వైఎస్సార్‌ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు | AP Kadapa Fifteen People Drowned in the Cheyyeru River | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

Published Fri, Nov 19 2021 11:08 AM | Last Updated on Fri, Nov 19 2021 12:25 PM

AP Kadapa Fifteen People Drowned in the Cheyyeru River - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి.
(చదవండి: వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..)

చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో గల్లంతయ్యారు. అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

చదవండి: వర్షాలపై సీఎం జగన్‌ అత్యవసర సమీక్ష.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement