
సాక్షి, చెన్నారావుపేట (వరంగల్): ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్నానం చేయించడానికి పెట్టిన వేడి నీటి బకెట్‌లో పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కందికడ్డతండా శివారు ఔసుల్‌తండాలో బుధవారం రాత్రి జరిగింది. తండాకు చెందిన సహదేవుల వెంకన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె జాహ్నవి(3) ఉంది. ఈ నెల 6న స్నానం చేయించడానికి తల్లి వేడి నీళ్లు సిద్ధం చేసింది.
బట్టలు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లిన క్రమంలో జాహ్నవి బకెట్‌లో పడిపోయి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి బుధవారం రాత్రి మృతి చెందింది. చిన్నారి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment