భర్తపై మరిగే నీళ్లు పోసిన భార్య
చెన్నై(కేకేనగర్):
ఇద్దరి మధ్య గొడవల్లో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై మరిగే నీళ్లను పోసిన సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి సమీపంలోని పాంచులినగర్‌కు చెందిన పళని (45) మాజీ సైనికుడు. భార్య మలర్‌కొడి (34)తో ఈయన తరచూ గొడవపడేవాడు. బుధవారం ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహం చెందిన మలర్‌కొడి స్టవ్‌పై మరుగుతున్న నీటిని భర్త శరీరంపై పోసింది. దీంతో పళని పొట్ట, చేతులు, కాళ్లు కాలి బొబ్బలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆయన కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పళణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురుపరపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.