mechanic
-
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా విడుదలైన ఐ హేట్ యూ మై డాడీ అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రతో అలరించనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, నరేష్ వీకే, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. It’s a new vibe, for sure😂Listen to our #IHateuMyDaddy from #MechanicRocky 🛠🔥🔗https://t.co/C0XtVfkoPW#MechanicRockyOnNOV22 🛠🎵 @JxBe🎤 #RamMiriyala✍️ #Sanare@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath @JxBe #RajaniTalluri @SRTmovies… pic.twitter.com/lpU6FzRc9X— VishwakSen (@VishwakSenActor) November 6, 2024 -
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్‌ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
‘మెకానిక్’తో ఆ సమస్య అర్థమవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
బైక్ ఆఫ్ అవడంతో బైక్ సీటు తెరిచి చూస్తే.. ఒక్కసారిగా షాక్!
మహబూబ్‌నగర్: బైక్ ఆఫ్ అయితుందని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లిన యువకులకు సీటు కింద పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు చెందిన బాలు, వినయ్ అక్కడే ఓ పరిశ్రమలో పని చేసేవారు. కంపెనీ పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణంలో కర్నూల్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు. అడ్డాకుల సమీపంలోకి రాగానే బైక్ ఆఫ్ అయితుండటంతో స్థానికంగా ఉన్న మెకానిక్ దగ్గరికి వచ్చారు. దాన్ని బాగు చేసే క్రమంలో బైక్ సీటు తీయగా దాని కింద పాము కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత యువకులంతా కలిసి దాన్ని బయటకు తీసి చంపేశారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
‘మెకానిక్’తో నాకు మరింత గుర్తింపు తెస్తుంది: హీరో మణి సాయితేజ
ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకుని కాల్షీట్స్ ఇస్తూ పోవచ్చనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్ గా తెలుసుకుంటున్నాను" అంటున్నాడు యంగ్ హీరో మణి సాయి తేజ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన మణి సాయి తేజ "బ్యాట్ లవర్స్" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావడంతో వెంటనే ‘రుద్రాక్షాపురం’ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన "మెకానిక్" త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన "నచ్చేశావే పిల్ల నచ్చేశావే" పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణి సాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. "మెకానిక్" తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందని మణి సాయి తేజ అన్నారు. -
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మెకానిక్’ పోస్టర్
మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్... ట్యాగ్ లైన్. ముని సహేకర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మునెయ్య(మున్నా) నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 15 న విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన పోస్టర్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశాడు. కాగా, ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ పాట యూట్యూబ్‌లో 8 మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండిండ్‌లో ఉంది. ఇదే సినిమా నుంచి రిలీజ్ అయినా ‘టులెట్ బోర్డ్ ఉంది నీ ఇంటికి’అనే మరోపాట 1.6 మిలియన్స్‌తో దూసుకెళ్తోంది. ఇలా విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోను వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సిద్ శ్రీరామ్ పాట
సింగర్ సిద్ శ్రీరామ్ గొంతుకు టాలీవుడ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుంచి ఒక పాట వస్తే చాలు.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వచ్చేస్తాయి. తాజాగా ‘మెకానిక్’ సినిమాలో ఆయన ఆలపించిన ‘నచ్చేసావే పిల్లా’ కూడా మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’.ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ఇటీవల సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా వ్యూస్ రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ మునెయ్య(మున్నా) మాట్లాడుతూ "వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ముందు విడుదల అయిన 'టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి' అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా "మెకానిక్" చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో సెన్సార్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం" అని తెలిపారు. -
సాధారణ మెకానిక్‌లు ఇప్పుడు ఈవీ టెక్నీషియన్లు..
వారంతా ఒకప్పుడు సాధారణ మెకానిక్‌లు. ఇప్పుడు ఈవీ టెక్నీషియన్స్‌గా మారారు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ASDC) ఎలక్ట్రానిక్ వెహికల్ పరిశ్రమలో టెక్నీషియన్లుగా పనిచేయడానికి 300 మంది సాధారణ టూ వీలర్, త్రీ వీలర్ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. లివ్‌గార్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈవీ పరిశ్రమకు నైపుణ్యత కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అందించడం ఈ చొరవ లక్ష్యం. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని ఆగ్రాలో అభ్యర్థులకు పది రోజులపాటు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈవీ పరిశ్రమలో అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడం, రిపేర్ టెక్నిక్లను మెరుగుపర్చుకోవడంపై ఈ శిక్షణలో తర్ఫీదు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్ అయిన భారత్‌లో మోటార్‌సైకిల్ పరిశ్రమ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోందని టోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీఈవో అరిందమ్ లహిరి పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తగ్గించవచ్చని, పరిశ్రమ డిమాండ్లను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, వేతన ఆధారిత ప్రోత్సాహకాలు, టూల్ కిట్, ఒక సంవత్సరం ప్రమాద బీమా కవరేజీని అందించారు. ఈ సర్టిఫికెట్, టూల్ కిట్లు, ప్రోత్సాహకాలు అభ్యర్థులకు పరిశ్రమలో ఉపాధిని పొందేందుకు, బ్యాంకు రుణాల సహాయంతో సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాయని వివరించారు. -
మెకానిక్‌లు సాధికారత సాధించాలి
న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్‌లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్‌లోని బైకర్స్ మార్కెట్లో మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్‌లతో కలిసి ఓ బైక్‌ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్‌లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. -
రాహుల్ జన్‌కీ బాత్.. ఈసారి వాళ్లతో ఇలా..
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. బైక్ రిపేర్ షాపులలో మెకానిక్‌గా మారిపోయి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారాయన. ఈ మేరకు ఆ ఫొటోల్ని స్వయంగా ఆయనే పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం కరోల్ బాగ్ మార్కెట్లోని బైక్ రిపేర్ దుకాణాలకు వెళ్లి.. ఆయన అక్కడి పనివాళ్లతో ముచ్చటించారాయన. వాళ్లతో కలిసి బైక్ రిపేర్ చేస్తూ మాటామంతీ కలిపారు. ఆయన రాక గురించి సమాచారం అందుకున్న స్థానికులు భారీ ఎత్తునే అక్కడ గుమిగూడారు. వాళ్లకు అభివాదం చేసి.. దాదాపు రెండు గంటలు అక్కడే గడిపారాయన. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లోనూ ఫొటోలు ఉంచిన ఆయన.. రెంచ్‌లను తిప్పే.. భారత్ చక్రాలను కదిలించే చేతుల నుండి నేర్చుకోవడం అంటూ క్యాప్షన్ ఉంచారాయన. భారత్ జోడో యాత్ర తర్వాత పార్టీ పటిష్టతపై అధిష్టానంతో కలిసి దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మధ్యమధ్యలో ఇలాంటి మన్‌కీ బాత్‌లు చాలానే నిర్వహిస్తున్నారు. నేరుగా పలు వర్గాల ప్రజల దగ్గరికి వెళ్లి.. వాళ్ల సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ముందు ట్రక్ డ్రైవర్ సమస్యలనూ ఆయన అడిగి తెలుసుకున్నారు. 29, 30 తేదీల్లో మణిపూర్‌కు రాహుల్ గాంధీ గిరిజన గిరిజనేతర వర్గాల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో ఆయన మణిపూర్ వెళ్తారని కాంగ్రెస్ తెలిపింది. చురాచంద్పూర్, ఇంఫాల్ల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకున్న వారితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో వందమందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. సాధ్యమయ్యే పనేనా? -
ఎండలో బండి నడుపుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్టే
రాత్రికి వంద రూపాయల పెట్రోల్ వేయించా... మాములుగా అయితే బండి రోజులు నడుస్తుంది. అలాంటిది ఒక్క రోజుకే పెట్రోల్ నిల్ అని చూపుతోందని సురేష్ ఆందోళన చెందాడు. ఈ సమస్య సురేష్ ఒక్కడిదే కాదు... జిల్లా వ్యాప్తంగా వాహనాలు వినియోగిస్తున్న అందరి అనుభవం. వేయించున్నా పెట్రోల్ ఏంమైంది? పెట్రోల్ బంకులోనే తక్కువగా వేస్తున్నారా? లేదా ఎవరైనా దొంగలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవేవి కాదని నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండల వేడికి వాహనాల్లోని పెట్రోల్ ఆవిరవుతుండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి హిందూపురం: అసలే వేసవికాలం... గతంలో ఎన్నడూ లేనంతగా సూరీడు భగభగ మంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి తరుణంలో వాహనాలను ఎక్కడబడితే అక్కడ ఎండలో ఉంచేస్తే పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. వాహనదారులు వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే కొత్త సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నెలాఖరు నుంచి మే మాసం లోపు 43.1 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్క్‌కు చేరుకోవడంతో ఎండ వేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరైతే ద్విచక్ర వాహనాలు లేదా, కార్లలో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ఎండలో ఎక్కడబడితే అక్కడే ఆపేస్తున్నారు. దీంతో ఎండ వేడిమికి ఆయా వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. ఇది ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్కింగ్ జోన్లు లేక అవస్థలు.. జిల్లాలోని హిందూపురం, పుట్టపర్తి, కదిరి మున్సిపాల్టీలతో పాటు పంచాయతీ కేంద్రాల్లో పార్కింగ్ జోన్లు లేక వాహదారులు అవస్థలు పడుతున్నారు. కాయగూరలకు ఇతర అవసరాలకు వాహనాల్లో వెళ్లినప్పుడు ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధనం ఆవిరై పోతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల 2,77,235 వాహనాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని 139 పెట్రోలు బంకుల్లో గతంలో రోజు వారీ 139 వేల లీటర్ల పెట్రోలు, డీజిల్ విక్రయాలు సాగేవి. వేసవి ఆరంభం నుంచి ఇది పెరుగుతూ వస్తోంది. తాజాగా 210 వేల లీటర్ల మార్క్‌ను చేరుకుంది.వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎండ వేడిమికి పెట్రోల్ ట్యాంకుల్లో గ్యాస్ ఏర్పడి పేలిపోయే ప్రమాదముంది. రాత్రి పూట బైక్‌ను నిలిపి ఉంచినప్డుపు ఓ సారి ట్యాంక్ మూత తీసి మళ్లీ మూసి వేయాలి. మందపాటి సీటు కవర్లు వాడడం మంచిది. పెట్రోల్ ట్యాంకులను సైతం కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయడం ఉత్తమం. – షాజహాన్, మెకానిక్, హిందూపురం -
రూ.328 కోట్ల లాటరీ బ్రో అంటే.. ‘ఏప్రిల్ ఫూల్’ అనుకున్నాడు.. తీరా చూస్తే షాక్!
క్లీవ్(అమెరికా): ఆదివారంతో వారాంతం ముగిశాక అందరూ సోమవారం కొత్త వారాన్ని మొదలుపెడతారు. కానీ అమెరికాకు చెందిన మాజీ మెకానిక్ ఏకంగా కొత్త జీవితాన్నే మొదలుపెట్టారు. 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.328 కోట్ల) లాటరీ రూపంలో ఆయనను ధనలక్ష్మి వరించింది. చిరకాల మిత్రుడొచ్చి లాటరీ గెలుపు సంగతి చెబితే ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తున్నాడని భావించాడు ఎర్ల్ లాపే. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆ టికెట్ కొన్నాడు మరి. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ సిటీలో ఉండే 61 ఏళ్ల లాపే మెకానిక్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఇటీవల ఆయన కొన్న ‘లోట్టో అమెరికా’ లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ను క్లెయిమ్ చేశాడు. విడతలవారీగా అయితే రూ.328 కోట్లను 29సంవత్సరాల కాలంలో ఇస్తారు. కానీ విడతలవారీగా కాకుండా ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనకు రూ.175 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. -
వినోదం.. సందేశం
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వంలో ఎమ్. నాగ మునెయ్య నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘ఓ బర్నింగ్ ప్రాబ్లమ్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహనిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి. -
‘మెకానిక్’ మంచి విజయం సాధించాలి: దిల్ రాజు
‘మెకానిక్’ చిత్రం మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ని దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంకంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!
మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్‌లోని ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్‌లోని ఎస్వీఎం గ్రాండ్ బాంకెట్ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది. పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్ అనే లిఫ్ట్ మెకానిక్‌ను హోటల్ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు. పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం -
సర్పంచులుగా ఉన్నా వీడని వృత్తులు.. సాదాసీదాగా జనంతో మమేకం
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): సాధారణంగా చిన్న పదవికే డాబు, దర్పం ప్రదర్శించేవాళ్లను చూస్తుంటాం. ఆ పదవితో చేస్తున్న వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తేస్తారు. అయితే గ్రామానికి ప్రథమపౌరులై ఉండి, మన దేశంలో ప్రధానికైనా లేని చెక్‌పవర్ కలిగిన సర్పంచులు సాదాసీదాగా, చేస్తున్న వృత్తికే అంకితమై ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము సర్పంచులం, మనకొక హోదా, గుర్తింపు, సమాజంలో, అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందన్న అహం కొందరిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్పంచులు కాక ముందు ఏ వృత్తిలో ఉండి జీవనం సాగించేవాళ్లో ఇప్పుడూ వాటినే కొనసాగిస్తూ పంచాయతీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. సర్పంచు అయ్యాక మనోడు మారలేదు అనుకునేలా అందరితో కలిసిపోతూ మమేకమవుతున్నారు. అలాంటి సర్పంచుల్లో కొందరి గురించి... మోటర్ మెకానిక్‌గానే... అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన సి.జయరామిరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో నాయనబావి సర్పంచుగా పోటీ చేసి అధిక మెజార్టితో గెలుపొందారు. అప్పటివరకు వ్యవసాయ మోటార్లకు రిపేర్లు చేసే మెకానిక్‌గా గ్రామస్తులకు పరిచయం. సర్పంచు పదవితో రాజకీయాల్లో బీజీ అయిపోతాడని గ్రామస్తులు భావించారు. డిగ్రీ ఫైయిల్ అయిన జయరామిరెడ్డి భిన్నంగా ఉన్నాడు. సర్పంచు పదవి ఇప్పుడొచ్చింది, నాకు జీవితాన్నిచ్చిన వృత్తిని వదిలేదిలేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. సర్పంచుగా అధికారుల సమావేశాలకు హజరువుతూ, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మోటార్ల రిపేరు పనిని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం పెద్దమండ్యం మండలం కోటకాడపల్లె సర్పంచు కే.భూదేవి చదివింది ఐదో తరగతి. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఆమె సర్పంచు అయింది. భర్త పెద్దరెడ్డెప్పకి ఒకటిన్నర ఎకరా పొలం, అందులో బోరు ఉంది. మొదటినుంచి మహిళా రైతుగా వ్యవసాయం చేస్తోంది. కోటకాడపల్లె సర్పంచు పదవికి పోటీచేసి గెలుపొందినా ఆమె రైతు జీవితాన్ని వీడలేదు. సర్పంచుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తాను గ్రామానికి ప్రథమ పౌరురాలిని అన్న దర్పం చూపకుండా టమాట, వేరుశెనగ పంటల సాగు పనులు చేస్తున్నారు. మహిళా సర్పంచు అయినప్పటికి మహిళా రైతు జీవితాన్ని వీడలేదు. పదవిలో రాణిస్తూ.. వృత్తిలో కొనసాగుతూ.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె సర్పంచుగా పదో తరగతి చదివిన ఓ సాధారణ బోర్ మెకానిక్ ఎస్.మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పైసా ఖర్చు లేకుండా ఏకగ్రీవమంటే ఆ సర్పంచు డాబు చూపాల్సిందే. అయితే ఈయన సర్పంచుగా కంటే బోర్ మెకానిక్‌గానే గుర్తింపు కోరుకొంటున్నాడు. పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఈయన ఈ ప్రాంతంలో బోర్లలో మోటార్లను వెలికితీయడం, కాలిపోయిన మోటార్లకు వైండింగ్ పనులు చేస్తున్నారు. సర్పంచుగా విధులు నిర్వర్తిస్తూనే మెకానిక్ పని చేస్తున్నాడు. తన వృత్తికి సర్పంచు పదవి అడ్డంకికాదని, అందరూ తనను మెకానిక్‌గానే అభిమానిస్తారని అంటున్నాడు మౌలాలి. సమస్యలు పరిష్కరిస్తూ.. దుకాణం నడుపుతూ.. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన ఆర్.రుక్మిణి ఇంటర్ ఫెయిల్. తుమ్మణంగుట్ట సర్పంచు పదవి జనరల్ మహిళ కావడంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. భర్త అమరనాథరెడ్డితో కలిసి చిల్లర దుకాణం, చికెన్ సెంటర్ నడుపుతూ వస్తున్నారు. సర్పంచుగా గెలుపొందినా వృతిని వీడలేదు. సర్పంచుగా సమావేశాలకు హజరవుతూ, పల్లెల్లో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికి సాధారణ గృహిణిలా, దుకాణంలో పనులు చేసుకుంటూ కనిపిస్తారు. (క్లిక్: ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య..) -
ఊళ్లల్లో కనుమరుగవుతున్న మెకానిక్ దుకాణాలు.. అదే కారణమా!
సామర్లకోట(కాకినాడ జిల్లా): భార్యా పిల్లలతో ఏ శుభ కార్యానికో, వ్యాహ్యాళికో వెళ్తున్న వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం ఏదో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కనుచూపు మేరలో మెకానిక్ షాపులు లేవు. భార్య బిడ్డలను ఆటోలో చేరాల్సిన చోటుకు పంపి అతడి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు. రెండు మైళ్లు చెమటోడ్చి వెళ్లాక.. ఏవో చిన్న పరికరాలు పెట్టుకుని ఓ చిన్న బండికి మరమ్మతు చేస్తున్నాడు 60కి దగ్గరలో ఉన్న వ్యక్తి. అసలే గ్రామీణ వాతావరణం. ఆపై మొండిగా తిరిగే బళ్లు. నట్లు, బోల్టులు పట్టేశాయి. వాటిని విప్పడానికి అతని శక్తి చాలడం లేదు. సత్తువ ఉన్న సహాయకుడు ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. అదీ లేదు. బండిని తోసుకు రావడంతో సోష వచ్చి అక్కడే కూలబడ్డాడు వెంకటేశ్వర్లు. ఎప్పటికైతే అప్పుడే అవుతుందని కూర్చున్నాడు. ఇదీ ప్రస్తుతం మెకానిక్ దుకాణాలు, వాహన చోదకుల పరిస్థితి. సామర్లకోట మండల పరిధిలో సుమారు 70 వరకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులు ఉన్నాయి. వీటిలో 20 షాపుల్లో మాత్రమే హెల్పర్లు ఉండగా, మిగిలిన వాటిలో దుకాణ యజమానులే మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఆ 50 మందిలో 30 మంది 50 ఏళ్లు దాటిన వారే. చేసే ఓపిక లేకపోతే ఇంట సేదతీరడం తప్ప మరో పని చేయలేని పరిస్థితి వారిది. గతంలో ఏ మెకానిక్ దుకాణం చూసినా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు సహాయకులుగా ఉండి బళ్ల మరమ్మతులు నేర్చుకునేవారు. చురుకైనవారైతే ఏడాదిలోనే పని నేర్చేసుకుని వేరే దుకాణం పెట్టేసేవాడు. మళ్లీ అతడి దగ్గరకి సహాయకులు చేరిక.. ఇలా సాగేది. నేటి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. బడి ఈడు పిల్లలు బడిలోకే వెళ్లాలి. పనిముట్లు పట్టరాదు అనే నినాదంతో ఏ చిన్నారీ బాల్యాన్ని బాదరబందీ బతుకులకు బలిచేయకూడదని, ఏ ఒక్కరైనా భావి భారత పౌరుడిగా జాతి ఔన్నత్యాన్ని నిలిపేలా తయారు కాకపోతాడా అనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీంతో చిన్నారులు బడిబాట పడుతుంటే, సహాయకులు లేక, పని నేర్చుకునేవారు లేక మెకానిక్ దుకాణాలు కాలక్రమంలో అంతకంతకూ తగ్గిపోతున్నాయి. దీంతో వెంకటేశ్వర్లు లాంటి వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. ఏ చిన్న సమస్యకైనా సర్వీస్ సెంటర్‌కి వెళ్లాలంటే మరమ్మతు చార్జీతో పాటు అదనపు చార్జీలు వేసి చేటంత బిల్లు ఇస్తారు. గ్రామీణులు భరించలేని పరిస్థితి ఇది. వాహనం కొన్నప్పుడు ఇచ్చే ఫ్రీ సర్వీసులనే ఎవరూ చేయించుకోరు. నమ్మకస్తులైన సొంత మెకానిక్‌లతో సర్వీస్ చేయించుకుంటారు చాలామంది. పైగా సర్వీస్ సెంటర్లు కూడా దూరాభారం. వాహన చోదకుల సమస్యలకు ఆయా యాజమాన్యాలు సర్వీస్ సెంటర్లను గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. వృత్తి విద్య శిక్షణ ఏర్పాటు చేయాలి.. ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అనేక మందికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు లో మోటారు సైకిలు మెకానిక్‌పై కూడా కోర్సును ఏర్పాటు చేయాలి. సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మోటారు సైకిల్ సంస్థల్లో చేరే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట హెల్పర్లు లేకపోతే షాపుల నిర్వహణ కష్టం సహాయకులు లేకపోతే మెకానిక్ షాపుల నిర్వహణ కష్టమే. గతంలో పిల్లలు పని నేర్చుకోడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రాథమిక విషయాలు తెలుసుకున్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారికీ, మాకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – ఆండ్ర నూకరాజు, సీనియర్ మెకానిక్, సామర్లకోట -
కుటుంబాన్ని రిపేర్ చేస్తున్న మెకానిక్ రాధ
ఆ గ్యారేజ్‌లో రెంచ్‌లు, స్క్రూ డైవర్ల సందడితో గాజుల చప్పుడు కలిపి వినిపిస్తుంది. గ్రీజు అంటుకుపోయిన దుస్తులతో ఎప్పుడూ కనిపించే మెకానిక్ కాకుండా ఓ స్త్రీ చేతిలో రెంచీతో కొత్తగా కనిపిస్తుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో ఉందీ మెకానిక్ షెడ్. భర్తకు అండగా నిలవడానికి భార్య మెకానిక్‌గా మారిన ఈ కథ ఆసక్తికరం. మట్టి అంటిన చేతులు నిజాయితీకి నిలువుటద్దాలు అంటారు కదా.. అలా నిజాయితీ కలిగిన ఓ మహిళ కథ ఇది. శ్రీకాకుళం: మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది టీచర్లయ్యారు, ఇంకొందరు ప్రైవేటు సెక్టార్లలో రాణిస్తున్నారు, మరికొందరు రాజకీయా ల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు.. అలా రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటే రంగంతో పని లేదని నిరూపిస్తున్నా రు ఈమె. వాస్తవానికి బైక్ మెకానిక్ రంగం మగాళ్ల రాజ్యం. రోజంతా దుమ్ము, ధూళి, గ్రీజులతో ఈ పని మొరటుగా ఉంటుంది. కానీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఈ పనిని కూడా ఆమె బాధ్యతగా నెత్తికెత్తుకుంది. ► పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో గిరి మెకానిక్ షా పు ఉంది. అక్కడే రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి వాహనం వచ్చినా ఇట్టే సమస్యను పసిగట్టి పరిష్కరించి పంపిస్తారు. వాస్తవానికి రాధ బైక్ మెకానిక్ పనులేవీ నేర్చుకోలేదు. కాలం ఆమెను ఈ రంగం వైపు నడిపించింది. ► పదహారేళ్ల కిందట రాధకు పోల గిరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి స్వ స్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ గ్రామం. అక్కడ ఉపాధి లేక పలాస వరకు వలస వచ్చారు. గిరికి బైక్ మెకానిక్ పనులు తెలుసు. కానీ ఆయనకు సరిగ్గా వినిపించదు. దీంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు రావడం.. సమస్యను చెప్పడానికి ఆపసోపాలు పడడంతో గిరికి గిరాకీ తగ్గింది. కోవిడ్ రాకతో.. ► అసలే వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే అప్పుడే కోవిడ్ కేసులు ఉద్ధృతం కావడం మొదలయ్యాయి. ఫలితంగా ఉన్న ఉపాధి కాస్తా పోయింది. షెడ్‌కు బళ్లు రావడం మానేశాయి. ఓ వైపు కుటుంబానికి తిండీ తిప్పలు, ఇంటి అద్దె, షాపు అద్దె కట్టాల్సి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ► ఈ కష్టకాలంలో గిరి భార్య రాధ ఆదర్శ ప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను షెడ్లో ఉంటే తప్ప పరిస్థితులు చక్కబడవని గ్రహించి మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. భర్త తోడుతో.. కోవిడ్ కాలంలో అద్దెల భారం పెరిగి కరోనా సమయంలో ఉపాధి లేక పస్తులు పడ్డా రు. పనిచేసేందుకు ఎవరినైనా పెడదామంటే అంత జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాధ స్వయంగా రోజూ దుకాణానికి వచ్చి సాయం చేసేది. సందేహాలు వస్తే గూగుల్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొన్ని నేర్చుకునేవారు. కరోనా సమయంలో ఇంటి వద్దకు కొన్ని వాహనాలు వస్తే కాదనకుండా మరమ్మతులు చేసి పంపించేవారు. భర్తే ఆమెకు దగ్గరుండి విద్య నేర్పడం గమనార్హం. భర్త నేరి్పన విద్యతో అన్ని రకాల మరమ్మతులు చేస్తూ బైక్ మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వాహనాలతో పాటు పాతకాలం నాటి యమహా క్రక్స్ వంటి వాహానాలను కూడా ఆమె బాగు చేయగలరు.బీఎస్ 2 నుంచి బీఎస్ 6 వరకు స్కూటీలు, మోటారుసైకిళ్లు బాగు చేస్తున్నారు. భార్యాభర్తలం కష్టపడితేనే పైసలు కనిపిస్తున్నాయని, అందుకే సిగ్గు పడకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని ఆమె చెబుతున్నారు. పిల్లలను చక్కగా చదివించుకుని ఇక్కడే స్థిరపడాలని ఉందని ఆమె తెలిపారు. -
మంచి సందేశం ఇచ్చేందుకు రెడీ అవుతున్న ‘మెకానిక్’
మణిసాయితేజ , రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
బుల్లెట్ గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును!
సాక్షి,విజయనగరం: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు.. డుగ్గు...డుగ్గు.. డుగ్గని.. అందాల దునీయాను చూపించప్పా.. చిక్కుచిక్కు చిక్కుని.. చిక్కుబుక్కని.. అంటూ ఇటీవల అందరినీ అలరించిన ఈ పాట వింటే చాలు గుర్తుకు వచ్చేది రోయల్ ఎన్ఫీల్డ్ బండి. రెండు దశాబ్దాలకు పూర్వం స్టేటస్ సింబల్‌గా భావించే ఈ రెండు చక్రాల వాహనం డుగ్గు... డుగ్గు అంటూ నడిపితే ఆ రాజసమే వేరు. పూర్వం గ్రామాల్లో సర్పంచ్‌లు.. నాయుడులు వాడే ఈ వాహనం అన్ని వర్గాల ప్రజల మనుసుదోచుకుంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న బుల్లెట్ బండికి రిపేర్వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠక్కున గుర్తుకు వచ్చేది ఈశ్వరరావు పేరే. చిన్నపాటి మరమ్మతు నుంచి ఇంజిన్రిపేర్ వరకు ఆయన చేయి పడనిదే బండి రోడెక్కెని పరిస్థితి. అందుకే.. విజయనగరం నడిబొడ్డున గల మహాకవి గురజాడ అప్పారావు కూడలిలోని ఆయన చిన్నపాటి చెక్కబడ్డీ ముందు బుల్లెట్ బైక్‌లు క్యూ కడతాయి. అన్నీ సర్వీసింగ్ కోసమే వచ్చినవే. వాటిని రిపేర్ చేసే వ్యక్తి మాత్రం 7వ తరగతి వరకే చదివి.. మెకానిక్‌లో ఇంజినీరింగ్ ప్రావీణ్యం సంపాదించిన కోరాడ వీధికి చెందిన గొలుసు ఈశ్వరరావు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన చిన్నతనంలో బైక్ మైకానిక్ వృత్తిని ఎంచుకున్నారు. మొదటిగా బ్రహ్మాజీ అనే గురువు వద్ద ద్విచక్ర వాహనాల మరమ్మతులు చేయడంలో శిక్షణ పొందారు. అనంతరం గాంధీ గురువు వద్ద రోయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు రిపేర్లు చేయడం నేర్చుకున్నారు. నమ్మిన వృత్తిని ఇష్టంగా భావించిన ఆయన ఆ రంగంలో తనకు వేరెవ్వరు సాటిలేరన్నంత నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ఆయన గ్యారేజ్ వద్ద పదుల సంఖ్యలో ఎన్ఫీల్డ్ వాహనాలకు రిపేర్లు చేస్తూ వాహన చోదకుల మన్ననలు పొందుతున్నారు. శబ్దాన్నిబట్టి సమస్యను గుర్తించేంత నైపుణ్యం.. ఈశ్వరరావు తన గురువు గాంధీ వద్ద నేర్చుకున్న బుల్లెట్ వాహనాల రిపేర్ల వృత్తిని వ్యక్తిగత ఉపాధిగా మలచుకున్నారు. 2000 సంవత్సరం నుంచి చిన్నపాటి గ్యారేజీ ప్రారంభించి బుల్లెట్లకు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ఫీల్డ్ బైక్‌లు అరకొరగా ఉన్న రోజుల్లో... మేడిన్ ఇంగ్లాడ్ పేరిట అప్పట్లో వాడే 1965, 1975, 1985 మోడల్ వాహనాలకు రిపేర్ చేయడంలో మంచి పరిణితి పొందిన మెకానిక్‌గా గుర్తింపు సాధించారు. బుల్లెట్ శబ్దాన్ని బట్టి సమస్యను గుర్తించేంత విజ్ఞానం ఈశ్వరరావు సొంతం. అందుకే.. బుల్లెట్లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయన గ్యారేజ్‌కు తెస్తారు. ఎన్ఫీల్డ్ వాహనంలో మార్పులు చోటు చేసుకుని నేటితరాన్ని ఆకట్టుకునే మోడళ్లు రావడం, వాహనాల సంఖ్య పెరగడంతో ఆయనకు ప్రతిరోజూ చేతినిండా పనిదొరుకుతోంది. మరో నలుగురు కుర్రాళ్లకు ఉపాధి చూపుతున్నారు. నా గురువులు బ్రాహ్మాజీ, గాంధీలు నేర్పించిన విద్యతో నేడు నేను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురు కుర్రాళ్లకి ఉపాధి కల్పిస్తున్నాను. అప్పట్లో ఊరికో ఎన్ఫీల్డ్ బండి ఉండేది. రోజుకో, రెండు రోజులుకో ఒక బండి షెడ్‌కి వచ్చేది. దానికి మరమ్మతులు చేసే వాడిని. ప్రస్తుతం రోయల్ ఎన్ఫీల్డ్ వాహనాల సంఖ్య పెరిగింది. రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు షెడ్‌కు వస్తున్నాయి. జనరల్ సర్వీసు అయితే గంటలో చేసిస్తాం. అదే ఇంజిన్ మరమ్మతులు అయితే రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటాం. – గొలుసు ఈశ్వరరావు, రోయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్, విజయనగరం చదవండి: నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా? -
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్‌ను ఈ–సైకిల్‌గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్‌లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశారు. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) ఇది గంటన్నర చార్జింగ్‌తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్‌తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!!
A 90 Year Old Mechanic Named Bryan Webb Has Been Celebrated on Social Media After Retiring at the Age of 75: దశాబ్దం పాటు ఒకే కంపెనీలో పనిచేస్తేనే గొప్ప విషయంగా మారిన ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి మాత్రం, తను పనిచేస్తున్న కంపెనీలో అమృతోత్సవం జరుపుకున్నాడు. అసలు విషయం ఎంటంటే.. బ్రిటన్‌కు చెందిన బ్రియాన్ వెబ్ కుటుంబ పరిస్థితుల కారణంగా పదహారేళ్ల వయసులోనే సంపాదించాల్సిన పరిస్థితి. అతని అదృష్టం.. వెంటనే 1946లో వోక్స్ హాల్ అనే కార్ల కంపెనీలో మెకానిక్ ఉద్యోగం లభించింది. నాలుగేళ్లలోనే మెకానిక్ నుంచి సీనియర్ మెకానిక్‌గా మారాడు. తర్వాత వివిధ పదోన్నతులు పొందుతూ వారంటీ అడ్మినిస్ట్రేటర్‌గా ఎదిగాడు. రోజులు గడిచేకొద్దీ.. సంస్థపై తనకున్న అభిమానం పెరిగిపోతూనే ఉంది. ఎంతలా అంటే.. తన 25 సంవత్సరాల సర్వీస్‌కు సంస్థ నుంచి అందిన వాచ్‌ను ఇప్పటికీ ధరించేంతలా! అయితే, ఎంత ఇష్టం ఉన్నా కాలాన్ని ఆపలేం కదా! పెరిగిపోతున్న వయసు ఆడ్డుకట్ట వేసింది. బ్రిటన్ రిటైర్మెంట్ రూల్స్ ప్రకారం పదవీ విరమణ పొందాడు. చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే.. దీంతో, 90 ఏళ్ల వయసులో 75 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్ తీసుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇందుకు సంస్థ నుంచి ఓ స్పానర్ను బహుమతిగా పొందాడు. ఇన్ని రోజులు విధినిర్వహణలో భాగమైన తన స్పానర్.. దానినే వారు మంచి బాక్స్‌లో పెట్టి, ఓ బంగారు పూత పూసిన ఫలకంపై అతని పేరు, సర్వీస్ వివరాలను ముద్రించి బహూకరించారు. వీటితో పాటు మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చారు. మిస్ అవుతున్నా.. ‘చిన్నప్పటి నుంచి కార్లు అంటే ఇష్టం. అందుకే, ఇంతకాలం ఇంత ఇష్టంగా పనిచేయగలిగా! ఇంకొన్ని రోజులు పనిచేయమన్నా పనిచేస్తా. కంపెనీని, కొలీగ్స్‌ని బాగా మిస్ అవుతున్నా’ అంటూ బ్రియాన్ వెబ్ కంపెనీకి వీడ్కోలు పలికాడు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! View this post on Instagram A post shared by BBC News (@bbcnews) -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
ఆరంకెల జీతం వదిలి.. మెకానిక్‌గా మారిన మహిళ
కేబిన్‌లో కూచుని చేసే ఉద్యోగంఆమెకు బోర్ కొట్టింది. కొన్నాళ్లు బండి మీద దేశం తిరిగింది. కొన్నాళ్లు బండ్లు రిపేర్ చేసే ఆటోమొబైల్ రంగంలోపని చేసింది. ఇప్పుడు ఆమె సొంత గ్యారేజ్ తెరిచింది. స్త్రీలు మెకానిక్ గ్యారేజ్‌లు నడపడం అరుదు. కాని చెన్నైకి చెందిన అఫునిసా చౌదరి ఇప్పుడు ‘కారు ఆమె చేతుల్లో పెడితే దిగుల్లేదు’ అనే పేరు సంపాదించుకుంది. కొత్తగా ఏదైనా చేస్తే ఇలాగే పేరొస్తుంది. సాధారణంగా ఏ గ్యారేజ్‌లో అయినా అడ్మినిస్ట్రేషన్‌లో మహిళా ఉద్యోగులు కనిపిస్తుంటారు. గ్యారేజ్ లోపల మాత్రం మగవారిదే రాజ్యం. కాని చెన్నై నీలాంకరి ఏరియాలో ఉన్న ‘మోటర్హెడ్స్’ గ్యారేజ్‌లోకి వెళ్లినప్పుడు మాత్రం గ్యారేజ్ లోపల అఫునిసా చౌదరి మెకానిక్ యూనిఫామ్‌లో కనిపిస్తుంది. ఆమె యూనిఫామ్‌లో లేనప్పుడు మొదటిసారి వచ్చిన కస్టమర్ ఆమెను రిసెప్షనిస్ట్ అని పొరపడుతుంటాడు. ‘నా కారు టెస్ట్ డ్రైవ్‌కి మెకానిక్‌ని పిలుస్తారా’ అన్నప్పుడు ‘పదండి నేనే వస్తాను’ అని అఫునిసా అంటుంది. మోటర్హెడ్స్కు ఆమే అధినేత. అందులో ఆమే మెకానిక్ కూడా. ఉద్యోగం బోర్‌కొట్టి నలభై ఏళ్ల అఫునిసా చౌదరి గతంలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ర్యాంక్‌లో పని చేసింది. ఆపరేషన్స్ విభాగం చూసేది. క్యాబిన్, దర్జా, మంచి జీతం అన్నీ నడిచేవి. కాని ఆమెకు ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. ఆమెకు ఆటోమొబైల్ రంగం అంటే ఇష్టం. ఆమె దగ్గర కొన్ని పాత టూ వీలర్లల కలెక్షన్ ఉంది. ‘బాబీ’ సినిమాలో కనిపించే స్కూటర్ మొదలు ఇప్పుడు కనిపించకుండా పోయిన యమహా ఆర్.ఎక్స్ 135 లాంటి బండ్లు కూడా ఉన్నాయి. యమహా మీద ఆమె తరచూ దూరప్రయాణాలు కూడా చేస్తుంటుంది. ఉన్నచోటే ఉండిపోవడం నా వల్ల కాదు అని పదేళ్ల క్రితం 2010లో ఆ ఉద్యోగం మానేసింది. ఏం చేస్తావు అని ఆ కంపెనీ వాళ్లు అడిగితే కార్ల గురించి తెలుసుకుంటా అని చెప్పిందామె. పదేళ్లు ఆటోమొబైల్ రంగంలో... దేశంలో కార్ల రంగం బాగా వృద్ధి చెందింది. ఒక కొత్త మోడల్ వచ్చేలోపు ఇంకో కొత్త మోడల్ రిలీజ్ అవుతోంది. అన్ని కంపెనీలకు ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి. కాని ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్లో పెద్దగా చర్చలకు తావుండదు. వారు చెప్పిన ధరలకు చెప్పిన సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ధరలు ఒక్కోసారి ఎక్కువగా ఉంటాయి కూడా. మారుతి నుంచి మొదలెట్టి బి.ఎం.డబ్లు్య వరకు అన్ని కార్ల యజమానులు మంచి గ్యారేజ్ ఉంటే ఆ వైపు చూడటానికే ఇష్టపడతారు. ‘నా గ్యారేజ్ అలా ఉండాలని నేను పదేళ్లు గ్రౌండ్ వర్క్ చేశాను’ అంటుంది అఫునిసా చౌదరి. ‘పదేళ్లు నేను చాలా గ్యారేజ్‌లను పరిశీలించడంలో గడిపాను. రిపేర్లు, స్పేర్‌పార్ట్‌లు, ఏ కారుకు ఎంత రిపేర్ అవసరం వంటి వివరాలన్నీ తెలుసుకున్నాను. ఇక కారులోని ఎలక్ట్రానిక్స్ది ఒక కీలకవ్యవస్థ. ఆ ఎలక్ట్రానిక్స్ రిపేర్లను చేయడంలో తగిన శిక్షణ కలిగిన మెకానిక్‌లు ఉండాలని తెలుసుకున్నాను. అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకుని మల్టీబ్రాండ్ గ్యారేజ్‌ను 2020లో ప్రారంభించాను’ అంటుంది అఫునిసా. లాక్డౌన్ సవాలు గ్యారేజ్ తెరిచిన వెంటనే అఫునిసాకు ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వల్ల చెన్నైలో లాక్డౌన్ వచ్చి మూడు నెలల పాటు మూసేయాల్సి వచ్చింది. ‘ఇది కూడా ఒక విధంగా మంచిదే అయ్యింది. ఉపాధి పొందలేని వర్గాల నుంచి కొంత మంది కుర్రాళ్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేందుకు మేము నిశ్చయించుకున్నాం’ అని అఫునిసా అంటుంది. ఆమెకు ఈ గ్యారేజ్ స్థాపన వెనుక ఒక లక్ష్యం ఉంది. కేవలం దీనిని ఆదాయ వనరుగా కాక దిగువ వర్గాల యువతీ యువకులకు పని నేర్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలనేది ఆమె భావన. ‘మేము పని నేర్పించి వారు జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన సహాయం కూడా చేస్తాం’ అని అఫునిసా అంది. నోటిమాట ప్రచారం మొదటి లాక్డౌన్ ముగిసి రెండో లాక్డౌన్ వచ్చేలోపు నోటి మాట మీదుగా అఫునిసా గ్యారేజ్ ప్రచారం పొందింది. కస్టమర్లు ఆమె గ్యారేజ్ సేవలను విశ్వసిస్తున్నారు. అన్నింటికి మించి మహిళలను అరుదుగా కనిపించే ఈ రంగంలో ఆమె సమర్థంగా నిలదొక్కుకోవడం వెనుక ఆమెకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, విశేష అనుభవం కారణం అని అర్థం చేసుకున్నారు. ‘క్యాబిన్లో కూచుని చేసే ఉద్యోగంలో లేని థ్రిల్లు ఒక కారులో కనిపించే జటిలమైన సమస్యను రిపేర్ చేసినప్పుడు కలుగుతుంది.’ అంటుంది అఫునిసా. వైట్‌కాలర్ కెరీర్లు చాలానే ఉంటాయి.కాని చేతులకు గ్రీజ్ పూసుకొని పెట్రోల్ వాసనల మధ్య పని చేయడంలో ఒక గొప్ప ఉత్సాహాన్ని పొందుతోంది అఫునిసా. ఆమె కొత్త పనిని ఎంచుకుంది. అందుకే మీరిక్కడ ఆమె గురించి చదువుతున్నారు.కేబిన్‌లో కూచుని అందరిలా ఉద్యోగం చేస్తే ఎందుకు రాస్తారంట. -
యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు!
యూట్యూబ్ వీడియోలనును ఖరీదైన అందులోనూ లాంబొర్గిని లాంటి విలాసవంతమైన స్పోర్ట్స్ కారును తయారుచేయడం సాధ్యమేనా? అంటే కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు అసోంకు చెందిన ఒక మెకానిక్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన అన్నట్టు తాను అనుకున్నది సాధించి తీరాడు..తన డ్రీం కార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కారుతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అస్సాంలోని కరీమ్గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నూరుల్ హక్ (30 )ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. భంగా ఏరియాలో ఎన్ మారుతి కార్ కేర్ అనే గ్యారేజీ నిర్వహించే నూరుల్‌కు స్పోర్ట్స్ కార్లంటే మోజు. అందులోనూ లంబోర్ఝిని అంటే మరీ ప్రాణం. ఎలాగైనా అలాంటి కారును నడపాలని, సొంతం చేసుకోవాలని కలలుకన్నాడు. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఇబ్బందులు వచ్చి పడ్డాయి. పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. తన డ్రీంకార్ తయారీపై దృష్టిపెట్టాడు.ఎట్టకేలకు తనకున్న తక్కువ వనరులోనే స్విఫ్ట్ కారు ఇంజీన్ మార్చి తన సొంత వెర్షన్నుతయారు చేయాలని నిర్ణయించు కున్నాడు. ఎట్టకేలకు తన పాత స్విఫ్ట్‌కారును ఇటాలియన్ లగ్జరీ కారు లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్లో తీర్చి దిద్దాడు. ఎనిమిది నెలలపాటు శ్రమించి తన ప్రాజెక్టును పూర్తి చేశాడు. దీని కోసం .రూ.6.2 లక్షలు ఖర్చు చేశానని నూరుల్ చెప్పాడు.అంతేకాదు తన నెక్ట్స్ టార్టెట్ కార్ లగ్జరీ స్పోర్ట్స్ కారు ఫెరారీ అని స్పష్టం చేశాడు. View this post on Instagram A post shared by Nurul Haque (@haquenurul786786) -
హీరో ‘ఎలక్ట్రిక్’ కీలక నిర్ణయం; 20,000 మందికి శిక్షణ
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో 20,000 మంది మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ల విషయంలో తమ కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. 2020–21లో హీరో ఎలక్ట్రిక్ 52,000 యూనిట్లను విక్రయించింది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ధ్యేయం. ఇప్పటి వరకు 4,000 మంది మెకానిక్‌లు శిక్షణ పొందగా, 1,500 చార్జింగ్ పాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చామని హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష యూనిట్లను విక్రయించాలన్నది లక్ష్యమని వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 75,000 నుంచి 3,00,000 యూనిట్లకు చేరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కొత్త తయారీ కేంద్రం నెలకొల్పుతామని, ఇది కార్యరూపం దాలిస్తే స్థాపిత తయారీ సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుతుందని తెలిపారు. తయారీ సామర్థం పెంపు, ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు కంపెనీ రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. 2–3 కొత్త మోడళ్లను ఈ ఏడాది ప్రవేశపెట్టనుంది. చదవండి: (టాప్‌గేర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు) -
TSRTC: రంగారెడ్డిలో 33 అప్రెంటిస్ పోస్ట్‌లు
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ), రంగారెడ్డి రీజియన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 33 ► మెకానిక్ డీజిల్(అప్రెంటిస్): అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ► స్టయిపండ్: రూ.6,931 నుంచి రూ.7,797 చెల్లిస్తారు. ► శిక్షణా వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో బేసిక్ ట్రెయినింగ్ కాలవ్యవధి 6 నెలలు, జాబ్ ట్రెయినింగ్ కాలం 19 నెలలు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 08.04.2021 ► వెబ్సైట్: https://apprenticeshipindia.org/ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు; ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి -
పెద్దమనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. లాక్డౌన్ కాలంలో ఎంతోమంది విద్యార్థులకు సాయం అందించిన కవిత.. తెలంగాణ తొలి మహిళా మెకానిక్ అదిలక్ష్మికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మెకానిక్ షాపు పెట్టిన ఆదిలక్ష్మికి వెన్నంటి నిలిచారు. కొత్త షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని, ఇద్దరు ఆడపిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించిన మెకానిక్ ఆదిలక్ష్మికి అన్ని విధాలా తాను ఆదుకుంటానని కవిత భరోసా ఇచ్చారు. కాగా ఆదిలక్ష్మిపై గతవారం (జనవరి 26)న సాక్షి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. (ఆదిలక్ష్మి గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును) ఆదిలక్ష్మి నేపథ్యం.. సుజాతనగర్ మండల కేంద్రం ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే రహదారి పక్కనే ఉంటుంది. ఓ టైర్ మెకానిక్ షెడ్డు. ట్రాక్టర్లు, లారీలు, పెద్ద పెద్ద చక్రాల బండ్లు అక్కడ ఆగుతాయి. ఓ మహిళ బయటకు వచ్చి సమస్య ఏమిటని తెలుసుకుంటుంది. పంచర్, టైర్ మార్పు.. పని ఏదైనా సరే చకచకా పని పూర్తి చేస్తుంది. భర్తతో పాటు షెడ్డు నడుపుకుంటూ కుటుంబానికి ఆసరా నిలుస్తుంది. ఆమె పేరు ఆదిలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనానపురానికి చెందిన ఆదిలక్ష్మిది, ఆర్థికంగా నిరుపేద కుటుంబం. భర్త మెకానిన్‌గా పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేవాడు. అయినా.. జీతం సరిపోయేది కాదు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంది. అక్కడా ఇక్కడా అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్లో టైర్ వర్క్స్ షెడ్డు తెరిచారు. మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ షెడ్డును తానే నడిపిస్తున్నది ఆదిలక్ష్మి. వాహనాలకు గ్రీజు పెట్టడం నుంచి వెల్డింగ్ పనులు, పంచర్ వేయటం వరకు అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి శెభాష్ అనిపించుకుంటున్నది. ఇప్పుడు తనే సొంతంగా కొత్త షాపు పెట్టుకోవాలని నిర్ణయించుకొని, సాయం కోసం ఎదురు చూస్తోంది.అయితే ఆదిలక్ష్మి చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, నేరుగా మాట్లాడి అభినందనలు తెలిపారు. అంతేకాదు కొత్త షాపు కోసం కావల్సిన అధునాతన మెషిన్లను అందజేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని నివాసంలో కవిత ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. ఆది లక్ష్మి షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఇద్దరు కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేసి, ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చిన కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. -
నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి
భద్రాచలం, మణుగూరు నుంచి రోజూ సిమెంట్ లారీలు, టిప్పర్లు బయలుదేరి కొత్తగూడెంలోని ఆదిలక్ష్మి పంక్చర్ షాపు ముందు ఆగుతాయి. ఆదిలక్ష్మి చేయి పడితే వాటి టైర్లకున్న జబ్బులన్నీ పోతాయి. ఇంతకాలం పురుషులే టైర్ల మరమ్మతులు చేసేవారు. ఇప్పుడు ఆదిలక్ష్మి వాటిని ఇటు అటూ తిప్పి అవలీలగా బోర్లించి రిపేర్ చేస్తుంది. ‘నా భర్త షాపు దగ్గర లేకపోతే లారీలు వెళ్లిపోయేవి. బేరం చెడగొట్టుకోవడం ఎందుకు అని నేనే పనిలో దిగా’ అంటుంది ఆదిలక్ష్మి. ఇప్పుడూ ఆదిలక్ష్మి భర్త పంక్చర్లు వేస్తాడు. కాని టైర్లన్నీ అదిరిపడేది ఆదిలక్ష్మి అడుగుల చప్పుడుకే. తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి కథ ఇది. ‘నా కడుపులో రెండో అమ్మాయి ఉన్నప్పుడు మా ఆయన కరెంటు పోల్స్ వేసే పనికి కొత్తగూడెం నుంచి కడప వైపు వెళ్లాడు. నిండు నెలలు నాకు. నొప్పులొచ్చాయి. పైసలు లేవు. మనిషి దగ్గర లేడు. కూతురు పుట్టిన వారానికి చూడటానికి వచ్చాడు. నాకు దుఃఖం వచ్చింది. ఏం చేద్దామా అని ఆలోచించాను ఇద్దరం ఒకటే చోట ఉండి పని చేయడానికి’ అంది ఆదిలక్ష్మి. ఆమె వయసెంతో ఆమెకు తెలియదు. 30 ఉండొచ్చని అంటుంది. కొత్తగూడెం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాత అంజనాపురం వాళ్లది. ‘మేము నలుగురం ఆడపిల్లలం. నేను రెండోదాన్ని. మా అమ్మా నాన్న పొలం కూలీకి పోతే ఇంట్లో నా చెల్లెళ్లని చూసుకోవడానికి ఉండిపోయాను. బడికెళ్లలేదు’ అంటుంది ఆదిలక్ష్మి. లారీ టైర్‌కు గాలి నింపుతున్న ఆదిలక్ష్మి ఇప్పుడు ఆమె కొత్తగూడెంలో చాలా ఫేమస్. ఇంకొన్నాళ్లలో తెలంగాణ అంతా ఫేమస్ కావచ్చు. ఎందుకంటే లారీ టైర్ల మరమ్మతు చేస్తున్న ఏకైక మహిళా మెకానిక్ కాబట్టి. హెవీ వెహికిల్స్ టైర్లను విప్పడం సామాన్యమైన విషయం కాదు. వాటికి పంక్చర్లు వేయడానికి చాలా బలం కావాలి. కాని ఆదిలక్ష్మి ఆ పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఆ దారిలో మగవాళ్లు వేసే పంక్చర్లనైనా డ్రైవర్లు అనుమానిస్తారేమోగాని ఆదిలక్ష్మి వేసే పంక్చర్లను అనుమానించరు. అంత పర్ఫెక్ట్ వర్కర్ ఆమె. చెట్లెక్కే నిపుణురాలు ‘నా చిన్నప్పుడు ఇంట్లో మొక్కజొన్న దంచి కడక చేసేవారు. జావ కాచేవారు. బియ్యమే తెలియదు మాకు. జొన్నకూడు తినలేక నేను అడవిలో, పొలాల్లో దొరికే వాటి కోసం తిరిగేదాన్ని. పన్నెండేళ్లకే తాటిచెట్లు ఎక్కి కాయలు కోశా. కొబ్బరిచెట్లు ఎక్కా, రేగుకాయలు, పరిగి కాయలు, సీమసింత గుబ్బలు తిని పెరిగా. నాకు కష్టం చేయడం పెద్ద కష్టం కాదు’ అంది ఆదిలక్ష్మి. వరుసకు అత్తకొడుకైన భద్రంతో ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. అతడు టైర్ల మెకానిక్. వెల్డింగ్ చేస్తాడు. జీతానికి ఉంటే ఆ జీతం ఏ కోశానా సరిపోయేది కాదు. దూరానికి వెళ్లి కూలి చేసేవాడు. ఇవంతా వద్దు మనమే చేసుకుందాం అని షాపు పెట్టించింది ఆదిలక్ష్మి. ‘మాకు ఎవరూ అప్పు ఇవ్వలేదు. ఎలాగో 80 వేలు వడ్డీకి తీసుకొని అవి చాలక మరో 50 వేలు అప్పు చేసి... సుజాత నగర్లో ఈ స్థలం నెలకు 2 వేలు కిరాయికి తీసుకొని షాపు మొదలెట్టా’ అందామె. మొదలైన పని.. భర్త కోసం ఆదిలక్ష్మి గాలి మిషను, బోల్డ్ మిషను, గ్రీజు మిషను, జనరేటర్... ఇన్ని ఎలాగోలా సమకూర్చింది. కాని భర్త ఏవో పనుల కోసం బయటకు వెళ్లేవాడు. లేదంటే తొందరగా అలసిపోయేవాడు. ‘బేరాలు పోతుంటే తట్టుకోలేకపోయా. నేనే చేయడానికి పనిలో దిగా. నన్ను చూసి నువ్వు వేస్తావా అని లారీ డ్రైవర్లు ఆగకుండా వెళ్లిపోయేవాళ్లు. ఇలా కాదని వాళ్లను కూచోబెట్టి వాళ్లముందే టైర్లను విప్పి పంక్చర్లు వేశా. ఒకప్పుడు వెళ్లిపోయిన వాళ్లంతా ఇప్పుడు ఆగుతున్నారు’ అంది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి స్టిక్కర్ వేస్తుంది. హీట్ పంక్చర్ వేస్తుంది. టైర్‌కు చిల్లిపడితే క్షణాల్లో పూడ్చేస్తుంది. బండ్లకు అవసరమైన మైనర్ వెల్డింగ్ వర్కులు చేస్తుంది. ‘ఆ వెల్డింగ్‌లో ప్రమాదం జరిగి కన్ను పోయేంత పనయ్యింది. విజయవాడ ఎల్.వి.ప్రసాద్లో 50 వేలు ఖర్చయ్యింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఒక కన్ను ఏమీ కనపడదు. కొన్ని గంటల పాటు ఎదుట ఉన్నది నెగెటివ్ లాగా కనిపిస్తుంది’ అంటుంది ఆదిలక్ష్మి. కొనసాగుతున్న పని ఆదిలక్ష్మికి మూడు కోరికలు ఉన్నాయి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, మూడు... అప్పులు తీరాలి. ఇవన్నీ ఆమె సాధించుకోగలదు. కాని ఆమె మరోమాట అంది. ‘నా దగ్గరకు పని నేర్చుకోవడానికి వచ్చినవారికి మంచిగా తిండి పెట్టి పని నేర్పించేలా నేనుండాలి’ అని. ఈ హృదయం తక్కువమందిలో ఉంది. ఆదిలక్ష్మి భవిష్యత్తులో మరింత ఎదుగుతుంది. ఆమె భవిష్యత్తు చక్రానికి తిరుగులేదనే అనిపిస్తుంది. శ్రమను నమ్ముకుంటే ఓటమి ఉంటుందా? – సాక్షి ఫ్యామిలీ ఫొటోలు: దశరథ్ రజ్వా -
మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్
లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ స్కాలర్షిప్ పొంది హై స్కూల్ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్ హై స్కూల్లో గత నెల షాదాబ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్) షాదాబ్ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. -
మీ ఇంటికే మెకానిక్
కార్ అయినా బైక్ అయినా నడిచినంత కాలం పర్లేదు. కాని ఆగిందంటే నరకమే అంటారు వాహన చోదకులు. సరైన సర్వీసింగ్ సెంటర్ దొరకక, దొరికిన సర్వీసింగ్‌పై సందేహాలు తీరక... వాహన యజమానులు కష్టాలకూ ఓనర్స్అనిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచే ఓ యువ టీమ్ సృష్టించింది గో మెకానిక్ స్టార్టప్. సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో కార్లు వినియోగించేవాళ్లు కేవలం అందానికి, సాంకేతిక విశేషాలకు మాత్రమే కాకుండా నాణ్యమైన విక్రయానంతర సేవలకూ అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆ సేవలు సైతం తమకు వీలైనంత సమీపంలో ఉండాలని కోరుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆథరైజ్డ్ సేవలకూ, లోకల్ వర్క్‌షాప్స్‌కు మధ్య సర్వీసింగ్ తో పాటు ధరల్లో కూడా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ ఖాళీని పూర్తి చేయడానికే టెక్నాలజీని అనుసంధానించిన కార్ సర్వీసెస్ సెంటర్స్ నెట్‌వర్క్‌గా గో మెకానిక్‌ను అందుబాటులోకి తెచ్చామంటున్నారు అమిత్ భాసిన్, రిషబ్ కర్వా, కుశాల్ కర్వా, నితిన్ రానాలు. ఢిల్లీకి చెందిన ఈ యువ బృందం ఇటీవలే నగరానికీ తమ సేవల్ని విస్తరించిన సందర్భంగా పంచుకున్న విశేషాలు.. అనుభవం చూపిన పరిష్కారం.. నేను చెవర్లెట్ తీసుకున్నప్పుడు పలు వర్క్‌షాప్స్‌కి తిరిగి రూ.2వేల నుంచి రూ.20వేల వరకూ సమర్పించుకుంటూ ఉండేవాడినని (భాసిన్). అప్పటికీ తన కార్కు సంబంధించిన అసలు సమస్య ఏమిటనేది తెలీలేదు.. ఇలాంటి సందర్భాల్లో ఆథరైజ్డ్ సెంటర్‌కి వెళ్లి అధిక మొత్తం చెల్లించుకోవడం లేదా లోకల్ వర్క్‌షాప్‌లో మంచి సర్వీసింగ్ దొరకాలని భగవంతుడ్ని ప్రార్థించడం.... వినియోగదారుల ముందు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులాగా నాణ్యమైన సేవలనూ లోకల్ వర్క్‌షాప్ తరహాలో అందుబాటు ధరలనూ మేళవించడమే దీనికి పరిష్కారం అనిపించింది. ఎలా పనిచేస్తుందంటే... ఫ్రాంఛైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ (ఎఫ్‌ఓసీఓ)మోడల్లో గో మెకానిక్ పనిచేస్తుంది. కస్టమర్ ఇంటి నుంచే కార్ తీసుకెళ్లి మరమ్మతు పూర్తి చేశాక తిరిగి ఇంటికి భద్రంగా చేరుస్తుంది కార్ని ఇచ్చిన దగ్గర్నుంచి అది తిరిగి వచ్చేవరకూ దానికి సంబంధించిన అప్డేట్స్ ఆటోమేటెడ్ మెసేజెస్ కస్టమర్‌కి వెళ్తుంటాయి. మరమ్మతు ధరల్లో పారదర్శకత...తీసుకురావాలనేదే మా ఆలోచన ఏ స్పేర్ పార్ట్కైనా రీప్లేస్మెంట్ చేసేలా...వేలాదిగా స్పేర్ పార్ట్స్, మా కస్టమర్లు అందరికీ సర్వీస్పార్ట్నర్స్ ద్వారా ప్రీ ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. వారంటీ అనంతరం ప్రతి కారుకీ తప్పని ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మార్కెట్ విలువ దాదాపు 8 నుంచి 10 బిలియన్లు ఉంటుందని మా అంచనా.మా స్టార్టప్ ప్రస్తుతం హైదరాబాద్ సహా అరడజను నగరాల్లో సేవలు అందిస్తోంది. -
విశాఖలో బస్సు దగ్ధం
విశాఖపట్నం: గాజువాక పోర్టు రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న లారీ మెకానిక్ గ్యారేజ్‌లో పెనుప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మత్తుల కోసం వచ్చి గ్యారేజ్‌లో ఉన్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో గ్యారేజ్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో బస్సు దగ్ధం
-
ఒక్క క్లిక్ చాలు మెకానిక్ మీ చెంతకు
మీ బైక్ అర్ధాంతరంగా రోడ్డుపై ఆగిపోయిందా? ఆఫీస్‌కు వెళ్లే సమయంలో కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయా? టైర్ పంక్చరయ్యిందా? లేదా యాక్సిండెంట్ అయ్యిందా? బైక్ లేదా కారుని మార్గమధ్యలో విడిచిపెట్టలేక, మెకానిక్ వద్దకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇలా ఏ రిపేర్ అయినా సరే.. తమ మెకానిక్ వచ్చి రిపేర్ చేసి సమస్య పరిష్కరిస్తాడంటున్నారు సిటీకి చెందిన ముగ్గురు యువకులు. కేవలం ఒక్క క్లిక్ లేదా ఒక్క ఫోన్ కాల్‌తో మీరున్న చోటకే మెకానిక్ వచ్చి వాహనాన్ని రిపేర్ చేస్తారని భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం ‘గో గాడీ’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్లు. సాక్షి, సిటీబ్యూరో:నెల్లూరుకు చెందిన ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్, సూర్యతేజలు నగరంలోని ఖాజాగూడలో స్థిరపడ్డారు. ప్రజిత్‌రెడ్డి కంప్యూటర్ సైన్స్, మిత్రవర్షిత్ ఆర్కిటెక్, సాయితేజ ఎంబీఏ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే వీళ్లు స్నేహితులు. ఓ రోజు సిటీ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు మార్గమధ్యలో మొరాయించింది. సంబంధిత సర్వీస్ సెంటర్‌కు కాల్ చేస్తే.. వాళ్లు సరిగా రెస్పాండ్ కాలేదు. చిరాకు వచ్చి కారు అక్కడే వదిలేసి వేరే వెహికల్లో విజయవాడ వెళ్లారు. ఈ సమస్య వీళ్ల ముగ్గురిదే కాదు. వీళ్ల బంధువులు, తెలిసిన వాళ్లకు కూడా ఎదురైంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏదైనా కొత్తగా ఆలోచించాలని ప్రయత్నించారు. ఆ ఆలోచనలో భాగంగానే ‘గో గాడీ’ యాప్‌నకు శ్రీకారం చుట్టారు. యాప్ వినియోగమిలా.. మీ మొబైలోని ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ‘గో గా>డీ’ని సెర్చ్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మార్గంమధ్యలో ఎక్కడైనా కారు లేదా బైక్ అగిపోతే ఈ యాప్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ‘కారు/బైక్ సర్వీస్, కార్/బైక్ స్పా, కార్/బైక్ యాక్ససిరిస్, రోడ్‌సైడ్ (గో గాడీ) అసిస్టెన్స్’ అనే ఆప్షన్స్ వస్తాయి. దీనిలో మనకున్న రిపేర్‌ని ఆ ఆప్షన్స్ ద్వారా ఎంచుకుని మనం ఉన్నచోటకు మెకానిక్‌కి పిలిపించుకోవచ్చు. ఇలా ఒక్క క్లిక్ చేసిన 20 నిమిషాల వ్యవధిలో మనం ఉన్న చోటకు మెకానిక్ వస్తాడు. యాప్‌ని వాడలేని వారు 79939 19293కు కాల్ చేసినా చాలు. సిటీలో 500 సర్వీస్ సెంటర్లు మనవద్దకు వచ్చిన మెకానిక్ వెహికల్ కండిషన్ చూస్తాడు. అది అక్కడిక్కడే రిపేర్ అయ్యేదైతే పరిష్కరిస్తారు. లేనిపక్షంలోæ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. సిటీలో మొత్తం 500 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వెహికల్ని మనకు నచ్చిన సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తారు, లేదా వాళ్లకు సంబంధించిన 500 సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి రిపేర్ చేస్తారు. మెకానిక్ వచ్చి అక్కడిక్కడ సమస్యను పరిష్కరిస్తే రూ.499 చార్జి చేస్తారు. అదే వెహికల్ని లిఫ్ట్ చేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే రూ.799. మెకానిక్ వచ్చేలోపు రిపేర్‌ని మనమే చేసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. మాకెదురైన సమస్య నుంచే.. కారు మొరాయిస్తే ఎంత చికాకు వస్తుందో.. మేం స్వయానా అనుభవించాం. అందుకే ముగ్గురం స్నేహితులం ఈ యాప్‌ని రూపొందించాం. సిటీతో పాటు విజయవాడ, నెల్లూరులలో కూడా ఈ సేవలను వాహనదారులకు అందిస్తున్నాం. యాప్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా మీ వెహికల్ రిపేర్ సమ స్యని పరిష్కరించుకోవచ్చు. త్వరలో ఈ చలా నా, ఫాస్టాగ్ రీచార్జి, కా రు అమ్మకాలు, కొను గోలు, డోర్‌స్టెప్ సేవలు వంటి వాటిని అందుబాటులోకి తేస్తాం.– సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్ -
బతుకు గ్యారేజ్..!
కష్టజీవులకు ఉపాధి కల్పించే బస్తీ.. ఇండస్ట్రియల్ ఎస్టేట్. చిత్తూరు నగరానికి చివర్లో ఉన్న ఈ ఎస్టేట్.. కార్మికుల జీవనోపాధికి కేంద్రంగా ఉంది. శ్రమనే నమ్ముకున్న ప్రతి శ్రామికుడికి ఈ ఎస్టేట్‌లో ఉపాధి దొరుకుతోంది. ఆటో నుంచి లారీ, జేసీబీల వరకు నూతన బాడీ కట్టించుకోవడం, రిపేర్లు చేయించుకోవాలంటే.. వాహన యజమానులందరూ ఈ ఎస్టేట్‌నే ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతున్నారు. సాక్షి, చిత్తూరు రూరల్ : చిత్తూరు నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఇక్కడ వివిధ రకాలైన మెకానికల్ షాపులు 170 దాకా ఉన్నాయి. ఈ షాపుల్లో 3వేలకు పైగా శ్రామికులు పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆటోలు, కార్లు, టిప్పర్లు, లారీలు, బస్సుల రిపేర్ పనులు అధికంగా ఉంటాయి. అలాగే లేత్, గ్లాస్ వర్క్, లైనర్, వెల్డర్, డ్రిల్లర్, పెయింటర్, బాడీ బిల్డర్ (బస్సులు, లారీలకు బాడీ కట్టేవారు), బ్యాటరీ తయారీ.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు పనులు ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. వాహనాలు రిపేర్ వస్తే.. చిత్తూరు వాసులే కాకుండా మదనపల్లి, పలమనేరు, పీలేరు, పుత్తూరు, తిరుపతి, తమిళనాడులోని పళ్లిపట్టు, పొన్నై వాసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మంచి నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు ఎస్టేట్‌లో ఉండడంతో ఈ సంఖ్య ఇటీవల మరింత పెరిగింది. స్వయం కృషితో... మెకానిక్‌లుగా ఎస్టేట్‌లో చాలా మంది బతుకు బండి లాగుతున్నారు. వీరిలో చాలా మంది మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకుని పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది శ్రామికులు ఇక్కడ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ పనీ లేకున్నా ఎస్టేట్‌ను ఆశ్రయించిన వారికి ఏదో రకంగా ఉపాధి దొరుకుతోంది. పని నేర్చుకోవాలి.. సంపాదించాలనే తపన ఉన్న వ్యక్తులకు ఈ ఎస్టేట్ కొండంత అండగా నిలుస్తోంది. ఇక్కడ హెల్పర్, దినసరి కూలీగా పనిలో చేరి.. సొంత షాపు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారంతా తాము స్వయం కృషితోనే పైకి వచ్చామని, ఈ ఎస్టేట్ తమకు ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అంటున్నారు. చిత్తూరుకు పరిశ్రమలు వస్తే తమలాంటి వాళ్లకు మరింత మేలు చేకూరుందని పలువురు భావిస్తున్నారు. పరిశ్రమలు రావాలి.. చిత్తూరుకు పరిశ్రమలు రావాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు పనులు పుష్కలంగా ఉంటాయి. నేను లారీ, బస్సు ఇంజిన్ రిపేర్ చేస్తాను. సొంతంగా షాపు ఉంది. రోజూ కూలి గిట్టుబాటు అవుతోంది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – పటేల్, చిత్తూరు 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎస్టేట్‌లో మెకానిక్‌గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. నెలకు నాకు రూ.10 వేలు వస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. చేతినిండా పని ఉంది. చిన్నతనంలోనే లారీ, బస్సు రిపేర్లు నేర్చుకున్నాను. ఎక్కడికెళ్లినా పని చేయగలను. – పురుషోత్తం, చిత్తూరు శ్రమకు తగ్గ వేతనం.. నేను చిన్నతనంలోనే ఇక్కడ పనికి వచ్చా. మూడేళ్లలో పని నేర్చుకున్నా. మెకానిక్ పనులతో పాటు బ్యాటరీ తయారీ, రిపేర్లు చేస్తా. కూలి గిట్టుబాటు అవుతోంది. నేను ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. – మోహన్, చిత్తూరు -
మెకానిక్ అరుణ
సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది. రుణం ఇచ్చి ఆదుకోవాలి స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. – అరుణ, మెకానిక్, కొత్తకోట -
బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు
ముంబై : బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ నేరం నమోదయ్యింది. వివరాలు.. ఆదిత్య పంచోలి సర్విసింగ్ నిమిత్తం తన కార్‌ను 2017 మార్చ్‌లో ఓ మెకానిక్‌కి అప్పచెప్పాడు. సదరు మెకానిక్ సర్విసింగ్, రిపేర్ చేశాడు. ఇందుకు గాను రూ. 2.82 లక్షల బిల్లు అయ్యిందని.. ఆ డబ్బును చెల్లించాల్సిందిగా ఆదిత్యను కోరాడు. కానీ ఆదిత్య బిల్లు కట్టకుండా సదరు మెకానిక్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. బిల్లు కట్టమని అడిగిన ప్రతిసారి ఆదిత్య, మెకానిక్‌ను తిట్టడమే కాక వ్యక్తిగత బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. కార్ సర్విసింగ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. నేటికి కూడా ఆదిత్య బిల్లు చెల్లించకపోవడంతో విసిగిపోయిన మెకానిక్ చివరకూ ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఆదిత్య మీద ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మెకానిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతుంద’ని తెలిపారు. అయితే ఏ వ్యక్తి మీద అయిన నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు అయితే వారెంట్ లేకుండా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. -
బైక్.. రంగు వెలిసిపోకుండా..!
ఇష్టంగా కొనుక్కున్న బైక్ మీద చిన్న గీత పడినా ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు బయటి వాతావరణం వల్ల బైక్ రంగు తొందరగా వెలిసిపోతుంది. అలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఇప్పుడు స్ప్రే పాలిష్‌లు, స్క్రాచ్ రిమూవర్లు అందుబాటులో ఉన్నాయి. బైక్‌పై గీతలు పడిన చోట స్క్రాచ్ రిమూవర్‌ను ఉపయోగిస్తే అవి కనిపించవిక. స్ప్రే పాలిష్‌తో బైకుకు కొత్త మెరుపును అందించవచ్చు. వీటిని వినియోగించే ముందు బైకును, వాటిని ఉపయోగించే భాగాలను షాంపూతో రుద్ది, దుమ్ము, మరకలు వంటివి లేకుండా కడిగేయాలి. ఆ తర్వాత తుడిచి, కాసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత.. దుమ్ము పడితే కాటన్‌తో తుడిచి స్క్రాచ్ రిమూవర్‌ను లేదా స్ప్రే పాలిష్‌ను ఉపయోగించాలి. ఆయా ఉత్పత్తులపై పేర్కొన్న సూచనలు పాటిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. స్ప్రే పాలిష్/స్క్రాచ్ రిమూవర్ల నాణ్యత, పరిమాణం బట్టి ధర ఉంటుంది. విజయనగరం మున్సిపాలిటీ: ఇటీవల కాలంలో బైక్ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. రెప్పపాటులో బైక్‌లను మాయం చేసే మాయగాళ్ళు పెరిగారు. బైక్‌ను ఎవరూ ఎత్తుకుపోకుండా, కదిలించకుండా ఉండేందుకు తోడ్పడేలా డిస్క్ బ్రేక్ లాక్, ఫ్రంట్ వీల్ లాక్‌లు అందుబాటులో ఉన్నాయి. చిన్నగా ఉన్నా అత్యుత్తమ రక్షణ అందించడం వీటి ప్రత్యేకత. డిస్క్ బ్రేక్ సదుపాయం ఉన్న బైకులకు డిస్క్ బ్రేక్ లాక్, లేని వాటికి ఫ్రంట్ వీల్ లాక్ తోడ్పడుతుంది. డిస్క్ బ్రేక్ లాక్ చాలా చిన్నగా ఉంటుంది. అవసరమైతే జేబులో వేసుకుని వెళ్లొచ్చు. డిస్క్ బ్రేక్ ప్లేట్ పై ఉండే రంధ్రం గుండా చిన్నపాటి ఐర¯న్ లాక్‌ను చొప్పించి తాళం వేయవచ్చు. తాళం చెవి లేకుండా దీన్ని తీయడం చాలా కష్టం. వీటి ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ వీల్ లాక్ ముందు ఉండే చక్రానికి మధ్యలో అమర్చవచ్చు. చక్రం ఫోక్ లేదా అల్లారు వీల్ రాడ్‌ను రెండు వైపులా అడ్డుకునేలా దీనిలో ఏర్పాటు ఉంటుంది. ఈ లాక్ వేస్తే బైకును ముందుకు.. వెనక్కి ఏ మాత్రం కదిలించలేరు. జాగ్రత్తలు పాటించాలి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనంపై ఆధారపడుతున్నారు. దీంతో వాటి సంఖ్య చాలా పెరిగింది. ప్రతి ఒక్కరు వాహనాన్ని కొనుగోలు చేసి నడపటం తప్ప నిర్వహణను పట్టించుకోరు. దీంతో కొత్త వాహనాలైనా త్వరగా పాడైపోతుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పాత వాహనాన్నయినా కొత్తగా తయారు చేసుకోవచ్చు.–పి.శ్రీనివాసరావు,బైక్ మెకానిక్, విజయనగరం -
పక్షులకు ప్రాణదాత!
నాంపల్లి: పతంగులు పక్షుల పాలిట శాపంగా మారాయి. చైనా మాంజాలతో పతంగులు ఎగురవేయడంతో తెగిపడిన మాంజాలకు చిక్కుకుంటూ గద్దలు, కాకులు, పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కాళ్లను, రెక్కలను పోగొట్టుకుంటున్నాయి. ఆకాశంలో ఎగరలేక కిందపడ్డ ఓ గద్ద ఒకానొక రోజు నాంపల్లి రోడ్లపై కనిపించింది. పైకెగరలేని గద్దను నాంపల్లి వ్యాయామశాల వద్ద నివాసం ఉండే టూ వీలర్ మెకానిక్ సుబ్బారావు కుమారుడు త్రిమూర్తి పిళ్లై దగ్గరకు తీసుకున్నారు. మాంజా (దారం) చుట్టుకుని గాయపడ్డ గద్దకు చికిత్సలు అందించారు. నెల రోజుల పాటు నాంపల్లి మార్కెట్లో చికెన్ కలేజాను కొనుగోలు చేసి ఆహారంగా అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత గద్దను పైకి వదిలేశారు. ఈ సంఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. పక్షులపై నాడు చిగురించిన ప్రేమ నేటికీ అతనిలో తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన గద్దలకు మాంసం వేస్తూ తనవంతుగా పక్షులకు ప్రేమను పంచుతున్నారు. వృత్తిరీత్యా మెకానిక్... త్రిమూర్తి పిళ్లై ద్విచక్రవాహనాల మెకానిక్. నాంపల్లి ఏరియా ఆసుపత్రికి వెనుక వైపు ఫుట్‌పాత్‌పై మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వికలాంగుడు కావడం చేత ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. త్రిమూర్తి పిళ్లై మెకానిక్‌గా స్థిరపడినప్పటికి ఆయన గొప్ప జంతు ప్రేమికుడు. ఆయన మనసంతా జంతువులు, పక్షుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఉడుతలకు, చీమలకు ఆహారాన్ని అందిస్తారు. నాంపల్లిలోని ఆయన నివాసం వద్ద తెలవారగానే ఉడతలు ఆహారం కోసం అరుస్తూ కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. నెలలో రెండు పర్యాయాలు నర్సాపూర్ అడవులకు అద్దె కారులో వెళ్లి అక్కడ ఉండే కోతులకు పల్లీలను ఆహారంగా ఇస్తారు. అంతేకాదు ఆలయాల వద్ద గోవులకు ఆహారాన్ని అందిస్తారు. అనాథలకు అండగా నిలుస్తూ వారికి దుస్తులు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదన్న కారణంతో అరటి పండ్లను ఇస్తారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పిళ్లై దైనందిన దినచర్యలో భాగం అయ్యాయి. గద్దలకే అధిక వ్యయం.... ఆకాశంలో ఎగిరే గద్దలంటే త్రిమూర్తి పిళ్లైకు చాలా ఇష్టం. సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు వాటికి ఆహారం ఇవ్వడం పరిపాటిగా మారింది. త్రిమూర్తి పిళ్లైకు సుస్తీ చేసినా, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పడు తన దగ్గర మెకానిక్‌గా శిక్షణ పొందే యువకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ముర్గీ మార్కెట్లో ప్రతి రోజూ నాలుగు కిలోల చికెన్ కలేజాను కొనుగోలు చేస్తారు. తనతో పాటు శిష్యులతో కలిసి ఆకాశంలో ఎగిరే గద్దలకు మాంసాన్ని విసిరివేస్తారు. సంపాదనలోకొంచెం సామాజిక సేవకు ఆశాంలో ఎగిరే పక్షులు పతంగుల మాంజాలకు బలవుతున్నాయి. పక్షులు అనుభవిస్తున్న క్షోభను చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది. విదేశాలకు చెందిన మాంజాలను నిషేధించాలి. నేను సంపాదించిన ఆదాయంలో ప్రతి రోజూ రూ.800 వరకు సామాజిక సేవకు ఖర్చు పెడతాను. ఈ సేవ నాకెంతో తృప్తినిస్తోంది. – త్రిమూర్తి పిళ్లై, జంతుప్రేమికుడు -
మెకానిక్ దారుణహత్య
కర్నూలు, రుద్రవరం: మండల కేంద్రంలో మెకానిక్ మహబుబ్‌బాషా(39) దారుణహత్యకు గురయ్యాడు. ఎస్ఐ చిన్న పీరయ్య యాదవ్ తెలిపిన వివరాలు.. చాకరాజువేములకు చెందిన మహబుబ్‌బాషా రుద్రవరానికి చెందిన గాజుల రంతుల్లా కూతురు హుశేన్బీని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే భార్య పుట్టినిళ్లు రుద్రవరానికి వచ్చి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణ సమీపంలో ఉన్న తన షెడ్డులో పనులు ముగించుకుని అక్కడే నిద్రించాడు. అయితే రోడ్డు ప్రమాదంలో మహబూబ్ బాషా తీవ్రంగా గాయపడగా తాము షెడ్డు వద్దకు తీసుకొచ్చామని అర్ధరాత్రి మండల కేంద్రానికే చెందిన జయలక్ష్మి ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా తన భర్తకు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉండేదని, ఆ మహిళలే చంపి ఉంటారని మృతుడి భార్య హుసేన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం.. మహబుబ్‌బాషా భార్య ఫిర్యాదుతో విచారణ నిమిత్తం జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డకు తరలించగా డాక్టర్లు కర్నూలుకు రెఫర్ చేసినట్లు ఎస్ఐ చిన్నపీరయ్యయాదవ్ తెలిపారు -
నావద్ద ఏమియునూ లేదు...
అనారోగ్యం మాటేమిటోగానీ అప్పుడయాన యుద్ధానికి వెళుతున్న చక్రవర్తిలా ఉన్నాడు. తెలియని ఉత్సాహం ఏదో అతని కండ్లలో వెలుగుతుంది.కళాకారులకు పెద్దగా ఏమీ అక్కర్లేదనుకుంటా.... చప్పట్లు చాలు, వన్స్మోరు కేకలు చాలు! ఈ మాత్రం దానికే ఆ కొద్దిసేపు వాళ్లు రాజ్యాలను జయించే చక్రవర్తులవుతారు. కుబేరుణ్ణి తలదన్నే అపరకుబేరులవుతారు.జీవితసార్థకతను ప్రేక్షకుల చప్పట్లలో కొలుచుకొని పదేపదే మురిసిపోతారు. అలాంటి ఒక కళాకారుడు సత్యవతి వాళ్ల నాన్న. ఆయన స్టేజీ ఎక్కితే, స్టేజీ మాయమై మరోలోకం కనిపిస్తుంది. ఆయన ప్రేక్షకులను ఎటో తీసుకువెళతాడు.ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆయనే ఎక్కడికో వెళ్లిపోయాడు.సత్యహరిశ్చండ్రి వేషంలో ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కుండతో ఉత్సాహంగా స్టేజీ వైపు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు ఆయన. కూతురు సత్యవతి ‘నాన్నా!’ అని అరుస్తూ ఆయన దగ్గరకు వచ్చింది.‘‘ఏమిటమ్మా?’’ అడిగాడు ఆయన.‘‘మాత్రలు వేసుకోవడం మరిచిపోయావు నాన్నా’’ అని గుర్తు చేసింది ఆమె.కూతురికి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకు ఒకవైపు మురిసిపోతూనే...‘‘ఆ డాక్టర్ చాదస్తం సగం నీకు వచ్చినట్లుందమ్మా’’ అంటూ చేతిలోని కుండను ఆమెకు ఇచ్చి మాత్రలు వేసుకొని గ్లాసులో నీళ్లుతాగి స్టేజీవైపు నడిచాడు. తండ్రి ఉత్సాహన్ని చూస్తూ తనలో తాను చిన్నగా నవ్వుకుంది సత్యవతి.నాటకం మొదలైంది.‘‘మాలిని... ఎవరైనసరే కాటి సుంకం చెల్లించిగానీ దానకార్యమునకు ఉపక్రమించను’’ అని తేల్చేశాడు హరిశ్చంద్రుడు.‘‘అయ్యా! కాటిసుంకంమును చెల్లించుటకు నా వద్ద ఏమియునూ లేదే’’ అని అసలు విషయం చెప్పింది చంద్రమతి.‘‘నేనిది బొత్తిగా నమ్మను. ఆలోచించు’’ అని కంఠంలో కాస్త కోపాన్ని కొని తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇద్దరి మధ్య కాసేపు పదునైన పద్యాల యుద్ధం జరిగింది. ‘‘అయ్యా! నా వద్ద ఏమియు లేదన్నా నన్ను ఏల బాధించెదరు?’’ శోకతప్తహృదయంతో నిలదీసింది ఆమె.ఆమె శోకంతో తనకు బొత్తిగా పనిలేదన్నట్లు...‘‘అది మాంగల్యం కాబోలు. ఏ వెలకైనా దాన్ని తెగనమ్మి నీ సుతునికై వెచ్చించు... వెచ్చించు.. ఆ...ఆ...ఆ...’’ అంటూ రాగం తీశాడు హరిశ్చంద్రుడు.వినలేనిదేదో విన్నట్లు ‘అయ్యో! దైవమా’ చెవులకు చేతులు అడ్డం పెట్టుకుంది చంద్రమతి.తరువాత ఆలోచించింది.‘‘నా పతికి తక్క అన్యులకు గోచరించని నా దివ్యమాంగల్యం.... కాదు కాదు కాదు... ఇతడు ఛండాలుడు కాదు. నా మంగల్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడు. స్వామి... నేను స్వామి నీ చంద్రమతిని’’ అంటూ భర్త దగ్గరకు వచ్చింది.‘‘దేవీ నువ్వా! నా చంద్రమతివా? అటులైన వీడు?’’ అని కుర్రాడి శవాన్ని చూస్తూ అడిగాడు హరిశ్చంద్రుడు.‘‘మన కుమారుడు లోహితుడు’’ అంటూ ఆమె దీర్ఘమైన పద్యం ఒకటి పాడింది.హరిశ్చంద్ర– చంద్రమతులు కుమారుడి తలనిమురుతూ ‘హా లోహితా! లోహితా’ అని కంటికి మింటికి ధారగా ఏడుస్తున్నారు.ప్రేక్షకుల్లో ఏడ్వనివాడు పాపాత్ముడు!‘వన్స్‌మోర్’ అంటూ ఈలలు.పాత్రకు ప్రాణం పోస్తూ .... ఏడుస్తూ ఏడుస్తూ.... ఒక్కసారిగా స్టేజీపైనే కూలిపోయాడు సత్యవతివాళ్ల నాన్న. ‘నాన్న... నాన్న’ అంటూ ఆందోళనగా పరుగెత్తుకు వచ్చింది కూతురు.‘‘ఈసారి చాలా ఉధృతంగా వచ్చింది. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్‌కు చూపించాలి’’ అని చెప్పాడు ఆ ఊరివైద్యుడు. ఆయన్ను ట్రాక్టర్లో ఎక్కించి తీసుకెళుతున్నారు. ‘‘ఏంకాదమ్మా’’ అంటూ పోస్ట్ మాస్టర్ బాబాయ్ సత్యవతికి ధైర్యం చెబుతున్నాడు. ఏమైందో ఏమో ట్రాక్టర్ మధ్యలోనే ఆగింది.మెకానిక్‌ను తీసుకొస్తానంటూ డ్రైవరు కుర్రాడు పరుగెత్తుకు వెళ్లాడు. ఏడుపులు విని... అటుగా వెళుతున్న రమేష్ ‘‘ ఏమైంది?’’ అని అడిగాడు.‘‘మావాడు చావుబతుకుల మధ్య ఉన్నాడు... ట్రాక్టరేమో చెడిపోయింది. అర్జంటుగా పట్నానికి తీసుకెళ్లాలి’’ అని చెప్పాడు బాబాయ్.రమేష్ మెకానిక్ అవతారమెత్తి ట్రాక్టర్లో కదలిక తెచ్చాడు.‘‘ఆ డ్రైవర్ ఎప్పుడొస్తాడో ఏమో... నేను తీసుకెళ్తాను పదండి’’ అంటూ డ్రైవర్ సీట్లో కూరున్నాడు రమేష్. ట్రాక్టర్ పట్నం రోడ్డు మీద అడుగుపెట్టగానే ఊరేగింపు ఒకటి కనిపించింది. తెల్లటి పొడవాటి బ్యానర్లపై‘ప్రభుత్వ వైద్యుల సమ్మె’ అనే నీలిరంగు అక్షరాలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ గవర్నమెంట్ ఆస్పత్రి ముందు ఆగింది. ‘‘సీరియస్ కేసు సార్. మీరు వెంటనే అడ్మిట్ చేసుకోవాలి’’ అని ఆస్పత్రి ఉద్యోగిని అభ్యర్థించాడు పోస్ట్‌మాస్టర్ బాబాయ్.‘‘ఏంలాభం లేదండీ. డాక్టర్లెవరూ లేరు. బోర్డ్ చూడలేదా!’’ అని చావుముందు కబురు చల్లగా చెప్పాడు ఆ ఉద్యోగి.‘‘ప్రజలకు ప్రాణం పోయాల్సిన డాక్టర్లు సమ్మె చేయడం ఏమిటి?’’ అని అంతెత్తు లేచాడు రమేష్. సమాధానం చెప్పేవారు లేరక్కడ.‘‘పోనీ... చుట్టుపక్కల వీధిలో ప్రైవేట్ డాక్టర్ ఎవరు లేరా?’’ ఆరా తీశాడు బాబోయ్.ఆ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోయే సమయానికే సత్యవతి నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.స్టేజీపై ఆయన పాడిన పద్యం గాలిలో లీలగా వినిపిస్తుంది.‘నా ఇల్లాలని... నా కుమారుండని.... ఎంతో అల్లాడిన ఈ శరీరం... ఒంటరిగా కట్టెలలో కాలుచున్నది. ఆ ఇల్లాలు రాదు.... పుత్రుడు తోడై రాడు’ -
వృత్తి మెకానిక్.. చేసేది దొంగతనాలు
చైతన్యపురి: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఇన్స్పెక్టర్లు సైదయ్య, మహేష్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీందర్‌రావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ అలియాస్ నాగరాజు (22) నగరానికి వచ్చి బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదన కోసం నేరాల బాట పట్టి దొంగగా మారాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలు, ఇంటి తాళాలు, దేవాలయాల హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ప్రభాత్‌నగర్ శ్రీలక్ష్మీగణపతి దేవాలయం హుండీ ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ కెమెరాలకు చిక్కాడు. అప్పటినుంచి క్రైం పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. సోమవారం బైక్‌పై దిల్‌సుఖ్‌నగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పాతనేరస్తుడిగా గుర్తించారు. చైతన్యపురి, కటంగూరు, సూర్యాపేట స్టేషన్ల పరిధిలో ఏడు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు, రెండు దేవాలయాల్లో హుండీ దొంగతనం, ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ. 3.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నా రు. 2012 నుంచి 2017 మధ్య కాలంలో చైతన్యపురి, సరూర్‌నగర్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు. సిబ్బందికి రివార్డులు చోరీలకు పాల్పడుతున్న పాతనేరస్తుడు మహేష్‌ను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన డీఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు మహేష్, మల్లేష్, రాము, నగేష్, లక్ష్మికాంత్‌రెడ్డి, ఎన్‌ఎన్‌రెడ్డి, సురేందర్, నవీన్‌కుమార్, శివలను ఏసీపి పృథ్వీందర్‌రావు అభినందించారు. డిపార్టుమెంట్ తరఫున క్యాష్ రివార్డును అందజేశారు. -
మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్‌ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక ఎస్ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్‌ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందున్నప్పటికీ మెకానిక్‌లు మాత్రం వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సదస్సుకు సుమారు రెండు వేల మంది మెకానిక్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక నాయకులు తోడేటి బాబు, స్వామి, రమేష్, ఆశోక్‌రెడ్డి, సుజేందర్, రాము, రవికాంత్, లక్ష్మణ్, రాజు, రాజినీకాంత్, మనోహర్, జాఫర్, రమేష్, పాషా, శంకర్, సురేష్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి
షాద్‌నగర్‌టౌన్: ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ల్యంతోనే కార్మికుడు వెంకటేష్ మృతి చెందాడని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. షాద్‌నగర్ ఆర్టీసీ బస్ డిపోలో పని చేస్తున్న కార్మికుడు హైదరాబాద్‌లోని హకీంపేటలోని ఆర్టీసీ గ్యారేజీలో రెండు బస్సుల మధ్య నలిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు మంగళవారం షాద్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వెంకటేష్ (30) ఐటీఐ పూర్తి చేసి గత కొంత కాలంగా షాద్‌నగర్ ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సును రిపేర్ నిమిత్తం ఆర్టీసీ వారు హైదరాబాద్‌లోని హకీంపేటకు పంపాచారు. బస్సు డ్రైవర్‌తో పాటుగా డీజిల్ మెకానిక్ వెంకటేష్ కూడ హకీంపేటకు వెళ్లాడు. అయితే అక్కడ రెండు బస్సులు ఒకదాని వెంట మరొకటి నిలబడ్డాయి. ఓ బస్సును రివర్స్ తీసే క్రమంలో బస్సు వెనక నిలబడి ఉన్న వెంకటేష్ ప్రమాదవశాత్తు రెండు బస్సుల మధ్య చిక్కుకొని నలిగిపోయాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నష్టపరిహారం చెల్లించాలి... కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీయం, బీఎల్ఎఫ్ నాయకులతో పాటుగా వివిధ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని కార్మికుడిని బస్సు మరమ్మతులకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కారణంగా వెంకటేష్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడు వెంకటేష్ కుటుంబానికి పరిహారం అందజేస్తామని టీఆర్టీసీ డీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు దంగు శ్రీనివాస్‌యాదవ్, శివశంకర్‌గౌడ్, ఎన్.రాజు, బుద్దుల జంగయ్య, నాగరాజు, ఈశ్వర్ నాయక్, అల్వాల దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మెకానిక్‌ల బతుకులు దుర్భరం
బీబీపేట : ప్రస్తుతం కాలంలో బైకు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పెరుగుతున్న అవసరాల రీత్యా ఒక్కో ఇంట్లో రెండేసి, మూడేసి బైక్‌లు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన యజమాని సర్వీసింగ్, రిపేర్ చేయించక తప్పదు. కానీ బైక్ మెకానిక్‌లు పొద్దంతా కష్టపడి పని చేసినా, ఏళ్లు గడిచినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. నానాటికి పెరిగిపోతున్న వాహనాల విడిభాగాల ధరలతో మెకానిక్‌లకు ఆదాయం తగ్గిపోతోంది. మరమ్మతులు చేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో మెకానిక్‌లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడు కొత్త వాహనాలపై మోజు పెంచుకోవడంతో తమ వృత్తి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగానే చార్జీలు.. బైక్ సర్వీసింగ్‌కు మెకానిక్‌లు నామమాత్రంగానే చార్జీలు వసూలు చేస్తుంటారు. బైక్ సర్వీసింగ్ కు రూ. 350లు, వాటర్ సర్వీసింగ్ కు రూ. 50లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయిల్ ధరలు పెరగడం, విడి భాగాల ధరలు పెరగడం వల్ల మిగులుబాటు ఉండడం లేదని మెకానిక్‌లు వాపోతున్నారు. అలాగే నిత్యం ఆయిల్ గ్రీజులను ముట్టుకోవడం, వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. పెరిగిన అద్దెలు ప్రస్తుతం మెకానిక్ దుకాణం ఏర్పాటు చేయాలంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో అయితే రూ. 50వేల అడ్వాన్సుతో పాటు నెలకు కనీసం రూ. 2వేల నుంచి 5వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు కరెంట్ బిల్లు మరో రూ. వెయ్యి వస్తుంది. మొత్తంగా వచ్చే ఆదాయంలో సగం వరకు ఖర్చులకే సరిపోతుందని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆరోగ్య పథకాలు, బీమా వర్తింప జేయాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణకు కష్టంగా ఉంది మెకానిక్ పనిచేస్తే వచ్చే ఆదాయం కుటుంబపోషణకు కూడా సరిపోవడం లేదు. అద్దెలు పెరిగాయి. బైకు విడిభాగాలు, పనిముట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. మా జీవితానికి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వం ఆర్థికసహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. –గుర్రాల నవీన్, బైక్ మెకానిక్, బీబీపేట -
స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ
గుంటూరు ఈస్ట్: స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ చేసిన వ్యక్తిని సంఘటన జరిగిన 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, లాలాపేట ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ ఆదివారం లాలాపేట పోలీస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత గుంటూరు రెడ్ల బజారుకు చెందిన షేక్ రకీబుర్ రెహ్మాన్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తుంటాడు. అడ్డదారిలో సంపాదించాలని పథకం వేశాడు . లాలాపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉద్యోగి అయిన పీసపాటి శ్రీనివాసాచార్యులుని బైక్ మెకానిక్ షాపులో పరిచయం చేసుకున్నాడు. స్నేహంగా మెలుగుతూ ఆయన ఇంటికి వెళ్లేవాడు. ఇటీవల శ్రీనివాసాచార్యులు భార్య మృతి చెందినప్పుడు ఆత్మీయుడిలా అన్ని పనుల్లో అండగా నిలబడ్డాడు. ఈనెల 6న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో యాత్రలకు వెళ్లాడు. ఈ సమయంలో రెహ్మాన్ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ. 30వేలు, బీరువాలోని 3.5 సవర్ల బంగారు నాంతాడు చోరీ చేశాడు. శ్రీనివాసాచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన రోజు శ్రీనివాసాచార్యులు ఇంటి సమీపంలో తిరుగాడిన విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ జరిగిన 48 గంటల్లో అరెస్టు చేసి నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేసవిలో ప్రత్యేక నిఘా వేసవి ప్రారంభమైన నేపథ్యంలో చోరీలు నివారించేందుకు ప్రత్యేక నిఘా పెడుతున్నామని డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. ఊరు వెళ్లే సమయంలో నగలు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇంటికి ఆధునికమైన, బలమైన తాళాలు, గెడలు ఉపయోగించాలని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవాలని కోరారు. -
అప్పు తిరిగి చెల్లించలేదని.. చంపేసాడు
-
అప్పు తిరిగి చెల్లించలేదని..
అమీర్‌పేట: వ్యాపారం లో నష్టానికి కారణమయ్యాడనే కోపంతో ఓ మెకానిక్ కారు యజమానిని దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ మండలం, మడికొండకు చెందిన వెంకటరాజ్యం (32) నగరానికి వలస వచ్చి ఇంద్రానగర్‌లో ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో కారు అద్దెకు నడుపుకుంటున్నాడు. అతడికి మధురానగర్ జీ బ్లాక్‌కు చెందిన మెకానిక్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. కృష్ణ సలహా మేరకు జైలో కారు కొనుగోలు చేసిన వెంకటరాజ్యం రూ.లక్ష అప్పు కావాలని కోరడంతో కృష్ణ తనకు తెలిసిన వ్యక్తి వద్ద అప్పు ఇప్పించాడు. అయితే సకాలంలో అప్పు తీర్చలేకపోగా గత మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు రోజుల క్రితం కృష్ణకు ఫోన్ చేసిన వెంకటరాజ్యం జైలో కారును విక్రయించి షిఫ్ట్ డిజైర్ కారు కొనాలని, బాకీ తీరుస్తానని చెప్పాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కృష్ణ ఓ కారు అమ్మకానికి ఉందని, వెంటనే వస్తే ఇప్పిస్తానని చెప్పడంతో అతను శుక్రవారం మధ్యాహ్నం షెడ్డు వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా అప్పు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరడంతో ఆవేశానికి లోనైన కృష్ణ స్క్రూడైవర్‌తో వెంకటరాజ్యం దాడి చేసి, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న వెంకట్‌ను 108లో గాంధీ ఆసుపత్రికి తరళించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ‘పెట్టుబడి’కి 9,700 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో రైతు పెట్టుబడి పథకానికి రూ.9,700 కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఈ మొత్తం అవసరమని తెలిపింది. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెట్టుబడి పథకం నిధులతో కలిపి ప్రగతి పద్దు కింద మొత్తం రూ. 12,800 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌గా ఉండే అవకాశముందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ సారి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 2017–18 బడ్జెట్లో యాంత్రీకరణకు రూ.336 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి అదనంగా రూ.164 కోట్ల మేరకు కోరుతున్నారు. ఇక వడ్డీలేని రుణాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.340 కోట్లు కేటాయిస్తే, వచ్చే బడ్జెట్లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. విత్తన సబ్సిడీకి గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, రానున్న బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించారు. ఖరీఫ్ పెట్టుబడి సాయం 6,480 కోట్లు రాష్ట్రంలో దాదాపు 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని.. దాని ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు లెక్కవేసి వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు, మరో రూ.3,220 కోట్లు రబీ సీజన్‌కు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ భూములకు ‘పెట్టుబడి’ అందదు! పెట్టుబడి పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సాగుకు యోగ్యంకాని భూములుంటే వాటిని పెట్టుబడి పథకం నుంచి మినహాయించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సాగుకు యోగ్యం కాని భూమి మొత్తంగా రెండు శాతం ఉండొచ్చని, ప్రస్తుతం ఆ భూమిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు. -
ట్రాక్టర్లతో సరిపెట్టేశారు!
13 నియోజకవర్గాలకు 40 చొప్పున మంజూరు ఎస్డీపీ కింద రూ.12.85 కోట్లు కేటాయింపు ఇతర పరికరాలకు రూ.7.36 కోట్లు అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్, మే నెలల్లో యాంత్రికీకరణ పథకానికి అనుమతి ఇచ్చిఉంటే ఉపయోగరకంగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎస్డీపీ కింద రూ.20.21 కోట్లు బడ్జెట్ కేటాయింపు : ప్రస్తుతం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీపీ) కింద 520 ట్రాక్టర్లకు రూ.12.85 కోట్లు, ఇతర పథకం కింద మరికొన్ని యంత్ర పరికరాలకు రూ.7.36 కోట్లు మంజూరు చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల విషయానికొస్తే జిల్లాకు 520 మంజూరు కాగా అందులో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక్క ట్రాక్టర్ కూడా కేటాయించలేదు. మిగతా 13 నియోజక వర్గాలకు 40 చొప్పున కేటాయించారు. అధికారికంగా ఇన్చార్జ్ మంత్రి అనుమతులు తప్పనిసరి చేయడంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులకు ఇచ్చుకునే పరిస్థితి నెలకొనడంతో సామాన్య రైతులకు ట్రాక్టర్లు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇకపోతే జిల్లా వ్యవసాయశాఖ రూ.40.93 కోట్లు బడ్జెట్‌తో 14,739 యూనిట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపింది. రూ.20.21 కోట్ల బడ్జెట్‌తో ట్రాక్టర్లు, కొన్ని యంత్రపరికరాలకు అనుమతివ్వడం గమనార్హం. -
యాంత్రీకరణపై రైతులకు శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : యాంత్రీకరణ పథకంపై సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానిక రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్‌టీసీ) డీడీఏ డి.జయచంద్ర ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది రైతులను ఎంపిక చేశామన్నారు. తొలిరోజు ఎఫ్‌టీసీలో శిక్షణ ఉంటుందన్నారు. ఏడీఏ పి.రామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రెండోరోజు గార్లదిన్నెలో ఉన్న ట్రాక్టర్‌నగర్‌లో, మూడోరోజు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, నాలుగోరోజు రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రంతో పాటు పనిముట్లు తయారు కేంద్రాలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని తెలిపారు. యాంత్రీకరణ పథకం, నియమ నిబంధనలు, వ్యవసాయ, ఉద్యాన పంటల్లో యంత్ర పరికరాల వాడకం, ఆవశ్యకత అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. -
ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ మృతి
నరసరావుపేటటౌన్ (నరసరావుపేట) : బస్సుకిందపడి ఆర్డీసీ మెకానిక్ మృతిచెందిన సంఘటన సోమవారం నరసరావుపేట ఆర్టీసీ గ్యారేజీలో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ గ్యారేజీలో జాజం నాగేశ్వరరావు (45) బస్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. మధ్యాహ్న సమయంలో బస్సు కింది భాగంలో పనిచేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ అల్లాడి విజయామృతరావు బస్సును బయటకు తీసే ›ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెనుకభాగంలో ఉన్న టైరు నాగేశ్వరరావు పైకి ఎక్కడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు, సిబ్బంది బాధితుడిని వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య తెలిపారు. -
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం : మెకానిక్ మృతి
విజయవాడ : ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిధిలోని గ్యారేజ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న దుర్గారావు ఆదివారం బస్ నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ మెకానిక్ సత్యనారాయణను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్పర్ చేతికి బస్ ఎవరిచ్చారో తెలియదంటూ ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హెల్పర్‌కి నిబంధనలకు విరుద్ధంగా బస్‌ను ఇచ్చిన ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హెల్పర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. -
జాబిల్లిని చేరే యంత్రం ఏది?
సుమారు 40 ఏళ్ల క్రితం మనిషి జాబిల్లిపై అడుగుపెట్టినప్పుడు అంతరిక్ష రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఇందులో డౌటేమీ లేదు. ఇన్నేళ్ల తరువాత మరోసారి అలాంటి ఘట్టానికి రంగం సిద్ధమైంది. విషయం ఏమిటి అంటారా? అక్కడికే వస్తున్నాం. ఎడమవైపు ఉన్న ఫొటో చూశారుగా... ఈ ఏడాది జాబిల్లిపైకి చేరే తొలి ప్రైవేట్ వాహనం ఇదే కావచ్చు. ఇక రెండో ఫొటోలో ఉన్నది మన భారతీయ బృందం "టీమ్ ఇండస్"’ సిద్ధం చేసిన మోడల్. ఇది కూడా జాబిల్లిపైకి చేరే చాన్స్ ఉంది! రెండూ వెళతాయా? ఏమో చెప్పలేం. ఒకటైతే గ్యారంటీ. కాకపోతే మొత్తం ఐదు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఎందులో? గూగుల్ లూనార్ ఎక్స్‌ప్రైజ్ పోటీలో! పోటీ ఫైనలిస్ట్‌లను ఇటీవలే ప్రకటించారు. దాదాపు మూడు కోట్ల డాలర్ల (దాదాపు 210 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ కోసం జరుగుతున్న ఈ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ స్పేస్ఎల్, టీమ్ ఇండస్లతోపాటు, జపాన్‌కు చెందిన హకుటూ, న్యూజిలాండ్‌కు చెందిన రాకెట్ ల్యాబ్, వివిధ దేశాల భాగస్వామ్యంతో నడుస్తున్న "సినర్జీ మూన్"లు పోటీ పడుతున్నాయి. ఈ టీమ్స్‌లో ఏ ఒక్కటి జాబిల్లిపైకి చేరి 500 మీటర్లు ప్రయాణించి, హై డెఫినిషన్ వీడియో, చిత్రాలు ప్రసారం చేసినా చాలు వారికి రెండు కోట్ల డాలర్లు చెల్లిస్తుంది ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్. మరి మిగిలిన కోటి డాలర్ల మాటేమిటి? అనేదేనా మీ సందేహం? చాలా సింపుల్. 50 లక్షల డాలర్లు రెండో ప్రైజ్‌గా ఇస్తారు. ఇంకో 50 లక్షల డాలర్లను జాబిల్లిపై ఒక రాత్రి మొత్తం గడిపిన అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసిన బృందానికి బోనస్ ప్రైజ్‌గా ఇస్తారు. పీటర్ డెమండిస్ అనే వ్యాపార వేత్త చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి పోటీలు అనేకం జరుగుతూంటాయి. ప్రస్తుతం జాబిల్లిపైకి అంతరిక్ష నౌకలను పంపడం మాత్రమే కాకుండా... భూమ్మీద నీటి సమస్యలు తీర్చడం, మహిళల భద్రత, అందరికీ అక్షరాస్యత, వంటి సమస్యల పరిష్కారానికీ కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో పోటీలు నిర్వహిస్తోంది! - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉరి వేసుకుని ఉద్యోగి ఆత్మహత్య
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఐసీఎల్ కర్మాగారం ఉద్యోగి జి.వేణుగోపాల్ నాయుడు(52) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటనాయుడు సోమవారం తెలిపారు. ఐసీఎల్ కర్మాగారంలో ఆయన 25 ఏళ్లకు పైగా మెకానిక్‌గా పని చేస్తుండే వారు. ఐసీఎల్ కాలనీలోని ఏ/52 నంబరు గల ఇంటిలో భార్య పిల్లలతో జీవించే వారు. ఆయనకు భార్య విజయలక్ష్మితోపాటు పిల్లలు సందీప్, సుచరిత ఉన్నారు. వేణుగోపాల్ నాయుడు కొంత కాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతుండే వారు. మూడు రోజుల కిందట భార్య తన అమ్మవారి ఇంటికి పోయివస్తానని చెప్పి పిల్లలతో వెళ్లింది. అనారోగ్యంతో జీవితం విరక్తి చెందిన ఆయన ఇంటిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
యాంత్రీకరణే అధిక దిగుబడికి పరిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ జనాభా 2040 నాటికి 900 కోట్లకు చేరుకోనుంది. వీరందరికీ సరిపడ ఆహారోత్పత్తి పెద్ద సవాల్ అని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయల్ తెలిపారు. నేలల రకాన్నిబట్టి ప్రత్యేక పోషకాలు, యాంత్రీకరణ, నదుల అనుసంధానం, కరువును తట్టుకునే వంగడాలు అధిక దిగుబడికి పరిష్కారమని బుధవారమిక్కడ జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు. దున్నటం, పంట కోతలకు మాత్రమే యాంత్రికీకరణ పరిమితమవుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు అన్నారు. కరువు తట్టుకునే విత్తనాల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. బీటీ పత్తి విత్తనాలపై ఆధారపడడం తగ్గించే చర్యల్లో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెరిగేలా వంగడాలను సృష్టించే పనిలో ఉన్నట్టు తెలిపారు. అనుమతులు మీరిచ్చి... కోరమాండల్ స్పాన్సర్ చేసిన సీఐఐ సదస్సుకు ఆ కంపెనీ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇచ్చేది మీరు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ చర్యలు మాపైనా తీసుకోవడమేంటని మెదక్ ఫెర్టిలైజర్స్, సీడ్స, పెస్టిసైడ్‌స అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్ మోహన్తోసహా వేదిక పైన ఉన్నవారంతా ఖంగుతిన్నారు. యూరియా బస్తాలు తక్కువ బరువుతో వచ్చినా తయారీ కంపెనీలపై చర్య తీసుకోకుండా డీలర్లను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా అవుతున్నా ప్రభుత్వ శాఖల నుంచి కొత్త వంగడాలు పెద్దగా రావడం లేదన్నారు. ఏడాదిలో విస్తరణ పూర్తి... వైజాగ్‌లో ఉన్న ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ యూనిట్‌ను కోరమాండల్ విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు సామర్థ్యం రోజుకు 700 టన్నులు. దీనిని 1,000 టన్నులకు చేర్చనున్నారు. విస్తరణకై డిసెంబరు 8న (నేడు) ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి రాగానే 12 నెలల్లో ప్లాంటు సిద్ధం చేస్తామని కంపెనీ మార్కెటింగ్ ప్రెసిడెంట్ జి.రవి ప్రసాద్ తెలిపారు. విస్తరణకు కంపెనీ రూ.225 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 275 మందికి ఉద్యోగాలు రానున్నాయి. -
ప్రాణం తీశారు
u నిర్లక్ష్య వైద్యంతోనే లారీ మెకానిక్ మృతి చెందాడు u చంద్ర హాస్పిటల్ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోâýæన u డాక్టర్‌పై చర్యలు తీసుకుని, హాస్పిటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ అనంతపురం సెంట్రల్ : ఆపరేష¯ŒS సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాలు ఇన్ఫెక్ష¯ŒS అయ్యేలా చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారని నందమూరి నగర్‌కు చెందిన లారీ మెకానిక్ సయ్యద్‌బాషా అలియాస్ చోటూ (32) బంధువు లు నగరంలోని చంద్ర హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శాంతిస్వరూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోâýæన నిర్వహించారు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు.. పది రోజుల కిందట పెన్నహోబిలం సమీపంలో కారు బోల్తాపడిన ఘటనలో సయ్యద్‌బాషాకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ శాంతిస్వరూప్ తను కన్సల్టెంట్‌గా ఉన్న చంద్రహాస్పిటల్‌కు రెఫర్ చేశారు. అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) కింద ఆయన చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన నిమ్స్‌కు తీసుకెళితే.. కాలు ఇన్ఫెక్ష¯ŒS అయ్యి కుళ్లిపోయే స్థితికి చేరుకున్న విషయాన్ని గుర్తించచిన వైద్యులు అడ్మిష¯ŒS చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాలికి గాయమైన చోట అంటుకున్న మట్టిని కూడా తీయకుండా ఆపరేష¯ŒS చేసి కుట్లు వేయడంతో ఇన్ఫెక్ష¯ŒS సోకి ప్రాణం కోల్పోయాడని సయ్యద్‌బాషా బంధువులు మధ్యాహ్నం ఆస్పత్రి వద్దకు మృతదేహంతో చేరుకుని ఆందోâýæన నిర్వహించారు. మృతికి కారకుడైన డాక్టర్ శాంతిస్వరూప్‌పై చర్యలు తీసుకుని, చంద్ర హాస్పిటల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. త్రీటౌ¯ŒS పోలీసులు రంగ ప్రవేశం చేసి హాస్పిటల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో బాధితులు శాంతించారు. వీరి ఆందోâýæనకు ఎంఎండీఏ అధ్యక్షులు ఇమామ్, ఐఎంఎం అధ్యక్షులు బాషా, ఎంఐఎం నాయకులు అలీ, రఫీ, సీపీఎం నాయకులు ఇంతియాజ్, బాబావలి, సీపీఐ నాయకులు లింగమయ్య తదితరులు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గురువారం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. మృతుడికి భార్య భాను, కుమార్తెలు నాజు, యాస్మిన్, సాదియా ఉన్నారు. -
కాటేసిన కరెంట్
విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి కొలిమిగుండ్ల: వ్యవసాయ బోర్లను మరమ్మతు చేసే ఓ మెకానిక్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవెంతుర్ల సమీపంలో శనివారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా వరదాయిపల్లెకు చెందిన మెకానిక్ బెస్త రమేష్(22) జీవనోపాధి నిమిత్తం పదేళ్ల క్రితం పేరుఽసోమల చేరుకున్నాడు. ఇటీవల సొంతంగా వ్యవసాయ బోర్లలో మోటర్లు, పైపులు వెలికి తీసేందుకు ట్రాక్టర్‌తో తయారు చేసిన మోటర్ క్రేన్ తెచ్చుకుని చుట్టు పక్కల గ్రామాల్లో పనిచేసేవాడు. శనివారం పెద్దవెంతుర్లకు చెందిన రైతు శివయ్య పొలంలో కొత్త పైపులు క్రేన్ సాయంతో వేస్తుండగా పైనున్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు పైపు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం యజమానితోపాటు సాయంగా ఉన్న మరో ఇద్దరు రైతులు ప్రాణాప్రాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. -
వృత్తి మెకానిక్... ప్రవృత్తి చోరీలు
– బైక్‌ల దొంగ అరెస్ట్ – 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కర్నూలు: మెకానిక్ షెడ్లో గుమాస్తాగా పనిచేస్తూ జల్సాల కోసం బైకుల చోరీకి పాల్పడిన దొంగ పోలీసుల వలకు చిక్కాడు. మహానంది మండలం అభాండం తండాకు చెందిన మెగావత్ నాగార్జున నాయక్ నంద్యాల పట్టణంలో మెకానిక్ షెడ్లో గుమాస్తాగా పనిచేస్తూ మారు తాళాలతో బైకులను చోరీ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నంద్యాల ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగార్జున నాయక్‌పై నిఘా వేసి పట్టుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నంద్యాల–మహానంది రోడ్డులోని బంగారుపుట్ట వద్ద నాగార్జున నాయక్ అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. నంద్యాల, కడప పట్టణాల్లో బైక్‌లు చోరీ చేసినట్లు ఆయా పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. నాగార్జున నాయక్ వినియోగిస్తున్న ఒక బైకును గుర్తించి విచారించగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కంప చెట్లలో మరో 8 బైకులు దాచి వుంచినట్లు అంగీకరించడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బైకు దొంగను అరెస్టు చేసి ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినందుకు నంద్యాల ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రమణ, హరిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు, శివయ్య, బాలదాసు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, గంగాధర్, మద్దిలేటి, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించారు. గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తే పోలీసు చర్యలు: ఎస్పీ గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే వారు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. పాణ్యం సమీపంలోని కొండజూటూరు, వెల్దుర్తి మండలం చెరుకులపాడుతో పాటు ఆదోని ప్రాంతాల్లోని మరో రెండు గ్రామాల్లో కొంతమంది ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వారికి సూచించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేవారిపై రౌడీషీట్లు, బైండోవర్ కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఎవరైనా రౌడీయిజానికి, దౌర్జన్యానికి పాల్పడితే తక్షణమే డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ నివాసి చెర్కుపల్లి నరేందర్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతనికి కొంతకాలంగా భార్యతో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేందర్ బుధవారం ఉదయం ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ సదస్సులో అధ్యాపకుల ప్రతిభ
పెదకాకాని: మలేషియా దేశంలో జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సుతో వీవీఐటీ మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన అధ్యాపకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలు సమర్పించారని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొడక్షన్ ఎనర్జీ అండ్ రిలయబిలిటీ (ఐసీపీఈఆర్–2016) అంశంపై ఈ సదస్సు నిర్వహించారని చెప్పారు. విద్యాసాగర్ మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి 18 వరకు కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరిగిందని, 25 దేశాలకు చెందిన నిపుణులు హాజరయ్యారని వివరించారు. ఈ బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.కేదార్ మల్లిక్, అసోసియేట్ ప్రొఫెసర్ షేక్ అబ్దుల్ మునాఫ్ ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. -
యాంత్రీకరణపై సర్కార్ నజర్
మహబూబ్‌నగర్ వ్యవసాయం: సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్నదే తమ లక్ష్యం అంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతువస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా గడిచిన రెండేళ్ల కాలంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలలో లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. సదరు పరికరాలు రైతులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ఇంటర్ డిస్ట్రిక్ స్వా్కడ్ టీంలను నియమించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. 2015–16 వార్షిక ఏడాదిలో జిల్లాలో వ్యవసాయాంత్రీకరణకు రూ. 5 కోట్ల రాయితీ యంత్ర పరికరాలను, ఆర్కేవీవై కింద రూ. 3.6 కోట్ల విలువలగల పరికరాలపై క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో పంపిణీ చేసిన పరికరాలు,ట్రాక్టర్లపై విచారించేందుకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఒక ఏడీఏ,ఒక ఎంఏఓతో కూడిన రెండు బృందాలు జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలో విచారణ చేట్టాయి.మంగళవారం షాద్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమొదలైంది. -
ఆశ్రయం ఇస్తే ప్రాణం తీశాడు
మద్యం మత్తులో దూషిస్తున్నాడని తలపై రాడ్‌తో కొట్టి వ్యక్తి హత్య భాగ్యనగర్ కాలనీ: తాగి దూషిస్తున్నాడని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినే దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఆనక మృతదేహాన్ని బూత్రూమ్లో దాచి పరారయ్యాడు. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. కూకట్పల్లి సీఐ పురుషోత్తమ్ యాదవ్ కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన పన్నాలాల్ షా (55) మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో నివాసం ఉంటూ స్థానిక చక్రగిరి ట్రాన్స్‌పోర్ట్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన పన్నాలాల్ నగరానికి తిరిగి వస్తూ తన వెంట అదే గ్రామానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. అతడిని తన వద్ద అసిస్టెంట్ మెకానిక్‌గా చేర్చుకొని, తన రూమ్‌లోనే వసతి కల్పించాడు. పన్నాలాల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. తాగినప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతూ సంజీవ్ని వేధించేవాడు. దీంతో విసుగు చెందిన సంజీవ్... ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న పన్నాలాల్ తలపై ఐరన్ రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూమ్లో దాచి పెట్టి సంజీవ్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తలపై ఐరన్ రాడ్‌తో కొట్టడంతో మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. -
సాయం కోసం ఎదురుచూపు
♦ కిడ్నీలు దెబ్బతిని మంచాన పడ్డ మెకానిక్ ♦ దయనీయ స్థితిలో దళిత కుటుంబం ♦ ప్రభుత్వ సాయం కోసం విన్నపాలు వర్గల్ : అతనిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్డే ఇల్లు. అతను మెకానిక్‌గా.. భార్య కూలి పనిచేస్తే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి. అయినా, పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లో చదివిస్తున్నారు. ఇంతలో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. కిడ్నీలు పాడవడంతో డియాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి. స్నేహితులు కొంతమేర సహాయం చేస్తున్నా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. వర్గల్ మండలం పాములపర్తిలో దళిత కుటుంబానికి చెందిన చిగురుపల్లి శ్రీనివాస్(30) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆపై ఫ్యాన్లు, కూలర్లు, సబ్మెర్సిబుల్ మోటార్ల రిపేరింగ్ నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రజ్ఞాపూర్‌లో పనిచేస్తూ మంగమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి మహేశ్(8), మాధురి(7) పిల్లలు. శ్రీనివాస్ మెకానిక్‌గా కలిగారు. తాను మెకానిక్‌గా, భార్య కూలి చేస్తూ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం శ్రీను అకస్మాత్తుగా జర్వపీడితుడై.. నడవలేని స్థితికి చేరాడు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా మూత్రపిండాలు దెబ్బతున్నట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. పొందుపు చేసిన డబ్బులు, తెచ్చిన అప్పులు ప్రాథమిక పరీక్షలు, చికిత్సలకే సరిపోయాయి. దీంతో పిల్లల చదువులు ప్రైవేటు స్కూల్ నుంచి ఊళ్లోని సర్కార్ బడికి మారింది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకుంటే తప్ప.. ప్రాణాలు నిలవవని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం మరింత ఆందోళనకు గురైంది. డయాలసిస్, మందులకు వారానికి సగటున రూ.8 వేలు ఖర్చు అవుతున్నాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మిత్రులే అండగా.. గ్రామానికి చెందిన కరుణాకర్, రవి, రాజేశ్ తదితరులు స్నేహితుడు శ్రీనివాస్‌కు తోడుగా నిలిచారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వీరంతా భారీగా ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. డయాలసిస్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుతున్నారు. ఎవరైనా కనపడితే చాలు మిత్రుడి దుస్థితి వివరించి ఆదుకోవాలని కోరుతున్నారు. కుటుంబానికి గుదిబండ అయ్యా రేకుల షెడ్డే మా ఇల్లు. నిరుడు నా ఆరోగ్యం దెబ్బతిన్నది. హైదరాబాద్‌ల టెస్టులు చేయిస్తే రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలిసింది. వైద్యం కోసం నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసిన. జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పిన్రు. వారానికి రెండుసార్లు బ్లడ్ ఇంజెక్షన్లు, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కిడ్నీలు మార్పించుకోవాలన్నరు. ఆరోగ్యశ్రీ ద్వారా గాంధీ ఆస్పత్రిల్లో డయాలసిస్ చేయించుకుంటున్న. వారానికి అన్ని ఖర్చులు కలిపి రూ. 8,000 అయితున్నయ్. దోస్తుల సాయంతోనే ఇప్పటిదాక నెట్టుకొచ్చిన. నెలకు రూ. 32,000 ఖర్చు ఎవలిస్తరు. ‘జీవన ధార’ల కిడ్నీల కోసం దరఖాస్తు పెట్టినం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు సాయం చేస్తే బతికినంత కాలం రుణపడి ఉంట. సాయం చేయాలనుకున్నవారు సెల్‌నెంబర్: 83749 86639కు కాల్ చేయండి. - శ్రీనివాస్ దోస్తులే దేవుళ్లు ఆయన, నేను కూలి చేసుకునేటోళ్లమే. అన్నదమ్ములు సా యం చేసే పరిస్థితి లేదు. మా ఆయన కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టిండు. నీళ్లు ఎక్కువ తాగొద్దు, తిండి ఎక్కువ తినొద్దు. ఏది తేడా అయినా కడుపు ఉబ్బుతది, అజీర్ణం అయితది. మనిషి ఆగమాగం చేస్తడు. దీంతో కూలీ పని వదిలి ఇంటి వద్దే ఉంటున్న. ఆయన దోస్తులే దేవుళ్ల లెక్క మాకు సాయం చేస్తున్నరు. సర్కారు సాయం చేసి మా ఆయనను కిడ్నీ వ్యాధి నుంచి కాపాడాలె. కిరాణా దుకాణం పెట్టుకునేటందుకు సాయం జేస్తె బాగుంటది. - మంగమ్మ, శ్రీనివాస్ భార్య -
'యాంత్రీకరణతో వ్యవసాయం లాభసాటి'
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకునేందుకు వీలుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి పేర్కొన్నారు. ర్యాడికల్, రూరల్ ఎల్లో అనే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో అంతర్జాతీయ అగ్రిహార్టి టెక్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ మురళి, విత్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ కేశవులుతో కలసి స్టాళ్లను పరిశీలించారు. ఈ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన అగ్రిహార్టి కంపెనీల స్టాళ్లతోపాటు రాష్ట్రానికి చెందిన ఆయిల్‌ఫెడ్, విత్తన ధ్రువీకరణ సంస్థ, వ్యవసాయ వర్సిటీ, ఉద్యానశాఖ స్టాళ్లు కూడా పాలుపంచుకుంటున్నాయని పార్థసారధి వివరించారు. పట్టణ ఉద్యానవనాన్ని ప్రభుత్వం రూ. 6 వేల యూనిట్ ఖర్చుతో ప్రోత్సహిస్తుందని, ఉత్సాహవంతులు ముందుకొస్తే 50% సబ్సిడీ ఇస్తామన్నారు. ఈ ప్రదర్శన 24 వరకు కొనసాగనుంది. -
ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!
బెర్లిన్: ఎవరైనా ఏకకాలంలో పరస్పర భిన్నమైన జీవితాలను గడపడం చరిత్రలోనే అరుదు. అందులో రాజభోగాలు అందుబాటులో ఉండే ఓ దేశానికి రారాజుగా, మరో దేశంలో కష్టపడి పనిచేసే కారు మెకానిక్‌గా జీవించడమనేది అసలు ఉండదు. కానీ పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశం రాజు సెఫాస్ కోసి బాన్సా, పార్ట్ టైమ్ రాజుగాను, జర్మనీలో ఫుల్‌టైమ్ కారు మెకానిక్‌గాను పనిచేస్తున్నారు. వృత్తికి అంకితమై పనిచేసే వ్యక్తిగా జర్మనీ కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్న బాన్సా, ‘స్కైప్’ ద్వారా రాజ్యపాలను కొనసాగిస్తూ ఘనా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. జర్మనీలోని లుద్విగ్షాఫెన్లో సొంతంగా కారు మెకానిక్ షెడ్‌ను నడుపుతూ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న 67 ఏళ్ల బాన్సాకు తూర్పు ఘనాలో పెద్ద రాజ ప్రాసాదమే ఉంది. ఆయన్ని అక్కడ ‘కింగ్ టోంగ్బే ఎన్గోరిఫియా సెఫాస్ కోసి బాన్సా’ అని వ్యవహరిస్తారు. అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. మొత్తం 20 లక్షల మంది ప్రజలకు ఆయన పాలకుడు. ఆయన రాజ ప్రాసాదం ఉన్న నగరంలోనే మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. బాన్సా రాజు కాకముందే 1970లో చదువుకోసం జర్మనీ వచ్చారు. మంచి నైపుణ్యం గల మెకానిక్ కావాలంటూ తండ్రి ప్రోత్సహించడంతో బాన్సా చదువు పూర్తికాగానే మెకానిక్‌గా స్థిరపడ్డారు. 1987 వరకు ఆయన జీవితం ఓ మెకానిక్‌గా సాఫీగానే సాగిపోయింది. అప్పుడే ఆయనకు ఘనా రాజ ప్రాసాదం నుంచి అర్జెంట్‌గా రావాల్సిందిగా కబురు వచ్చింది. అప్పటి వరకు రాజుగా కొనసాగిన బాన్సా తాత కింగ్ ఆఫ్ హోహో మరణించారు. బాన్సాకు అప్పటికీ తండ్రి, ఓ అన్నయ్య ఉన్నారు. అయితే వారిద్దరు ఎడమ చేతి వాటంగాళ్లు అవడంతో రాచరిక సంప్రదాయం ప్రకారం వారు సింహాసనానికి అనర్హులయ్యారు. దాంతో సింహాసనం వారుసుడిగా బాన్సా ఎంపికయ్యారు. రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఆనవాయితీగా ఆధ్యాత్మిక గురువుగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఎవరైనా రాజు బాధ్యతలు స్వీకరించాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పాత జీవితాన్ని తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కానీ బాన్సాకు తాను ఎంతోకాలంగా చేస్తున్న మెకానిక్ వృత్తిని వీడాలనిపించలేదు. అప్పటి నుంచి రెండు విధులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఎనిమిది సార్లు ఘనాకు వెళ్లి వస్తుంటారు. మిగతా సమయాల్లో స్కైప్ ద్వారా తన సలహాదారులలో సంప్రదింపులు జరుపుతూ పాలనా వ్యవహారలాను చూస్తున్నారు. ఘనాలో ప్రస్తుతం డెమోక్రటిక్ వ్యవస్థ ఉన్నప్పటికీ రాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని ఎయిడెడ్ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇప్పటికే ఘనాలో ఎన్నో పాఠశాలలను కట్టించిన బాన్సా ప్రస్తుతం ఘనాలో మహిళల కోసం ప్రత్యేక జైలును నిర్మించేందుకు ఆయన అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తున్నారు. బాన్సాకు భార్య గాబ్రియెల్ బాన్సా (57), ఇద్దరు పిల్లలు కార్లో, క్యాథరినాలు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం బాన్సా వివాహం రాయల్ స్టేటస్ ప్రకారమే జరిగింది. ఆయనతోపాటు ఘనా వెళ్లి మొన్ననే తిరిగొచ్చిన జర్మనీ ఫొటోగ్రాఫర్ ఒకరు ఈ విషయాలను తోటి మీడియాతో పంచుకున్నారు. -
ఎస్యూవీ ఇంజన్లు, కారుసీట్లతో హెలికాప్టర్!
అద్భుతాలు సృష్టించాలంటే చదువే అక్కర్లేదు.. ఆలోచన ఉంటే చాలని నిరూపించాడు అసోంకు చెందిన ఓ యువకుడు. స్కూలు చదువు సగంలోనే ఆపేసినా.. తనలో ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదని చూపించాడు. తమ గ్రామంలో ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడమే ధ్యేయంగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మెకానిక్‌గా పనిచేసిన అనుభవంతో ఏకంగా హెలికాప్టర్ తయారు చేశాడు. అసోంలోని శ్యామ్ జులి గ్రామానికి చెందిన చంద్ర శివకోటి శర్మ ఈ సొంత హెలికాప్టర్‌ను తయారు చేసి, దానికి 'పవనపుత్ర' అని పేరు పెట్టాడు. ఆటో మొబైల్ మెకానిక్‌గా పనిచేసే అతడు... తాను పొదుపు చేసిన డబ్బు నుంచి 15 లక్షల రూపాయలను ఖర్చు చేసి హెలికాప్టర్ డిజైన్ చేశాడు. గౌహతికి 450 కిలోమీటర్ల దూరంలోని ధెమాజీ జిల్లాకు చెందిన తమ గ్రామానికి ఎటువంటి వాహనాలు చేరలేకపోవడమే ఇతడి సృష్టి వెనుక కారణం. నిజానికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో క్లాస్ తర్వాత శివకోటి చదువు ఆపేశాడు. అయితేనేం తన కల నిజం చేసుకోవాలనుకున్న శివకోటి.. పొదుపు చేసిన డబ్బుతోపాటు, ఉన్న భూమిని కూడా అమ్మేసి హెలికాప్టర్‌ను రూపొందించాడు. శివకోటి తయారుచేసిన హెలికాప్టర్లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. భూమికి 30 నుంచి 50 అడుగుల ఎత్తులో ఎగిరే దీన్ని మెటల్ షీట్లు, కారు సీట్లు, రెండు ఎస్యువి ఇంజన్లతో తయారుచేశాడు. ఈ 'పవనపుత్ర' గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, దీన్ని నడిపిందుకు ఆయా విభాగాలకు చెందిన అధికారుల క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నానని శివకోటి చెబుతున్నాడు. ఏవియేషన్‌లో ఎలాంటి డిగ్రీ లేకపోయినా... శివకోటి ఇలాంటి వాహనం తయారు చేయడాన్నిజిల్లా డిప్యూటీ కమిషనర్ విక్టర్ కార్పెంటర్ ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు, హెలికాప్టర్ ట్రయల్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చే విభాగాలకు ఉత్తరాలు కూడా రాశారు. అయితే అతడు నిబంధనలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని విక్టర్ చెబుతున్నారు. శివకోటి ప్రయోగానికి ముగ్ధులౌతున్న స్థానికులు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. స్థానిక అధికారులు, ఆర్మీ క్యాంపులోని ఆఫీసర్లు సైతం హెలికాప్టర్ ట్రయల్‌కు వస్తామని శివకోటికి హామీ ఇచ్చారు. -
ట్రాక్టర్లకు యాంత్రీకరణ జోష్..!
♦ కూలీ రేట్లు పెరగటం; లభ్యత తగ్గటమే కారణం ♦ వాణిజ్య అవసరాలకు వాడటంపై పెరిగిన ఆసక్తి ♦ మెల్లగా జోరందుకుంటున్న అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ అనగానే గుర్తొచ్చేది వ్యవసాయమే. కాకపోతే సాగు చేసేవారే ట్రాక్టర్‌ను కొనటమనే ట్రెండ్ మారిందిపుడు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతుండటంతో ఆదాయం కోసం వ్యవసాయ కుటుంబాలకు చెందనివారూ ట్రాక్టర్లను కొని అద్దెకివ్వటం వంటివి చేస్తున్నారు. విభిన్న అవసరాలకు... ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల రవాణాకు ఉపయోగపడడం, తక్కువ సమయంలో ఎక్కువ పని, తక్కువ ఇంధనాన్ని వినియోగించే ట్రాక్టర్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్లు, ఇతర మెషినరీ తయారీ కంపెనీలు సైతం ఔత్సాహిక యువతను ప్రోత్సహిస్తున్నాయి. చెల్లించగలిగే స్తోమతున్న వారికి రుణం అందేలా చొరవ తీసుకుంటున్నాయి. ఈ చర్యలతో స్తబ్దుగా ఉన్న పరిశ్రమ తిరిగి గాడిలో పడుతోందన్నది కంపెనీల మాట. వాణిజ్య అవసరాలకు వినియోగం... నిజానికి రైతులు వ్యవసాయ అవసరాలకు ట్రాక్టర్ వాడితే ఏడాదిలో 90 రోజులకు మించి పని ఉండదు. మిగిలిన రోజుల్లో ట్రాక్టర్ ఖాళీగా ఉంటుంది కనక వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే గిట్టుబాటు అవుతుందని మహీంద్రా స్వరాజ్ సేల్స్ డీజీఎం ఎం.రాజానందన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. ఒక గ్రామంలో ఎందరు రైతులున్నారు? ట్రాక్టర్లు, త్రెషర్లు, రోటావేటర్లు, పవర్ టిల్లర్ల వంటివి వారి దగ్గరెన్ని ఉన్నాయి? వాస్తవ డిమాండ్ ఎంత? అనే విషయాల్ని కంపెనీలు అధ్యయనం చేస్తున్నాయి. ఊళ్లో ఔత్సాహిక యువతను ఎంచుకుని యంత్రాలను కొనేలా వారిని ప్రోత్సహిస్తున్నాయి. వారి రుణానికి మధ్యవర్తిగానూ వ్యవహరిస్తున్నాయి. పంట రకాన్నిబట్టి విభిన్న పరికరాలు (అప్లికేషన్లు) అవసరం. ఇలా ముందుకొచ్చిన యువతకు వారి ఊరు, సమీప గ్రామాల్లో వేసిన పంటల ఆధారంగా పనిముట్లను సూచిస్తున్నాయి. యాంత్రీకరణ విషయంలో భారత్‌లో అపార అవకాశాలున్నాయని ట్రాక్టర్ల కంపెనీ సొనాలికా చెబుతోంది. పంజాబ్‌లో అయిదుగురు రైతులకు ఒక ట్రాక్టర్ ఉంటే, దక్షిణాదిన 25 మంది రైతులకు ఒకటి ఉంది. డిమాండ్ ఉన్న మోడళ్లపైనే.. మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఆశించిన వర్షాలు పడలేదు. పండించిన పంటకు సరైన ధర రాలేదు. దీంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయాలు లేక రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లకు దూరమయ్యారు. ఈ పరిశ్రమ తిరోగమన బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక స్థాయిలో ఏటా 60 వేల ట్రాక్టర్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడీ సంఖ్య 37 వేలకు పరిమితమైంది. దేశవ్యాప్తంగానూ పరిస్థితి ఇలాగే ఉండడంతో ట్రాక్టర్ల కంపెనీలు 2014 నుంచి మోడళ్ల ధరలను పెంచలేదు. ఈ కారణంగా లాభాలు పడిపోయాయని సొనాలికా సీనియర్ జీఎం ఎన్‌వీఎల్‌ఎన్ స్వామి తెలిపారు. అందుకే ఎక్కువ అమ్ముడయ్యే హెచ్‌పీ విభాగంపైనే దృష్టిసారించామని చెప్పారు. తమ కస్టమర్లలో 60 శాతం మంది సొంత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాలకు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారని, 40 శాతం మంది పూర్తిగా కమర్షియల్ యూజర్లని తెలియజేశారు. పెద్ద ఎత్తున యాంత్రికీకరణ.. భారత్‌లో వ్యవసాయ యంత్రాల పరంగా ఎక్కువగా అమ్ముడయ్యేవి ట్రాక్టర్లే. ఏడాదికి త్రెషర్లు ఒక లక్ష యూనిట్లు, రోటావేటర్లు 80,000, పవర్ టిల్లర్లు 60,000, పవర్ వీడర్లు 25 వేలు, కంబైన్ హార్వెస్టర్లు 5,000 దాకా విక్రయమవుతున్నాయి. కూలి రేట్లు పెరగటం, కూలీల కొరత తీవ్రంగా ఉండడమే యాంత్రీకరణను పెంచుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. 2004-2012 మధ్య దేశంలో 3.7 కోట్ల మంది వ్యవసాయ కూలీలు నిర్మాణ, తయారీ, సేవా వంటి రంగాలకు మళ్లినట్టు అంచనా. దేశ చరిత్రలో ఈ స్థాయిలో వలసలు జరగడం ఇదే తొలిసారి. ఇదంతా యాంత్రీకరణకు ఊపిరిపోస్తోంది. -
30న ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు
- జనవరిలో మిగితా పోస్టులన్నింటికి వరుసగా నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 1:2 చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం బీసీ క్రీమీలేయర్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30వ తేదీన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) మెకానికల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించి, జనవరి నెలలో అన్ని రకాల పోస్టులకు ఇంటర్వ్యూలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ అధికారి పోస్టులకు మినహా ఇంటర్వ్యూలు ఉన్న మిగితా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణకు చర్యలు చేపడుతోంది. ఇక నీటి పారుదల, ఆయక ట్టు అభివృద్ధి శాఖలో ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఈనెల 30న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ జాబితాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వారికి 30వ తేదీన ఉదయం 9 గంటలకు కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్లు, ఖాళీల వివరాలు, చెక్ లిస్టులు, అటెస్టేషన్, ఇతర ఫారాలు అన్నింటిని ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత నుంచి తమ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటన్నింటిని ఫిల్ చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అంద జేయాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను రెండు సెట్ల జిరాక్స్ కాపీలను (అటెస్టెడ్) అందజేయాలని, బీసీలు అయితే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను అందజేయాలని కోరారు. అభ్యర్థులు ఉద్యోగం వస్తుందా? లేదా? అన్నది చూడకుండా నాన్ క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే ఆయా సర్టిఫికెట్లను తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. -
విద్యార్థినిని వేధిస్తున్న మెకానిక్ అరెస్ట్
ముషీరాబాద్ : ప్రేమపేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిని ముషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోలక్పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో నివసించే నంది సురేష్(21) స్కూటర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి పక్కనే నివసించే విద్యార్థినిని ప్రేమించాలని నాలుగు నెలలుగా వెంటపడుతున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు నానమ్మకు తెలిపింది. ఆ యువకుడిని పిలిచి మందలించగా నానమ్మ దేవమ్మను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. దీంతో దేవమ్మ గురువారం ముషీరాబాద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
-
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
ప్రియురాలితో కలిసి పారిపోయే ప్రయత్నంలో పంటకాలువలో పడి గల్లంతయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో జరిగింది. హైదరాబాద్ అల్వాల్‌లో మెకానిక్‌గా పనిచేసే వినయ్‌కుమార్... భీమవరానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో వినయ్ అమ్మాయి ఊరెళ్లి, వాళ్ల బంధువులతో గొడవ పడ్డాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి పారిపోయే ప్రయత్నంలో వినయ్ తాడేరు పంటకాల్వలో దిగాడు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. ప్రియురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి వినయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. -
టీవీ రిపేరంటూ తీసుకెళ్లి గొంతుకోశారు
పశ్చిమగోదావరి: టీవీ బాగు చేయాలని చెప్పి మెకానిక్‌ను బైక్‌పై తీసుకెళ్లిన దుండగులు గొంతు కోసి పరారయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ చల్లా నాగ వెంకట మురళిని ఇద్దరు దుండగులు టీవీ బాగు చేయాలని చెప్పి శనివారం రాత్రి బైక్‌పై ఎక్కించుకున్నారు. తణుకు రూరల్ మండలం ముద్దాపురం గ్రామానికి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యారు. స్థానికులు అతడ్ని తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బస్సు ఢీకొని ఆర్టీసీ మెకానిక్ మృతి
ప్రొద్దుటూరు: ఆర్టీసీ డిపోలో టెస్టింగ్ నిర్వహిస్తున్న ఓ మెకానిక్ ప్రమాదవశాత్తూ బస్సు ఢీకొని మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. జమ్మలమడుగుకు చెందిన పట్నం వెంకటరమణ(53) ఆర్టీసీ లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నైట్‌షిప్ట్ లో పనిచేస్తూ.. బస్సుకు ఆయిలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో డిపోలోని మరో బస్సుకు టెస్ట్‌డ్రైవ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటరమణ మృతికి పలు కార్మికసంఘాలు తమ సంతాపం తెలిపాయి. -
ఇదేనా... యాంత్రీకరణ?
వ్యవసాయంలో యాంత్రీకరణకు అక్కడ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందివ్వడంలో విఫలమవుతున్నారు. కలుపునివారణకు వినియోగించే స్ప్రేయర్లకోసం సబ్సిడీ మొత్తాలు సిద్ధంగా ఉన్నా వాటిని అందివ్వలేకపోతున్నారు. ఇదే అదనుగా అన్నదాతల అవసరాన్ని ప్రైవేటు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. గార : జిల్లా రైతాంగానికి కలుపునివారణ కష్టంగా మారుతోంది. దీనికోసం వినియోగించాల్సిన సబ్సిడీ స్ప్రేయర్ల సరఫరాలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తాలతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేంద్రప్రభుత్వం ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. రాష్ట్ర వ్యవసాయ సాధారణ ప్రణాళిక, జాతీయ ఆహార భధ్రతా మిషన్ వంటి పథకాల కింద రైతులకు ఆధునిక పరికరాలు 50 శాతం రాయితీపై ఇచ్చేందుకు జిల్లాలో సుమారు రూ. 15 కోట్లు ప్రస్తుతం సిద్ధంగా ఉంది. వాటిలో పవర్, సాధారణ స్పేయర్లకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకే రూ. కోటి వినియోగించుకోవచ్చు. గతేడాది స్పేయర్లు పంపిణీ చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం రాయితీని ఇంతవరకు జమచేయలేదు. దీంతో ఈ ఖరీఫ్‌కు కావాల్సిన స్పేయర్లు కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నా జిల్లాకు మాత్రం పంపించేందుకు ససేమిరా అంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రాయితీలేకుండానే ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా డీలర్లు ఒక్కో స్పేయరుపై రూ. 200 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. కలుపునివారణకు స్ప్రేయర్లు తప్పనిసరి ఖరీఫ్ సీజన్లో వరి పంటలో కలుపు నివారణకు సాధారణంగా ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి ఉంటుంది. పెరిగిన తరువాత తొలగించాలంటే కూలీలకోసం దాదాపు రూ. ఆరువేలకుపైబడి ఖర్చుపెట్టాలి. అయితే కలుపుమందులు ముందుగానే చల్లేస్తే కేవలం వెయ్యిరూపాయలతో నివారించుకోవచ్చు. అయితే ఈ మందు పిచికారీ చేస్తేనే కలుపు నివారణ సాధ్యమవుతుంది. ఇందుకోసం పవర్, సాధారణ స్ప్రేయర్లను ఎవరి శక్తిని బట్టి వారుకొనుగోలు చేస్తారు. సాధారణ స్ప్రేయర్లయితే రూ. 1800 నుంచి రూ. 3000 వరకూ లభ్యమవుతుండగా, పవర్ స్ప్రేయర్లు రూ. 2000 నుంచి 30వేల వరకూ లభ్యమవుతున్నాయి. అన్నింటికీ యాభైశాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా అవిరైతులకు ఉపయోగపడటంలేదు. జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల్లో 70వేల మంది రైతులు ఎద సాగు చేస్తున్నారు. కానీ వీరందరికీ జిల్లాలో కేవలం 5వేల స్ప్రేయర్లే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెద జల్లిన మూడు రోజుల నుంచి కలుపు మందు పిచికారి చేయాలి. అందరూ ఒకేసారి స్పేయర్లు కావాలనుకోవడం, ప్రభుత్వం రాయితీపై అందుబాటులో ఉంచకపోవడంతో సమస్య ఏర్పడింది. గత ఏడాది లెక్కతేలకే మూలుగుతున్న సబ్సిడీ జిల్లాలో స్ప్రేయర్ల పంపిణీపై వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గతేడాది స్ప్రేయర్లు ఎన్ని ఇచ్చారో కంపెనీలు రాతపూర్వకంగా తమకు ఇవ్వకపోవడంవల్లే సబ్సిడీ జమచేయలేకపోయామని తెలిపారు. సాధారణ స్ప్రేయర్ వాస్తవ ధర రూ. 1800 కాగా రూ. 600 మాత్రమే సబ్సిడీ అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందనీ, పవర్ స్ప్రేయర్‌కు మాత్రం 50 శాతం రాయితీ వర్తిస్తుందనీ చెప్పారు. గతంలోలా కాకుండా స్ప్రేయర్ కోసం మీసేవలో అప్లోడ్ చేస్తే ఏవో, ఏడీ, జేడీఏ అమోదం తెలుపుతారనీ, అనంతరం బ్యాంకులో డీడీ తీయాలని చెప్పారు. అధికారులు ఆన్లైన్లో అనుమతులిచ్చాక డీలరు స్ప్రేయర్ ఇవ్వాలని తెలిపారు. దీనంతటికీ ఎక్కువ సమమయం పడుతున్నందున సాధారణ స్ప్రేయర్‌కు వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదించామనీ, రెండు రోజుల్లో జిల్లాకు స్పేయర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
లోతు జలాల్లో చేపల వేటపై సదస్సు
విశాఖపట్నం : సముద్ర లోతు జలాల్లో చేపల వేట సాగించే అంశంపై ఈ నెల 6వ తేదీన కోస్తాంధ్ర సదస్సు విశాఖపట్నంలో జరుగనుంది. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలో ఈ సదస్సు జరుగనుంది. సాధరణంగా సముద్రంలో 100 నుంచి 200ల మీటర్ల లోతు జలాల్లో మాత్రమే వేట సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాల వల్ల తీరప్రాంతంలో ఉండే మత్స్య సంపద సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుంది. దీంతో వంద మీటర్ల లోతు జలాల్లో మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడింది. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) ఆధ్వర్యంలో డీప్ సీ ఫిషింగ్‌పై గత దశాబ్ద కాలంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. సముద్ర లోతు జలాల్లో ఊహించనంత మత్స్యసంపద ఉందని, కనీసం వెయ్యి మీటర్ల లోతు జలాల్లో వేట సాగిస్తే ప్రపంచంలో మరెక్కడా దొరకని మత్స్య సంపద మన తీర జలాల్లోఉన్నట్టుగా ఈ పరిశోధనల్లో గుర్తించారు. తూర్పుతీరంలోని మత్స్యకారుల వద్ద ఉన్న మెకానైజ్డ్ బోట్లు 100-150మీటర్ల లోతు జలాల్లో వేట సాగించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. కనీసం 500 మీటర్ల నుంచి 1000 మీటర్లు ఆ పైబడిన లోతు జలాల్లో వేట సాగించాల్సిన ఆవశ్యకత నెలకొంది. రానున్న ఐదేళ్లలో ఈ లోతు జలాల్లో కనీసం 200 బోట్లతోనైనా వేట సాగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ చూస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర లోతు జలాల్లో చేపలవేట ఆవశ్యకత, అనుకూలతలపై చర్చించేందుకు తొలిసారిగా కోస్తాంధ్ర పరిధిలోని తొమ్మిది జిల్లాల సదస్సు విశాఖ తీరంలో జరుగనుంది. 6వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనున్న ఈ సదస్సుకు తొమ్మిది జిల్లాల మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మెకానైజ్డ్ బోటు యజమానులు, మత్స్యశాఖ నిపుణులు హాజరుకానున్నారని జిల్లా మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు తెలిపారు.