ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
ప్రియురాలితో కలిసి పారిపోయే ప్రయత్నంలో పంటకాలువలో పడి గల్లంతయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో జరిగింది. హైదరాబాద్ అల్వాల్‌లో మెకానిక్‌గా పనిచేసే వినయ్‌కుమార్... భీమవరానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో వినయ్ అమ్మాయి ఊరెళ్లి, వాళ్ల బంధువులతో గొడవ పడ్డాడు.
పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి పారిపోయే ప్రయత్నంలో వినయ్ తాడేరు పంటకాల్వలో దిగాడు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. ప్రియురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి వినయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.