Begumpet
-
బేగంపేట : హుషారుగా..డార్లింగ్స్ డే.. (ఫొటోలు)
-
మరదలిపై వదిన దుర్మార్గం
అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా.. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.పైగా తనతో సంబంధం ఉన్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
మహిళా రైల్వే స్టేషన్ గా మారిన బేగంపేట్ రైల్వే స్టేషన్
-
బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
సనత్‌నగర్: బేగంపేట అల్లంతోటబావిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో మోది ముళ్లపొదల్లో పడవేసి నిందితులు పరారయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. బేగంపేట పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆ ప్రాంతానికి చెందిన అన్నామలై అయ్యప్ప(40)కు గత పదేళ్ల క్రితం గాయత్రి అనే యువతితో వివాహమయ్యింది. అయ్యప్ప సికింద్రాబాద్ పార్క్‌లైన్‌లోని ఓ ప్రింటర్ షాపులో పనిచేస్తున్నాడు. ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి రాత్రి 10 గంటలకు తిరిగి వస్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే శుక్రవారం కూడా విధులకు వెళ్లాడు. కాగా భార్య గాయత్రికి రాత్రి 8 గంటల సమయంలో స్థానికులు ఓ వార్తను చేరవేశారు. అల్లంతోటబావి ఆర్కే టవర్స్ వెనుక ముళ్ల పొదల్లో అయ్యప్ప రక్తపుమడుగులో పడున్నట్లు స్థానికులు ఇచి్చన సమాచారంతో హుటాహుటిన ఆమె అక్కడికి చేరుకున్నారు. భర్త పరిస్థితిని చూసిన ఆమె వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో క్షతగాత్రుడు అయ్యప్పను గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. పరిస్థితి విషమించి అయ్యప్ప అర్ధరాత్రి 1.22 గంటలకు మృతి చెందాడు. అయ్యప్ప భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేశారు. 24 గంటలు గడవకముందే అరెస్టు.. భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్ ఆధారంగా ఎవరెవరితో అయ్యప్ప మాట్లాడాడు, ఎవరిపై అనుమానాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించారు. దీంతో నేరుగా నిందితుల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు కొమ్మల సంతోష్ అలియాస్ సంతు (34), సయ్యద్ రజా (37), ప్రైవేటు ఉద్యోగి గొర్ల హర్షవర్ధన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య విషయాన్ని ఒప్పుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం..! హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరైన కొమ్మల సంతోష్ భార్య సాయికన్యకు హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అయ్యప్ప ఆమెతో చనువుగా ఉండేవాడు. ఆ చనువు కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సంతోష్ పలుమార్లు భార్యను హెచ్చరించడంతో పాటు అయ్యప్పకూ వార్నింగ్ ఇచ్చాడు. అయ్యప్పను అంతమొందించాలని పథకం వేసిన సంతోష్ తన స్నేహితులు సయ్యద్ రజా, హర్షవర్ధన్‌ల సహాయం కోరాడు. వీరంతా శుక్రవారం సాయంత్రం మద్యం సేవించి అయ్యప్పను కలుసుకుని మద్యం సేవించాలని పట్టుబట్టారు. అయితే తాను మద్యం సేవించనని చెప్పడంతో అయ్యప్పతో వాగ్వాదానికి దిగారు. ఆవేశంతో సంతోష్ గ్రానైట్ రాయితో అయ్యప్పతలపై పలుమార్లు మోది హత్య చేశాడు. -
ఛాయ్ పే శ్రీవల్లి.. బేగంపేటలో రష్మిక సందడి (ఫొటోలు)
-
ఆ ధైర్యసాహసాలకు సలాం కొట్టాల్సిందే (ఫొటోలు)
-
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేటకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
-
HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు. వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
Wings Airshow 2024 Photos: అదిరిపోయే ఎయిర్ షో..బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా-2024’ (ఫొటోలు)
-
Hyderabad : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వింటేజ్ కార్ల షో అదుర్స్ (ఫొటోలు)
-
HYD: బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాలం విడిది కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల దాకా బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తారు. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ప్రతీయేడులాగే.. ఈసారి కూడా శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ విడిదిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే వీలుంది. అయితే అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించి చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీ బయల్దేరే అవకాశాలు ఉన్నాయి. -
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యార్థుల సందడి (ఫోటోలు)
-
నగరంలో కుండపోత వర్షాలు
-
శభాష్ పోలీస్.. వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులు..
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంలో ట్రాఫిక్ పోలీసు అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగం. రణగొణ ధ్వనుల మధ్య దూసుకొస్తున్న వాహనాలు, ప్రతికూలంగా ఉండే వాతావరణం, తీవ్ర కాలుష్యం. ఎన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా.. డ్యూటీ చేయాల్సిందే. అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను నియంత్రించాల్సిందే. ఇవన్నీ రోజూ జరిగేవే కానీ.. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన.. పోలీసుల్లో డ్యూటీతో పాటు మానవత్వం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఆ రోడ్డులో నడుస్తూ వెళ్తోన్న గుజ్జల రాముకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కండిసా గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుజ్జల రాము హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. బేగంపేటలో నడుస్తూ వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సీపీఆర్‌తో నిలిచిన ప్రాణం.. గుజ్జల రామును గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. పబ్లిక్ స్కూల్ పక్కన చెట్టు నీడలోకి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి రామును గమనించాడు. వెంటనే ఇన్స్పెక్టర్ బాలయోగి, మరో అధికారి శ్రీనివాస్‌తో కలిసి సీపీఆర్ చేశారు. అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి .. ఆగకుండా సీపీఆర్ చేయడంతో రాములో కదలిక వచ్చింది. కాసేపటికి స్పృహలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత మెరుగైన చికిత్సకు రామును గాంధీ ఆస్పత్రికి తరలించారు. Highly appreciate the timely efforts of Madhusudan Reddy Garu, Additional Commissioner of Traffic, North Zone, for performing #CPR on a man identified as Ramu who collapsed due to heart attack at Begumpet. The patient was shifted to Gandhi Hospital soon after and he is now… pic.twitter.com/2zhlEg8d4p — Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2023 విధుల్లో ఉన్న పోలీసులు సత్వరం స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారని అక్కడ ఉన్నవారంతా ప్రశంసించారు. అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి చేసిన సీపీఆర్, దాని వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు నిలపడంపై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇది కూడా చదవండి: హృదయవిదారకం: గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టిన సోదరి -
Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు. సీటీఓ జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్ ఔట్‌గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహిదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్ పై నుంచి వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ (ఖైరతాబాద్) ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ క్లోజ్ ఉంటుంది. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిష్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో నకిలీ మందుల కలకలం.. రూ.కోటి విలువైన మందులు స్వాధీనం -
బేగంపేట్ చేరుకున్న ప్రధాని మోదీ
-
బేగంపేట పోలీస్ లేన్‌లో హనుమాన్ జయంతి వేడుకలు
ఎప్పుడూ ఖాకీ దుస్తుల్లో కనిపించే రక్షక భటులు కాస్తా.. భక్తులుగా మారిపోయారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. బేగంపేట పోలీస్ లేన్ క్వార్టర్స్‌లో పోలీసుల కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బేగంపేట పోలీస్ క్వార్టర్స్ లోపలి ప్రాంగణంలో దాదాపు మూడు దశాబ్దాల కిందట ఈ గుడిని నిర్మించారు పోలీసుల కుటుంబ సభ్యులు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా గుడిని విశాలంగా, సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖుల సహకారంతో గుడి ఆవరణకు ఒక రూపం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతీ హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి ఉదయం నుంచే పూజలు నిర్వహించారు పోలీసులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో బేగంపేట ఏసీపీ GS చక్రవర్తి, పోలీసు కుటుంబ సభ్యుల్లో ఒకరైన రవి క్రియాశీలకంగా వ్యవహరించగా, ముఖ్యఅతిథిగా సినీ నటులు కృష్ణ భగవాన్, రాజకీయ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
కొత్త భవనంలో యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: అమెరికా.. నూతన కాన్సులేట్ భవనాన్ని మార్చి 20న హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ప్రారంభిస్తోంది. రూ. 27.87 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం నుంచే ఇక నుంచి యూఎస్ కాన్సులేట్ కార్యకలాపాలు సాగనున్నాయి. నూతన కాన్సులేట్‌లో అందించే వివిధ సేవల వివరాలను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కొనసాగుతున్న బేగంపేట ‘పైగా ప్యాలెస్’లో ఈనెల 15 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల నుండి 20వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కాన్సులేట్ మూసివేసి ఉంటుంది. ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. మార్చి 20 ఉదయం 8:30 వరకు అత్యవసర సేవలు కోరే అమెరికా పౌరులు +91 040–4033 8300 నంబర్ పైన సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ వివరించింది. మార్చి 20 ఉదయం 08:30 తరవాత అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు +91 040 6932 8000 పై సంప్రదించవలసి ఉంటుంది. అత్యవసరంకాని సందేహాల కోసం, అమెరికా పౌరులు HydACS@ state.gov కి ఈ–మెయిల్ చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అపాయింట్మెంట్లు, ‘‘డ్రాప్‌బాక్స్’’అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్, హైదరాబాద్ 500081లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (Vఅఇ) లో కొనసాగుతాయని తెలిపింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. వీసా సేవలకి సంబంధించి సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయాలని యూఎస్ కాన్సులేట్ పేర్కొంది. కొత్త ఆఫీస్ చిరునామా సర్వే నం. 115/1, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. -
హైదరాబాద్: బ్లైండ్ స్కూల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ అంధ విద్యార్థుల స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో.. లక్ష్మి గౌతమ్ శ్రీకర్(12) అనే ఆరో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. ఈ క్రమంలో కిందపడి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
ఘనాపాఠీల చదువులకు కేరాఫ్ బేగంపేట ‘హెచ్‌పీఎస్’
హైదరాబాద్: ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి.. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి.. సినీనటులు అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్.. ప్రస్తుత నగర కమిషనర్ సీవీ ఆనంద్.. ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యత హర్షభోగ్లే.. ఇలా ఏ రంగాన్ని తట్టినా మేటి స్థానాల్లో నిలబడిన వారెందరో. వారందరికీ అది పునాది రాయి.. ఇదే వారి ప్రఖ్యాతికి మైలు రాయి. రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లింది. అక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ప్రస్తుతం ఉన్నత శిఖరాలను అధిరోహించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఎదిగారు. వారంతా ఓనమాలు నేర్చుకున్న ఆ సరస్వతీ నిలయానికి అక్షరాలా నూరేళ్లు. అదే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్). నేటి నుంచి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న హెచ్‌పీఎస్‌పై ప్రత్యేక కథనం. అవతరణ ఇలా.. ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో బేగంపేటలో ‘జాగీర్దార్ కాలేజ్’ పేరుతో ఈ స్కూల్ షురువైంది. దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా ముగ్గురు విద్యార్థులతో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమైంది. 1950లో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థకు స్వస్తి చెప్పడంతో అప్పటివరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ స్కూల్ 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా అవతరించింది. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పడింది. 1988 వరకు బాలురకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్‌లో ఆ తర్వాత బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించారు. దాదాపు 122 ఎకరాల సువిశాల ప్రాంగణం.. పెద్ద క్రీడా మైదానం.. ఎటుచూసినా పచ్చదనం.. లైబ్రరీ, ఇ–లైబ్రరీ, డైనింగ్‌హాల్, ఆధునిక లేబరేటరీలు, హాస్పిటల్, అన్ని రకాల క్రీడా కోర్టులు, గుర్రపు స్వారీ.. ఇలా అత్యాధునిక వసతులతో హెచ్‌పీఎస్ అలరారుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 3,200 మంది పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఇండో– సారాసెనిక్ శైలిలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. హెచ్‌పీఎస్‌కు విద్యారంగంలోని దాదాపు అన్ని రకాల ఉన్నత స్థాయి అవార్డులు వరించాయి. ఎడ్యుకేషన్ వరల్డ్, ఫ్యూచర్ 50 అవార్డు, ఎడ్యుకేషన్ టుడేస్ ఇండియా స్కూల్ మెరిట్ అవార్డ్, బెస్ట్ ఇన్నోవేటివ్ కే–12 స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్ కొనసాగుతున్నారు. అతిపెద్ద ఎడ్యుకేషన్ సైన్స్ ఫెస్టివల్.. హెచ్‌పీఎస్ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణను చేపట్టింది. అందులో భాగంగా మొదటి దఫాగా ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఇండియా సైన్స్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్)తో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22న సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా ప్రదర్శన ఉంటుంది. 22 నుంచి 27 మధ్యన రౌండ్ స్క్వేర్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌లు హాజరుకానున్నారు. (క్లిక్ చేయండి: వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు) సమాజానికి అమూల్యమైన సేవ.. విద్య ద్వారా సమాజానికి అమూల్యమైన సేవను హెచ్‌పీఎస్ అందిస్తోంది. సైన్స్, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, అడ్వంచర్, ఇన్నోవేషన్, ఎక్స్పోజర్, సహకారం, నెట్వర్కింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పరంగా ప్రయోజనం చేకూర్చేలా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాధవ్‌దేవ్ సరస్వత్, ప్రిన్సిపాల్ -
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి
సనత్‌నగర్: నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం నిదర్శనమన్నారు. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని ఆమె అభినందించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ...ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే మరిన్ని గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు... త్వరలోనే ఎయిర్పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో వ్యాపార వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి, దర్శకుడు నరసింహారావు, టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, అక్రితి గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుల్దీప్ రైజాదా, తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి, గోల్డ్ సిక్కా సంస్థ చైర్పర్సన్ అంబిక బుర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..
సాక్షి, హైదరాబాద్: బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ–11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అభ్యర్ధన మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ► బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రసూల్ చౌరస్తా వద్ద రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతించరు. అయితే అక్కడ యూ టర్న్ తీసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ మీదుగా రాంగోపాల్‌పేట పీఎస్, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ వైపు అనుమతిస్తారు. ► రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పురా వైపు అనుమతించరు. వీరు రాంగోపాల్‌పేట పీఎస్, సింథికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ వైపు నుంచి కిమ్స్ ఆస్పత్రి వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద ఎడమ వైపు మళ్లి మినిస్టర్ రోడ్డులో కిమ్స్ వైపునకు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ప్యారడైజ్, రాణిగంజ్ వద్ద కుడివైపునకు మళ్లి కిమ్స్ వైపు మళ్లవచ్చు. ► అంబులెన్స్‌లు లేదా రోగులు బేగంపేట ఫ్లైఓవర్ నుంచి మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లేవారు సీటీఓ/ మీటింగ్ పాయింట్ వద్ద యూ టర్న్ తీసుకుని సింథికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్లేందుకు బైలేన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ► భారీ వాహనాలు (బస్సులు, డీసీఎంలు, లారీలు) హనుమాన్ దేవాలయం నుంచి సింథికాలనీ, పీజీ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రెండు వైపులా అనుమతించరు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డుకు చేరుకోవడానికి రాణిగంజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నగర పౌరులు ఈ ఆంక్షలను గమనించి సూచించిన మార్గాల్లో గానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో గానీ తమ గమ్యస్థానాలను సులువగా చేరుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. -
మునుగోడు ఫలితంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. పంజాగుట్ట–గ్రీన్ ల్యాండ్స్–ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అలాగే సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కావున ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీలో విద్యార్థిపై దాడి #TrafficAdvisory - In view of the visit of Hon’ble Prime Minister of India to Hyderabad on 12th November 2022 moderate traffic congestion is expected on the roads leading to and surroundings of Begumpet Airport, Hyderabad. Citizens/commuters are...https://t.co/11VXja6qtp pic.twitter.com/rWACYiE8Yr — Hyderabad City Police (@hydcitypolice) November 11, 2022 -
Hyderabad: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: భారత్–అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే యూఎస్ కాన్సులేట్ కార్యాలయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చూసుకున్న ఈ భవనానికి ఇదే చివరి వార్షికోత్సవం. అందులో భాగంగా 14 ఏళ్ల పాటు సేవలందించిన కార్యాలయం పైన చివరిసారిగా అమెరికా జెండాను ఎగుర వేశారు. 300 మిలియన్ డాలర్లతో నూతన కాన్సులేట్.. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా 300 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి ఈ కాన్సులేట్ మారనుంది. అనుకోకుండా కాన్సులేట్ ప్రారంభించిన రోజునే ఈ కార్యాలయం చివరి రోజు కావడం, దీపావళి పండుగ కలిసి రావడంతో సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వీడియోను కాన్సులేట్ జనరల్ జెన్సిఫర్ లార్సన్ విడుదల చేశారు. (క్లిక్: నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్) Want a sneak peak of our new consulate building? Here it is! pic.twitter.com/eu4g2Ui1uJ — Jennifer Larson (@USCGHyderabad) June 4, 2022 భారత్‌లో మొదటి శాశ్వత భవన అమెరికా దౌత్య కార్యాలయం.. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య సంబంధాలను మరింత ఉన్నతంగా మార్చడానికి హైదరాబాద్ అనువైన వేదిక అనే ఉద్దేశంతో యూఎస్ కాన్సులేట్‌ను ప్రారంభించామని అన్నారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో నిర్మించిన మొదటి అమెరికా దౌత్యపరమైన శాశ్వత భవన కార్యాలయం ఇదేనని పేర్కొన్నారు. ఈ కార్యాలయం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. We raised the American flag at US Consulate #Hyderabad at Paigah Palace fourteen years ago today. We begin a new chapter - we’ll see you soon in the new space. pic.twitter.com/XEgJSm4ZMG — Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022 -
HYD: నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాలా చోట్ల మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ దగ్గర, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ ఆస్పత్రుల చుట్టూరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి నుంచి పరిస్థితి అలాగే ఉండడంతో వాహనదారులు చిరాకు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సైతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. ఇక ఇవాళ(మంగళవారం) ఉదయం సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పంజాగుట్ట-ఎల్వీప్రసాద్ రూట్లో, పంజాగుట్ట, బేగంపేట దగ్గర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. -
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్
-
భారీ శబ్ధాలతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: పెద్ద శబ్దంతో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనన్న అయోమయంతో క్షణాల్లో రైలు దిగి బయటకు వచ్చేశారు. భారీ కుదుపుతో అకస్మాత్తుగా రైలు ఆగిపోయిన సమయంలో స్పీడ్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం ఉదయం 8.20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి హైదరాబాద్ వైపు (నాంపల్లి) వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బేగంపేట దాటింది. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు హుస్సేన్‌సాగర్ జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ కుదుపునకు గురై రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఏం జరిగిందో అర్ధంకాక ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రైలుకు విద్యుత్ సరఫరా జరిగే పాథన్‌పై చెట్టుకొమ్మ పడడంతో సరఫరా నిలిచినట్లు సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో రైలు స్పీడ్ తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది.15 నిమిషాల్లో సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా రైలు ముందుకుకదిలింది. చెట్టుకొమ్మ పడడంతోనే సరఫరా నిలిచి రైలు నిలిచిపోయినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్ తెలిపారు. -
అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్ఎస్ నేత కారు.. అద్దం పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్కి టీఆర్ఎస్ నేత కారు అడ్డుగా వచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో భద్రతా సిబ్బంది కారు వెనుక అద్దం పగులగొట్టారు. అనంతరం ఎస్పీజీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కారులో ఉన్న టీఆర్ఎస్ నేతను జరిగిన విషయంపై మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అనుకోకుండానే కారు ఆగిపోయినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎస్పీజీ అధికారులకు చెబుతానని స్పష్టం చేశారు. మరోవైపు.. అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా వైఫల్యంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోం మంత్రి పర్యటనలోనే ఇలా ఉంటే ఇతరులను ఎలా రక్షిస్తారు?. భద్రతా వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విషయంలోనూ ఇలాగే జరిగింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. 19 మంది ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ! -
హైదరాబాద్: బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
Rajeshwari Thaman: ప్రాక్టీస్ న్యాయశాస్త్ర
సమాజంలో మనం అన్యాయానికి గురైనప్పుడే న్యాయం గుర్తుకు వస్తే.. మన ఆలోచనల్లోనే అపసవ్యత ఉన్నట్టు. న్యాయం ఏంటో ముందుగానే తెలిస్తే .. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించవచ్చు. మన జీవనంలో పుట్టుక నుంచి మరణం వరకు న్యాయపరమైన హక్కులు, అవగాహన అవసరం. ఈ ఆలోచనతోనే న్యాయం పట్ల సమాజంలో సరైన అవగాహన కల్పించడం కోసం ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’ పేరుతో కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు, జిల్లాల్లోనూ లీగల్ సదస్సులను ఉచితంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ వాసి లాయర్ రాజేశ్వరి థమన్. బేగంపేట్ చికోటి గార్డెన్స్‌లో ఉన్న ఈ లాయర్ని కలిసినప్పుడు తాము చేస్తున్న కృషి గురించి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘న్యాయం గురించి తెలిస్తే మన చేతిలో కనపడని ఆయుధం మనకు రక్షణగా ఉన్నట్టే. న్యాయరంగంలో ఉన్నవారు ఏదో ఒక స్థాయికే పరిమితమై ఉండలేరు. ప్రాక్టీస్‌లోకి వచ్చిన తొమ్మిదేళ్లకు నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నాను. అలా, ఐదేళ్ల క్రితం న్యాయ రంగంలోకి కొత్తగా వస్తున్నవారికి శిక్షణ ఇస్తే బాగుంటుందని, మా సీనియర్స్‌తో కలిసి చర్చించాం. చదువుకూ–ప్రాక్టీస్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను పోగొట్టాలనుకున్నాం. దీంట్లో భాగంగా వెయ్యి మందికి పైగా జూనియర్ లాయర్లకు ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇదే క్రమంలో లాయర్లకి మాత్రమే కాదు.. సమాజంలో అన్ని వర్గాల వారూ న్యాయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకున్నాం. ఐటీ ప్రొఫెషనల్స్కైతే కాపీరైట్, సైబర్ సమస్యలు, మీడియావారికి ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలనే విషయాలు, కాలేజీ స్టూడెంట్స్‌కి న్యాయ పరంగా ఉన్న హక్కులు, అమ్మాయిలకు రక్షణ చట్టాలు, మహిళలకు ఆస్తికి సంబంధించిన సమస్యలు.. ఇలా ప్రతీ ఒక్కరికీ అవసరమైన న్యాయపరిజ్ఞానం అన్ని చోట్లా అందరికీ అవసరం అనుకున్నాం. దీంతో.. ఎ.పి.సురేష్ అండ్ అసోసియేట్స్‌తో కలిసి.. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, ట్రస్ట్ అండ్ సేప్టీ, లిటిగేషన్, ట్రాన్జాక్షన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్, రాజ్యాంగం, పర్యావరణం, మానవహక్కులు, సైబర్ లా, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో లీగల్ కు సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఐదేళ్లుగా చేస్తున్న ఈ కృషికి మంచి స్పందన వస్తోంది. నోటి మాట ద్వారానే... ఇప్పటి వరకు తెలిసిన వారి ద్వారానే మమ్మల్ని సంప్రదిస్తున్నవారున్నారు. మేమే కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళుతున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, మండల స్థాయిలో లీగల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మాకున్న న్యాయపరమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి, దీనికి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌లోనే కాకుండా కర్నూలు, విజయవాడ ప్రాంతాల్లోనూ న్యాయశిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో జరిగిన మహిళా దర్బార్‌లోనూ లీగల్ సెల్ నుంచి పాల్గొని, మా వంతుగా ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’ గురించి మహిళలకు వివరించాం. గిరిజనులకు ప్రత్యేకం గిరిజన ప్రాంతాల నుంచి కూడా కొంతమంది లాయర్లుగా వస్తున్నారని తెలుసుకున్నాం. అలాంటి వారు ఎవరున్నారో సమాచారం సేకరించి, నేరుగా వారిని సంప్రదిస్తున్నాం. మారుమూలప్రాంతాల నుంచి వచ్చే అలాంటి వారికి సరైన ప్రోత్సాహం అందించడానికి ప్రయాణ, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. డాక్టర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ, లీగల్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూగా ఉండదు. ఇది గమనించే ఈ రంగంలో న్యాయవిద్య నిరంతరం అందించాలని చేస్తున్న ప్రయత్నం ఇది. అవగాహనే ప్రధానం.. ఒకరోజు 80 ఏళ్ల వయసున్న పెద్దాయన మా ఆఫీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి, రిటైర్ అయిన ఆయన తనకు ఈ వయసులో న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుందని చెప్పారు. మూడు రోజులు రెండు గంటల పాటు ఆయన మా క్లాసు విన్నారు. చాలా ఆనందమేసింది. నిజానికి టీనేజ్ నుంచే న్యాయపరమైన విషయాలు తెలుసుకుంటే వారి భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. మద్దతు కోసం వెతుకుతున్నారు.. ఇన్నేళ్ల భారతావనిలో ఇంకా ఈ రంగంలో మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సపోర్ట్ కోసం చూస్తున్నారు. దీనికి కారణం.. ఇల్లు, పిల్లలు, పెద్దలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆంక్షలు.. ఇంకా ఎన్నో బాధ్యతలు. ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే.. ‘ముందు మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. తర్వాత బయట సమస్యలు చూద్దురు’ అంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితే లాయర్లుగా మహిళల సంఖ్య పెరుగుతుంది. అయితే, ఈ రంగంలో మహిళలు వెనుకంజ వేయడానికి కారణాలు లేకపోలేదు. ముందు ఈ రంగంలో వెంటనే పెద్దగా డబ్బులు రావు. ఉదయాన్నే తొమ్మిదింటికి బయటకు వెళితే సాయంత్రం 5 వరకు కోర్టులోనే. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంటిపనులు, పిల్లల పనులు, ఆ తర్వాత మళ్లీ రేపటి కేసు గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. దీంతో కుటుంబ పరిస్థితే స్త్రీల ఆశయాన్ని వెనకంజవేసేలా చేస్తుంది. ఇప్పటికీ ఈ రంగంలో ఢీ అంటే ఢీ అనే మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అమ్మాయిలు కూడా సౌకర్యంగా ఉండే ఉద్యోగాల వైపే చూస్తారు. ఇప్పటికైనా న్యాయరంగంలోకి వచ్చేవారు సరైన సబ్జెక్ట్ ఉండేలా, బలంగా వాదించే సమర్థత గలవారుగా ఎదగాలి. ఆ అవగాహన రావడం కోసం చేస్తున్న ప్రయత్నమే ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’. మా వర్క్ ద్వారా వచ్చే డబ్బునే ఈ అవగాహన సదస్సుల కోసం ఖర్చుచేస్తున్నాం. ఉన్న జ్ఞానాన్ని కొంత వరకైనా పంచగలిగితే అందరికీ న్యాయం గురించి అవగాహన కలగుతుందన్నదే మా ఉద్దేశ్యం’’ అని వివరించారు ఈ లాయర్. ‘మాకు న్యాయం చేయండి’ అనే వేడుకోలుకు ముందు న్యాయం గురించి తెలుసుకుంటే అన్యాయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం సులువుగా వస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడి లీగల్ క్లాసులకు హాజరైనవారు చెబుతున్నప్పుడు మారబోతున్న సమాజచిత్రం కళ్లముందు ఆవిష్కృతమైంది. – నిర్మలారెడ్డి -
కొడుకే యముడై..
సనత్‌నగర్: కన్నబిడ్డల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి విద్యాబుద్ధులు నేర్పించడానికి తండ్రి రెక్కలుముక్కలుగా చేసుకుని కష్టపడతాడు. అలాంటి తండ్రిని వృద్ధాప్యంలో మేమున్నామంటూ ఆదరించి చూసుకోవాలి. కానీ.. ఓ కుమారుడు కర్కశంగా మారాడు. ఆస్తి గొడవలతో కన్నతండ్రినే కడతేర్చాడు. గొడ్డలితో నరికి దారుణంగా చంపిన విషాదకర ఘటన ఆదివారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విమాన్‌నగర్‌లో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట విమాన్‌నగర్‌కు చెందిన అబ్రహం లింకన్ (84) ఆర్మీలో ఉద్యోగ విరమణ అనంతరం బీహెచ్ఈఎల్ పని చేసి అక్కడ రిటైర్డ్ అయ్యారు. ఆయన మొదటి భార్య మహబూబ్‌నగర్‌లో ఉంటోంది. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో కుమారుడు, ఓ కుమార్తె చనిపోయారు. ప్రస్తుతం ఒక కుమార్తె మాత్రమే ఉంది. రెండో భార్య శేరిలింగంపల్లిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక కుమారుడు కిరణ్ (30), కుమార్తె ఉన్నారు. అబ్రహం లింకన్‌ను ఇద్దరు భార్యలు, పిల్లలు ఎవరూ పట్టించుకోకపోవడంతో విమాన్‌నగర్‌లోని రాహుల్ రెస్టారెంట్లో వంట మనిషిగా పని చేస్తూ అక్కడేనివాసం ఉంటున్నాడు. తండ్రికి తెలియకుండా ప్లాట్ల విక్రయం.. : అబ్రహం లింకన్‌కు షాద్‌నగర్‌లో ప్రభుత్వం నాలుగన్నర ఎకరాల భూమి రిటైర్డ్ ఆర్మీ కోటాలో కేటాయించింది. శేరిలింగంపల్లిలో 200 గజాలవి 2ఖాళీ ప్లాట్లున్నాయి. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు కిరణ్ ఈ స్థలాలను తండ్రికి తెలియకుండా నకిలీ గిఫ్ట్ డీడ్‌తో రూ.75 లక్షలకు విక్రయించాడు. అబ్రహాం లింకన్‌కు డబ్బు అవసరం ఉండటంతో ఈ రెండు ప్లాట్లను విక్రయించేందుకు యత్నించగా ఆయన కుమారుడు ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలతో ఈ స్థలాలు కొన్న వారు మరో రూ.25 లక్షలు ఇస్తామని చెప్పారు. భూమి తన పేరిట రాయాలని.. :కిరణ్ షాద్‌నగర్‌లో ఉండే నాలుగున్నర ఎకరాల భూమి కూడా తన పేరుపై రాయాలని, అదనంగా వచ్చే రూ.25 లక్షలు తనకే ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం ఉదయం కిరణ్ తనతో పాటు కొడవలిని తీసుకుని విమన్‌నగర్‌లోని తండ్రి వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే కొడవలితో తండ్రి మెడపై నరికాడు. తీవ్ర గాయాలపాలైన అబ్రహం లింకన్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తీరనున్న ట్రాఫిక్ తిప్పలు.. పూర్తయిన రసూల్‌పురా నాలా, బ్రిడ్జి పనులు
-
27 నిమిషాలు.. 23.4 కిలోమీటర్లు.. జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చారు!
సాక్షి,సంతోష్‌నగర్(హైదరాబాద్): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సమయన్వయంతో శుక్రవారం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి నుంచి లైవ్ ఆర్గాన్ (ఊపిరితిత్తులు)ను రవాణా చేసే సౌకర్యాన్ని కల్పించారు. గ్రీన్ చానల్ (ట్రాఫిక్ పోలీసుల) సహకారంతో శుక్రవారం అవయవదానం జరిగింది. వివరాల ప్రకారం.. బడంగ్పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అతడిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో డీఆర్డీఓ అపోలో ఆసుపత్రి వారు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఊపిరితిత్తులతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి ఎల్బీనగర్, ఉప్పల్ మీదుగా బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 12.12 గంటలకు తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 23.4 కిలో మీటర్ల దూరానికి కేవలం 27 నిమిషాల్లో చేరుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ఆసుపత్రుల నిర్వాహకులు అభినందించారు. చదవండి: హనీట్రాప్‌లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి -
బేగంపేటలో మోదీ స్వాగత సభ?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెసేతర ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుని కొత్త రికార్డ్‌ను నెలకొల్పిన నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. 26న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవం.. హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లకు చెందిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం.. ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, ముఖ్యనేతలు, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏ కొంత సమయం చిక్కినా ఎయిర్‌పోర్టు లాంజ్‌లో మోదీతో రాష్ట్ర పార్టీ ముఖ్యులు సమావేశమయ్యే అవకాశముంది. బేగంపేటలో ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అక్కడే ఏర్పాటు చేసే వేదికపై నుంచి లేదా ఏదైనా ఓపెన్ టాప్ జీప్ నుంచి ప్రధాని అభివాదం చేసేందుకు వీలుగా రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుమతి కోరుతూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ కూడా పంపించింది. దీనికి తప్పకుండా అనుమతి లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు మాట్లాడే అవకాశం ఉందని పార్గీ వర్గాలు వెల్లడించాయి. 8 ఏళ్ల పాలనను కీర్తిస్తూ హోర్డింగ్‌లు... హెచ్‌సీయూ నుంచి రోడ్డు మార్గాన ఐఎస్బీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా మోదీ స్వాగత ఫ్లెక్సీలు, తోరణాలు, 8 ఏళ్ల పాలనను కీర్తిస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు, కార్యకర్తలు జాతీయ జెండాలు, బీజేపీ జెండాలు ధరించి ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఇంకా విదేశీ పర్యటన నుంచి దేశానికి తిరిగి టరానందున, ఆయన హైదరాబాద్, చెన్నైకు సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, అధికారిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధాని పర్యటన ఇలా.. ♦26న మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. ♦అక్కడే 15 నిమిషాలు ముఖ్యనేతలను కలుసుకుంటారు. పార్కింగ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తారు. ♦అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వెళ్తారు. ♦హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ఐఎస్బీకి ప్రయాణిస్తారు. ♦మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్బీ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ♦సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో చెన్నై వెళతారు. -
మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
హైదరాబాద్: రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో
-
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: హెచ్‌సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజారుద్దీన్ గురువారం బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్‌లోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Rishi Dhawan: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..? -
ముంపు సమస్యను ముగిద్దాం
సాక్షి, సిటీబ్యూరో: బేగంపేట నాలా పొంగిపొర్లినప్పుడు ముంపు బారిన పడుతున్న బ్రాహ్మణవాడి, అల్లంతోటబావి, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించడమే కాక ఆయా కాలనీల్లో వరదనీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం), జలమండలి అధికారులు సమన్వయంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. శుక్రవారం మునిసిపల్ పరిపాలనశాఖ కార్యాలయంలో ఆ శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తో కలిసి జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్ఎన్డీపీ, రెవెన్యూ, ఎండోమెంట్స్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముషీరాబాద్ మండలం భోలక్‌పూర్‌లోని సోమప్ప మఠానికి చెందిన 3571 గజాల స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దాదాపు 130 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. వారిలో 53 కుటుంబాలకు 1996లోనే పట్టాలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జీరా కాంపౌండ్‌లోని దాదాపు 70 కుటుంబాలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతూ, ఎండోమెంట్స్‌కు చెందిన ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ గృహాలకు ఓకే.. రాంగోపాల్ పేట డివిజన్లోని 134 గృహాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్‌కు మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. వీటితోపాటు న్యూ బోయగూడ, హైదర్ బస్తీ,మోండామార్కెట్ డివిజన్లోని శంకర్స్ట్రీట్, సజ్జన్లాల్స్ట్రీట్, రాంగోపాల్ పేట డివిజన్ లోని వెంగళరావునగర్, సనత్ నగర్ డివిజన్లోని శ్యామల కుంట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఆ స్థలాల రెగ్యులరైజేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. మోండా మార్కెట్, ఓల్డ్ జైల్ ఖానా భవనాలను మోజంజాహీ మార్కెట్ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అండర్‌పాస్, ఫతేనగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టేందుకు రైల్వే, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తెలిపారు. -
పేకాటలో ప్రజాప్రతినిధులు?
సాక్షి, హైదరాబాద్: అది పేరుకు దీపావళి పార్టీ.. కానీ అక్కడ జరిగింది మాత్రం పేకాట. ఓవైపు అంతటా టపాసుల మోత మోగుతుంటే.. ఆ అపార్ట్మెంట్ టెర్రస్‌పై మాత్రం పత్తాలాట జోరుగా సాగింది. ఆ పేకాట పార్టీలో ఉన్నది మామూలు వాళ్లు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని మోతీలాల్ నెహ్రూనగర్‌లో ఉన్న మారుతి బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన ఈ తతంగం సంచలనంగా మారింది. ఆ పార్టీకి ఓ మంత్రి కూడా హాజరయ్యారని, ఆ మంత్రి సహకారంతోనే సదరు ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి వీఐపీలు సహా అంత మంది హాజరైనా.. పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే పట్టుబడినట్టు చూపడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో.. దీపావళి రోజున బసేరా అపార్ట్మెంట్ టెర్రస్‌పై జరిగిన పార్టీలో.. పదుల సంఖ్యలో ఉన్నవారి అరుపులు, కేకలతో అపార్ట్మెంట్ వాసులతోపాటు పక్కనున్న ఇళ్లవారు గందరగోళానికి గురయ్యారు. కాలనీకి వచ్చే రోడ్డు బ్లాక్ అవడం, మొత్తం వీవీఐపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తుల హడావుడి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని ఆరా తీసి.. పార్టీ చాటున పేకాట హంగామా సాగుతోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా వీఐపీలే.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి బసేరా అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అసలేం జరుగుతోందని తేల్చేందుకు ఒకరిద్దరు మామూలుగా పైకి వెళ్లి చూశారు. అక్కడ ఓ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. మంత్రిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించి.. వెంటనే దాడి చేసినట్టు సమాచారం. అయితే పట్టుబడ్డ వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతోపాటు పాలవ్యాపార నిర్వహణలో పేరు గడించిన ఓ ప్రముఖ వ్యక్తి, నిజామాబాద్‌కు చెందిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు మంత్రి ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలను వదిలేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో 30 మందికిపైగా పట్టుబడినా కేవలం ఐదుగురిని చూపడం ఏమిటని మండిపడుతున్నారు. దాడికి ముందే ఉన్నతాధికారులు! అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు సదరు పార్టీకి వెళ్లిన ముగ్గురు సీనియర్ అధికారులు.. పోలీసుల దాడికి కొద్దినిమిషాల ముందే హడావుడిగా వెళ్లిపోవడం మరో రకమైన చర్చకు తావిస్తోంది. అందులో ఓ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో ఇద్దరు సెక్రటరీ హోదా అధికారులు, ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆరితేరిన వాడే.. బసేరా అపార్ట్‌మెంట్‌పై పేకాట పార్టీ నిర్వాహకుడు, వ్యాపారవేత్తగా పేరు పొందిన అరవింద్ అగర్వాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయి. క్యాసినో, పోకర్, మూడు ముక్కలాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తిగా పేరుంది. ఈయన కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులేనని, అన్ని రాజకీయ పార్టీల కీలక నాయకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీస్ వర్గాలే చెప్తున్నాయి. పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత తనదే అంటూ భరోసా కల్పించడం అతడి నైజమని పేర్కొంటున్నాయి. వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంకలకు తీసుకెళ్లి కోట్ల రూపాయలు క్యాసినోలు ఆడిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటిదేమీ లేదు: బేగంపేట పోలీసులు పేకాట వ్యవహారంపై బేగంపేట పోలీసులను వివరణ కోరగా.. తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని, పార్టీకి వచ్చిన 85 మందిలో అందరూ వెళ్లిపోయారని తెలిపారు. దాడి సమయంలో అక్కడున్న ఐదుగురు ఓ టేబుల్‌పై పోకర్ గేమ్ ఆడుతున్నారని, టేబుల్‌పై ఉన్న రూ.10 వేలను స్వాధీనం చేసుకొని.. వారిని తనిఖీ చేయగా రూ.12.56 లక్షలు దొరికాయని వెల్లడించారు. 53 ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేతప్ప తమకు పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులు గానీ, ఇతర ప్రముఖులు గానీ ఎవరూ లేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అరవింద్ అగర్వాల్‌తోపాటు డబీర్‌పురాకు చెందిన జాఫర్ యూసఫ్, బేగంపేటకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్, మలక్‌పేటకు చెందిన భగేరియా సూర్యకాంత్, కరీమాబాద్‌కు చెందిన అబ్దుల్ అలీ జిలానీ ఉన్నట్టు తెలిపారు. -
హైదరాబాద్ బేగంపేటలో పేకాట రాయుళ్లు అరెస్ట్
-
డైమండ్ ధగధగల సౌందర్య సోయగం
-
బేగంపేటలో కిడ్నాప్ కలకలం.. సొంత ఊరికి వచ్చాను!
∙సాక్షి, సనత్‌నగర్: బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టింంది. ఆడిటర్ కిడ్నాప్‌కు గురయ్యాడని పోలీసులకు అందిన ఫిర్యాదు వారిని హైరానా పెట్టింది. చివరకు క్షేమంగా ఉన్నట్లు వీడియో కాల్ ద్వారా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండకు చెందిన సాంబశివరావు ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ సికింద్రాబాద్, భరణీ కాంప్లెక్స్‌లోని తన కార్యాలయానికి వెళ్లేవాడు. ఆదివారం ఆఫీసుకు వెళ్లిన సాంబశివరావు రాత్రికి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం కనిపించ లేదు. అయితే బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని సాంబశివరావు బంధువు ఇంటి వద్ద అతని కారు ఉన్నట్లు తెలిసింది. అతనికి భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో దగ్గరి బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానంతో అతడి భార్య సరిత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందుబాటులోకి వ్చన సాంబశివరావు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావుతో వీడియో కాల్లో మాట్లాడారు. తాను క్షేమంగా ఉన్నానని, బంధువులతో తన స్వస్థలమైన ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’ -
హైదరాబాద్ : బేగంపేట్ లో కిడ్నాప్ కలకలం
-
బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్‌లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ -
హైదరాబాద్ ట్రాఫిక్; ఈ రూట్లో వెళ్లకపోవడమే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణం వాహన చోదకులకు నిత్యనరకంగా మారుతోంది. గత రెండు రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీఐపీలు బయటకు వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి వేస్తుండటంతో హైదరాబాదీలు ఇక్కట్ల పాలవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ స్తంభించింది. గురువారం కూడా ఇదే సీన్ రిపీటయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామయింది. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబరు 1, 3లతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంబులెన్స్‌లు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సహనం కోల్పోయిన వాహనదారులు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులతో వాదనలకు దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ నిలిపివేయడం సరికాదని భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. మామూలుగానే బేగంపేట మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బేగంపేట ఫ్లైఓవర్ మీద ఏదైనా వాహనం ఆగిపోతే అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. ఇక ప్రముఖుల రాకపోకల సమయంలోనూ వాహనాలను నియంత్రించడం వల్ల ట్రాఫిక్‌కు త్రీవ అంతరాయం కలుగుతోంది. అయితే వీఐపీలు రావడానికి చాలా సమయం ముందే పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారని చోదకులు ఆరోపిస్తున్నారు. వీఐపీలు వెళ్లడానికి కొద్ది సమయం ముందు వాహనాలను నియంత్రిస్తే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే వారు వాపోతున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి గర్భిణి మృతి 22 రెగ్యులర్ రైళ్లకు పచ్చజెండా -
బేగంపేటలోని పబ్‌పై కేసు, అదుపులోకి 28 మంది
పంజగుట్ట: నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న పబ్‌పై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని, మరో 8 మంది మహిళలను రెస్క్యూ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట కంట్రీక్లబ్‌లో ఉన్న లిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 8 మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్ అధికారులకు, పబ్ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. -
క్రీమ్‌స్టోన్‌లో సందడి చేసిన మోడల్స్
-
బ్రాండ్ ఫ్యాక్టరీ అన్‌లాక్ సేల్ మోడళ్లు సందడి
-
ఎస్ఐ.. మై హీరో ఆఫ్ ది డే
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులుగా ఆటోలో ఎక్కి ఆటోడ్రైవర్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన బేగంపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ను నగర పోలీసు కమిషనర్ ప్రశంసించారు. బేగంపేట మయూరిమార్గ్ వద్ద ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓలాకు చెందిన ఓ ఆటోలో ఎక్కిన ముగ్గురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌పై దాడి చేసి ఆటో అద్దాలు పగులగొట్టడమే కాకుండా అతని వద్ద ఉన్న రూ.5 వేలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే 100కు డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను సేకరించి అప్పటికప్పుడు స్థానికంగా పలువురితో ఏర్పాటుచేసిన గ్రూపులో పోస్టు చేశారు. స్పందించిన స్థానికులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితులను చూశామని చెప్పడంతో ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ వెళ్ళి విచారించారు. స్థానికంగా రవికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బల్కంపేటలో ఉండే ఇద్దరిని, ఫతేనగర్‌లో ఉండే మరొకరిని పట్టుకున్నారు. దోపిడీకి పాల్పడిన నిందితులను స్వల్ప వ్యవధిలోనే ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ పట్టుకోవడంతో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ‘మై హీరో ఆఫ్ ది డే’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
అత్యాధునిక వసతులతో శ్మశానవాటిక
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్న బేగంపేట్ స్మశానవాటిక పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. '5 ఎకరాల విస్తీర్ణంవున్న ఈ స్మశానవాటికలో నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి 150 లారీలలో తరలించారు. అలాగే 50 లారీల తుమ్మ, ఇతర కంప చెట్లను తొలగించారు. అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు, నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నారు. (శవాలపైనా కాసులవేట!) ఒక వైపు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కాంపౌండ్ వాల్ ఉండగా.. అభివృద్ధిలో భాగంగా రోడ్డు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించారు. ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫార్మ్స్, దింపుడుకల్లం, పార్కింగ్, సీటింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. తదుపరి విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నారు. ఈ దహన వాటికకు ఎదురుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్థలంలో ఇప్పటికే చెట్లు ఏపుగా, దట్టంగా పెరిగాయి. ఈ స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులతో మరో ఆరు నెలల్లో ఆహ్లాదకరమైన స్మశానవాటికగా మారనుంది' అని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
బేగంపేటలో విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
బాలుడి మృతికి ఇదే కారణం..
