palani
-
600 మెట్లపై హారతి కర్పూరం వెలిగించిన సామ్ ..ఫోటోలు వైరల్
-
‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ చెప్పారు. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్ ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి. -
ఇద్దరు ప్రియురాళ్లను ఒకేసారి పెళ్లాడాడు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆ ఆటోడ్రైవర్ 14 అడుగులు నడిచి పెళ్లి చేసుకున్నాడు. అవును నిజంగా నిజం. అతడు ఏకకాలంలో ఇద్దరు యువతులను పెళ్లాడాడు మరి. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపూరు జిల్లా ధారాపురానికి చెందిన 19 ఏళ్ల యువతి గతనెల 29వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. సదరు యువతి పళని బస్‌స్టేషన్‌లో ఒక యువకుడితో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం వారిని పట్టుకున్నారు. అయితే అక్కడ వారిద్దరితోపాటూ ఉన్న మరో యువతి తనను కూడా తీసుకెళ్లమని పట్టుబట్టడంతో ముగ్గురిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ యువకుడు ధారాపురం పుదుకోట్టైమేడుకు చెందిన ఆటోడ్రైవర్ (26) కాగా, ఇద్దరు యువతులు సైతం అదే ప్రాంతానికి చెందినవారుగా తెలుసుకున్నారు. ముక్కోణపు ప్రేమకథ అవివాహితుడైన ఆటోడ్రైవర్‌కు భర్తకు దూరమై వేరుగా కాపురం ఉంటున్న 25 ఏళ్ల యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలాగే అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతితో కూడా అతను ప్రేమ వ్యవహారం నడిపాడు. కొద్దిరోజుల్లో ఆటోడ్రైవర్ బండారం ఇద్దరు యువతులకు తెలిసిపోవడంతో అతన్ని నిలదీశారు. దీంతో ఆటోడ్రైవర్ ఇద్దరినీ వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆటోడ్రైవర్ పన్నాగాన్ని పసిగట్టిన ఇద్దరు యువతులు కూడబలుక్కున్నారు. ఇద్దరూ ఏకకాలంలో అతడిని వివాహమాడాలని, కలిసి కాపురం చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని అతడికి చెప్పడంతో ఆటోడ్రైవర్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. ముగ్గురూ కలుసుకుని పెద్దలతో చెప్పకుండా ఇళ్లు వదిలి పళనికి పారిపోయారు. అక్కడి ఒక ఆలయంలో ఇద్దరు యువతుల మెడలో అతడు తాళి కట్టి పెళ్లాడాడు. పెళ్లి చేసుకొని పళని నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌లో నిల్చుని ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతుల కుటుంబీకులు లబోదిబోమంటూ ఆ పెళ్లికి నిరాకరించారు. యువతులకు ఎంతగా నచ్చజెప్పినా ఆటోడ్రైవర్‌తోనే కలిసి ఉంటామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు చేసేదిలేక ఇద్దరు పెళ్లాలతో ముద్దుల మొగుడిని సాగనంపారు. -
భర్తపై మరిగే నీళ్లు పోసిన భార్య
చెన్నై(కేకేనగర్): ఇద్దరి మధ్య గొడవల్లో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై మరిగే నీళ్లను పోసిన సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి సమీపంలోని పాంచులినగర్‌కు చెందిన పళని (45) మాజీ సైనికుడు. భార్య మలర్కొడి (34)తో ఈయన తరచూ గొడవపడేవాడు. బుధవారం ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన మలర్కొడి స్టవ్‌పై మరుగుతున్న నీటిని భర్త శరీరంపై పోసింది. దీంతో పళని పొట్ట, చేతులు, కాళ్లు కాలి బొబ్బలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆయన కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పళణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురుపరపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళనాట ప్రమాదం: అయ్యప్ప భక్తుల మృతి
తమిళనాడు రాష్ట్రంలోని పళని సమీపంలోని తెరియకులం వద్ద తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపోను లారీ ఢీకొంది. దాంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో ముగ్గురిని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. వీరి పేర్లు రాహుల్, రెడ్డి ప్రసాద్, చండ్రాయుడు. మరో ఇద్దరు రెండు వాహనాల డ్రైవర్లు. అతి వేగంగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. తమిళనాడు పళని వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను తేని జిల్లా పెరియాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.