
ఒకటిన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ కెటిల్.. ఆటో షట్‌ఆఫ్, బాయిల్–డ్రై ప్రొటెక్షన్‌తో రూపొందింది. ఈ మెషిన్‌తో టీ, కాఫీలతో పాటు ఇన్ స్టంట్ నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. దీనిలో ఫారెన్ హీట్ లేదా సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత యూనిట్‌ని మార్చడానికి వీలుగా ప్రత్యేకమైన బటన్ ఉంటుంది.
బాయిల్ లేదా స్టాప్ బటన్ సాయంతో.. దీన్ని చాలా సులభంగా వాడుకోవచ్చు. ఫుడ్–గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఉన్న ఈ డివైస్.. మగ్ మాదిరి వినియోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైక్వాలటీ టెక్నాలజీతో, యాంటీ స్కాల్డ్ హ్యాండిల్‌తో చూడటానికి భలే అందంగా ఉంటుంది. కిచెన్ ఇంటీరియర్ లుక్ కోసం కూడా దీన్ని ఎన్నుకోవచ్చు. ధర 40 డాలర్లు (రూ.3,315)
Comments
Please login to add a commentAdd a comment