సనత్‌నగర్: అమెరికా వెళ్లేందుకు వీసా కోసం నగరానికి వచ్చి బేగంపేటలోని స్టార్ హోటల్లో బస చేసిన సాఫ్ట్వేర్ దంపతులు రవి నారాయణరావు, శ్రీవిద్య దంపతుల చిన్నకుమారుడు విహాన్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కలుషితాహరం తిని చిన్న కుమారుడు మృతి చెందాడు. దంపతులతో పాటు వారి పెద్ద కొడుకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి నారాయణరావు, ఆయన భార్య శ్రీవిద్య నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా బాలుడు విహాన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు బేగంపేట ఏసీపీ నరేష్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులు తెలిపారు. వారు చెబుతున్నట్లు కుటుంబసభ్యులు విషాహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా..? బాలుడు ఈ కారణంగానే మృతి చెందాడా? లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. సోమవారం రాత్రి వీరు తీసుకున్న ఆహారంలోని కడాయ్ పన్నీరును హోటల్లో బస చేసిన మరో ఇద్దరు కూడా తీసుకున్నారని, వారు ఆరోగ్యంగానే ఉన్నామనే సమాచారం తమకు అందిందన్నారు. ఈ నేపథ్యంలో రవి నారాయణ కుటుంబసభ్యులు బయటకు ఏమైనా వెళ్లారా, మరేమైనా ఆహారం తీసుకున్నారా? లేదా హోటల్లో తీసుకున్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున హోటల్‌కు వచ్చిన రవి నారాయణరావు మామ ప్రసాదరావును కూడా విచారించి వివరాలు సేకరించామన్నారు. ఆహార నమూనాల సేకరణ చిన్నారి మృతి చెందడం, కుటుంబసభ్యులు అస్వస్థతకు గురి కావడంతో జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగం అధికారులు బేగంపేటలోని మానస సరోవర్ హోటల్లో బుధవారం సందర్శించి కిచెన్‌ను తనిఖీ చేశారు. అక్కడి వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఏహెచ్ఎంసీ డాక్టర్ రవీందర్‌గౌడ్, వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు ఆహార శాంపిళ్లను సేకరించారు. బాధితులు తీసుకున్నట్లుగా చెబుతున్న రోటి, కడాయ్ పన్నీర్‌కు సంబంధించిన నమూనాలతో పాటు వారు బస చేసిన గదిలో పడకలపై చేసుకున్న వాంతులకు సంబంధించిన నమూనాలను కూడా అధికారులు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బాలుణ్ని కాపాడడానికి 45 నిమిషాలు శ్రమించాం: కిమ్స్ వైద్యులు రవి నారాయణ కుమారుడు నిహాన్ మృతి, సభ్యులంతా అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కిమ్స్ వైద్యులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 10న 5.30 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్‌కు రవినారాయణ, శ్రీవిద్య, ఇద్దరు పిల్లలను తీసుకుచ్చారు. అప్పటికే వారు 8– 10 సార్లు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితిని దర్యాప్తు చేసిన డాక్టర్లు వారిని మెడికల్ స్టెప్‌డౌన్ యూనిట్‌కు తరలించారు. ఆ ఇద్దరు పిల్లల్లో రెండేళ్ల నిహాన్ పరిస్థితి విషమంగా ఉంది. 45 నిమిషాల పాటు సీపీఆర్ అతనికి అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నిహాన్‌ను కాపాడలేకపోయాయమని వైద్యులు తెలిపారు. మరో బాలుడిని ఐసీయూకు పంపించాం. అతనితో పాటు తల్లిదండ్రులకు ఫ్లూయిడ్స్, యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందించాం. ప్రస్తుతం ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. డీహైడ్రేషన్‌కు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఫుడ్పాయిజనింగ్గా అనుమానిస్తున్నాం. పరీక్షల కోసం రక్త నమూనాలను పంపించాం. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరికి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సంధ్య చికిత్స అందిస్తున్నారు. -
హోటల్లో పుడ్‌పాయిజన్,బాలుడి మృతి
-
విషాహారం తిని బాలుడి మృతి
సనత్‌నగర్: యూఎస్‌కు వెళ్లేందుకు వీసా కోసం వచ్చిన నగరానికి వచ్చిన సాఫ్ట్వేర్ దంపతులకు విషాదం మిగిల్చింది. స్టార్ హోటల్లో బస చేసి అక్కడ విషాహారం తీసుకోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం లింగగూడేనికి చెందిన ఏట్కూరి రవి నారాయణరావు, శ్రీవిద్య భార్యాభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా బెంగళూరులో ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి వరుణ్ (7), విహాన్ (ఏడాదిన్నర) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 9న కుటుంబం మొత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూఎస్ కాన్సులేట్‌లో వీసా ఫింగర్ ప్రింట్, స్టాంపింగ్ కోసం వచ్చి బేగంపేట మానస సరోవర్ హోటల్లోని 318 గదిలో బస చేశారు. 10వ తేదీ ఉదయం యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లి పనిపూర్తి చేసుకుని హోటల్‌కు వచ్చారు. ఉదయం, మధ్యాహ్నం అక్కడే అందరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేశారు. రాత్రి సమయంలో ఇండియన్ బ్రెడ్ బాస్కెట్, కడాయ్ పన్నీర్‌ను ఆహారంగా తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చిన్న కుమారుడు విహాన్ వాంతులు చేసుకోవడం శ్రీవిద్య గమనించింది. అదే సమమంలో రవి నారాయణ కూడా కడుపు నొప్పితో బాధపడ్డారు. కొద్ది సేపటికి పెద్ద కుమారుడు, భార్య కూడా వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని రవి నారాయణ నగరంలోనే ఉండే బంధువు ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన తెల్లవారు జామున 3.30గంటల సమయంలో హోటల్‌కు వచ్చారు. రవి నారాయణకు కడుపులో నొప్పి ఎక్కువ ఉండటం బంధువుతో కలిసి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అదే సమంలో పిల్లలు నిద్రపోతుండగా, భార్య హోటల్లోనే ఉండిపోయింది. ఉదయం 8గంటల సమయంలో ఆస్పత్రి నుంచి హోటల్‌కు రవినారాయణ రాగా చిన్న కుమారుడు విహాన్ అపస్మారక స్థితిలో ఉండటంతో పాటు పెదవులు నలుపు రంగులోకి మారి, శరీరం మొత్తం చల్లబడిపోయి ఉండటంతో వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు బేగంపేట పోలీసులుకు సమాచారం అందించారు. రవి నారాయణరావు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మానస సరోవర్ హోటల్లో విషాహారం తిని తన కుమారుడు చనిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మొహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం ఆఫీసులు, విద్యాసంస్థలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రద్దీ సమయంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డిసెంబర్ 31న ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో చిచ్చు రగిలింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానిని డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులతో అమెరికా అంతమొందించింది. సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సంబంధిత వార్తలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ట్రంప్ ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు ట్రంప్–మోదీ ఫోన్ సంభాషణ 52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్! సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట -
లిస్బన్ పబ్‌లో పోలీసుల తనిఖీలు
-
బేగంపేటలో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేటలో దారుణం జరిగింది. శ్రీలంక బస్తీలో రషీద్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. రషీద్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు ఇంతియాజ్, ఇమ్రాన్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటన స్థలానికి చేరకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రషీద్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నెల రోజుల్లోనే బేగంపేట పరిధిలో రెండో హత్య జరగడం కలకలం రేపుతోంది. -
మొదటి భార్యను మర్చిపోలేక దారుణం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త భార్యను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ నగర్లో నివాసముంటున్న వెంకటేశ్, స్వప్నకు మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే, 15 ఏళ్ల క్రితమే వెంకటేశ్‌కు మరో మహిళతో వివాహమైంది. దీంతో మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేశ్ తరచూ స్వప్నతో గొడవకు దిగేవాడు. మొదటి భార్య కారణంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్ స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో పాటు రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆందోళనకు గురైన వెంకటేష్ భార్యను చంపిన వెంటనే తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్, స్వప్న మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి -
బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు తాళం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించారు. కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
అందమైన భామలు
-
డ్రెస్ కోడ్ విషయంలో విద్యార్థినుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ విద్యార్థినులు ఆందోళనను ఉధృతం చేశారు. డ్రెస్ విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ చేసిన వ్యాఖ్యలతో ధర్నాకు దిగారు. మోకాళ్ల పైకి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్‌లోకి అనుమతించనని ప్రిన్సిపల్ పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి డ్రెస్‌లు వేయడం వల్ల పెళ్లిల్లు కావని ప్రిన్సిపల్ అంటున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. డ్రెస్ కోడ్ పాటించని కొందరు విద్యార్థులను మహిళా సెక్యురిటీ కాలేజ్‌లోనికి రానివ్వలేదని, కాలేజ్ వారు పెట్టిన రూల్స్ మార్చకపోతే నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాకల్టీతో సమస్యలేదు కానీ మేనేజ్మెంట్కు సమస్య ఉంది అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా కూడా మేనేజేమెంట్ ఏ మాత్రం స్పందించలేదని కాలేజ్ గేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం విద్యార్థినులతో మాట్లాడింది. సమస్య పరిష్కారం అయిందని యాజమాన్యం ప్రకటించింది. -
మోకాళ్ల కిందివరకు కుర్తీ ఉంటేనే కాలేజ్‌కి రండి
-
విద్యార్థినిలకు డ్రెస్ కోడ్.. కాలేజీ తీరుపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ వుమెన్స్ కాలేజీ విద్యార్థినుల వస్త్రాధారణపై నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. మోకాళ్ల కింది వరకు ఉన్న కుర్తీ ధరించి వస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. నిబంధన పాటించని విద్యార్థినులను ప్రిన్సిపల్ వెనక్కి పంపిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతామని గొప్పలు చెప్పుకునే ఇదే కాలేజీలో ఇలాంటి నియమాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా శనివారం ఆందోళన చేపట్టారు. సోమవారం కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఇక సెయింట్ ఫ్రాన్సిస్ పూర్వ విద్యార్థి ఒకరు కాలేజీ యాజమాన్యం తీరుపై ఫేస్బుక్ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అనవసర నిబంధనలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పొడవాటి కుర్తీ వేసుకుని కాలేజ్‌కి వస్తేనే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని గతంలో యాజమాన్యం చెప్పిందని ఆరోపించారు. మహిళా సెక్యురిటీ సిబ్బందిని నియమించుకుని మరీ.. కుర్తీలు మోకాళ్ల కింది వరకు ఉన్నాయా అని తనిఖీ చేయిస్తున్నారని వాపోయారు. డ్రెస్ నిబంధనలు పాటించడం లేదని తరగతులకు అనుమతించకపోవడం దారుణమన్నారు. -
బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్చల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ చేసింది. బుసలు కొడుతూ ఫ్లైఓవర్ పైకి రావడంతో ఎక్కటి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. మొదటగా రోడ్డు పక్కన ఉన్న పూలకుండిలో పామును గమనించిన ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, యువకులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది రోడ్డుపైకి వచ్చింది. పామును చూసిన వాహనదారులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కాసేపటి తర్వాత ఓ యువకుడు పామును పట్టుకొని పొదల్లో విడిచిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, పాము హల్చల్ కారణంగా ఫ్లైఓవర్‌కు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
‘‘డియర్ కామ్రేడ్’ విజయం సంతోషాన్నిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: డియర్ కామ్రేడ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు హీరోయిన్ రష్మిక మందన్న. బేగంపేట భారతీ ఎయిర్టెల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక ‘డియర్ కామ్రేడ్’ కాంటెస్ట్ విజేతలను కలిసి ముచ్చటించారు. సినిమా విడుదలకు ముందే ఎయిర్టెల్.. ఏపీ, తెలంగాణల్లోని తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ‘డియర్ కామ్రేడ్’ సినిమాపై ఓ కాంటెస్ట్ నిర్వహించింది. దానిలో గెలుపొందిన 40 మంది విజేతలు నేడు బేగంపేట ఎయిర్టెల్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ సీఈవో అవ్నిత్ సింగ్ విజేతలను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలను కలవడం చాలా సంతోషంగా ఉంది. గత నెల 26న విడుదలయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాను తెలుగు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది’ అన్నారు. -
బేగంపేటలో వింగర్ బీభత్సం
హైదరాబాద్: బేగంపేటలో ఆదివారం ఉదయం టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి వాహనాలు, పాదచారుల పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా పలు వురికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ ఆగిపోయింది. వింగర్ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన సముద్రాల రవికృష్ణ (30) టాటా వింగర్ వాహనం డ్రైవర్. తన వాహనంలో ప్రతిరోజూ ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా హైటెక్ సిటీకి హెచ్డీఎఫ్సీ ఉద్యోగులను తీసుకెళ్తుంటాడు. రోజూలాగానే ఆదివారం ఉదయం 10.30 సమయంలో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్నాడు. బేగం పేట ప్రకాశ్‌నగర్ బస్టాప్ వద్దకు రాగానే వాహన వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ నిలిచింది. హోంగార్డు అక్కడికక్కడే మృతి... ఈ ప్రమాదంలో ప్రకాశ్‌నగర్ బస్టాప్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. వింగర్ 8 వాహనాలను ఢీకొట్టగా అవి దెబ్బతినడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్ నడుపుతున్న రవికృష్ణకు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రభాకర్ స్వస్థలం మెదక్ జిల్లా ఝరాసంగం కక్కెరవాడ. మూడేళ్ల నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆదివారం కావడంతో రద్దీ పెద్దగా లేదని, పని దినాల్లో ఈ ప్రమాదం జరిగితే నష్టం ఊహించని విధంగా ఉండేది. రవికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
బేగంపేటలో టాటా వింగర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : టాటా వింగర్ వాహనం ఆదివారం ఉదయం బేగంపేట ప్రకాశ్ నగర్లో బీభత్సం సృష్టించింది. టాటా వాహనం బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డు ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. మరోవైపు ఈ సంఘటనలో గాయపడ్డ వాహనం డ్రైవర్ రవితో పాటు మరో అయిదుగురిని బేగంపేట పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి...ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
సందడిగా అందాల పోటీలు
-
‘ఆమె పబ్ డ్యాన్సర్ కాదు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన లిస్బన్ పబ్ నిర్వాహకుల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలు హరిణి ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు నిరాకరించినందున నడిరోడ్డుపై తనను వివస్త్రను చేసి, దాడికిపాల్పడ్డారని హరిణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. హరిణి పబ్ డ్యాన్సర్ కాదని, రోజూ అక్కడకు వచ్చి వెళ్తుందని తెలిపారు. హరిణి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు.. నలుగురు యువతులు, పబ్ యజమానులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. పబ్‌లో ఎలాంటి డాన్సులు జరగడం లేదని తెలిపారు. డీజేల అనుమతి తమ పరిధిలో లేదని, డీజే, ఫుడ్‌కు సంబంధించిన అనుమతులను జీహెచ్ఎంసీ చూసుకుంటుందన్నారు. వెస్ట్‌జోన్‌లో ప్రస్తుతం 40 పబ్‌లు ఉన్నాయని తెలిపారు. వీటి కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుండటంపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కాగా సినిమా చాన్స్‌ల కోసం హైదరాబాద్ వచ్చిన తను.. ఆర్థిక సమస్యల కారణంగా బేగంపేటలోని లెస్బెన్ పబ్‌లో డాన్సర్‌గా పని చేస్తున్నట్లు హరిణి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ పబ్‌కొచ్చే కస్టమర్లు తాగిన మైకంలో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, కోరిక తీర్చాలంటూ వేధించేవారని ఆరోపించింది. అయితే అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లిపోయేదాన్నని చెప్పింది. ఓ రాత్రి కస్టమర్‌తో గడిపితే రూ.10వేలు ఇస్తారని పబ్ నిర్వాహకులు ఒత్తిడి చేసేవారని ఆమె వాపోయింది. 'ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు. నిన్న క్లబ్ ముగిసిన తర్వాత ఒంటి గంటకు నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి దాడి చేశారు. ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్లకు ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించారు. సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్. పంజాగుట్ట పీఎస్‌లో వారిపై ఫిర్యాదు చేశాను. నాపై దాడి చేసిన వారు కూడా పంజాగుట్ట పీఎస్‌కు వచ్చి వెళ్ళిపోయారు. క్లబ్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు’ అని ఆమె మీడియాకు వెల్లడించింది. -
పోలీసుల ముందే బీరు తాగుతూ హల్చల్..
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యం తాగుతు కారు నడిపి పట్టుబడ్డ అతగాడు.. తన చేతిలోని బీరు సీసాను మాత్రం పడయకుండా అలాగే పట్టుకుని పోలీసుల ముందే తాగుతూ హల్చల్ చేశాడు. అర్థరాత్రి జూబ్లీహిల్స్ నీరుస్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పోలీసులకు ఇతగాడు చిక్కాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు. మరోవైపు తప్పతాగి వాహనాలు నడిపిన 48మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే పట్టుబడ్డవారి నుంచి 20 కార్లు, 28 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారికి సోమవారం బేగంపేటలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలపై తామెంత అవగాహన కల్పించినా మందుబాబుల్లో మార్పు రావట్లేదని అన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో సర్వీసులు
-
హైదరాబాద్ మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం తప్పడం లేదు. మరోసారి ఫ్లెక్సీలు మెట్రో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు వీయడంతో ప్యారడైజ్-బేగంపేట మార్గంలో మెట్రో రైళ్ల వైర్లపై ఫ్లెక్సీలు పడ్డాయి. గాలులకు ఎగిరివచ్చిన ఫ్లెక్సీలు తీగలపై పడటంతో దాదాపు అరగంట పాటు రైళ్లు ఆగిపోయాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లెక్సీని తొలగించాక రైళ్లు యధావిధిగా నడస్తున్నాయని మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో మార్గంలో భారీ ఫ్లెక్సీలు లేకుండా చూసుకుంటామన్న ప్రభుత్వ అధికారుల హామీ అమలుకు నోచుకోకపోవడంతోనే ప్రతిసారి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్యారడైజ్-బేగంపేట మధ్య నిలిచిపోయిన మెట్రో -
బీరు సీసాల లారీ బోల్తా
-
బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపైనే లారీ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లారీ బోల్తా పడటంతో బీరు సీసాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆర్పీఫ్ హెడ్ కానిస్టేబుల్ కాత్తితో వీరంగం
-
∙మీటూ; ద వే ఫార్వార్డ్ చనిపోతే తప్ప నమ్మరా?
హైదరాబాద్, బేగంపేటలో ఉంది ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక ఆ స్కూలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇది తొమ్మిదో ఎడిషన్. నిన్న మొదలైన ఈ మూడు రోజుల పండుగ రేపటితో ముగుస్తుంది. ఈ ఏడాది ఫెస్టివల్‌కి అతిథి చైనా దేశం. గాంధీజీ 150వ జయంతి ఏడాది కావడంతో గుజరాత్ సాహిత్యం సాహిత్యం, గాంధీజీ ప్రధానాంశాలుగా రూపొందిందీ ప్రోగ్రామ్. సాహిత్య సభలో సిరాచుక్క సాక్షిగా ‘మీటూ’ సామాజికాంశం ప్రధానమైన చర్చనీయాంశమైంది. అనేక ఆవేదనలకు సంగ్రహరూపంగా ‘మీటూ; ద వే ఫార్వార్డ్’ ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో చిన్మయి శ్రీపాద, సంధ్య మెనన్, సుతప పాల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలి ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ’ అంటూ ప్రశంసపూర్వకంగా ఆహ్వానించారు వసుధ. ‘‘సమాజం అధికార సమీకరణల మీద నడుస్తోందని, అది విద్యార్థిని– టీచర్ నుంచి అధికారి – ఉద్యోగిని వరకు అన్ని చోట్లా విస్తృతంగా రాజ్యమేలుతోందని నిరసించారామె. ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ‘నా దేహాన్ని పణంగా పెట్టడం ఎందుకు’ అంటూ శ్రీరెడ్డి గళం విప్పినప్పుడు తెలిసింది సినిమా ఇండస్ట్రీకి విశాఖ గైడ్‌లైన్స్ గురించి తెలియదని. ధైర్యంగా బయటకు వచ్చిన తనుశ్రీదత్తా నుంచి ఎవరు కూడా కంప్లయింట్ ఫైల్ చేసే అవకాశమే లేని విధంగా నడుస్తోంది మన వ్యవస్థ. పని ప్రదేశంలో సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్ ఉండాలనే నిబంధన అమలు చేయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి’’ అన్నారు వసుధ. ‘‘మగవారికి ప్రతికూలమైన అంశాల మీద కనీస చర్చ లేకుండా వీలయినంత త్వరగా తుడిచేయడానికే చూస్తుంది సమాజం. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం మంచి ఫలితాలనివ్వాలంటే మహిళలకు ఉద్యోగం చేసే చోట సురక్షితమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం కల్పించే వరకు ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని రచయిత సంధ్యా మెనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలు అంటూ గొంతుచించుకోవడం మీద తన అధ్యయనాన్ని వివరిస్తూ ‘‘నేపాల్ నుంచి కేరళ వరకు రకరకాల మహిళలను కలిశాను. వారి అనుభవాలను తెలుసుకున్నాను. నా ఫోన్‌కు 250 మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో మూడు మాత్రమే పెద్దగా ప్రాధాన్యం లేనివి. మిగిలినవన్నీ ఏ మాత్రం సందేహం లేకుండా వేధింపు అని అంగీకరించాల్సినవే. ఆ మూడింటిని కూడా అసత్యపు ఆరోపణలు అనడానికి వీల్లేదు. చిన్నపాటి అపార్థాల కారణంగా లేవనెత్తిన ఆరోపణలవి.మీటూ ఉద్యమంలో స్పందించే గొంతుకలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి’’ అన్నారు సుతప పాల్. గళం విప్పినందుకు.. సమంత, భూమిక, కాజల్, త్రిష, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, నయనతార, లావణ్య త్రిపాఠి... వంటి అనేక మంది హీరోయిన్ల ద్వారా మనకు స్వర పరిచితురాలు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా సింగిల్ కార్డుతో పాటలు పాడిన అమ్మాయి. నంది, ఫిలింఫేర్, స్టేట్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులందుకున్న అమ్మాయి. బ్లూ ఎలిఫెంట్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా నడుస్తున్న కెరీర్ ఆమెది. తమిళనాడు నుంచి ఫార్చ్యూన్ గ్లోబల్ ఉమెన్స్ మెంటరింగ్ పార్ట్నర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన తొలి మహిళ. ఒకప్పుడు గడియారంతో పాటు పరుగులు తీస్తూ... రోజుకు ఐదారు పాటలు పాడిన అమ్మాయి. ఇప్పుడు రోజుకు ఒక పాటకు మించడం లేదు. దీనంతటికీ కారణం తమిళ కవి, పాటల రచయిత వైరముత్తు అకృత్యాలను బయటపెట్టడమే. ‘మీటూ’ అంటూ బయటకొచ్చిన బాధితులకు ఆలంబనగా నిలిచినందుకు ఆమె చెల్లిస్తున్న మూల్యం ఇది. ‘‘సక్సెస్‌లో ఉన్నావు కెరీర్‌ని కోల్పోవద్దు... అని చెప్పింది మా అమ్మ. కెరీర్ కంటే స్త్రీగా ఆత్మగౌరవం ముఖ్యం కదా అమ్మా అన్నాను. వైరముత్తు మీద నోరు తెరిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైరముత్తు వేసుకున్న జెంటిల్మన్ ముసుగును తొలగిస్తూ వందల మంది బయటకు వచ్చారు. అప్పటివరకు నా కులం ప్రస్తావన రాలేదు, వాళ్ల అఘాయిత్యాలను బయటపెట్టినప్పటి నుంచి కుల సమీకరణలు మొదలయ్యాయి. అవి రాజకీయ సమీకరణలకు దారితీశాయి. వాటంతటగా అవి దారి తీయలేదు. అలా తీయించారు. ‘పబ్లిసిటీ కోసం సమాజంలో పేరున్న వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే’ అన్నాడా పెద్దమనిషి. పదిహేడేళ్లపాటు నిర్మించుకున్న కెరీర్ నాది. నేనందుకున్న అవార్డులకు లెక్కేలేదు. అలాంటి నేను పబ్లిసిటీ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేయడం నాకవసరమా? పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు అందుకున్న వ్యక్తి (వైరముత్తు) అనాల్సిన మాటలు కావవి. సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ప్రాణ హాని ఉంటుందని, ఒక్కదానినే ప్రయాణం చేయవద్దని స్నేహితులు, బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏరోజు ఏదైనా జరగవచ్చనేటంతగా భయానక వాతావరణం ఏర్పడి ఉంది. ఇది కూడా పవర్ ఉన్న వాళ్లు వ్యూహాత్మకంగా సృష్టించినదే.ఇలాంటి విషయాల్లో భారతీయ సమాజం మారాలి. పితృస్వామ్య భావజాలంతోపాటు స్త్రీ అంటే తేలిక భావం, ఏదైనా అనవచ్చు అనే ఆధిక్య భావన కరడు గట్టుకుని ఉంది. మహిళను నమ్మరు, ఆమె మాటను విశ్వసించరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటంటే... వివాదాన్ని ఎదుర్కొంటున్న మహిళ తాను చెప్పదలచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. ఈ పోకడ మారనంత వరకు ఈ పోరాటాలు తప్పవు’’ అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. – వాకా మంజులారెడ్డిఫొటోలు: అనిల్ కుమార్ మహిళ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. మంచి పరిణామం కోసమే ‘‘నా మీద ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చు. దాడి జరుగుతుందని వెనక్కి పోవడం ఉండదు. ఇప్పటి వరకు జరిగిన దాని పట్ల నాకు ఎటువంటి విచారమూ లేదు. జరగాల్సినదే జరిగింది. జరగాల్సిన మంచి పరిణామానికి వేసిన అడుగు ఇది. ఒక మంచి జరగాలంటే కొంత ఘర్షణ తప్పదు. అలాంటి ఘర్షణే ఇది. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయాణం కొనసాగుతుంది. – చిన్మయి శ్రీపాద, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్