
బండిమెట్ ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులు
హైదరాబాద్, సనత్‌నగర్: విద్యార్ధినుల పట్ల అభ్యకరంగా ప్రవరిస్తున్న కీచక గురువుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట పాటిగడ్డలోని బండిమెట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలకృష్ణ గత కొంతకాలంగా విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 30న ఓ బాలిక (13)ను హోమ్ వర్క్ ఎలా చేశావంటూ దగ్గరకు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం వారు స్థానిక కార్పొరేటర్ ఉప్పల తరుణి, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా, మిగిలిన విద్యార్థినులు సైతం అతని వేధింపులను కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. దీంతో వారు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment