చాక్లెట్ ఆశ చూపి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం | Mechanic rapes a nine year old girl in Hyderabad | Sakshi
Sakshi News home page

చాక్లెట్ ఆశ చూపి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

Published Mon, Nov 18 2013 5:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

చాక్లెట్ ఆశ చూపి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం - Sakshi

చాక్లెట్ ఆశ చూపి.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

హైదరాబాద్లో మరో ఘోరం జరిగింది. అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికపై ఓ మెకానిక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని కప్ బోర్డు కింద దాచాడు. ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కుత్బుల్లాపూర్లో నివసిస్తున్న బబ్లూ (26) అనే మెకానిక్ ఆదివారం సాయంత్రం చాక్లెట్ ఆశ చూపి బాలికను తన గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం గదిలోనే ఉంచి ళం వేశాడు. ఆ అమ్మాయి అతని ఇంటికి సమీపంలోనే ఉంటుంది. బాలిక కనపడకుండా పోయేసరికి కుటుంబ సభ్యులు ఆరా తీశారు. బబ్లూ గది తాళాన్ని పగులగొట్టి లోపలకి వెళ్లి చూడగా, ఆ చిన్నారి కప్ బోర్డు కింద కనిపించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement