సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్‌లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్‌లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు.
వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment