విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఆ సాంగ్ వచ్చేసింది! | Vishwak Sen's Mechanic Rocky Movie Song Out Now | Sakshi
Sakshi News home page

Mechanic Rocky: 'ఐ హేట్‌ యూ డాడీ' అంటోన్న విశ్వక్ సేన్.. ఈ సాంగ్ విన్నారా?

Published Wed, Nov 6 2024 5:04 PM | Last Updated on Wed, Nov 6 2024 5:15 PM

Vishwak Sen's Mechanic Rocky Movie Song Out Now

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు  రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఐ హేట్‌ యూ మై డాడీ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ మెకానిక్ పాత్రతో అలరించనున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, నరేష్ వీకే, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement