
ప్రతీకాత్మక చిత్రం
దతియా(మధ్య ప్రదేశ్): తాగుడుకు డబ్బులివ్వలేదని భార్యపై కాల్పులు జరిపి పిల్లలను కత్తితో పొడిచాడో భర్త. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లా ఇంద్రగడ్ గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మోను జా(32), జ్యోతి(30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. మోను జా నిత్యం తాగుతూ భార్యాపిల్లల్ని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. మద్యానికి డబ్బులు కావాలని కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు.
శుక్రవారం ఉదయాన్నే వచ్చి మద్యానికి డబ్బులు కావాలని భార్యను బెదిరించాడు. డబ్బులు ఇవ్వడానికి భార్య నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న దేశీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఐదేళ్ల, ఆరు నెలల కూతుళ్లపై కత్తితో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న మిగతా కుటుంబసభ్యులు గాయపడిన వారిని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరు నెలల చిన్నారి మృతిచెందింది. సంఘటన జరిగిన వెంటనే నిందితుడు మోనుజా పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment