girls hostel
-
బాలికల హాస్టల్ లో ఆగంతకుడు హల్ చల్
-
ప్రభుత్వ సదన్ బాలికల ఒంటిపై గాయాలు.. వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
మత్తుమందు ఇస్తున్నారు.. మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదు..!
విశాఖ : తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ(Visakha) వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహం(Girls Hostel)లోని బాలికలు నిరసనకు దిగారు. తమకు నిద్రమాత్రలు ఇచ్చి మానసికంగా రోగులుగా మారుస్తునన్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంటికి పంపించేయాలంటూ మరోసారి హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు.అయితే ఈరోజు(గురువారం)మరోసారి హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టిన బాలికల్నిజజ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani) పరామర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాలికల శరీరంపై ఉన్న గాయాలు చూసి వివరాలు తెలుసుకున్నారు.తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని ఆ బాలికలు.. వరుదు కళ్యాణకి తెలిపారు. అంతే కాకుండా మత్తు మందు ఇస్తున్నారని బాధిత బాలికలు స్పష్టం చేశారు.బాలికకు మత్తుమందు ఇవ్వడం దుర్మార్గం: వరుదు కళ్యాణిఈ ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘బాలికలకు మత్తు మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదని, బాలికల సదన్ ఘటనపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.ఐదుగురు బాలికల ఆందోళనకాగా, జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. -
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు. వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్
-
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 31 మంది విద్యార్థినులకు అస్వస్థత
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్ అన్నంలోని బల్లిని తీసివేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ జ్వర సర్వే -
వడ్డిస్తుండగా సాంబారులో బల్లి.. అప్పటికే తిన్న వారికి..
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహం (నాగావళి)లో శనివారం రాత్రి భోజనాల సమయంలో సాంబారులో బల్లి కనిపించింది. రాత్రి 9.30 సమయంలో విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక విద్యార్థినికి సాంబారు వేస్తుండగా బల్లి కనిపించింది. దీంతో విద్యార్థి నులంతా భోజనాలు ఆపేశారు. అంతా కలిసి వసతి గృహం వద్ద వంట నిర్వహణ సిబ్బందికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటికే తిన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. వర్సిటీ ఆరోగ్య సిబంది సైతం పర్యవేక్షించారు. నిరసనకు దిగిన విద్యార్థులతో వసతి గృహ నిర్వాహకులు చర్చలు జరిపారు. చివరకు మళ్లీ వంట చేసి రాత్రి 11.30 సమయంలో భోజనం పెట్టారు. విద్యార్థులు ఫోన్లో వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంటకు వాడుతున్న నీటి నిర్వహణ, వంట గది పారిశుద్ధ్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు చేశారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా లోపాలపై దృష్టిపెట్టడం లేదని విద్యార్థులంటున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ఏ రాజేంద్ర ప్రసాద్ వద్ద విషయం ప్రస్తావించగా దీనిపై విచారణ నిర్వహిస్తామన్నారు. చదవండి: ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో.. -
అభివృద్ధిలో ‘అధ్యయనాలు’ కీలకం
సనత్‌నగర్: ప్రజల సమగ్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పాలకులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోగతి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ప్రాంగణంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిరి్మంచనున్న బాలికల వసతి గృహం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఆర్థిక, సామాజిక అధ్యయనాలు లేకుండా రాష్ట్రాల పురోగతికి అడుగులు ముందుకుపడవన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఆ బడ్జెట్ రాష్ట్రాలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది.. రాష్ట్రాలు ఆ బడ్జెట్ నుంచి ఏవిధంగా నిధులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.. సామాజిక, ఆర్థిక అవసరాలకు ఏమేర నిధులను ఉపయోగించుకోవచ్చో సెస్ వేదికగా విశ్లేషణలు జరగాలన్నారు. ఆర్థిక, సామాజిక అంశాలపై విస్తృతంగా అధ్యయనాలు జరిపి పాలకులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న సెస్ మరింతగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యూనివర్సిటీతో కలిసి ఇక్కడ నిర్వహిస్తున్న పీహెచ్డీ కోర్సులో జాతీయ స్థాయిలో విద్యార్ధులు చేరుతున్నారని, ఈ నేపథ్యంలో వారు వసతికి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రూ.5 కోట్లతో ఇక్కడ బాలికల వసతి గృహం ఏర్పాటుచేసుకోవడం జరుగుతుందన్నారు. సెస్ డైరెక్టర్ రేవతి మాట్లాడుతూ 2016 నుంచి ఇక్కడ పీహెచ్డీ కోర్సును నిర్వహిస్తున్నారన్నారు. -
శభాష్ అంజలి.. మంచి పని చేశావ్!
కట్నం డబ్బును మంచి పనికి వినియోగించి శభాష్ అనిపించుకుంది ఓ పెళ్లికూతురు. పెద్ద మొత్తంలో నగదును సమాజ సేవకు అందించి ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? రాజస్థాన్‌లోని బార్మర్ నగరానికి చెందిన కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్ నవంబర్ 21న ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. తనకు కట్నంగా ఇవ్వాలనుకున్న 75 లక్షల రూపాయలను బాలికల హాస్టల్ నిర్మాణానికి వినియోగించాలని పెళ్లికి ముందే తండ్రితో చెప్పింది. కుమార్తె కోరినట్టుగానే ఈ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు కిషోర్ సింగ్. (చదవండి: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’) ఈ విషయాన్ని లేఖ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథులకు తెలియజేయగా కరతాళ ధ్వనులతో వారందరూ స్వాగతించారు. అంజలి తండ్రి పెళ్లి పందిట్లోనే ఖాళీ చెక్కును కూతురికి అందించి.. ఆమె అభీష్టాన్ని నెరవేర్చారు. బాలికల విద్య కోసం కట్నం సొమ్మును త్యాగం చేసిన అంజలి మంచి మనసును అక్కడున్నవారంతా మెచ్చుకున్నారు. 68వ జాతీయ రహదారికి సమీపంలోని నిర్మితమవుతున్న బాలికల వసతి గృహానికి కిషోర్ సింగ్ ఇప్పటికే కోటి రూపాయాలు ప్రకటించారు. అయితే నిర్మాణం పూర్తికావడానికి 50 నుంచి 75 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో అంజలి ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!) #positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE — Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021 దీనికి సంబంధించిన కథనాన్ని ‘దైనిక్ భాస్కర్’ పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం క్లిప్పింగ్‌ను త్రిభువన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. దీంతో అంజలి కన్వర్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచావంటూ పొగడుతున్నారు. (చదవండి: అనుపమ అలుపెరగని పోరాటం.. ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!) -
బాధ్యులను ఉపేక్షించం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను కేటీఆర్ గురువారం సందర్శించారు. వేధింపులకు గురైన తొమ్మిది విద్యార్థులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దేవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. విద్యార్థులు స్వంత హాస్టల్ భవనం కావాలని కోరారని త్వరలో నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్లో ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నిరంతరాయంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్,ఎస్పీలను ఆదేశించామని చెప్పారు. భవిష్యత్తులో సిరిసిల్ల హాస్టల్లో జరిగిన సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
సాక్షి, వరంగల్ అర్బన్: బాలికల వసతి గృహంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండలోని జూలైవాడ గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో వార్డెన్ ప్రమేయం ఉందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలని, అదే విధంగా అక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనాన్ని సమయానికి అందించాలని, హాస్టల్ విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు. -
లేడీస్ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...
సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్ అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు యువకులపై కేసు.. ఏలూరు టౌన్: లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్సీ వీధిలోని మనస్వి లేడీస్ హాస్టల్ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు. ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఏలూరి అనిల్ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దెయ్యం దెబ్బకు హాస్టల్ ఖాళీ
సాక్షి, సి. బెళగల్(కర్నూల్) : ఆదర్శ బాలికల హాస్టల్లో దెయ్యం బూచితో బాలికలు హడలిపోతున్నారు. రాత్రిపూట విచిత్ర అరుపులు, కేకలు, పసిపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయని పుకార్లు పుట్టించడంతో వారు భయందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో శుక్రవారం రాత్రికి హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క విద్యార్థిని భయంతో మొదలు..హాస్టల్ 9 వతరగతి నుంచి ఇంటర్ వరకు ఉంది. ఇందులో మొత్తం 75 మంది బాలికలు ఉన్నారు. ఇటీవల కొత్తగా 9వ తరగతి విద్యార్థిని చేరింది. ఈ విద్యార్థిని భయపడి మిగతావారు కూడి భయపడేలా చేసింది. సదరు బాలికకు హాస్టల్లో ఉండేందుకు ఇష్టంలేక దెయ్యం బూచి పెట్టిందని హాస్టల్ సిబ్బంది, కొందరు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. కొండప్రాంతంలో హాస్టల్ ఉండటంతో పక్షులు, జంతువుల అరుపులు వినిపించి ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నిస్సహాయక స్థితిలో ప్రిన్సిపాల్, వార్డెన్ హాస్టల్లో దెయ్యముందని పుకార్లు షికారు చేయడంతో శుక్రవారం సాయంత్రం నుంచి పిల్లల తల్లిదండ్రులు హాస్టల్‌కు క్యూ కట్టారు. తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని స్కూల్ ప్రిన్సిపాల్ కిషోర్‌కుమార్, వార్డెన్ నాగలక్ష్మితో వాదనకు దిగారు. వారు ఎంత సముదాయించినా వినిపించుకోకుండా పిల్లలను తీసుకెళ్లారు. దీంతో హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. -
వివంత గర్ల్స్ హాస్టల్’లో మహిళ మృతి
హిమాయత్‌నగర్: పై అంతస్తు లోనుంచి కిందికి దిగే క్రమంలో లిఫ్ట్ ఎక్కేందుకు సిద్ధపడిన ఓ మహిళ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్ రాకుండానే దాని డోరు తెరుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ దుఘటన గురువారం నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరగ్గా.. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జియాగూడకు చెందిన కె.రేఖ(45) హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ సమీపంలోని ‘వివంత గర్ల్స్ హాస్టల్’లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం పనిలోకి వచ్చి హాస్టల్లోని గదులు శుభ్రం చేసి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఐదో అంతస్తులో ఉన్న రేఖ లిఫ్ట్ బటన్ నొక్కింది. లిఫ్ట్ వచ్చిందని గేట్ తీసి కాలు ముదుకేయడంతో ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో రేఖ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆమె మార్గమధ్యలోనే మరణించింది. హాస్టల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. తాగి పడిపోయిందన్న యజమాని వివంత గర్ల్స్ హాస్టల్‌ను శివ అనే వ్యక్తి నడుపుతున్నాడు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రేఖ చనిపోయినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హాస్టల్ యజమానిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రేఖ మద్యం తాగి డ్యూటీకి వచ్చిందని, అందుకే వెళ్లేప్పుడు లిఫ్ట్ గేటు తీసి కిందపడిపోయి చనిపోయిందన్నారు. అయితే, మద్యం తాగిన ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులన్నీ చేయగలిగింది కానీ..లిఫ్ట్‌ని మాత్రం గుర్తించలేకపోయిందా అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నారాయణగూడలో.. నారాయణగూడ ఏఐటీయూసీ భవన్‌లోని ‘యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్’లో డెవలప్మెంట్ అధికారిగా పనిసే ఆనందరావు రెండేళ్ల క్రితం ఇలాంటి దుర్ఘటనలోనే ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయంలో విధులు ముగించుకుని బయటకు వెళ్లే క్రమంలో ఆయన మూడో అంతస్తులో లిఫ్ట్ బటన్‌ను నొక్కారు. లిఫ్ట్ వచ్చిందనుకుని గేటు లాగి కాలు లోపలికి వేయడంతో జారి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు. గురువారం జరిగిన ఘటనలోను రేఖ అలాగే ప్రాణాలు కోల్పోయింది. పలు భవనాల్లో నిత్యం వినియోగించే లిఫ్ట్‌లను సరిగా నిర్వహించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గానే లిఫ్టుల ఏర్పాటుకు ‘లిఫ్ట్ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్’ ఉండాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఇంత వరకూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జీహెచ్ఎంసీలో సైతం భవన నిర్మాణాల్లో లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణపై కూడా నిబంధనలు లేకపోవడం గమనార్హం. నిర్వహణ పట్టించుకోని అధికారులు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్యం కారణంగా తరచూ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం మృతి చెందిన పి.ఆనందరావు, గురువారం ప్రాణాలు కోల్పోయిన రేఖ లిఫ్ట్ కంటే ముందు గేటు తెరుచుకోవడం వల్లే మరణించడం గమనార్హం. లిఫ్టులు, వాటి నిర్వహణను జీహెచ్ఎంసీలోని ఏ విభాగమూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ లిఫ్ట్ ఇన్స్పెక్టర్లు సైతం లేకపోవడం సిగ్గుచేటు. తప్పనిసరి అనుకుంటే పొరుగు రాష్ట్రం నుంచి పిలిపించి సర్టిఫై చేసుకోవాల్సిన దుస్థితి మన నగరంలో ఏర్పడింది. భవనం ఎత్తును బట్టి 10 మీటర్లు దాటితే లిఫ్ట్ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాలు నిర్మాణం జరుగుతున్న జీహెచ్ఎంసీలో లిఫ్ట్ ఇన్స్పెక్టర్ లేకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ♦ వ్యాపార సంస్థలతో పాటు నివాస అపార్ట్మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో సర్వీసు చేయించడం, లిఫ్ట్ ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడడం తప్పనిసరి. ♦ సామర్థ్యాన్ని బట్టి ముగ్గురు పట్టే లిఫ్టుల నుంచి 40 మంది వరకు వెళ్లగలిగే లిఫ్టులు వాడుకలో ఉన్నాయి. సాధారణంగా సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా కదలకుండా మొరాయించడం.. తలుపులు వేయకపోతే పనిచేయకపోవడం వంటి ఏర్పాట్లు లిఫ్టుల్లో ఉంటాయి. కానీ దీర్ఘకాలం పాటు సర్వీసులో ఉన్న లిఫ్ట్‌లు సాంకేతిక లోపాలతో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం.. ♦ స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. ♦ లిఫ్టులో ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ నగరంలో చాలా భవనాల్లో ఆపరేటర్ అన్న ఊసే ఉండదు. ♦ పనిచేసే ‘అలార్మ్’ బెల్ ఉండాలి. లేని పక్షంలో కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్ ఉండాలి. ఇవి ఎక్కడా కానరావు. ♦ సాధారణంగా లిఫ్ట్ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్ట్ కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయాలి. కానీ ఇవి దాదాపు ఉండనే ఉండవు. ♦ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లాంటి వాటిల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి. ♦ అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లు లిఫ్టులో కనబడేలా ఉండాలి. -
79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం తిని 36 మంది విద్యార్థినినులు సోమవారం రాత్రి 11 గంటలకు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 79కి చేరింది. బాధిత విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాగునీటి కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్ చెడిపోయి 20 రోజులైందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ స్వర్ణలతకు చెప్పినా పట్టించుకోలేదనీ.. దీంతో 10 ఏళ్లుగా వాడకుండా నిరుపయోగంగా ఉన్న చేతిపంపు నీటిని తాగాల్సి వచ్చిందని వారు వాపోయారు. కాగా, పాఠశాలను డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి వంటశాల పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందనీ, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్లక్ష్యమే శాపం.. జిల్లాలో మొత్తం 40 ఆశ్రమ వసతి గృహాల్లో సుమారు 13 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతిగృహాల్లో కనీస వసతులు కల్పించడం అటుంచి.. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు మేల్కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాంకిడి మండలంలోని బాంబార ఆశ్రమ పాఠశాలలో 30 మంది, తిర్యాణి మండలంలోని చెలమెల గురుకుల పాఠశాల 70 మంది, కౌటాల కేజీబీవీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. ఇలా ప్రతీ ఏడాది మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం లేదని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారం నుంచి కడుపునొస్తుంది.. బోర్ పని చేయకపోవడంతో చేతి పంపు నీళ్లనే తాగినం. అవి తాగినప్పుటి నుంచి కడుపు నొప్పి వస్తోంది.మేడంకు చెప్పినా ఏం కాదన్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే సరికి దవాఖానకు తీసుకొచ్చిన్రు. – కళ్యాణి, 8వ తరగతి చెప్పినా పట్టించుకోలేదు.. బోర్ నీళ్లు రావడం లేదని వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మురికి నీటితోనే వంటలు కూడా చేస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పని చేయక చల్లనీళ్లే స్నానం చేస్తున్నం. – మౌనిక, 9వ తరగతి బాధ్యులను సస్పెండ్ చేయాలి ఇలా మళ్లీ జరగకుండా ఉండలంటే బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థుల కోసం వచ్చిన నిధులను వారి కోసం ఖర్చు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -యూకే రాము, పాఠశాల చైర్మన్ ఇద్దరి సస్పెన్షన్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలో సిబ్బం ది నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, ఇందుకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు స్వర్ణమంజుల, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తున్నట్లు డీటీడీవో దిలిప్‌కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలే తీసుకోకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. డీటీడీఓ దిలీప్ కుమార్ -
ప్రయివేటు హాస్టల్లో లైంగిక వేధింపులు
చెన్నై తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని ప్రయివేటు హాస్టల్లో బాలికలకు లైంగిక వేధింపులు ఇచ్చిన యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి హాస్టల్‌కు సీల్ వేశారు. తిరువణ్ణామలై ఎంకేవీ వీధిలో నందకుమార్‌కు సొంతమైన ప్రయివేటు చిన్నారుల హాస్టల్ నడుస్తుంది. వీటిలో మేనేజర్‌గా వినోద్‌కుమార్ పనిచేస్తున్నాడు. ఈ హాస్టల్లో 17 సంవత్సరాలలోపు 15 మంది బాలికలు ఉంటున్నారు. ఈ హాస్టల్‌ను అనుమతి లేకుండా నడుపడంతో పాటు బాలికలకు లైంగిక వేధింపులు ఇస్తున్నట్లు కలెక్టర్ కందస్వామికి రహస్య సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి కలెక్టర్ కందస్వామి, ఎస్పీ సిబి చక్రవర్తి వెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో బాలికలకు ఎటువంటి రక్షణ లేకుండా హాస్టల్ నడుపుతున్నట్లు గుర్తించి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు, పోలీసులు రాత్రి సమయంలో హాస్టల్ గదిలో తనిఖీ చేయగా దాచి ఉంచిన రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. వాటిలో వందల సంఖ్యలో ఉన్న అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాలికల వద్ద విచారణ జరపగా హాస్టల్ నిర్వాహకులు తరచూ బాలికలకు లైంగికంగా వేధింపులు చేయడంతో పాటు సమయానికి భోజనం పెట్టకుండా పస్తులు పెడుతున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు సీల్ వేసి అందులో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ యజమాని నందకుమార్ పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో రాత్రి వార్డెన్, వంట మనిషిని అరెస్ట్ చేశారు. అనంతరం హాస్టల్లో ఉన్న 15 మంది బాలికలను పెరుంబాక్కం గ్రామంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. -
బాలికల దీనస్థితి.. చలించిపోయిన డీఎస్పీ!
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్లో చిన్నారులు అనారోగ్యం పాలైనా పట్టించుకోకుండా.. వార్డెన్ షేక్ నాగర్ బీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. సెప్టిక్ ట్యాంక్ పగిలిపోయి హాస్టల్ మొత్తం దుర్వాసన వస్తున్నా వార్డెన్ ఏమాత్రం స్పందించకుండా పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. తాగడానికి, కాలకృత్యాలకు కూడా నీళ్లు లేకపోవడంతో బాలికలే బయట నుంచి నీటిని మోసుకొని వస్తున్నారు. శుభ్రం చేయని నీటిని తాగడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాలికలు విజిలెన్స్ అధికారులకు తెలిపారు. ఇటీవల ఇదే జిల్లాలోని దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లోనూ.. బాలికల దీన పరిస్థితులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
ఇలాగైతే ఉంచలేం..
భీమునిపట్నం: భీమిలిలోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన వారి తల్లిదండ్రులను కలవరపరిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన వారు తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకువెళ్లిపోతున్నారు. శనివారం కొందరిని తీసుకువెళ్లగా, ఆదివారం ఏకంగా 300మంది వరకు పిల్లలు వెళ్లిపోయారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో తీసుకు వెళ్లిపోయారు. నమ్మకం కోల్పోయాం ఇక్కడి గురుకుల పాఠశాలపై తామందరికీ ఎంతో నమ్మకం ఉండేదని, తాము ఎంత దూరంగా ఉన్నా పిల్లలు సురక్షితంగా ఉంటారని భావించేవారమని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. కానీ ప్రిన్సిపాల్ రామరాజు కాలం తీరిన పప్పుతో పిల్లలకు భోజనాలు పెట్టి వారి ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా చేస్తారని ఊహించలేదన్నారు. విషయం తెలిసి అందరమూ వణికిపోయామన్నారు. తమ పిల్లలకు ఏమైందోనని హడలిపోయామని చెప్పారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్‌పై చర్యల విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అతను చేసిన ఘోర తప్పిదం కళ్లముందే కనబడుతున్నా వెంటనే సస్పెండ్ చేయవలసిందిపోయి సెలవుపై వెళ్లమనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, కానీ పరిస్థితి చూస్తే అటువంటి నమ్మకం తమకు కలగడం లేదని అన్నారు. తమ పిల్లల్ని కొద్దిరోజులు ఉంచుకుని తిరిగి తీసుకు వస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని కోరారు. బోసిపోయిన గురుకులం ఇక్కడ 451మంది విద్యార్థినులకు గాను మూడు వందల వరకు వెళ్లిపోవడంతో విద్యాలయం బోసిపోయింది. ఉన్న పిల్లల్ని కూడా సోమవారం తల్లిదండ్రులు తీసుకు వెళ్లిపోతే ఖాళీ అయే పరిస్థితి. నిర్లక్ష్యం క్షమించరానిది ఇక్కడ ఉంటున్న పిల్లల విషయంలో ప్రిన్సిపాల్ రామరాజు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు క్షమించరానిది. మొదటి నుంచి ఈయన వైఖరి సరిగ్గా లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మేము ఎన్నోసార్లు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా వారి ప్రాణాలకే ముప్పు జరిగే విధంగా వ్యహరించిన తీరు ఘోరం.– మీసాల ఈశ్వరరావు, సిరిజాం, చీడికాడ మండలం భయంతో తల్లడిల్లిపోయాం సంఘటన తెలియగానే అందరం భయంలో తల్లడిల్లిపోయాం. పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినా ఇక్కడైతే వారు బాగుంటారని ధైర్యంగా ఉన్నాం. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. – ఖతీజాబీబీ, గాజువాక -
బాలికల హాస్టల్లో దుర్భర పరిస్థితులు!
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బాలికల వసతి గృహంలో భారీగా అవకతకవలు జరిగినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా దుర్భరమైన పరిస్థితుల్లో నడుమ హాస్టల్లో బాలికలు గడుపుతున్నారని, హాస్టల్లోని బాత్రూమ్లు, కిచెన్‌తోపాటు పరిసర ప్రాంతాలు ఏమాత్రం శ్రుభంగా లేవని తెలిపారు. వసతి గృహంలో భారీగా బియ్యపు నిలువలు ఉన్నాయని, 865 కేజీలకుగాను 2500 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉండాల్సిన పరిమాణంలో వంట సరుకులు లేవని, మెనూలో ఉన్న ఆహార పదార్ధాలు ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో వార్డెన్ ఆటలాడుతున్నారని అధికారులు మండిపడ్డారు. -
ఈ అన్నం, పులిహోర ఎవరైనా తింటారా!
