drowns
-
గుజరాత్ వరదలు : ‘‘బతకడానికి ఇంకేం మిగల్లేదు’’!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. వడోదర సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది గాంధీనగర్, ఖేడా, వడోదర తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 18వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 15 అడుగుల పొడవైన మొసళ్లు ఇళ్లల్లోకి చొరబడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వడోదర నివాసి ఆవేదన గుజరాత్ వర్షభీభత్సానికి అద్దం పట్టింది. వరద ఉదృతికి విలువైన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయంటూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇక బతకడానికి ఏమీ మిగల్లేదు అంటూ తన బాధను పంచుకున్నాడు. దీనికి సంబంధించి నీట మునిగిన తన మూడు కార్ల ఫోటోలను రెడ్డిట్ యాప్‌లో షేర్ చేశాడు. పోస్ట్ ప్రకారం, 50 లక్షల రూపాయల విలువైన ఖరీదైన కారు ఆడి ఏ6,మారుతి సుజుకి సియాజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.అయితే వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న నెటిజన్లు వ్యాఖ్యలకు స్పందించిన ఆయన మరింత వివరంగా తన దుస్థితిని వివరించాడు. తాను 5 BHK బంగ్లాలో ఉంటాననీ 85 ఇళ్లు ఉన్న సొసైటీలో, ప్రతీ ఇంటికి 3 కార్ పార్కింగ్లు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయని , తన ఇంట్లోకి 7 అంగుళాలు, బయట దాదాపు 4 అడుగుల నీరు చేరిందని తెలిపారు. దీంతో నెటిజన్లు సానుభూతి ప్రకటించారు.VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK— Press Trust of India (@PTI_News) August 29, 2024 -
తీవ్ర విషాదం: చిన్నారిని మింగేసిన స్విమ్మింగ్ పూల్.. తండ్రి కళ్లెదుటే
మునగపాక/అనకాపల్లి టౌన్ (విశాఖ): వేసవి సెలవుల్లో సరదాగా పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు క్షణాల్లో కుమారుడిని కోల్పోయారు. భగవంతుడా.. ఏమిటీ ఘోరమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మునగపాక మండలం అరబుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఈతకు దిగి, నీట మునిగారు. అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో అన్న రాపేటి పవన్ (8) తిరిగిరాని లోకాలకు చేరుకోగా తమ్ముడు చరణ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ రాపేటి గంగునాయుడు (చంటి) దంపతులు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని అనకాపల్లి బైపాస్ దరి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. తన పిల్లలకు ఈత నేర్పించేందుకు తండ్రి పూల్‌లోకి దిగారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలు అంతలోనే నీట మునిగి ప్రమాదానికి లోనయ్యారు. సంఘటన జరిగిన సమయంలో ఒడ్డున ఉన్న తల్లి మాధవి ఏం చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంది. కళ్లెదుటే చనిపోయిన కుమారుడిని చూసి బోరున విలపించడంతో స్థానికులు కూడా కంటతడి పెట్టారు. ఫిర్యాదు చేయకుండా పవన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో.. పట్టణ ఎస్ఐలు దివాకర్, సత్యనారాయణ, ఎస్.ప్రసాద్ అరబుపాలెం గ్రామానికి చేరుకొని పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో అరబుపాలెంలో విషాదం నెలకొంది. -
కోకాపేటలోని ఓ అపార్ట్ మెంట్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి
-
నార్సింగిలో విషాదం: ఫంక్షన్‌కు వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్‌పూల్‌లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు) -
‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): ‘కొడుకా.. ఒక్కగానొక్కడివి.. అల్లారు ముద్దుగా పెంచితిమి.. మంచి సదువులు సదివి ముసలోల్లమయ్యాక మమ్మల్ని సాకుతవని ఆశపడ్తిమి.. నీ మీద ఎన్నో కలలు కంటిమి.. మధ్యల నువ్ గిట్ల జేత్తివి బిడ్డా.. ఇక మేం ఎవరి కోసం బతుకుడు బిడ్డా’ అంటూ మారంపెల్లి శరత్ తండ్రి మారంపెల్లి సతీశ్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తుమ్మెనాలకు చెందిన మారంపెల్లి శరత్(12,) పవ్బం నవదీప్(12), యాదాద్రి భువనగిరి జిల్లా దాసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13) ఆదివారం ఈతకోసమని పాఠశాల సమీపంలోని చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన విషయం విదితమే. కన్నకొడుకు చనిపోయాడనే సమాచరం అందుకున్న సతీశ్.. బెహరాన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక, కొడుకు, భార్యను సాకేందుకని సురేశ్ 4నెలల క్రితమే బెహరాన్ వెళ్లాడు. అతడి భార్య రజిత గ్రామంలో కూలీ పనులు చేస్తూ కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం చెరువులోకి వెళ్లి కొడుకు మృతి చెందడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. బెహరాన్ నుంచి వచ్చిన సురేశ్.. ప్రీజర్‌లో ఉంచిన కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఉపాధ్యాయుల సంతాపం ముగ్గురు విద్యార్థుల మృతికి ప్రధానోపాధ్యాయుడు గాదె శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. విషాదంలో నవదీప్ కుటుంబం.. కిషన్ – పుష్పలత దంపతులకు కుమారుడు పబ్బతి నవదీప్, ఓ కూతురు ఉంది. కిషన్ ఉ పాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతడు మంగళవారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది. నవదీప్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచా రు. తండ్రి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేస్తారు. మృతి చెందిన మరో విద్యార్థి గొలు సుల యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు తీసుకెళ్లారు. చదవండి: దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి.. -
ఎంత ఘోరం : వేడి నీళ్లని తెలువక పాయె..
సాక్షి, చెన్నారావుపేట (వరంగల్): ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్నానం చేయించడానికి పెట్టిన వేడి నీటి బకెట్లో పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కందికడ్డతండా శివారు ఔసుల్‌తండాలో బుధవారం రాత్రి జరిగింది. తండాకు చెందిన సహదేవుల వెంకన్నకు ఇద్దరు కుమారులు, కుమార్తె జాహ్నవి(3) ఉంది. ఈ నెల 6న స్నానం చేయించడానికి తల్లి వేడి నీళ్లు సిద్ధం చేసింది. బట్టలు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లిన క్రమంలో జాహ్నవి బకెట్లో పడిపోయి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జాహ్నవి బుధవారం రాత్రి మృతి చెందింది. చిన్నారి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ స్వామి తెలిపారు. చదవండి: సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్ -
విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో..
సాక్షి, సంతబొమ్మాళి(శ్రీకాకుళం): మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో శేఖర్ కుమార్ బెహరా (21) మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్న 50 మంది విద్యార్థులు బస్సులో ఆదివారం బీచ్‌కు వచ్చారు. భోజనాల అనంతరం విద్యార్థులు సముద్రంలో స్నానాలకు దిగారు. ఇంతలో ఓ రాకాసి అల తాకిడికి శేఖర్‌కుమార్, ముక్తా ప్రధాన్‌తో పాటు మరికొందరు విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. కాసేపటికే అంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే శేఖర్ మునిగిపోతున్నాడని గ్రహించిన ముక్తా ప్రధాన్ అతడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా అలల మధ్య చిక్కుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు ఎలాగోలా కష్టపడి ముక్తాను రక్షించగలిగారు. కానీ శేఖర్‌ను మాత్రం ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. సాయంత్రం సమయంలో మృతదేహం ఒడ్డుకు చేరడంతో అంతా బోరుమన్నారు. శేఖర్‌కుమార్ స్వస్థలం బరంపురం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్ రాసి.. -
వైఎస్సార్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
సాక్షి, వైఎస్సార్: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి. (చదవండి: వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..) చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో గల్లంతయ్యారు. అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: వర్షాలపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. -
అమ్మా..! నాకూ, తమ్ముడికి ఈత రాదు
సాక్షి,తాడేపల్లిరూరల్: అమ్మా! నాకూ తమ్ముడికి, నీకు ఈతరాదు.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోదాం పద.. నాన్న, తాతయ్య దగ్గర మనం ఉండవద్దు అంటూ కన్న కూతురు వేడుకున్నా.. ఆ తల్లి హృదయం కరగలేదు. మామ పెట్టిన బాధలు గుర్తుకు వచ్చి గుండెను దిటవు చేసుకున్న ఆ అమ్మ బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్ద కృష్ణానదికి పడవలు వెళ్లే దారిలో కూతురు, కొడుకుతో కలిసి కాలువలోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. అసలేం జరిగిందంటే.. విజయవాడకు వన్‌టౌన్‌కు చెందిన పవన్ కుమార్‌కు ఖమ్మం జిల్లా రాంపురానికి చెందిన శాంతిప్రియకు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు. భర్తకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకుంటోంది. మామ రామకృష్ణ వేధిస్తుండడంతో శాంతిప్రియ భర్తకు చెప్పింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక తన పెద్దకుమార్తె స్పందన, కొడుకు తలామ్ రాజును తీసుకుని బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు గమనించాడు. అడ్డు కునే లోపలే ఆమె తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తనూ దూకింది. అక్కడే చేపలు పడుతున్న నాగరాజు, యేసు, యాకోబు, క్రిస్టియన్ బాబు కాలువలోకి దూకి ముగ్గురినీ కాపాడి బయటకు తీసుకు వచ్చారు. శాంతి ప్రియ తనను ఎందుకు బతికించారు అంటూ భోరున విలపించింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రామకృష్ణ ‘నీ మొగుడ్ని, రెండో కూతురిని కూడా తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటే మాకు పట్టిన పీడ వదిలేదని’ అనడంతో పోలీసులు తమదైన శైలిలో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శాంతిప్రియ తల్లిదండ్రులను పిలిపించి, పిల్లల్ని, ఆమెను ఇంటికి పంపారు. భర్తకు కిడ్నీ దానం చేసిన శాంతిప్రియ భర్తకు మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలూ చెడిపోవడంతో భర్త తండ్రిగానీ, తమ్ముడు కానీ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. శాంతిప్రియ తన కిడ్నీని దానం చేసింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా ఇంట్లో పనిమొత్తం ఆమె చూసుకుంటోంది. మామ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె ఎన్నిసార్లు భర్తకు చెప్పినా ఫలితం లేకపోయింది. భర్త కూడా తననే మందలించడంతో తన అమ్మానాన్నలకు చెప్పింది. వారూ సర్దుకుపోవాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రెండో కుమార్తెను భర్త బయటకు తీసుకెళ్లడంతో ఆ సమయంలో మిగిలిన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. -
సముద్రంలో పడిన మహిళ..! కాపాడిన ఫోటోగ్రాఫర్..వీడియో వైరల్..!
ముంబై: మనకు ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఆపదలో చిక్కుకుంటే కాపాడే వ్యక్తులు రావడం మన అదృష్టమే. తాజాగా ముంబైలోని. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో గోడపై కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోతే ఓ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. గేట్ వే ఆఫ్ ఇండియాను చూడడానికి వచ్చిన 30 ఏళ్ల పల్లవి ముండే పక్కనే ఉన్న గోడ మీద కూర్చొని ఉంది. ఒక్కసారిగా ఆ మహిళకు మైకం రావడంతో పక్కనే ఉన్నా సముద్రంలో పడిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చినా గులాబ్‌చంద్ గోండ్ గమనించి ఆమెను రక్షించడానికి వెంటనే సముద్రంలో దూకాడు. ఆమెను తాడు సహాయంతో ఒడ్డు తీసుకొచ్చాడు . కాగా ఆ మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్పూర్తితో మహిళను కాపాడినందుకుగాను ఫోటోగ్రాఫర్పై ప్రశంసల జల్లులు వెలువెత్తున్నాయి. #WATCH | Mumbai: A photographer rescued a woman who lost her balance as she was sitting on the safety wall near Gateway of India and fell into the sea yesterday. pic.twitter.com/9Nraxm0gVu — ANI (@ANI) July 12, 2021 -
పెను విషాదం: సరదాగా వెళ్లి.. శవాలై వచ్చారు..
