమాదం ఉంటుంది. దీంతో వారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తుంటారు. ఈ కాలంలో మైదానాలన్నీ మార్నింగ్ వాకర్స్‌తో కిటకిటలాడుతుంటాయి. చిన్నా పెద్ద అని తారతమ్యం లేకుండా వృద్ధులు సైతం వ్యాయామం చేయాలి. -
ఎంత ఘోరం : వేడి నీళ్లని తెలువక పాయె..
సాక్షి, చెన్నారావుపేట (వరంగల్): ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్నానం చేయించడానికి పెట్టిన వేడి నీటి బకెట్లో పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కందికడ్డతండా శివారు ఔసుల్‌తండాలో బుధవారం రాత్రి జరిగింది. తండాకు చెందిన సహదేవుల వెంకన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె జాహ్నవి(3) ఉంది. ఈ నెల 6న స్నానం చేయించడానికి తల్లి వేడి నీళ్లు సిద్ధం చేసింది. బట్టలు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లిన క్రమంలో జాహ్నవి బకెట్లో పడిపోయి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి బుధవారం రాత్రి మృతి చెందింది. చిన్నారి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ స్వామి తెలిపారు. చదవండి: సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్ -
విషాదం: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి
సాక్షి,మండ్య(బెంగళూరు): కాళ్ల పారాణి ఆరకముందే వేడినీళ్లు పడి నవ వధువు మృతి చెందింది. మండ్య జిల్లా మద్దూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన డి గ్రూప్ ఉద్యోగి నందరాజు కుమార్తె ఉన్నతి (19)ని మళవళ్ళి తాలూకా హోంబెగౌడనదొడ్డి గ్రామానికి చెందిన ప్రజ్వల్‌కు ఇచ్చి 20 రోజుల క్రితం పెళ్లి చేశారు. ఆలూరు గ్రామంలో ఈనెల 20న ఉన్నతి వంట గదిలో నుంచి బాత్రూంకి వేడినీటిని తీసుకెళ్తుండగా జారిపడడంతో వేడినీళ్లు ఆమెపై పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మండ్యలో ఒక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె శనివారం మృతి చెందింది. మద్దూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. కారు ప్రమాదంలో వైద్యుడు మృతి మైసూరు: కారు ప్రమాదంలో శివకుమార్ (35) అనే వైద్యుడు మరణించిన ఘటన మైసూరులో జరిగింది. నగరంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేసే శివకుమార్ శనివారం ఉదయం ఇంటి వద్ద నుంచి ఆస్పత్రికి కారులో వెళ్తూ రింగ్ రోడ్డులో ఉన్న మానసి నగర వద్ద కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన శివకుమార్ అక్కడే మరణించాడు. సిద్ధార్థనగర ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: బీమా డబ్బుల కోసం.. కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త మామా -
అయ్యో దేవుడా.. వేడి నీళ్లని తెలియకపాయె!
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరులో ఘోరం చోటు చేసుకుంది. ఓ తల్లి నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు బలిగొంది. సలసల కాలే నీరు శరీరంపై పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన మైసూరులో మంగళవారం చోటు చేసుకుంది. దాసనకొప్పలులో నివాసం ఉంటున్న రాము ఫొటోగ్రాఫర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కుమార్తె ఉంది. మంగళవారం చిన్నారికి స్నానం చేయించేందుకు తల్లి తన కుమార్తెను బాత్రూమ్కు తీసుకెళ్లింది. నీరు చాలా వేడిగా ఉండటంతో చల్లటి నీరు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలో చిన్నారి బక్కెట్లోకి చేయి పెట్టింది. వేడి తీవ్రత తాళలేక చేయి బయటకు తీసే క్రమంలో బకెట్ ఒకపక్కకు ఒరిగి నీరంతా మీదపడి శరీరం బొబ్బలు ఎక్కింది. హుటాహుటిన కేఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్లెదుటే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత -
కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు
చలిగాలి వీచినా.. ఎండ పొడ తాకినా.. తట్టుకోలేని వయసది. అమ్మ ఒడిలో ఒదిగిపోయే ప్రాయమది. రంగుల ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడే చిన్ని మనస్తత్వమది. ‘అమ్మా.. నాన్న’ ఈ రెండు పదాలు తప్ప వేరే ప్రపంచమే తెలియని చిన్ని లోకమది. ఆ లోకాన్నే ‘మా లోకం’ అని బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఆ బుజ్జాయి జ్ఞాపకాల్ని కడుపులో దాచుకున్న అమ్మ.. ఆ బుజ్జి పలికిన పదాలు మనసులో మననం చేసుకున్న నాన్న. ఆ చిన్నారి షైనీ రాకతో జీవితం ‘షైన్’ అయిందనుకున్నారు. ఆ చిన్నారి స్నానానికి పెట్టిన వేడినీళ్లు.. జీవితాంతం కన్నీళ్లను మిగుల్చుతాయని అస్సలు అనుకోలేదు. హసన్‌పర్తి: మండలంలోని సీతంపేటకు చెందిన బండారి అశోక్, సుజాత దంపతుల కూతురు షైనీ(3) వేడి నీళ్లలో పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నవంబర్ 27న షైనీ స్నానం కోసమని తల్లి సుజాత ఇంటి ఆవరణలో హీటర్ పెట్టింది. నీళ్లు బాగా వేడి అయ్యాయని హీటర్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత సుజాత వంట పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో షైనీ ఆడుకుంటూ బకెట్‌ను సమీపించింది. తప్పటడుగులేసుకుంటూ బకెట్‌ను తాకింది. ఒక్కసారిగా వేడి నీళ్లు పడడంతో గట్టిగా ఏడ్చింది. తల్లి వచ్చి చూసే సరికి షైనీ ఒళ్లు ఎర్రగా మారింది. ఏడుస్తున్న కూతురుని ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారం రోజులు చికిత్స అందించారు. శనివారం చికిత్స పొందుతున్న షైనీ మృతి చెందింది. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) ఎమ్మెల్యే పరామర్శ బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. çఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ జనగాం శరత్, ఎంపీటీసీ సభ్యురాలు బండారి రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, టీఆర్ఎస్ నాయకులు చేరాలు, తిరుపతి, పీఏసీఎస్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, ఉపసర్పంచ్ భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివాలయం బావిలో 4 నెలల నుంచి వేడి నీళ్లు.. దేవుడి మహిమేనా?
సాక్షి, కేసముద్రం(మహబూబాబాద్): పురాతన శివాలయంలోని చేదబావిలో నీళ్లు వేడెక్కడంతో ప్రజలు పూజలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. కాకతీయుల కాలంలో గ్రామంలో శివాలయం, ఆలయ ఆవరణలో చేదబావిని రాతికట్టడంతో నిర్మించారు. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెలిశాల సుగుణమ్మ ఈ బావి నీటినే వినియోగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఎప్పటిలాగే బావిలో నీటిని తోడగా.. నీళ్లు బాగావేడిగా ఉండటం గమనించింది. వాటిని ఆలయ ఆవరణలోని పోసి చూడగా పొగలు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన పూజారికి చెప్పింది. బావిలో నీరు వేడిగా ఉన్నట్లు గుర్తించిన ఆయన గ్రామపెద్దలకు సమాచారవిచ్చారు. ఒకట్రెండు రోజుల క్రితం విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇదంతా దేవుడి మహిమంటూ ఆదివారం ఆలయానికి చేరుకుని బావి వద్ద పూజలు చేశారు. చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్ గుండె చుట్టుపక్కలున్న బావిలోని నీటిని, ఈ బావి నీటిని పరిశీలించగా తేడా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. భూగర్భంలోని పొరల్లో మార్పుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాస్త్రవేత్తలతో పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. -
భర్త ప్రైవేట్ భాగాలపై మరిగే నీరు పోసి హత్యాయత్నం చేసిన మూడో భార్య
సాక్షి, ఏలూరు టౌన్: నిద్రపోతున్న భర్త పురుషాంగంపై సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది ఓ భార్య. హఠాత్తు పరిణామంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్తను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య పద్మావతితో పాటు, ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. నగరంలోని పత్తేబాదలో టైలరింగ్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా నాగేంద్రరావు, పద్మావతి మధ్య విభేదాలు పొడచూపాయి. శుక్రవారం రాత్రి వారి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. శనివారం ఉదయం భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని మర్మాంగంపై పడేలా ఒక్కసారిగా పోసేసింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు నాగేంద్రరావుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. చదవండి: (ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఆపై..) మూడో భార్యగా పద్మావతి... నాగేంద్రరావుకు పద్మావతి మూడో భార్య. మొదటి, రెండవ భార్యల నుంచి పిల్లలు పుట్టటం లేదనే కారణంగా విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. పిల్లలు కావాలనే ఉద్దేశంతో పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారు. ఇటీవల కాలంలో వారిమధ్య విభేదాలు తీవ్రస్థాయిలో చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి దిగిందని భావిస్తున్నారు. అసలు ఎందుకు అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలా, వివాహేతర సంబంధాలా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
భర్త దాష్టీకం.. భార్యపై మరుగుతున్న వేడినీళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్ అనే వ్యక్తి సంజు(32) అనే మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా చిన్న అమ్మాయి గత సంత్సరం జన్మించింది. ఆ తర్వాత నుంచి సంజూను ఆమె భర్త వేధించేవాడు. అయితే గత కొంత కాలంగా సత్యపాల్ తన భార్య సంజును కట్నం కింద అదనంగా రూ.50 వేలు తీసుకురావాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్నాడు. ఈ ఘటనపై ఇరుకుటుంబాలు పలుమార్లు చర్చించినా నిందితుడు ఖాతరు చేయలేదు. దీనిపై బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’’ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. కాగా నిందితుడు సత్యపాల్ ఆగష్టు 13న భార్య సంజూపై వేడి నీళ్లు పోసి పరారయ్యాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Bullet Bandi Song: హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో -
అయ్యో..చిన్నా.. వేడి నీటిలో పడి బాలుడి మృతి
సాక్షి,రఘునాథపాలెం: చిన్న ఏమరుపాటు పసివాడి ప్రాణం తీసింది. ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. బద్ధ్యాతండాకు చెందిన రమేష్ – అరుణ దంపతుల చిన్న కుమారుడు నునావత్ గీతమ్‌రామ్(4) ఈ నెల 8వ తేదీన హీటర్‌తో నీటిని వేడి చేసిన బకెట్లో ప్రమాదవశాత్తు పడి..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు కుమారులకు స్నానం చేయించేందుకు టీవీ దగ్గర ఉన్న స్విచ్‌బోర్డు వద్ద తల్లి హీటర్ ప్లగ్ పెట్టి బకెట్లో నీటిని వేడి చేసింది. అదే సమయంలో పెద్ద కుమారుడు అన్నం పెట్టాలని మారాం చేయడంతో అమ్మ అరుణ ప్లగ్ తీసేసి..ప్లేట్లో భోజనం తీసుకొచ్చేందుకు వంటగదిలోకి వెళ్లింది. అదే సమయంలో చిన్న కుమారుడు టీవీ స్వీచ్ వేసేందుకు వెళ్లి అక్కడ జారి..పక్కనే ఉన్న వేడి నీటి బకెట్లో పడి..బిగ్గరగా కేకలు వేశాడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్న తల్లి బిడ్డను బయటకు తీసింది. అప్పటికే తీవ్ర గాయాలైన బాబును తొలుత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స చేయిస్తుండగా..ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతి చెందాడు. గురువారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు బిడ్డలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, ఈ ఘటన విషాదం నింపిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వేడి నీళ్లు పడి ఐదేళ్ల చిన్నారి మృతి
సాక్షి, ఆదిలాబాద్: మండలంలోని బోదపల్లి గ్రామంలో వేడి నీళ్లు మీదపడి ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈన్గాం ఎస్సై సందీప్ తెలతిదపిన వివరాల ప్రకారం గడిల అశోక్- సౌజన్యలకు ముగ్గురు పిల్లలు. గత నెల 29న ప్రమదవశాత్తు అభినయ(5)పై వేడినళ్ల కొప్పెన బోర్లా పడింది. వెంటనే కాగజ్‌నగర్‌లోని అసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం, అక్కడినుంచి హైదరబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చిన్నారిని కాపాడలేకపోయారు. -
అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి
గౌహతి : అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి ముఖంపై వైద్య దంపతులు వేడి నీళ్లు పోసి తమ మూర్కత్వాన్ని ప్రదర్శించారు. ఈ ఘటన జరిగి వారం రోజులైనప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ పని చేసిన ఆ దంపతులను శనివారం రాత్రి నాగాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సిద్ధి ప్రసాద్ దేరి అస్సాం మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రసాద్ భార్య మిథాలి కొన్వార్ మోరన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. డిబ్రూగర్లో నివాసం ఉంటున్న ఈ దంపతుల ఇంట్లో 12 ఏళ్ల బాలుడితో ఇంటి పనులు చేయిస్తున్నారు. ఆగస్టు 29న ఇంట్లోనే ఉన్న ప్రసాద్ ఇంటికి సంబంధించిన పనిమీద బాలుడిని పిలిచాడు. అయితే బాలుడు రాకపోవడంతో అతను ఉన్న గది దగ్గరకు వెళ్లి చూడగా నిద్రపోతూ కనిపించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రసాద్ పని చేయకుండా హాయిగా నిద్రపోతున్నావా అంటూ వేడినీళ్లు బాలుడి ముఖం మీద గుమ్మరించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న మిథాలి భర్త చేస్తున్న పనిని అడ్డుకోకపోగా.. కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. వేడినీళ్లు పడడంతో ఆ బాలుడు రాత్రంతా నరకయాతన అనుభవించాడు.(చదవండి : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు) ఈ సంఘటన మొత్తాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి దానిని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫార్వర్డ్ చేశాడు. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు రంగంలోకి దిగి వైద్య దంపతులు ఉంటున్న ఇంటికి వెళ్లి బాలుడిని సంరక్షణ కేంద్రానికి తరలించి వారిద్దరిని అరెస్ట్ చేశారు. బాలుడి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు ఆ దంపతులపై బాలల హక్కు చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. -
వేడినీళ్లలో పడి చిన్నారి మృతి
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్) : ఆభం శుభం తెలియని ఓ పసివాడు ఆడుకుంటూ వేడినీళ్లపైపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామపంచాయితీ పరిధిలోని బాలునాయక్‌తండాలో నెలకొంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్–ముని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అందులో చిన్న కుమారుడు ధరావత్ సాయికుమార్(4) స్నానం కోసం ఉడుకుతున్న వేడినీళ్లు మీద పడి మృతి చెందాడు. ఈ నెల 26న ఇంటి ముందు పొయిపై మరుగుతున్న వేడినీళ్లపై ఆడుకుంటూ అటూగా వెళ్లిన బాలుడు గిన్నెపై పడ్డాడు. దీంతో ఆ బాలుడుకి ఒంటిపై వేడినీళ్లు పడి చర్మం తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన తల్లిదండ్రులు ముందట హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయికుమార్ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. నీన్నే చూస్తూ బతుకుతున్నం కొడుకా.....నాలుగేళ్లకే నూరేల్లు నిండాయా కొడుకా...ఇగ మేము ఎవరి కోసం బతకాలి బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. -
ఆమెపై పొగలు కక్కే వేడినీళ్లు గుమ్మరించాడు
సాక్షి, నార్సింగ్‌పూర్: ఓ వ్యక్తి తన ప్రేయసిపై వేడినీళ్లు గుమ్మరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నార్సింగ్‌పూర్‌లోని కెడియా గ్రామానికి చెందిన సూరజ్ ప్రభుదయాల్ యాదవ్, అతని ప్రేయసి ఇద్దరూ భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. వీరిద్దరూ మంకాపూర్‌లో ఓ గది తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇక ఈ మధ్య ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సూరజ్ గురువారం ఆమెతో గొడవకు దిగాడు. వీరి తగవు తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు ఆమెపై పొగలు కక్కుతున్న వేడినీళ్లు పోశాడు. దీంతో కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చదవండి: భార్య తలతో 1.5 కిలోమీటర్లు.. -
చెత్తబుట్టలో కాఫీ పొడి టీ ఆకులు పడేస్తున్నారా?!
చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ చుక్క గొంతులో పడందే పనులు మొదలవ్వవు. టీ లేదా కాఫీ డికాషన్‌ను వడకట్టాక అడుగున పొడి/ఆకులు మిగిలిపోతాయి. దీనిని చాలా వరకు చెత్తబుట్టలోనే పడేస్తుంటారు. అలా కాకుండా ఇక నుంచి వాడేసిన ఆ టీ ఆకులు లేదా పొడి పదార్థాలను చర్మ పోషణకు, ఇంటి అందానికి ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం... మొటిమల నివారణ ఒకసారి ఉపయోగించిన టీ ఆకులను వేడి నీటిలో వేసి చల్లారేవరకు ఉంచాలి. ఆ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శభ్రపరుచుకోవాలి. దీని వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. పాదాలకు టీ నీళ్లు ఈ టీ ఆకుల నీటిలో పాదాలను ఉంచాలి. పావుగంట సేపు అలాగే ఉంచి, తర్వాత బయటకు తీసి పాదాలను తడి లేకుండా తుడవాలి. దీంతో పాదాలపై ఉన్న ట్యాన్ సమస్య తగ్గిపోతుంది. దురద, పాదాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి. కాలిన కొద్దిపాటి గాయాలకు మందులా పనిచేస్తుంది. దుర్వాసన కూడా దరిచేరదు. కాబట్టి వేడి టీ రుచిని ఆస్వాదించినప్పుడు దాని అవశేషాన్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. బాడీ స్క్రబ్ కాఫీ పొడిని బాడీ స్క్రబ్‌గా ఉపయోగిస్తే చర్మంపై మలినాలు, ట్యాన్ సమస్య తగ్గుతుంది. ఫ్రిజ్ దుర్వాసన దూరం ప్రిజ్‌లో రకరకాల పదార్థాల వల్ల దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే వాడిన టీ లేదా కాఫీ పొడి వేసి మరిగించిన నీటిలో మెత్తటి క్లాత్ ముంచి, లోపలి భాగమంతా తుడవాలి. ఒక చిన్న గిన్నెలో వాడిన కాఫీ పొడిని వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచాలి. దుర్వాసన దరిచేరదు. ఫర్నీచర్ కొత్తగా! చెక్క ఫర్నీచర్ తరచూ గీతలు పడే అవకాశం ఉంది. ఆ గీతలు మీకు నచ్చకపోతే వాడిన కాఫీ పేస్ట్‌ను గీతల మీద రాసి 15 నిమిషాల తర్వాత మెత్తటి క్లా™Œ తో తుడవాలి. గీతలు కనిపించవు. చెక్క ఫర్నీచర్‌ని ఈ కాఫీ నీళ్లతో తుడిచేస్తే కొత్తగానూ కనిపిస్తాయి. సేంద్రీయ ఎరువు ఇతరత్రా వాడకం కుదరకపోతే ఒక కుండీలో వాడిన కాఫీ లేదా టీ పొడులను వేస్తూ పైన మట్టి వేస్తూ ఉండండి. కొన్ని రోజుల్లోనే ఇది మొక్కలకు సేంద్రీయ ఎరువులా ఉపయోగపడుతుంది. ఈ ఎరువు వల్ల మొక్కలకు పోషకాలు అంది వాటి పెరుగుదల బాగుంటుంది. ఫలితంగా మీ ఇంటి గార్డెన్లో పచ్చని మార్పులు వస్తాయి. -
ఎయిర్ హోస్టెస్ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!
చూడటానికి అందంగా కనిపించే ఎయిర్ హోస్టెస్ తమ విధులు సక్రమంగా నిర్వహించడానికి ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు. విమానంలోని ప్రయణికులకు ఆహారం అందించడంతో పాటు వారిని జాగ్రత్తగా చూసుకోవడమనేది చిన్న విషయం కాదు. ప్రయాణికులు తమ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించిన వారు నిస్సహాయులుగా ఉండిపోవాల్సిందే. వారు కోపానికి వచ్చిన, అసభ్య పదజాలం వాడిన కూడా భరించాల్సిందే. వారికి తిరిగి ఎదురుచెప్పే అవకాశం ఉండదు.. ఒకవేళ అలా చేస్తే ఉద్యోగం ఉండదనే భయం. ఇది వారి పరిస్థితి. గత కొంతకాలంగా ఎయిర్ హోస్టెస్‌లతో కొందరు ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు బయటికొస్తున్న.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వారిపై సంబంధిత అధికారులు కానీ, సంస్థలు కానీ కఠిన చర్యలు తీసుకోకపోవడమే అందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ఎయిర్ ఏషియాకు చెందిన ఫ్లైట్‌లో జరిగిన ఓ భయానక సంఘటనను తాను ఇప్పటికి మరచి పోలేకపోతున్నానని చెబుతున్నారు ఓ ఎయిర్ హోస్టెస్. ఎయిర్ ఏషియాలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న నురాలియా మజ్లాన్.. తన సహోద్యోగిపై జరిగిన దాడిని వివరించారు. ‘కొన్నాళ్ల కిందట ఆ ఎయిర్ హోస్టెస్‌తో చైనాకు చెందిన ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. అదే ఫ్లైట్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్ పక్కన ఆమెకు కూర్చొనే అవకాశం దక్కలేదు. సీట్ల మార్పుకు ఇతర ప్రయాణికులు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆమె ఎయిర్ హోస్టెస్‌పై దాడి చేసింది. ఎయిర్ హోస్టెస్ ముఖంపై న్యూడిల్స్ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది. అంతటితో ఆగకుండా ఎయిర్ హోస్టెస్‌పై పెద్దగా కేకలు వేసింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని అంశంలో ఎయిర్ హోస్టెస్‌పై తన కోపాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే తిరిగి ఆమె ప్రశ్నించలేదనే ధీమాతో. దీనిని గమనించిన ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెని సముదాయించే ప్రయత్నం చేస్తూంటే.. ఆమె మాత్రం ఇంకా తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి చేరుకున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా విమానాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్ కాగానే ఆమెను ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆమెను మాత్రం సదురు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించార’ని నురాలియా తెలిపారు. తాము యూనిఫామ్ ధరించి నిస్సహాయంగా ఉంటాం కాబట్టే కొందరు ప్రయాణికులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వేడినీటి స్నానంతోనూ వ్యాయామ లాభాలు...
రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకునేందుకు మధుమేహులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ జాబితాలోకి వేడినీటి స్నానం కూడా చేర్చుకుంటే మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. దీనివల్ల శరీరంలో ఏర్పడే మంట/వాపు తీవ్రత కూడా తగ్గుతుందని అమెరికన్ ఫిజియలాజికల్ సొసైటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తేల్చారు. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో మంట/వాపుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఎక్కువవుతాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఈ మంట/వాపు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో వ్యాయామానికి ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకునేందుకు అమెరికన్ ఫిజియాలజీ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతమంది ఊబకాయులు, వ్యాయామం చేయని వ్యక్తులను ఎన్నుకుని ప్రయోగాలు చేశారు. వీరిని రెండు గుంపులుగా విడగొట్టారు. ఒక వర్గాన్ని వేడిగా ఉండే గదిలో.. ఇంకో వర్గం వారిని వేడినీటిలో కొద్దిసేపు ఉండేలా చేశారు. మూడు రోజుల గ్యాప్‌తో గుంపులు తాము చేసే పనిని మార్చుకున్నాయి కూడా. దశలవారీగా సేకరించిన రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మంట/వాపులకు సంబంధించిన ఐఎల్–6 రసాయనం తగ్గినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోతాదులు కూడా నియంత్రణలోకి వచ్చినట్లు స్పష్టమైంది. -
చిన్నారిపై వేడినీళ్లు పోసిన మహిళ
ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలో ఓ చిన్నారిపై పొరుగింటి మహిళ వేడినీళ్లు పోసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. తుమ్మలగడ్డ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ చికెన్ దుకాణంలో పనిచేస్తూ భార్య షమీమ్, కుమారుడు హఫీజ్ (5)తో కలసి జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి హఫీజ్ తమ ఇంటి పక్కనే ఉన్న బంధువు అయిన నసీమా అనే మహిళ ఇంట్లో ఆమె కూతురితో కలసి ఆడుకోవడానికి వెళ్లాడు. గంట తర్వాత నసీమా వచ్చి ‘మీ అబ్బాయి ఆడుకుంటుండగా..స్టౌ మీద ఉన్న వేడినీటి గిన్నె మీద పడింది..’అని చెప్పింది. బాలుడి తల్లి షమీమ్ వెళ్లిచూడగా అప్పటికే హఫీజ్ వీపు కాలి, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చిన బాలుడు తన మీద నసీమా వేడినీళ్లు పోసిందని, వద్దని ఏడుస్తున్నా బలవంతగా పట్టుకొని పోసిందని చెప్పగా బాలుడి తల్లిదండ్రులు దీనిపై నసీమాను నిలదీశారు. ఆమె వాగ్వాదానికి దిగడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కువచ్చి సీఐ రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేశ్‌కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. -
భర్తతో చనువుగా ఉంటోందని.. వేడి నీళ్లు పోసిన భార్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో చనువుగా ఉంటోందనే కోపంతో మహిళపై భార్య వేడి నీళ్లు పోయండంతో నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజు, రహమత్‌లు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఉప్పర్‌పల్లి సత్సంగ్ విహార్‌కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉండే మహారాష్ట్రకు చెందిన చంద్రిక(25) రాజు వద్దే పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం రహమత్ పుట్టింటికి వెళ్లడంతో రాజు, చంద్రిక మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన రహమత్.. చంద్రిక తన భర్తతో చనువుగా ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈ నెల 7న రాత్రి చంద్రికను మాట్లాడదామని ఇంట్లోకి పిలిచిన రహమత్ బాగా కాగిన వేడి నీళ్లను పోసింది. దీంతో చంద్రిక వీపు, ముఖం బాగా కాలడంతో ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు స్థానికుల సహాయంతో ఉస్మానియాకు తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న చంద్రిక శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.