తమిళనాడు రాష్ట్రంలోని పళని సమీపంలోని తెరియకులం వద్ద టెంపోను లారీ ఢీకొంది. దాంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తమిళనాడు రాష్ట్రంలోని పళని సమీపంలోని తెరియకులం వద్ద తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపోను లారీ ఢీకొంది. దాంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులలో ముగ్గురిని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. వీరి పేర్లు రాహుల్, రెడ్డి ప్రసాద్, చండ్రాయుడు. మరో ఇద్దరు రెండు వాహనాల డ్రైవర్లు. అతి వేగంగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. తమిళనాడు పళని వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను తేని జిల్లా పెరియాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.