సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్‌కి టీఆర్‌ఎస్ నేత కారు అడ్డుగా వచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో భద్రతా సిబ్బంది కారు వెనుక అద్దం పగులగొట్టారు. అనంతరం ఎస్పీజీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కారులో ఉన్న టీఆర్‌ఎస్ నేతను జరిగిన విషయంపై మీడియా ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అనుకోకుండానే కారు ఆగిపోయినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎస్పీజీ అధికారులకు చెబుతానని స్పష్టం చేశారు.
మరోవైపు.. అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా వైఫల్యంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోం మంత్రి పర్యటనలోనే ఇలా ఉంటే ఇతరులను ఎలా రక్షిస్తారు?. భద్రతా వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విషయంలోనూ ఇలాగే జరిగింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. 19 మంది ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ!
Comments
Please login to add a commentAdd a comment