అమలాపురం రూరల్(తూర్పుగోదావరి): గోదావరిలో స్నానం చేయాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను తీసింది. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆ ముగ్గురు యువకులు తల్లిదండ్రులకు చేతికందొస్తున్న వేళ గోదావరి వారి నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది. స్నేహమేరా జీవితమనుకున్న యువకులను తిరిగి రాని లోకాలకు పంపేసింది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు.. మరణం విషయంలోనూ కలిసే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక గౌతమీ నదీ పాయలో బుధవారం జరిగిన ప్రమాదంలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి శివారు శెట్టిపేటకు చెందిన దంగేటి ఫణికుమార్ (19), కుడుపూడి ప్రేమ్‌సాగర్ (17), మామిడిశెట్టి బాల వెంకటరమణ (19) ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో కుటుంబానిదీ ఒక్కో కన్నీటి కథ ఫణికుమార్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి కోటేశ్వరరావు దివ్యాంగుడు. పేపర్ ఏజెంట్‌గా శ్రమిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. ఫణికుమార్ రెండో కొడుకు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశ పడుతున్న ఆ కుటుంబానికి ఫణి మృతి తీరని వ్యధ మిగిలింది. ప్రేమ్‌సాగర్ డిప్లమో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతానం లేకపోవడంతో మునేశ్వరరావు, సూర్యకుమారి దంపతులు ఈ కుర్రాడిని దత్తత తీసుకున్నారు. మూడేళ్ల కిందట సూర్యకుమారి చనిపోయింది. ఆరు నెలల కిందట మునేశ్వరరావు కరోనాతో కన్ను మూశాడు. దీంతో అనాథ అయిన ప్రేమ్‌సాగర్‌ను చిన్నాన్న రామకృష్ణ చేరదీసి పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురూ చనిపోయినట్లయింది. బాల వెంకటరమణ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాసరావు ఆటో నడుపుతాడు. తల్లి పార్వతి కిరాణా దుకాణంలో పని చేస్తోంది. వారికి వెంకటరమణ ఒక్కడే కొడుకు. చేతికందొచ్చే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో బుధవారం మధ్యాహ్నం ఓ వేడుకకు ముగ్గురూ ఒకే మోటారు సైకిల్‌పై వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు చేసి దగ్గరలోనే ఉన్న గేదెల్లంక గౌతమీ నది ఉత్తర వాహిన పుష్కర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురూ సరదాగా స్నానం చేద్దామని గోదావరిలోకి దిగారు. స్నానాలు చేస్తున్న సమయంలో ఒకరు తర్వాత ఒకరు గోదావరిలోకి మునిగి పోయి గల్లంతయ్యారు. చివరికి అయినవారికి గుండెకోత మిగిల్చుతూ గురువారం ఉదయం గేదెల్లంక గోదావరిలో శవాలై తేలారు. వారి మృత్యు వార్త విని ఆ మూడు కుటుంబాలే కాదు శెట్టిపేటే కన్నీరు మున్నీరయింది. చదవండి: అతి వేగానికి బ్రేకులు.. భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..! -
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!
సాక్షి, ముంబై: ప్రస్తుత కాలంలో తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం సాధారణంగా గూగుల్ మ్యాప్‌నే నమ్ముకుంటాం..గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత, తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాలను ఎంచుకోవడం, షార్ట్ కట్స్‌ను తెలుసుకోవడంమే కాదు గూగుల్ మాత ఉందిగా ఎందుకు బెంగ అనేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే గ్యూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని తప్పులో కాలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. డ్రైవర్ సతీష్, మిత్రుడు సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా రాంగ్ రూట్ చూపించింది గూగుల్. కానీ అది తెలియని వీరు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు. చీకటిపడినా గూగుల్ మ్యాప్ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు..అంతే కారు క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ, సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక, కారులోనే ప్రాణాలొదిలాడు. మరునాడు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే, అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందనిడిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే తెలిపారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా, నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జిమునిగిపోతుందని వెల్లడించారు. ఈ విషయం స్థానికులకు తెలుసు కనుక వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ రాత్రి పూట, గూగుల్ డైరెక్షన్ ఆధారంగా వెళ్లి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారన్నారు. గూగుల్ మ్యాప్‌లను గుడ్డిగా నమ్మితే, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని ఈ సంఘటన నిరూపిస్తోంది. సో...తస్మాత్ జాగ్రత్త! -
విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం
2020 భారతీయ సినీ పరిశ్రమలో తీరని విషాదాన్ని మిగిల్చింది. రెండురోజుల క్రితం దర్శకుడు షానవాజ్ మరణం నింపిన విషాదాన్నుంచి ఇంకా తేరుకోక ముందే మలయాళ మూవీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరుస్తోంది. ప్రముఖ నటుడు అనిల్ పీనేదుమంగాడ్ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనిల్ శుక్రవారం సాయంత్రం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుపుళం మలంకర డ్యామ్‌లో ప్రమాదవశాత్తు మునిగి కన్నుమూశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాయంత్రం నేడు స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ సహా, మలయాళ చిత్రపర్రిశమ ప్రముఖులు అనిల్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ) ఇలక్కీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీటిలో మునిగి అనిల్ ప్రాణాలు కోల్పోయారు. తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రమాదం సంభవించిందనీ, వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ముట్టం పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా తిరువనంతపురానికి చెందిన అనిల్ ‘కమ్మతిపాడమ్ మూవీతో ఫ్యామస్ అయ్యారు. ఆ తరువాత రాజీవ్ రవి చిత్రం కమ్మట్టిపాడోమ్లో విలన్‌గా, మలయాళ సూపర్‌హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియమ్‌లో పోలీసు అధికారిగా అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్నారు. ఇంకా పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్ చిత్రాల్లో కూడా ఆయన తనదైననటనతోఆకట్టుకున్నారు. మరోవైపు యాదృచ్చికంగా మరణించడానికి కొన్ని గంటల ముందు అనిల్ ఫేస్బుక్లో ఒకపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో మరణించిన అయ్యపనమ్ కోషియం దర్శకుడు సచి లేదా కె.ఆర్ సచిదందన్ను తలుచుకుంటూ.. నేను చనిపోయేవరకు మీరు నా ఎఫ్బి కవర్ ఫోటోలో ఉంటారంటూ ఫేస్బుక్లో రాశారు. దీంతో అనిల్ అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. అంతకుముందు ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. (ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు) Nothing. I have nothing to say. Hope you’re at peace Anil etta. 💔 pic.twitter.com/B6hOHGffkA — Prithviraj Sukumaran (@PrithviOfficial) December 25, 2020 View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
పాతబస్తీలో వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతు
-
‘అతని తలరాతని విధి మలుపు తిప్పింది’
వాషింగ్టన్: మది దోచిన నెచ్చలికి తన మనసులో మాట చెప్పి.. ఆమె వెచ్చని కౌగిలిలో సేద దీరాలని భావించిన అతడిని మృత్యువు తన బిగి కౌగిలిలో శాశ్వతంగా బంధించింది. ప్రియుడి నోటి నుంచి ప్రేమిస్తున్నాను అనే మాట విని సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి.. మరు నిమిషంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి గుండె పగిలేలా రోదిస్తుంది. వివరాలు.. అమెరికా లూసియానాకు చెందిన స్టీవ్ వెబర్, కెనేషా అనే యువతిని గత కొద్ది కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం వీరిద్దరు టాంజేనియా వెళ్లారు. అక్కడే స్టీవ్, కెనేషాకు ప్రపోజ్ చేయాలని భావించాడు. సాధారణంగా మోకాళ్ల మీద కూర్చుని.. ఉంగరం పట్టుకుని.. ‘విల్ యూ మ్యారీ’ అని అడగడం స్టీవ్‌కు ఇష్టం లేదు. దాంతో కాస్తా వెరైటీగా ప్రయత్నిద్దామని చెప్పి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నీటి లోపల ప్రపోజ్ చేద్దామని అనుకుని.. సముద్రంలోకి దూకాడు స్టీవ్. ఆ తర్వాత బోటులో తాము ఉంటున్న క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఉంగరాన్ని బయటకు తీసి, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని ఉన్న లెటర్ని చూపిస్తూ కెనేషాకు ప్రపోజ్ చేశాడు. అటు కెనేషా కూడా సంతోషంతో స్టీవ్ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇంకేముంది కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. అనుకోకుండా స్టీవ్ జీవితం తలకిందులయ్యింది. ప్రపోజ్ చేయడం కోసం నీటిలో మునిగిన స్టీవ్ మరిక బయటకు రాలేదు. అతడు నీటిలో మునిగి చనిపోయాడు. ఓ నిమిషం క్రితం వరకు సంతోషంగా సాగిన స్టీవ్ జీవితం.. అలా అనూహ్యంగా ముగిసి పోయింది. జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగలాల్సిన రోజు కాస్త పీడకలగా మారిపోయింది. కెనేషా బాధ అయితే వర్ణనాతీతం. ‘విధి స్టీవ్ జీవితంతో ఆడుకుంది. సంతోషంగా సాగుతున్న తరుణంలో స్టీవ్ జీవితం కృరమైన మలుపు తిరిగింది. మా జీవితంలో ఉత్తమంగా నిలవాల్సిన రోజు.. చెత్తగా మిగిలిపోయింది. స్టీవ్ నీవు ఆ లోతుల నుంచి ఎన్నటికి బయటకు రాలేవు. కాబట్టి నా సమాధానాన్ని కూడా వినలేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. కొన్ని లక్షల సార్లు నీ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతున్నాను. ప్లీజ్ స్టీవ్ నా కోసం వచ్చేయ్’ అంటూ కెనేషా హృదయవిదారకంగా రోదిస్తుంది. తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ విషాదంత కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. -
బాలి బీచ్‌లో ‘భారతీయ’ ఎకనామిస్ట్ మృతి
జకర్తా : ప్రముఖ ఆర్థిక నిపుణురాలు ఆకాంశ పాండే ఇండోనేషియాలోని బాలి బీచ్‌లో మృతిచెందారు. శనివారం సాయంత్రం బీచ్‌లోని నిషేధిత ప్రాంతంలో ఆమె స్విమ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన అలలు ఒక్కసారిగా ఆమెను తాకడంతో ఆకాంశ ప్రవాహంలో కొట్టుకుపోయారు. బీచ్ లైఫ్‌గార్డ్ ఆమెని కాపాడేందుకు ప్రయత్నించారు. అలల్లో కొట్టుకుపోతున్న ఆమెను బయటకు తీసుకువచ్చిన సిబ్బంది.. వెంటనే ఆమెను సిలోమ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆకాంశ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. భారత్ సంతతికి చెందిన ఆకాంశ ప్రస్తుతం యూఎస్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్ హెల్త్ ఎకనామిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఈ ఘటనపై బీచ్ అధికారులు మాట్లాడుతూ.. అకాంక్ష స్విమ్ చేస్తున్న ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు సూచికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ ఆకాంశ అవేమీ పట్టించుకోలేదని అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. లైఫ్‌గార్డ్‌లు రెండుసార్లు ఆకాంశను హెచ్చరించిన కూడా వారి మాట వినకుండా ఆమె ప్రాణాలు కొల్పోయిందన్నారు. -
షూటింగ్ స్పాట్లో నటుడి దుర్మరణం
నదీ తీరంలో షూటింగ్ జరుగుతుండగా విరామంలో.. ఓ నటితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన నటుడు దుర్మరణం చెందాడు. బ్రెజిల్ టీవీ రంగంలో టాప్ యాక్టర్‌గా కొనసాగుతోన్న డొమింగోస్ మాంటెగ్నర్ అనూహ్యరీతిలో మృతిచెందిన ఉదంతం ఆ దేశంలో చర్చనీయాంశమైంది. లీగల్ మెడికల్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ కార్దోస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బ్రెజిల్ ప్రఖ్యాత టీవీ సీరియల్ షూటింగ్ నిమిత్తం యూనిట్‌తో కలిసి గురువారం కానిండ్లే అనే గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామాన్ని ఆనుకునే సావ్ ప్రాన్సిస్కో నది ప్రవహిస్తూ ఉంటుంది. షూటింగ్ విరామంలో సహ నటి కామిల్లా పిటాంగాతో కలిసి డొమింగోస్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇద్దరూ జలకాలాటలలో మునిగిఉండగా.. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. ఒక బండరాయిని ఆసరాగా చేసుకుని కామిల్లా తననుతాను కాపాడుకోగా.. డొమింగోస్ మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది డొమింగోస్ కోసం గాలింపుచర్యను చేపట్టారు. ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, అంటే శుక్రవారానికి డొమింగోస్ మృతదేహాం లభ్యమైంది. గల్లంతైన ప్రదేశానికి 1000 అడుగుల దూరంలో నీటి అడుగున 60 అడుల లోతులో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన డొమింగోస్ మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీశామని కార్దోస్ లీగల్ మెడికల్ అధికారి జోస్ చెప్పారు. నిజానికి వారు నదిలోకి దిగిన చోటు ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. డొమింగోస్తొ కలిసి ఈతకు వెళ్లి తృటిలో ప్రాణాలు చేజిక్కించుకున్న నటి కామిల్లా ప్రమాదాన్ని వివరిస్తూ..'సరదాగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా నీళ్లొచ్చాయి. ఇద్దరం కొట్టుకుపోయాం. అయితే నాకొక బండరాయి ఆసరా దొరికింది. దానిపైకి ఎక్కి డొమింగోస్ కు చెయ్యి అందించే ప్రయత్నం చేశా. రెండు సార్లు దాదాపు దగ్గరగా వచ్చినా లాభం లేకపోయింది'అని చెప్పారు. 54 ఏళ్ల డొమింగోస్ సర్కర్ కళాకారుడిగా ప్రారంభమై, నాటక రంగంలో రాణించి, ఆపై టీవీ రంగంలో పేరు సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
నీటమునిగిన పంటలు
రేపల్లె : సాగునీరు అందక, వర్షాలు లేక ఒక ప్రాంత రైతులు ఆందోళన చెందుతుంటే మరో ప్రాంత రైతులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగి తల్లడిల్లిపోతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల పరిధిలో సుమారు 40 వేల హెక్టార్లలో వరిసాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు నారుమళ్ళు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామంలో వేసవిలో వేసిన వేరుశనగ, మోటార్ల సాయంతో వేసిన వరినారుమళ్లు నీట మునిగి పంట నీటిలో నానుతుండటంతో రైతులకు కంటతడి పెడుతున్నారు. రాంబొట్లవారిపాలెం, కావూరు, తుమ్మలపాలెం గ్రామపంచాయితీల పరిధిలో సుమారు 500 ఎకరాల వరకు వేరుశనగ సాగు చేస్తున్నారు. రాంబొట్లవారిపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని చిన్న, సన్నకారు రైతులు 100 మంది సుమారు 200 ఎకరాలలో వేరుశనగ వేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తున్న తరుణంలో కురిసిన వర్షాలకు పంట చేలలోకి నీరు చేరి వేరుశనగ పంట కుళ్లిపోయే దశకు చేరింది.