కృష్ణా, నూజివీడు:‘‘పులిహోర...అన్నం తినలేకపోతున్నాం.. సుద్దలాగా అవుతోంది.. ఐదు రోజులుగా భోజనం సరిగా తినడం లేదు...’’అంటూ పట్టణంలోని సాంఘికసంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కళాశాల బాలికల వసతిగృహం విద్యార్థినిలు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం పట్టణంలోని మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు ఎమ్మెల్యే ప్రతాప్తోపాటు వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లారు. విద్యార్థినులు బయటకు వచ్చి తమ బాక్స్‌లను తెరిచి అన్నం, పులిహోర ఎమ్మెల్యేకి చూపించారు. బంద్ నిర్వహిస్తున్నామని, ఒక గంటలో నేను హాస్టల్‌కు వస్తానని చెప్పి ఎమ్మెల్యే వెళ్లారు. ఆ తర్వాత హాస్టల్‌కు వెళ్లి ఆహారం పరిశీలించారు. ఈ అన్నం, పులిహోర మనుషులు ఎవరైనా తింటారా అంటూ మ్యాట్రిన్ నిర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడి చేరుకుని విద్యార్థినులతో హాస్టల్ బయట ధర్నాకు దిగారు. తహసీల్దార్ గుడిశే విక్టర్‌బాబు, ఏఎస్‌డబ్ల్యూవో వినుకొండమ్మ, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా జేడీ ప్రసాద్‌లు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్లోని పరిస్థితులను ఎమ్మెల్యే ప్రతా ప్ వారి దృష్టికి తీసుకువచ్చారు. మరుగుదొడ్ల విషయం ఈనెలలో జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రస్తావించామని, వాటిని వెంటనే పూర్తిచేయమని కలెక్టర్ చెప్పినా ఇంతవరకు పూర్తిచేయలేదన్నారు. మెనూ అమలుచేయకపోతే ఫోన్ చేయండి వసతిగృహంలో మెనూ అమలుచేయకపోతే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పాలని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు బాలికలకు సూచించారు. దాదాపు 300మంది ఉన్నందున రెండో హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతానన్నారు. హాస్టల్లో ఈరోజు సాయంత్రం నుంచే టీవీని ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. పర్మినెంట్ కుక్‌లు లేనందున పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్న వారిలో ఇద్దరిని పంపుతున్నట్లు జేడీ తెలిపారు. తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణలు చెరొక బియ్యం బస్తాలను, కూరగాయలు తెప్పించి విద్యార్థినులకు భోజనం వండించి పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు బసవా భాస్కరరావు, రామిశెట్టి మురళీకృష్ణ, కౌన్సిలర్లు కంచర్ల లవకుమార్, శీలం రాము, వైఎస్సార్సీపీ నూజివీడు మండల అధ్యక్షులు మందాడ నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు జీ రాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు లెనిన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత
కాళ్ల: కాళ్ల ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలానే శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి విద్యార్థినిలు హైస్కూల్‌కు వెళ్లారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు కడుపునొప్పి, తలతిరగడం, తీవ్రమైన ఆయాసంతో ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో హైస్కూల్ ఉపాధ్యాయులు వారిని కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి డాక్టర్ పరీక్షించి వీరిలో ఊపిరి అందక బాధపడుతున్న సీహెచ్ నందినిని మెరుగైన వైద్యం కోసం 108లో భీమవరం తరలించారు. మరో విద్యార్థిని టి.స్వాతి బాగానే ఉండడంతో తిరిగి హాస్టల్‌కు పంపించారు. స్వాతిది చినగరువు, నందినిది భీమవరం స్వస్థలాలు. వీరు హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నారు. దీనిపై డాక్టర్ పి.మోహనను వివరణ కోరగా తాగునీటి వల్లే ఇబ్బంది వచ్చిందని తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఒక విద్యార్థిని ఇదే సమస్యతో ఆస్పత్రికి వచ్చినట్టు డాక్టర్ చెప్పారు. ఫుడ్‌పాయిజనింగ్ అయితే వాంతులు అయ్యేవని, కలుషిత తాగునీరు వల్లే ఊపిరి అందక నందిని అనే విద్యార్థిని ఇబ్బంది పడుతోందని, మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంఈఓ దండు సీతారామరాజు హాస్టల్ పరిసరాలను, విద్యార్థులు తాగే మంచినీరు తాగి పరీక్షించారు. కాచిన నీరు విద్యార్థులకు అందిస్తున్నామని హాస్టల్ సిబ్బంది ఆయనకు చెప్పారు. హాస్టల్లో పారి«శుద్ధ్య, తాగునీటి సమస్య ఉందని ఎంఈఓ గ్రహించారు. దీనిపై మేట్రిన్ కుసుమను ప్రశ్నిచంగా ఎప్పటికప్పుడు మంచి ఆహారం అందిస్తున్నామని, ఎప్పటినుంచో మంచినీటి సమస్య ఉండటంతో కాచిన నీరు విద్యార్థినులకు అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. -
హాస్టల్లోనే ఎన్నోసార్లు నాపై దారుణం!
సాక్షి, కాన్పూర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కల్యాన్పూర్ సీఐ నవీన్ కుమార్ సింగ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐఐటీ కాన్పూర్ విద్యార్థినికి ఐఏఎఫ్ అధికారి సితాన్షుతో సోషల్ మీడియాలో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో అతడు తరచుగా గర్ల్స్ క్యాంపస్‌కు వచ్చేవాడు. పరిచయంతో లొంగదీసుకున్న అధికారి పెళ్లి చేసుకుంటానని విద్యార్థినిని నమ్మించాడు. కొన్నిసార్లు హాస్టల్లోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మేజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలిపారు. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన సితాన్షు తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడని బాధితురాలు చెబుతోంది. ఆపై పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఆ విద్యార్థిని వాపోయింది. నిందితుడితో పాటు అతడి సోదరి, బామ్మర్ది, ఓ స్నేహితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
లేడీస్ హాస్టల్ ఎదుట రెచ్చిపోయిన ఆకతాయిలు
-
హైదరాబాద్‌లో లేడీస్ హాస్టల్ ఎదుట వీరంగం
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో ఆకతాయిలు రెచ్చిపోయారు. సంబరాల పేరుతో దిల్ షుక్ నగర్ మెయిన్ రోడ్డు పై ఉన్న మైత్రి లేడీస్ హాస్టల్‌పై రాళ్లు రువ్వారు. అమ్మాయిలు బయటకు రావాలంటూ దాదాపు అరగంటపాటూ వీరంగం సృష్టించారు. 30 మంది వరకు ఆకతాయిలు అక్కడికి చేరుకొని విద్యార్థినులు బయటకు రావాలి అంటూ దుర్భాషలాడారు. హాస్టల్ గేటును తన్నుతూ నానా యాగీ చేశారు. రాళ్లు రువ్వడంతో హాస్టల్ గదుల ఆద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో హాస్టల్లోని యువతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టింది. ఈలోగా ఆకతాయిలను అక్కడి స్థానికుల చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆకతాయిల వీరంగాన్ని స్థానికులు వీడియో తీశారు. వీటి సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. లేడీస్ హాస్టల్ ఎదుట రెచ్చిపోయిన ఆకతాయిలు -
లేడీస్ హాస్టల్లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్(కేపీహెచ్‌బీకాలనీ): లేడీస్ హాస్టల్లోని యువతి ఫొటోలు తీసేందుకు యత్నించిన ఓ హాస్టల్ నిర్వాహాకుడి కొడుకును కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ధర్మారెడ్డికాలనీకి చెందిన మల్లేశ్వర్ లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. అయితే అతని కొడుకు చంద్రహాస్ హాస్టల్లోని బాల్కానీ ద్వారా బాత్రూంలోని ఓ యువతిని సెల్ఫోన్లో ఫొటోలు తీసేందుకు యత్నించాడు. విషయాన్ని గుర్తించిన సదరు యువతి షీటీమ్స్‌కు వాట్సప్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేపీహెచ్‌బీ పోలీసులు హాస్టల్‌కు చేరుకొని విచారణ జరిపి నిందితుడు చంద్రహాస్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. -
వరంగల్ బాలికల హాస్టల్ వద్ద ఉద్రిక్తత
-
కలుషితాహారం కాటు
కలుషితాహారం ప్రభావంతో జగ్గంపేట బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి వైద్యసేవలందించారు. దాంతో హాస్టల్లోని మిగిలిన విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. జగ్గంపేట: ఉన్న ఊరు.. కన్నవారిని విడిచి చదువులకోసం వచ్చిన నిరుపేద బాలికలు వారు. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మన జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలనుంచి, విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన విద్యార్థినులు జగ్గంపేటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్ (కలుషిత ఆహారం)తో 82మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 23మందికి వాంతులు, విరోచనాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని భావించిన స్థానిక వైద్యులు 108 వాహనాలలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జగ్గంపేట బీసీ బాలిక వసతి గృహంలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 131 మంది, ఇంటర్మీయెట్, డిగ్రీ విద్యార్థినులు 50 మంది కలిపి మొత్తం 181మంది ఉంటున్నారు. వారిలో 11 మంది ఇళ్లకు వెళ్లగా 170మంది హాస్టల్లో ఉన్నారు. బిర్యానీ, ఎగ్, బంగాళ దుంప కర్రీతోనే.. హాస్టల్ విద్యార్థినులకు ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ, గుడ్డుతో బంగాళాదుంప కూర ఆహారంగా ఇచ్చారు. రాత్రి సాంబారు అన్నం పెట్టారు. దాంతో రాత్రికే పలువురు విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు. సోమవారం ఉదయం వారికి అల్పాహారంగా కిచిడీ పెట్టారు. అది తిన్న తరువాత విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కాసాగాయి. దాంతో వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 23 మందిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పలువురి పరామర్శ డీఎం అండ్‌హెచ్‌ఓ చంద్రయ్య, బీసీ సంక్షేమాధికారి చినబాబు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, తహసీల్దార్ శివమ్మ, రైతు కూలీ సంఘ నేత కర్నాకుల వీరాంజనేయులు తదితరులు ఆస్పత్రిలో విద్యార్థినులను పరామర్శించారు. జీజీహెచ్‌లో పలువురి పరామర్శ కాకినాడ క్రైం: కలుషితాహారంతో అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జగ్గంపేట బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులను సోమవారం పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పరామర్శించారు. బాధితులను ఎమర్జన్సీ విభాగంలోని క్యాజువాలిటీ, పీడియాట్రిక్ విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులను జెడ్పీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కాకినాడ ఆర్డీవో ఎల్.రçఘుబాబు పరామర్శించారు. కలుషిత ఆహారంవల్లే అస్వస్థతకు గురయ్యారని, వారి ఆరోగ్యంపై ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాలికలు అస్వస్థతకు గురైన సంఘటనపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక అందజేయాల్సిందిగా ఎపిడమిక్ సెల్ సిబ్బందిని జగ్గంపేట హాస్టల్‌కు పంపించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ కె,చంద్రయ్య తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే తాను స్వయంగా జగ్గంపేట ఏరియా ఆస్పత్రికి వెళ్లి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 71 మంది అస్వస్థతకు గురికాగా 21మందికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కాకినాడ జీజీహెచ్‌కు 108 అంబులెన్సులో తరలించినట్టు ఆయన తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనీ లేదన్నారు. -
లేడీస్ హస్టల్ నుంచి దూకి అబ్బాయి ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన చెంద్రశేఖర్ కుమారుడు ఈశ్వర్ ఆనంద్(19), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న రాజ్‌దూత్ ఆపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తుపై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాలైన ఆనంద్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే రాజ్‌దూత్ అపార్ట్మెంట్లో లేడీస్ హస్టల్ ఉందని, దానిపైకి ఎందుకు వెళ్లాడన్న దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ విందు..చిందులు..!
బాలికల వసతి గృహంలో నిర్వాకం షాద్‌నగర్ క్రైం: అది బాలికల వసతి గృహం.. బయటి వ్యక్తులెవరినీ లోనికి రానివ్వకుండా చూడాల్సిన వార్డెనే తన కూతురు పుట్టిన రోజంటూ అక్కడ విందు ఏర్పాటు చేసింది. డీజేలు పెట్టి చిందులు వేయించింది.. ఈ తతంగాన్ని చూసిన విద్యార్థి సంఘం నాయకులు ఇదేంటని ప్రశ్నిస్తే వారిపైకి నా ఇష్టం అంటూ శివాలెత్తింది. విషయం పెద్దదై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆదివారం రాత్రి వార్డెన్ పద్మ తన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా డీజే మ్యూజిక్, చికెన్ వంటకాలు, మంచి కల్లును ఏర్పాటు చేశారు. ఈ విందుకు బంధుమిత్రులతో పాటు వార్డెన్ స్నేహితులు హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేస్తూ తమను తామే మరచిపోయారు. హాస్టల్లో నుంచి వస్తున్న శబ్దాలను గమనించిన విద్యార్థి సంఘం నాయకులు అక్కడకు చేరుకొని ఇదేంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. దీంతో వార్డెన్ వారిపై శివాలెత్తింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నాయకులకు, వార్డెన్‌కు వాగ్వివాదం జరిగింది. విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులుఅధికారులకు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం తహశీల్దార్ చందర్రావు, ఎంపీడీఓ రాజేశ్వరి హాస్టల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు వార్డెన్‌ను మందలించి సంబంధిత శాఖకు సమాచారమిచ్చారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సురే‹శ్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ గదిలో ఉన్న చికెన్ వంటకాలతో పాటు కల్లు సీసాలను చూసిన ఆయన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు నివేదిక అందించి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయా లంటూ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
-
లేడీస్ హాస్టల్ సంఘటనపై డీఎస్పీ విచారణ
– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నంద్యాల: పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ లేడీస్ హాస్టల్లో శనివారం రాత్రి ఆగంతకులు జొరబడి విద్యార్థినిలను భయబ్రాంతులకు గురి చేసిన సంఘటన డీఎస్పీ హరినాథరెడ్డి విచారణ చేపట్టారు. సోమవారం ఆయన హాస్టల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దేవనగర్‌కు చెందిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఇద్దరు గతంలో పెట్రోల్ దొంగతనాలకు పాల్పడేవారని, జల్సా కోసం దొంగలుగా మారారని విచారణలో తెలుస్తోంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం. లేడీస్ హాస్టల్లో జరిగిన సంఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి గాలి రవిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి చిన్న, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ హాస్టల్లో వాచ్‌మెన్‌ను నియమించకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. -
కస్తూర్భా హాస్టల్లో విద్యార్థుల కష్టాలు
-
అమ్మాయిల హాస్టల్లో రావెల అనుచరులు
గుంటూరు : మంత్రి రావెల కిశోర్ బాబు వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ‘సంక్షేమాన్ని’ విస్మరించిన మంత్రి తన అనుచరులకు ఏకంగా అమ్మాయిల హాస్టల్లోనే వసతి కల్పించారు. అధికార దర్పంతో విద్యార్థినుల భద్రతను విస్మరించిన ఈ ఘటన గుంటూరులో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిన్న ప్రభుత్వ దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి రావెల అనుచరులు వందమందికి పైగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు వచ్చారు. వారందరికీ కలెక్టరేట్ రోడ్డులోని పరివర్తన భవన్లో ఆశ్రయం కల్పించారు. ఆ భవన్‌లోనే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ తన అనుచరుల కోసం మంత్రి వాటికి తిలోదకాలిచ్చారు. కొంతమంది అధికారులు వారించినా మంత్రి పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. -
బాలికల హాస్టల్ లోకి పోకిరీలు
♦ బాత్రూంలో వీడియో చిత్రీకరించే యత్నం ♦ ఒకరిని పట్టుకున్న సిబ్బంది ♦ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత బోధన్ టౌన్ : పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలోకి ప్రవేశించి సెల్ఫోన్లో వీడియోలు తీసిన పోకిరీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ వెంకన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముగ్గురు యువకులు బుధవారం ఉదయం పట్టణంలోని బాలికల వసతి గృహం గోడపైనుంచి లోపలికి ప్రవేశించారు. బాలికలు బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో సిబ్బంది పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పోకిరీలు పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు యువకులు పారిపోగా.. సాయిసిద్ధార్థ పట్టుబడ్డాడు. అతడికి దేహశుద్ధి చేసి ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పారిపోయిన ఇద్దరు యువకులనూ అదుపులోకి తీసుకుని ముగ్గురికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సుమోటోగానే కేసునమోదు చేసుకున్నామని తెలిపారు. వసతి గృహనికి భద్రత కరువు నిరుపేద విద్యార్థుల కోసం పట్టణంలోని రాకాసీపేట్‌లో ఏర్పాటు చేసిన సమీకృత బాలికల వసతి గృహనికి భద్రత కరువయ్యింది. బాలికల వసతి గృహంలో వార్డెన్లు అందుబాటులో ఉండరు. భద్రత లేకపోవడంతో హాస్టల్ చుట్టూ పోకిరీలు చేరి బాలికలను ఆటపట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళలో వసతిగృహం లోకి రాళ్లు విసురుతున్నారని బాలికలు గతంలో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వసతి గృహం గోడ ఎత్తులేకపోవడంతో పోకిరీలు తరచూ ఆమ్మాయిలను ఆటపట్టిస్తున్నారు. భద్రత కోసం హాస్టల్ వద్ద మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరినా ఫలితం లేదు. ముగ్గురు యువకులు మూడు రోజులుగా వసతి గృహం వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని తెలిసింది. అధికారులు స్పందించి హాస్టల్ వద్ద భద్రత పెంచాలని, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఓయూ బాలికల హాస్టల్లో ర్యాగింగ్ కలకలం
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ ఇంజినీరింగ్ విభాగం బాలికల హాస్టల్లో ఓ విద్యార్థినిని సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు సమాచారం. ఆదివారం హాస్టల్ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని తనను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని ఆవేదన చెందినట్టు వదంతలు రావడంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. పీడీఎస్‌యూ నాయకురాలు కావేరి, ఏబీవీపీ నగర ఇంచార్జ్ షాజాది హాస్టల్‌ను సందర్శించి ర్యాగింగ్ పై విద్యార్థినులను ఆరా తీశారు. హాస్టల్లో ర్యాగింగ్ జరగలేదని విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు ర్యాగింగ్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. -
బాలిక వసతీగృహంలో దారుణం
-
బాలికలతో ఆగంతకుడి అసభ్య ప్రవర్తన
-
బాలికలతో ఆగంతకుడి అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : హైదరాబాద్ హయత్ నగర్లో బాలికల వసతి గృహంలో దారుణం జరిగింది. అర్థరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించిన దుండగుడు ....బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కత్తితో బెదిరించి బాలికలను దుస్తులు విప్పాల్సిందిగా బెదిరించినట్లు సమాచారం. ఆ సమయంలో హాస్టల్లో వార్డెన్ కూడా లేకపోవటంతో విద్యార్థినులు భయంతో వణికిపోయారు. తమకు రక్షణ కల్పించాలంటూ బోరున విలపించారు. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలికపై సమీప బంధువు అత్యాచారయత్నం
పిఠాపురం: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఓ బాలికను నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన సమీప బంధువు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఆదివారం రాత్రి జరగ్గా... బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని సమీప బంధువు ఆదివారం సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. నూతన వస్త్రాలు ఇప్పిస్తానని చెప్పి నేరుగా ఓ లాడ్జీకి తీసుకెళ్లిన అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలిక కేకులు పెట్టగా కొట్టాడు. ఆమె అక్కడి నుంచి పారిపోయి వసతి గృహానికి వచ్చి జరిగిన విషయాన్ని సిబ్బందికి చెప్పింది. వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
తిరిగొచ్చిన హాస్టల్ విద్యార్థినులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం నుంచి అదృశ్యమైన విద్యార్థులు ఆదివారం క్షేమంగా తిరిగొచ్చారు. వారిని రాజమండ్రి పోలీసులు తీసుకువచ్చి జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. ఈ నెల 21న కొండా గౌతమి, బి.ప్రేమలతలు కళాశాలకు అని చెప్పి బయలుదేరి అదృశ్యం కావడంతో వార్డెన్ స్వర్ణలత జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసు అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థినులు తిరిగొచ్చారనే విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీడీ శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థినులు ఈ నెల 21న వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి అదృశ్యమయ్యారన్నారు. ఆన్లైన్ స్కాలర్‌షిప్‌ల కోసం బ్యాంకు ఖాతాలు ఓపెన్చేయడానికి వెళ్లినట్టుగా విద్యార్థినులు చెబుతున్నారన్నారు. అయితే వసతిగృహం నుంచి బయలుదేరి కళాశాలకు హాజరుకాకుండా బ్యాంకుకు వెళ్లారని, కళాశాలకు హాజరుకాకపోవడంతో అధ్యాపకులు ఏమైనా అంటారేమోనని భయపడ్డామని తెలిపారన్నారు. అలాగే ఇదే విషయాన్ని తమ తల్లితండ్రులకు వార్డెన్ తెలియజేస్తానన్నారని, వారికి తెలిస్తే ఏమైనా అంటారేమోనన్న భయంతోనే తాము బయటకు వెళ్లిపోయామని విద్యార్థినులు చెబుతున్నారన్నారు. ఏసు అనే ఆటోడ్రైవర్ సహాయంతో ఆటోలో రాజమండ్రికి, అక్కడ నుంచి రైల్లో విజయవాడ, హైదరాబాద్ వెళ్లినట్టు పేర్కొంటున్నారన్నారు. హైదరాబాద్‌లో విద్యార్థులు దిగగానే వారి వారి తల్లితండ్రులతో ఫోన్లో మాట్లాడామని, భయంతోనే హైదరాబాద్ వెళ్లామని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నామని తల్లితండ్రులతో చెప్పామని వారు చెప్పారని ఆమె తెలిపారు. తిరిగి విద్యార్థులు రాజమండ్రి రైల్లో వచ్చి, పోలీసుల సహాయంతో జంగారెడ్డిగూడెం చేరుకున్నారు. అలాగే ఈ విద్యార్థులను చైల్డ్‌ప్రొటెక్షన్ వారికి అప్పగించనున్నట్లు చెప్పారు. వారు అక్కడ విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ ఏసు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఉన్నారని విచారణలో తేలిందని తెలిపారు. విద్యార్థినులు ఆటో ఎక్కడం, దిగడం వల్లే ఏసుతో పరిచయం ఏర్పడి ఉండి ఉంటుందని ఆమె అన్నారు. అయితే ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఆమె తెలిపారు. -
నగ్న దృశ్యం
-
బాధిత విద్యార్థినిలకు జిల్లా ఎస్పీ పరామర్శ
ఏలూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత విద్యార్థినులకు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులపై నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం తెలిసిందే. మాట్రిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు . ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల చేత వంట మనిషి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మాట్రిన్ జానకుమారి ఫిర్యాదు చేయటంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హాస్టల్ బాలికలపై వార్డెన్ భర్త అత్యాచారం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మాయిల హాస్టల్ సూపరింటెండెంట్ భర్త అదే హాస్టల్లో ఉంటున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో సూపరింటెండెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హాస్టల్ ధనోరా గ్రామంలో ఉందని, అసలైన నిందితుడు వినోద్ నాగ్ పరారీలో ఉండటంతో అతడి భార్య, హాస్టల్ సూపరింటెండెంట్ నీతా నాగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తికేయ గోయల్ తెలిపారు. వినోద్ నాగ్ తమపై అత్యాచారం చేసినట్లు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారని, వాళ్లు ఎంత చెప్పినా సూపరింటెండెంట్ ఏమాత్రం పట్టించుకోకపోగా.. వీలైనంతవరకు కేసును తొక్కేయడానికి ఆమె ప్రయత్నించారని కలెక్టర్ తెలిపారు. దాంతో విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదుచేఏశామన్నారు. -
నీటి కోసం..కోటి తిప్పలు..!
నీళ్లు వచ్చేటప్పుడు వీధి కుళాయిల వద్ద జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు గంటలే వచ్చే నీటిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలన్న తాపత్రయంతో పదులు.. ఇంకా చెప్పాలంటే వందల్లోనే ఉండే మహిళలు సిగపట్లు పట్టుకుంటారు. అటువంటిది 500 మందికి ఒక్క బోరే ఉంటే.. అదే అన్నింటికీ ఆధారమైతే.. రెండు మూడు గంటల్లో అందరి అవసరాలు తీరాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇదిగో.. ఈ ఫొటోనే అందుకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా నందిగాంలోని బాలికల సంక్షేమ వసతిగృహంలో ఉన్న ఈ బోరు.. దానితో విద్యార్థినులు జరుపుతున్న పోరు వివరాల్లోకి వెళితే.. ఈ వసతిగృహంలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న సుమారు 500 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అక్కడ ఉన్నది ఒకే ఒక్క బోరు. కాలకృత్యాలు, బట్టలు ఉతుక్కోవడం.. ఇలా అన్ని అవసరాలకు ఇదే ఆధారం. మరోవైపు ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకోవాలి. ఈలోగానే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. దాంతో తెల్లవారుజామున 5 గంటలకు ఈ హాస్టల్లో హడావుడి మొదలవుతుంది. బాలికల ఉరుకులు.. పరుగులు.. బోరు వద్ద పెద్ద క్యూ.. తమ వంతు వచ్చే వరకు ఉగ్గబట్టుకొని వేచి చూడటం.. 8 గంటల్లోగా తమ వంతు రాకపోతే ఉసూరుమంటూ వెనుదిరగడం.. ఇదీ ఇక్కడి విద్యార్థినుల నిత్య పోరాటం..! - ఫోటో: పీఎల్ మోహనరావు, సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం