drowns in river
-
వైఎస్సార్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
సాక్షి, వైఎస్సార్: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజంపేట వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి. (చదవండి: వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..) చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం పదిహేను మంది నదిలో గల్లంతయ్యారు. అలానే అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: వర్షాలపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష.. -
సరదాగా బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కుటుంబం.. అంతలోనే..
సాక్షి, మంథని(కరీంనగర్): తొలి పండుగ వేళ సరదా కోసం బంధువులతో కలిసి బ్యారేజీ సందర్శనకు వచ్చిన ఓ బాలుడు నదిలో మునిగి విగతజీవిగా మారడం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ దిగువ నీటిలో మునిగి హైదరాబాద్‌లోని లాల్గూడ మల్కాజ్‌గిరికి చెందిన నెరిమెట్ల సాయిష్(16) మృతి చెందాడు. మంథని ట్రైనీ ఎస్సై అజయ్ కథనం ప్రకారం గోదావరిఖనిలోని తన బంధువు ఇంట్లో శుభకార్యం ఉండడంతో సాయిష్ ఈనెల16న వచ్చాడు. ఏకాదశి సందర్భంగా తన బంధువులతోపాటు మరి 10మంది కలిసి మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద కాసేపు కాలక్షేపం చేశారు. అయితే సాయిష్ బ్యారేజీ గేట్ల వైపు ఉన్న నీటిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు అందులోనే మునిగాడు. కాపాడేందుకు ప్రయత్నించగా నీటి గుంత కావడంతో ఫలితం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోపాటు కలివిడిగా ఉన్న సాయిష్ విగత జీవిగా మారడంతో వెంట వచ్చిన వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్యారేజీ దిగువన గుంతలున్న సమాచారం లేకపోవడంతో గతంలో కూడా పలువురు మృతి చెందారు. అటు వైపుగా వెళ్లకుండా భద్రతా సిబ్బంది నియంత్రించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
కృష్ణానదిలో ఇద్దరు యువకుల గల్లంతు
నాగాయలంక(అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్ వద్ద సోమవారం కృష్ణానదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం ఇద్దరు యువకులు రెడ్ మారుతీ వ్యాగనార్ కారులో వచ్చి స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉంటుందని లోపలకు వెళ్లవద్దని అక్కడున్న వారు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా నదిలో దిగిన ఆ ఇద్దరూ కొద్ది సేపటికే గల్లంతయ్యారు. ఇరువురిలో పవన్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు పడవపై ఘాట్ వద్దకు చేర్చారు. దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. మిత్రులైన వీరిరువురూ ప్రముఖ మెడికల్ సంస్థ జీఎస్కే (గ్లాక్సో) కంపెనీ సేల్స్ విభాగంలో పని చేస్తున్నారని, అందులో భాగంగానే మెడికల్ షాపులకు వచ్చి.. సరదాగా కాసేపు సేదదీరేందుకు కృష్ణానదిలో దిగి ఉంటారని భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన పరాచి పవన్‌కుమార్(26)గా, గల్లంతైన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్(24)గా గుర్తించారు. -
పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది.పెన్నా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన కుందూ పెన్నా సంగమం వద్ద చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకురాగా.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడు కమలాపురం వాసి జాఫర్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే పరామర్శ.. పెన్నా నదిలో కుందూ పెన్నా సంగమం వద్ద గల్లంతై మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు. హుస్సేన్ మృతదేహానికి నివాళులు అర్పించి అతని కుటుంబాన్ని ఓదార్చారు. గల్లంతైన మిగతా ముగ్గురు పిల్లల్ని బయటకు తెచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. -
అయ్యో ‘దుర్గా’..రూ.500 అప్పు తీసుకొనచ్చిన బిడ్డా..!
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘దుర్గ’ పేరు పెట్టుకొని దుర్గమ్మ తల్లిని కొలుస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఏడుపాయలకు వచ్చిన ఓ యువతి మంగళవారం రాత్రి స్నానానికి వెళ్లి నీటి మునిగి బుధవారం శవమై తేలింది. తండ్రిలేని ఆ ఆడ బిడ్డ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషిస్తోంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది. హైదరాబాద్‌లోని మొహిదిపట్నానికి చెందిన ముక్కర్ల బాలమణికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భర్త కొంతకాలం కిందట మరణించడంతో పెద్ద కూతురు దుర్గ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది. ఆమెకు ఏడుపాయల దుర్గమ్మంటే ఎనలేని భక్తి.. ప్రతియేడు ఏడుపాయల జాతరకు వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఏడుపాయలకు వచ్చి టేకుల బొడ్డె ప్రాంతంలోని మంజీరా పాయలో స్నానం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగింది. గమనించిన బోయిని పాపయ్య అనే గజ ఈతగాడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్, పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని రాత్రి 12గంటల వరకు మంజీరా నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దుర్గ శవం లభ్యమైంది. రూ.500 అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంట్లో చిల్లిగవ్వలేక పక్కింటి వాళ్ల దగ్గర రూ.500ల అప్పు తీసుకొని వచ్చిన బిడ్డా! ఇంత ఘోరం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తల్లీ.. నేను ఎవరి కోసం బతకాలి బిడ్డా...! అంటూ మృతురాలి తల్లి బాలమణి రోధించిన తీరు జాతరకు వచ్చిన భక్తులను కంటతడి పెట్టించింది. తమ బిడ్డ గల్లంతైందన్న విషయం తెలుసుకొని ఏడుపాయలకు వచ్చిన బాలమణికి తెల్లవారి శవం చూసేసరికి తెలియదు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లికి నోచుకోకుండానే కానరాని లోకాలకు వెళ్లడంతో బాలమణి కన్నీరు మున్నీరైంది. పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
ప్రియురాలితో కలిసి పారిపోయే ప్రయత్నంలో పంటకాలువలో పడి గల్లంతయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో జరిగింది. హైదరాబాద్ అల్వాల్‌లో మెకానిక్‌గా పనిచేసే వినయ్‌కుమార్... భీమవరానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో వినయ్ అమ్మాయి ఊరెళ్లి, వాళ్ల బంధువులతో గొడవ పడ్డాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి పారిపోయే ప్రయత్నంలో వినయ్ తాడేరు పంటకాల్వలో దిగాడు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. ప్రియురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి వినయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.